Sunday, December 12, 2021

పంచ గయలు

*పంచ గయలు* 


మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు. 

*1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ.* 

 🔹1. *శిరోగయ* : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో *“శిరోగయ”* గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.

 🔹2. *నాభిగయ* : జాజాపూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను *“నాభిగయ”* అని అంటారు.

🔹 3. *పాదగయ* : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని *“పాదగయ”* అంటారు.

 🔹4. *మాతృగయ* : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని *“మాతృగయ”* అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.

🔹 5. *పితృగయ* : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల *“బ్రహ్మకపాలం”* అనే ప్రదేశాన్ని *“పితృగయ”* అంటారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS