ఇంటి పునాదులలో 11 గోమతీ చక్రాలు వుంచితే సమస్తా శుభకరము.
పర్స్ లో 2,4,6,8 సరిసంఖ్యతో గోమతీచక్రాలుండడం అదృష్టంగా భావించవచ్చు.
11 గోమతీ చక్రాలు పసుపురాసి దేవునితో పూజచేసి పసుపు గుడ్డలో కట్టి ఇల్లు అంతా చూపించి తర్వాత నదిలో గాని చెరువులో గాని వేస్తే ఆర్ధిక ఇబ్బందులు దరిచేరవు.
11 గోమతీచక్రాలు ఎర్రటి గుడ్డలో కట్టి కులదైవంతో పూజచేసి బియ్యం డబ్బాలో వుంచితే అన్నపానములకు లోటులేకుండా ఆరోగ్యజీవనం కలుగుతుంది.
పిల్లలకు 3 గోమతి చక్రాలు ఖాళీ మైదానంలో దిగదూడ్చి వెనుకనుండి విసిరితే దృష్టిదోషం, గ్రహదోషం తొలగి విద్య,ఉద్యోగ,కళ్యాణాదులందు ఆటంకాలు తొలగుతాయి.
ఇలా ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి గోమతీచక్రాలవలన.గోమతీ ద్వారకా నదిలో దొరికే ఈగోమతీ చక్రాలు లక్ష్మీదేవి ప్రతిరూపాలు. మహా విష్ణువు సుదర్శన చక్ర ప్రతీకలు. ద్వారకలోశ్రీకృష్ణుని ప్రదేశంనుండే లభిస్తాయి. కొన్ని పూజలలో సాలగ్రామము తోబాటు గోమతీ శిలలను ఆరాధిస్తారు. పిల్లలకు రక్షణకోసం ఆభరణాలలో పొదిగి వాడితే అన్ని గ్రహబాధలు, దృష్టిదోషములు నివారింపబడుతాయీ.వీటిని గోనయనము (ఆవుకన్ను) గా పవిత్రంగా భావిస్తారు.గోమతీ చక్రాన్ని మెడలో ధరించే లాకెట్ గా చేయించి, శుక్రవారంనాడు గంగాజల ప్రోక్షణతో సరస్వతీ అష్టోత్తరనామ పూజ చేసి, ఆ ఆభరణం పిల్లలకు ధరింపజేస్తే పిల్లలకు విద్యాబుద్ధులు బాగా అబ్బుతాయి అనే విశ్వాసం కూడా వుంది.
No comments:
Post a Comment