Friday, December 17, 2021

బ్రహ్మ రుద్రాంశలతో కూడిన విష్ణువ్యాంశతో జన్మించిన స్వామి దత్తాత్రేయస్వామి


. బ్రహ్మ రుద్రాంశలతో కూడిన విష్ణువ్యాంశతో జన్మించిన స్వామి దత్తాత్రేయస్వామి.

కుష్టు రోగ పీడితుడైన సూర్యభగవానుని ఆశ్రయం కల్పించినవాడు దత్తాత్రేయస్వామి. దేవతల చేత జంభాసురుని సంహరింపచేసినవాడు దత్తాత్రేయస్వామి. పొట్టిచేతులతో పుట్టిన కార్త్య వీర్యార్జునుకి వేయి చేతులు, అష్టసిద్దులు, అద్భుత పరాక్రమాన్ని ప్రసాదించిన మహత్ముడు దత్తాత్రేయస్వామి. విష్ణు దత్తునికి అనేక సిద్దులు వరమొసగి లోకోపకారం చేసినవాడు దత్తాత్రేయస్వామి. వేదశర్మ అనే బ్రాహ్మణుని కుమారున్ని రక్షించాడు. శ్రీహరి అవతారమైన పరశురామునికి జ్ఞానం ప్రసాదించినవాడు. ఇలాంటి అద్భుతాలు, మహిమలు, లీలలు, వింతలు సృష్టించిన కరుణా సముద్రుడైన శ్రీ దత్తాత్రేయస్వామి వారు నాటినుండి నేటివరకు ప్రతిరోజూ కాశీలో స్నానం చేసి, కొల్హాపూర్ నందు భిక్ష చేసి, తుంగభద్రలో నీరు సేవించి, మహుర్ ఘడ్ నందు నిద్ర చేస్తున్నారు. స్వామివారు నీరు సేవిస్తున్న పవిత్ర ప్రదేశమే పాంచలేశ్వర్. అట్టి పాంచలేశ్వర్ విశిష్టమైన దత్త క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది. దత్తాత్రేయుని భోజన స్థలమే పాంచలేశ్వర్. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నిగెల్ రాయి తాలూకాలో పాంచలేశ్వర్ గ్రామమున్నది. అక్కడే గోదావరి నది ఉన్నది. ఆ నది మధ్యలో దత్తాత్రేయ ప్రభువు భోజనం చేసే గద్దె కలదు. (8 ×4 ×2 ) గద్దె పరిమాణం. చుట్టూ భక్తులు కూర్చొని ధ్యానం జపము, చేసుకోవడానికి బండలు ఏర్పాటు చేశారు. ఆ గద్దె పై భాగములో ఎనిమిది పిల్లర్స్ తో అష్టభుజ ఆకారములో రూఫ్ వేసిఉంటుంది. అక్కడ దత్తాత్రేయ విగ్రహము ఏమీ ఉండదు. గోదావరి నీటి ప్రవాహము పెరిగితే ఈ గద్దె మునిగిపోతుంది. ప్రతిరోజూ అక్కడగల పూజారి పాంచలేశ్వర్ గ్రామానికి భిక్షకు వెళతాడు. అక్కడ గ్రామస్తులు ఇచ్చిన రొట్టె, అన్నము,కూరలు, స్వీట్లు తీసుకొచ్చి 12 గంటల కల్లా నివేదన చేసి, అక్కడ కూడిన భక్తులకు భోజనం పెడతారు. భక్తులు కొందరు ధ్యానం, మరి కొందరు గద్దె చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఈవిధంగా పాంచాలేశ్వర్ నందు నిత్య కార్యక్రమం జరుగుతుంది. ' కాశి స్నాన జప, ప్రతిదివాసి కోల్హాపూర్ భిక్షేసి, నిర్మల నది తుంగ జలప్రాసి, నిద్రా మాహుర్ దేశి. ' ప్రతిరోజూ దత్తాత్రేయ స్వామి వారణాసిలో స్నానం చేసి, కొల్హాపురి నందు భిక్ష చేసి, పాంచాలేశ్వర్ నందు మధ్యాన్న భోజనం చేసి మహూర్ ఘడ్ నందు నిద్రిస్తారు. ( సాయిదర్శన్ పూర్వపు సంచికల నుండి సేకరణ ).

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS