హనుమంతుని ప్రసిద్ధ అవతారములలో "శ్రీ పంచముఖ ఆంజనేయ స్వరూపం " చాలా ప్రసిద్ధ మైనది.
ఇందు :
1. పూర్వవదనం-వానర వదనం(శత్రునాశనం)
2. దక్షిణవదనం- నారసింహ వదనం(భయనాశనం)
3. పశ్చిమవదనం- గరుడ వదనం(సర్వరోగనాశనం)
4. ఉత్తరవదనం - వరాహ వదనం(అన్న,సంప దప్రదాయకం)
5. ఊర్ధ్వవదనం- హయగ్రీవ వదనం( సర్వ విద్యాదాయకం)
2. దక్షిణవదనం- నారసింహ వదనం(భయనాశనం)
3. పశ్చిమవదనం- గరుడ వదనం(సర్వరోగనాశనం)
4. ఉత్తరవదనం - వరాహ వదనం(అన్న,సంప దప్రదాయకం)
5. ఊర్ధ్వవదనం- హయగ్రీవ వదనం( సర్వ విద్యాదాయకం)
ఇపుడు,ఈ పంచవదనములను పూర్వవదనం నుండి ఉత్తరవదనం వరకు "సవ్యదిశ"లో (in clockwise direction )23 వ చౌపాయి నుండి 26 వ చౌపాయి కి సంధానించుతూ, 27 వ వదనమును "హయగ్రీవవదనం" కు సంధానించితే, ఈ 5 - చౌపాయిల్లో , స్వామి వారి "పంచముఖతత్వము"ను దర్శింప వచ్చు...
23. పూర్వవానరరూపం:
"ఆపన తేజ సమ్హారో ఆపై! తీనోఁ లోక హాంకఁతే కాంపై!!"
నీ యొక్క అద్భుతమైన తేజోరూపము మూడు రకములు గా భాసిస్తుంది. ఒకటి, సూక్ష్మరూపము.
ఇది నీవు, ఏ సూక్ష్మవానరరూపం తో సీతాదేవి కి ప్రధమదర్శనం ఇచ్చావో, అది నీ "సూక్ష్మరూపం".
రెండు, ఒక పాదం ఉదయాద్రి పై,ఇంకొక పాదం పశ్చిమాద్రి పై నుంచి, సూర్యునివద్ద వేదవేదాంగములు అభ్యసించినావో అది నీ " మధ్యమరూపం".
రెండు, ఒక పాదం ఉదయాద్రి పై,ఇంకొక పాదం పశ్చిమాద్రి పై నుంచి, సూర్యునివద్ద వేదవేదాంగములు అభ్యసించినావో అది నీ " మధ్యమరూపం".
ఇక నీ మూడో రూపం, సాగారోల్లంఘన సమయం లో, 10-యోజనముల వెడల్పు, 30 -యోజనములు ఎత్తు వున్న నీ
"భీమరూపం " తృతీయ రూపం. ఇట్టి నీ 3-రూపములు తో శోభిల్లు నీ దివ్య వానరరూపం చూచి ముల్లోకాలు కంపించి పోయినాయి".
"భీమరూపం " తృతీయ రూపం. ఇట్టి నీ 3-రూపములు తో శోభిల్లు నీ దివ్య వానరరూపం చూచి ముల్లోకాలు కంపించి పోయినాయి".
అట్టి నీ సుందర "పూర్వవానరవదనం "
నకు నమస్సులు...
నకు నమస్సులు...
24. దక్షిణనారసింహరూపం:
"భూత పిసాచ నికట నహిఁ ఆవై! మహాబీర జబనామ సునావై!!"
" పాదములలో చక్ర,శంఖ,నాగలి, వజ్రాయుధం,మీనం"వంటి దేవతా చిహ్నములతో, ఐరావత తొండముల వంటి ఊరువులతో,విశాల వక్షస్థలం తో, శంఖ,చక్ర, గద,ఖడ్గముల వంటి ఆయుధములు దాల్చిన అనేక బాహువులతో, వజ్రదేహ,వజ్రకవచ,వజ్రతుండ,వజ్రనఖ,వజ్రముఖ,వజ్రవాల,వజ్రరోమ, వజ్రనేత్ర,వజ్రశిర,వజ్రపాదములతో,ఎర్రని నాలుకతో,నాసిక నుండి వచ్చే వేడి నిట్టూర్పులతో ఉన్న నీ ఘోర "దక్షిణనారసింహ
వదనం"సమస్త భూత,ప్రేత,పిశాచ,బ్రహ్మరాక్షస,బేతాళ,మహామారీత్యాదులనుండి మమ్ము రక్షించుగాక!!!
వదనం"సమస్త భూత,ప్రేత,పిశాచ,బ్రహ్మరాక్షస,బేతాళ,మహామారీత్యాదులనుండి మమ్ము రక్షించుగాక!!!
25. పశ్చిమగరుడవదనము:
"నా సై రోగ హరై సబపీరా!జపత నిరంతర హనుమతబీరా!!"
కాంచనవర్ణముతో,సుపర్ణములతో శోభిల్లుతున్నవాడు,సమస్తఛందోమయుడు,
హరివాహనుడు,మహాబలుడు, అరుణానుజుడు,నాగ కులాంతకుడు,మహాతేజోవంతుడు,అమృతకుంభమును హస్తములందు దాల్చిన వాడు, వినతానందనుడు,మాతృదాస్యవిమోచకుడు,వాయువేగముతో సంచరించగలవాడు,
వైనతేయుడు, ఖగపతి అయిన " పశ్చిమగరుడవదనము" మమ్ములను వాత జ్వర,పిత్తజ్వర, కఫజ్వర,గ్రహజ్వర, విషజ్వర, శీతజ్వరములనుండి రక్షించు గాక!!!

26.ఉత్తర వరాహవదనము :
"సంకటతేఁ హనుమాన ఛుడావై!మనక్రమ బచన ధ్యాన జోలావై!!"
వరాహవదనం తో విరాజిల్లు ఓ ఆంజనేయా! నీవు యజ్ఞస్వరూపుడవు,యజ్ఞకర్తవు,యజ్ఞభోక్తవు, యజ్ఞ ఫలప్రదాతవు, యజ్ఞరక్షకుడవు,యజ్ఞాధిపతివి,వేదమూర్తివి,నీ చర్మం నుండి సమస్త వేదాలు జనియించాయి, నీ రోమకూపాలనుండి యజ్ఞాజ్ఞులు ఉద్భవించి నాయి, నీ కన్నులనుండి యజ్ఞద్రవ్యంగా నెయ్యి,ముట్టె నుండి "స్రుక్కు", ముక్కు నుండి "సృవము", ఉదరం నుండి "ఇడాపాత్రము", చెవులనుండి,ముఖం నుండి "చమసం", " ప్రాశ్రితం" అనే యజ్ఞపాత్రలు పుట్టాయి, నీవు యజ్ఞాదినాధుడవు!,యజ్ఞవరాహమూర్తివి!, ఓ వేద మయా! విదియనాటి చంద్రరేఖ లా నీ తెల్లని దంష్ట్రలపై భూమండలమును ధరించి,ఉద్ధరించిన ఓ భూరమణా! మమ్ము సమస్త సంకటముల నుండి రక్షించి ఉద్ధరించు!
27. ఊర్ద్వహయగ్రీవవదనము:
"సబ పర రామతపస్వీ రాజా!తినకే కాజ సకలతుమ సాజా!!"
"ఓ ఆంజనేయా! నీవు జ్ఞానానందమయుడవు,సర్వవిద్యలకు ఆధారమైన విద్యా స్వరూపుడవు,హయవదనుడవు, విశుద్ధ విజ్ఞానమునకు ఘనస్వరూపుడవు,వాగీశ్వరుడవు,పుస్తకధరుడవు,తపస్వులకు ప్రభువైన శ్రీరాముడు అనే
"రామపరబ్రహ్మం" లో మా బాహ్య,అంతఃప్రవృత్తులు లీనమగు "బ్రహ్మజ్ఞానం" నీ వల్ల మాకు కలుగుగాక!!!
"రామపరబ్రహ్మం" లో మా బాహ్య,అంతఃప్రవృత్తులు లీనమగు "బ్రహ్మజ్ఞానం" నీ వల్ల మాకు కలుగుగాక!!!
◆ ఈ విధం గా ,స్వామి వారి విరాడ్విశ్వరూపం ను దర్శించి న పిదప,ఈ 5-అవతారముల గురించి, వాల్మీకి రామాయణం లో కవివాల్మీకి సూటిగా ఎక్కడా ఉటంకించకుండా, స్వామివారి అవతార లీలల్లో మర్మగర్భంగా ,గుప్తం గా ప్రస్తావించటం గమనార్హం...
# పుట్టినది వానరరూపం
# రాక్షసుల సంహారం లో నరసింహుడు
# వేగం లో గరుత్మంతుడు
# శోకసముద్రం లో మునిగిన భూపుత్రిక అయిన సీతమ్మను ఉద్ధరించిన వరాహమూర్తి
# వేద, జ్యోతిష్య,సాముద్రిక,సాహితీ శాస్త్ర విద్యల్లో హయగ్రీవుడు.
# రాక్షసుల సంహారం లో నరసింహుడు
# వేగం లో గరుత్మంతుడు
# శోకసముద్రం లో మునిగిన భూపుత్రిక అయిన సీతమ్మను ఉద్ధరించిన వరాహమూర్తి
# వేద, జ్యోతిష్య,సాముద్రిక,సాహితీ శాస్త్ర విద్యల్లో హయగ్రీవుడు.
◆ తూర్పు, దక్షిణ,పశ్చిమ,ఉత్తర దిక్కులకు చూసే స్వామి వానర,నారసింహ, గరుడ,వరాహ వదనములు త్రిగుణములతో సర్వవ్యాపితమయం అయిన "సగుణతత్త్వం" కు సంకేతమయితే,శూన్యంగా ఆకాశ దిక్కు వైపు చూసే ఊర్ధ్వహయగ్రీవవదనం "నిర్గుణతత్వము"నకు సంకేతం...
◆ పంచభూతాలతో, పంచవదనములతో,పంచతత్వాలతో,పంచత న్మాత్రలతో సృష్టి నడుపు పరమేశ్వరుడి పంచవదనములు ,రుద్రాంశ సంభూతు డైన
హనుమంతుని వదనములతో క్రింది విధం గా శాస్త్రములు సంధానించినాయి:
హనుమంతుని వదనములతో క్రింది విధం గా శాస్త్రములు సంధానించినాయి:
1. వానర వదనం- సద్యోజాత
2. నరసింహ- వామదేవ
3. గరుడ- అఘోర
4. వరాహ- తత్పురుష
5. హయగ్రీవ-ఈశాన
2. నరసింహ- వామదేవ
3. గరుడ- అఘోర
4. వరాహ- తత్పురుష
5. హయగ్రీవ-ఈశాన
" కపివదనాయ,నరసింహాయ,వీరగరుడాయ, ఆదివరాహాయ,హయగ్రీవాయ...
ఆంజనేయాయ నమో నమః!!!
ఆంజనేయాయ నమో నమః!!!
జై హనుమాన్!!!
No comments:
Post a Comment