Saturday, June 23, 2018

వివిధ రకాల గణపతులు - పూజలు ఫలితాలు

వివిధ రకాల గణపతులు - పూజలు ఫలితాలు

         వినాయకుడు సర్వ విఘ్నాలకు అధిపతి గణేశుని కృపా కటాక్షం ఉంటేనే తలపెట్టిన ఏ కార్యమైన నిర్విఘ్నంగా సాగుతుంది.
వివిధ గణపతులను పూజించటం వల్ల వచ్చే ఫలితములు :

 ఎర్ర చందనం గణపతి  - అనారోగ్యం నుంచి విముక్తి !
ముత్యపు గణపతి  - రుణ విముక్తి !
 మరకత గణపతి   - వ్యాపారాభివృద్ధి !
 చందనం గణపతి - ఉద్యోగం , సంఘంలో గౌరవం !
 స్ఫటిక గణపతి - భార్యాభర్తలు సుఖజీవనం !
 నల్లరాతి గణపతి - అధిక శ్రమనుంచి విముక్తి !
 శ్వేతార్క గణపతి  - విఘ్న వినాశనం !
నవగ్రహ దోష నివారణకు వివిధ గణపతుల పూజాలు :

రవి : ఎర్ర చందనం గణపతి ఆదివారం పూజించాలి !
 చంద్రుడు : వెండి , ముత్యం లేదా పాలరాతి గణపతిని సోమవారం పూజించాలి !
 కుజుడు : రాగి లేదా పగడం గణపతిని మంగళవారం పూజించాలి !
 బుధ్ధుడు : మరకత గణపతిని బుధవారం పూజించాలి !
 గురువు : బంగారం , పసుపు లేదా చందనం గణపతిని గురువారం పూజించాలి !
శుక్రుడు : స్ఫటిక గణపతిని శుక్రవారం పూజించాలి !
 శని : నల్లరాతి గణపతిని శనివారం పూజించాలి !
రాహువు : ఎర్ర చందనం గణపతిని ఆదివారం పూజించాలి !
సకల విఘ్నరాజైన పార్వతీ తనయుడి రూప విశేషాలు చాల విలక్షణమైనవి ****

  గణేశుడి పూర్ణకుంభం వంటి దేహం , బాన వంటి పొట్ట - ఇవి పరిపూర్ణ జగత్తుకి సంకేతం !
గజముఖం , సన్నని కళ్ళు  - ఇవి సున్నితమైన పరిశీలనకి , గ్రహణ , మేధా శక్తులకు సంకేతాలు !
వక్రతుండం - ఇది ఓంకారానికి సంకేతం !
చుట్టి ఉండే నాగం - ఇది జగత్తు ఆవరించి ఉన్న మాయాశక్తికి సంకేతం !
నాలుగు చేతులు - మానవాతీతశక్తి , సామర్థ్యాలకి సంకేతం !
 ఒక చేతిలో పాశం , దండ - ఇది బుద్ధి , మనస్సులను సన్మార్గంలోకి నడిపించేందుకు సాధనం !
 మరొక చేతిలో విరిగిన దంతం ( మహా భారత రచన కోసం ఆయన తన దంతాన్నే విరిచి కలంగా చేసుకొన్నాడు ) ఇది విజ్ఞాన సముపార్జన కొరకు చేయవలసిన కృషి , త్యాగలకు సంకేతం !
 మరొక చేతిలో  మోదకం లేదా వెలగ పండు - ఇది  బాహ్యంలో గంభీరత , అంతరంగంలో సున్నితత్త్వానికి చిహ్నాలు !
 చేటంత చెవులు - ఇవి భక్తుల మొర ఆలకించటానికి గుర్తు !


No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS