Friday, June 29, 2018

ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం?దేవుని వద్ద కొబ్బరి కాయను కొట్టేది ఎందుకు?దేవాలయాల్లో తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు?గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?

దేవుని వద్ద కొబ్బరి కాయను కొట్టేది ఎందుకు?
సర్వదేవతలను పూజించే సమయాల్లోను, యజ్ఞ హోమదుల్లోను కొన్ని శుబకార్యాల్లోను కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతిక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కోడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసు స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం.
 *గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?*
“ప్రదక్షిణం ” లో “ప్ర” అనే అక్షరము పాపాలకి నాశనము, “ద” అనగా కోరికలు తీర్చమని, “క్షి” అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మ జ్ఞానము ఇమ్మని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాబట్టి భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదిక్షణ అవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నాని అర్థం.
 *ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం?*
ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు.కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వార ఆపదలను తొలగించి మనల్నిసుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయకారుడు. కాబట్టి రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతున్ని దర్శించాలి.
 *గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుభమా?*
తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ ,మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగాపరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుబ్రపరచుకొని దర్శించుకున్తున్నాము. ఈ శరీరంలా మనసుని శుచిగా, నిర్మలంగా ఉండేలా చెయ్యమనే అర్థమే పూర్తి స్నానం యొక్క భావము.
 *గుడిలో శడగోప్యం (శతగోపనం) తలమీద పెట్టడం ద్వారా ఎం ఫలితం వస్తుంది?*
దేవాలయం లో దర్శనం అయ్యాక తీర్ధం, శాదగోపం తప్పక తీసుకోవాలి. శతగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టె పూజారికి కూడా విన్పించానంతగా కోరికను తలచుకోవాలి. అంటే మీ కోరికే శదగోపం. మానవునికి శత్రువులైన కామం. క్రోధం, లోభం, మొహం మదం, మాత్సర్యములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరో అర్ధం. షడగోప్యం ను రాగి,కంచు, వెండి లతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలు ఉన్ట్టాయి. షడ గోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికివేలుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి.
 *దేవాలయాల్లో తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు?*
బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు, చిన్న మోసాలకు అంతే ఉండదు. మనావుడు చేసే సర్వ కర్మల పాపఫలం వెంట్రుకలను చేరుతుంది. అందుకే పాపాలకి నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి, స్వామి ఇంతవరకు పాపాలను వదిలేస్తున్నాను. ఇకపై మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటానని చెప్పడమే తలనీలాలు ఇవ్వడము.
 *దేవాలయపు వెనుక బాగాన్ని ఎందుకు తాకరాదు?*
చాల మంది ప్రదిక్షినలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు. అలా చేయరాదు. ఆ బాగంలో రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదిక్షిణ చేయాలి.
 *దేవాలయంలో ప్రదిక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి?*
వింటి నుంచి వెలువడ్డ బాణంలా వెనేకేవరో తరుముతున్నట్టు ప్రదిక్షణం చేయరాదు. నిండు గర్భిని నడిచి నట్టు అడుగులో అడుగు వేస్తూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదిక్షణలు పూర్తి చేయాలి. అలాగే అర్ధ రాత్రి, మధ్యాహానము దైవదర్శనం చేయరాదు.
 *గుడిలో ఎలా ఉండాలి?*
గట్టిగ నవ్వడము, అరవడము,ఐహిక విషయాల గురించి మాటలాడడం చేయరాదు. గుడి పరిసరాలని పరిశుబ్రంగా ఉంచాలి. బగవంతున్ని కనులార వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. దేవాలయం లో నిలుచుని తీర్థం తీసుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్దం పుచ్చుకోవాలి. దీపారాధన శివుడికి ఎడమ వైపు, శ్రీ మహా విష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడు వైపు వెలిగించాలి.
 జై శ్రీమన్నారాయణ 


No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS