Friday, March 18, 2022

కార్తీకమాసంలో దీపాలు వెలిగించేందుకు ఉత్తమ సమయమేదో తెలుసా..?

 కార్తీకమాసంలో దీపాలు వెలిగించేందుకు ఉత్తమ సమయమేదో తెలుసా..?



'దీపం జ్యోతిః పరబ్రహ్మ.. దీపం జ్యోతిః నమో నమః దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః' దీపం పరబ్రహ్మస్వరూపం.. పరాయణత్వం కలిగినది. పాప ప్రక్షాళన చేసే శక్తి కలది. అంతేకాదు మన ఇంట్లో సిరులు తెచ్చేది కూడా దీప జ్యోతియే! దీపం లేని ఇల్లు ప్రాణం శరీరం లాంటిదే.


సాధారణంగా దీపాలను మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ఇలాంటి సాధారణంగా దీపం ఉభయ సంధ్యల్లో పెడతారు.


ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీకమాసంలో దీపానికి అత్యధిక ప్రాధాన్యమిస్తారు. ఈ మాసంలో అగ్ని ఆరాధాన, హోమాలు వంటివి చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి. ఈ సందర్భంగా పవిత్రమైన కార్తీక మాసంలో దీపాలను ఏ సమయంలో వెలిగిస్తే ఫలితం ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


దీపారాధన.. మనలో చాలా మంది దీపారాధన చేసే సమయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువమంది దీపరాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనెను పోస్తుంటారు. అయితే అలా చేయకూడదంట. దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె వేసి ఆ తర్వాత వత్తులను అందులో వేయాలి. అలాగే స్టీల్ కందుల్లో దీపారాధన చేయకూడదు..


ఇందులోనే చేయాలి.. దీపారాధనను వెండి కుందులు, పంచలోహ కందులు, ఇత్తడి కందులు మరియు మట్టి కందులలో మాత్రమే చేయాలి. అలాగే కందులను కూడా ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని శుభ్రపరచకుండా వత్తులను అస్సలు వేయకూడదు.


నేరుగా వెలిగించకూడదు.. దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్ల తీసుకుని నేరుగా కందులలోని దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వరా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుండే దీపారాధన చేయాలి.


స్త్రీలే స్వయంగా.. దీపారాధనను ఎక్కువగా స్త్రీలే వెలిగించాలి. దీపారాధన కందిలో అయిదు వత్తులను వేసి స్త్రీలు తామే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం క్షేమం కోసం.. రెండో వత్తి అత్తమామల సంక్షేమం కోసం.. మూడో వత్తి సోదరసోదరీమణులు, నాలుగో వత్తి గౌరవ, ధర్మాలకు ప్రతీకగా.. అయిదో వత్తి వంశం అభివ్రుద్ధికి ప్రతీకగా పండితులు చెబుతారు.


రెండు వత్తులు.. మరో విషయమేమిటంటే.. దీపారాధన ఎవరు చేసినప్పటికీ, తప్పనిసరిగా రెండు వత్తులు అనేవి ఉండాలి. దీపారాధనకు ఉద్దేశించిన దీపాల నుండి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు.


పసుపు రంగు బట్టలతో.. జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీగణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది. అలాగే పసుపు రంగు బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల జఠర, ఉదరవ్యాధుల, కామెర్ల రోగం తగ్గుతాయి.


సూర్యోదయానికి ముందు.. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే.. స్త్రీలందరూ ఉదయం సూర్యోదయం సమయానికి దీపారాధన చేయడం శ్రేయస్కరం. అయితే అందరికీ ఆ సమయానికి అవకాశం ఉండటం లేదు. కానీ అందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదు. కాబట్టి మీరు సంకల్పంతో సూర్యోదయం తర్వాత కూడా చేయొచ్చు. అయితే మరీ 10 గంటలు లేదా 11 గంటల తర్వాత మాత్రం చేయకూడదు.


సంధ్య సమయంలో.. అలాగే సూర్యుడి అస్తమించే సమయంలో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత సుమారు 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన చేయకూడదట. ఎందుకంటే ఈ సమయంలో భూత, ప్రేతాలు తిరుగుతుంటాయని చెబుతారు. అందుకే సాయంత్రం 5:30 నుండి 6 గంటలు దాటిన తర్వాత దీపారాధన చేయాలి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS