Sunday, December 12, 2021

తలకిందులుగా వుండే హనుమాన్ ఉన్న ఆలయం గురించి విన్నారా....

🎻🌹🙏తలకిందులుగా వుండే హనుమాన్ ఉన్న ఆలయం గురించి విన్నారా.... 

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

ఉజ్జయిని ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉల్టాగా… అంటే తలక్రిందులుగా ఉంటుంది.

 ఈ ఆలయం చారిత్రక నగరమైన ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో సాన్వర్‌ సమీపాన ఉన్నది.

 ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ తలక్రిందులుగా ఉండటమే ఈ ఆలయం విశిష్టత

 విగ్రహం తలక్రిందులుగా ఉన్నది కాబట్టే ఆ ఆలయానికి ఉల్టే ఆంజనేయ స్వామి ఆలయం అనే పేరు స్థిరపడిపోయింది.

ఈ ఆలయంలో విగ్రహం ఆంజనేయస్వామి ముఖ భాగాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అదీ తలక్రిందులుగా. 

ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని, రామాయణ కాలం నాటిదని సాన్వర్‌ గ్రామ వాసులు అంటున్నారు.

 రామలక్ష్మణులను అహిరావణుడు బంధించి పాతాళ లోకానికి తీసుకుపోయినప్పుడు ఆంజనేయస్వామి పాతాళ లోకం వరకు వెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు.

 హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లిన స్థలం ఇదేనని ఇక్కడి ప్రజల నమ్మకం. హనుమంతుడు తలక్రిందులుగా పాతాళలోకాని కి వెళ్లినదానికి నిదర్శనంగా ఆలయంలో వాయుపుత్రుని విగ్రహం తలక్రిందులుగా స్థిరపడిపోయిందని చెబుతారు స్థానికులు.

ఈ ఆలయంలోని వీర హనుమాన్‌ విగ్రహం చాలా శక్తివంతమైనదని భావిస్తున్నారు. 

ఆలయం సమీపాన పలువురు మహర్షుల మందిరాలు ఉన్నాయి. 

దాదాపు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఈ మందిరాలు ఉంటున్నట్టు చరిత్ర చెబుతున్నది...సేకరణ...🌞🙏🌹🎻

         🌷జై హనుమాన్ 🌷

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS