Saturday, June 30, 2018

ఏదైన విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు..!


ఏదైన విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు..!!💐శ్రీ💐
" ఓం గం గణపతయే నమః' " వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం.
ఎంత ఆర్భాటాలు చేశామన్నది ముఖ్యం కాదు.మనం ఎంత సేపు స్వామి మీద ధ్యాస పెట్టి నిలకడగా కూర్చున్నామన్నదే ముఖ్యం.
కూర్చుని ఏమి చేయాలి?
స్వామికి సంబంధించిన ఒక శ్లోకం, మంత్రం(ఓం వినాయకాయ నమః లాంటి మంత్రాలు ఉంటాయి కదా)కాని లేదా అష్టొత్తరం కాని చదవండి.ఏది రానివారు"ఓం " అని జపించండి. కేవలం చదవడమే కాదు, చదువుతున్నప్పుడు మనస్సు మొత్తం స్వామి మీద లగ్నం చేయండి. వేరే ఏ పని చేయకండి. మీకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి నైవేధ్యం పెట్టి స్వీకరించండి. చిన్న బెల్లం ముక్క పెట్టినా ఫర్వాలేదు.
ఇలా మీరు చేసి చూడండి. ఒక సంవత్సరకాలంలో మీలో అద్భుతమైన మార్పు కనపడుతుంది.
మీరు కనుక రోజు క్రమం తప్పకుండా స్నానం చేసిన తరువాత పైన చెప్పిన విధంగా చేయగలిగితే చాలు మీరే గమనిస్తారు మీలో కలిగిన మార్పు.
మీరు నమ్మనంతగా మారతారు.
చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేయగలుగుతారు. విద్యార్థులు చదువు మీద ఎప్పుడు లేనంతగా శ్రద్ధ పెడతారు.
ఉద్యోగులకు పనిభారం తగ్గినట్టుగా అనిపిస్తుంది.
ఏదైన విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు.
వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి
"స్థిరొ భవ,వరదొ భవ, సుప్రసన్నొ భవ, స్థిరాసనం కురు" అని చదువుతారు.
అందుకే గజాననుని ముందు, రోజు కూర్చునే ప్రయత్నం చేయండి. అద్భుతమైన విద్యాబుద్ధులను, జ్ఞానాన్ని పొందండి.
మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టి పూజించమన్నది ముఖ్యం కాదు.స్వామి ముందు ఎంతసేపు కూర్చున్నామన్నది ముఖ్యం.
అందరూ రోజు కాసేపు గణపతికి కేటాయించండి. మీలో కలిగే మార్పులను గమనించండి. జీవితంలో అతి త్వరగా పైకి ఎదగండి.
దీని అర్దం విద్యార్ధులు చదవడం మానివేసి, మిగతావారు తమ రోజు వారి కార్యక్రమాలు మానివేసి గణపతి ముందు కూర్చొమని మాత్రం కాదు.
మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్దం అవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది
కనుక గణపతి ఆరాధనను మీ నిత్యజీవితంలో భాగం చేసుకొండి. ఆసనం(చాప వంటివి)వేసుకోవడం మరవకండి. న్యూస్ పేపర్లు, కాగితాలు లాంటివి ఆసనంగా వేసుకోకూడదు. పిలిస్తే పలికే దైవం గణనాధుడు.
ఓం గం గణపతయే నమః..స్వస్తి..!!💐
సర్వే జనా సుఖినోభవంతు..!!💐
💐శ్రీమాత్రే నమః💐

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS