Thursday, December 23, 2021

సినీ_దర్శకుడు_చిత్రకారుడు_బాపు_* గారికి *జయంతి* _నివాళులు డిశెంబర్15

*_సినీ_దర్శకుడు_చిత్రకారుడు_బాపు_*  గారికి *జయంతి* _నివాళులు డిశెంబర్15_  🙏🏻
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


    *బాపు* (డిసెంబరు 15, 1933 - ఆగష్టు 31, 2014) తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.

*బాపు*
సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ
జననం
డిసెంబరు 15, 1933
మరణం
ఆగష్టు 31, 2014
చెన్నై
నివాస ప్రాంతం
చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లు
*బాపు*
వృత్తి
చిత్రకారుడు,
కార్టూనిస్ట్
సినిమా దర్శకుడు
మతం
హిందూ
భార్య / భర్త
భాగ్యవతి
తండ్రి
వేణు గోపాల రావు
తల్లి
సూర్యకాంతమ్మ

బాపు శైలి సవరించు
'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది.

కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.ఆయనకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, ముళ్ళపూడి వెంకటరమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకూ కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే 'బాల' అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు 'అమ్మమాట వినకపోతే' అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్ట్‌గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్మ ప్రత్యేకమైనది. ఆయన రాత కూడా అంతే. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు... కానీ ఆ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పేవరకూ చాలా మందికి తెలీదు. రమణ రాత, బాపు గీతలో వెలువడ్డ 'కోతికొమ్మచ్చి' 'బుడుగు'లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు. దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి. తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండితెరపై సృష్టించారు. అందులో 'ముత్యాలముగ్గు' సినిమాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు
ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపొయాయనటం పొగడ్త కాదు.

క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.

బాపు గీత కు గురువు సవరించు
బాపు బొమ్మ తెలుగుజాతి ప్రతి నిధి అయినట్టే, గోపులు బొమ్మ తమిళిత్వానికి ప్రతీక. ఇద్దరూ మంచి మిత్రులు. ‘నాకు గురువు’ అని బాపు, కాదు ‘నాకే గురువు’ అని గోపులు ఇష్టంగా చెప్పుకునేవారు
బాపు ఒక వారధిగా లేకపోతే, తెలుగువారికి గోపులు ఇంతగా తెలియడానికి అవకాశం లేదు. బాపు పబ్లిసిటీ సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో పరిచయం, కడదాకా కొనసాగింది.ముందుగా చెప్పక పోతే వీరిద్దరిలో ఎవరు గీసిన బొమ్మొ చెప్పడం కొంచెం కష్టమైన విషయమే!

విద్యారంగానికి ఈయన చేసిన కృషి 
జీవితంగీసిన 
బాపు  సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933 వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు.
 1955 వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నాడు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. 2014 ఆగస్టు 31న చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు.
 
పురస్కారాలు సవరించు
బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి,ఆయన తీసిన సీతాకల్యాణం సినిమా లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అందులో ముఖ్యమయినవి కొన్ని:

బాపు దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ బహుమతితో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యాకి ఛాయగ్రాహకుడిగా బహుమతి.
1986 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక బహుమతి మదర్ థెరిస్సా బహూకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణతో కలిసి స్వీకారం.
చెన్నై (తమిళనాడు) లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిష్ఠాత్మకమయిన రాజ్యలక్ష్మి బహుమతి 1982 వ సంవత్సరంలో ఇవ్వబడింది.
1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహూకరణ.
1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) వారిచే శిరోమణి బహుమతి అమెరికాలో స్వీకరణ.
మిస్టర్ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ బహుమతి. (1993 వ సంవత్సరం).
1995 వ సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (TANA) వారిచే తెలుగు చిత్ర కళా, సాహిత్య, సాంస్కృతిక, సినిమా రంగాలకు తన ఏభై సంవత్సరాల (గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకు గాను ఘన సన్మానం.
బాపు మీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.
2001 జూన్ 9 వ సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ (IIC) వారిచే జీవిత సాఫల్య బహుమతితో సన్మానం.
2002లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట బహుమతి
అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవార్డు బహూకరణ.
బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975), పెళ్లి పుస్తకం (1991), మిస్టర్ పెళ్ళాం (1993), శ్రీరామరాజ్యం (2011) సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.
2013 కు గానూ ప్రకటించిన పద్మ పురస్కారాలలో కళల విభాగంలో తమిళనాడు రాష్ట్ర విభాగంలో పద్మశ్రీ బహుమతి.
బాపు చిత్రమాలిక సవరించు
అసంఖ్యాకంగా ఈయన గీసిన అందమయిన, అద్భుతమయిన చిత్రాలలో నుండి మచ్చుకు కొన్ని...

బాపు దర్శకత్వం వహించిన సినిమాలు 
*_శ్రీరామరాజ్యం,2011 (తెలుగు)_*
సుందరకాండ,2008 (తెలుగు)
రాధా గోపాళం,2005 (తెలుగు)
రాంబంటు,1996 (తెలుగు)
పెళ్ళికొడుకు,1994 (తెలుగు)
పరమాత్మా,1994 (హిందీ )
శ్రీనాథ కవిసార్వభౌమ,1993 (తెలుగు)
మిష్టర్ పెళ్ళాం,1993 (తెలుగు)
పెళ్ళి పుస్తకం,1991 (తెలుగు)
ప్రేమ్ ప్రతిజ్ఞా,1989 (హిందీ )
దిల్ జలా,1987 (హిందీ )
ప్యార్ కా సిందూర్,1986 (హిందీ )
కళ్యాణ తాంబూలం,1986 (తెలుగు)
మేరా ధరమ్,1986 (హిందీ )
ప్యారీ బెహనా,1985 (హిందీ )
బుల్లెట్,1985 (తెలుగు)
జాకీ,1985 (తెలుగు)
మొహబ్బత్,1985 (హిందీ )
సీతమ్మ పెళ్ళి,1984 (తెలుగు)
మంత్రిగారి వియ్యంకుడు,1983 (తెలుగు)
వోహ్ సాత్ దిన్,1983 (హిందీ )
ఏది ధర్మం ఏది న్యాయం,1982 (తెలుగు)
కృష్ణావతారం,1982 (తెలుగు)
నీతిదేవన్ మయగుగిరన్,1982 (తమిళం )
పెళ్ళీడు పిల్లలు,1982 (తెలుగు)
బేజుబాన్,1981 (హిందీ )
రాధా కళ్యాణం,1981 (తెలుగు)
త్యాగయ్య,1981 (తెలుగు)
హమ్ పాంచ్,1980 (హిందీ )
వంశవృక్షం,1980 (తెలుగు)
కలియుగ రావణాసురుడు,1980 (తెలుగు)
పండంటి జీవితం,1980 (తెలుగు)
రాజాధిరాజు,1980 (తెలుగు)
తూర్పు వెళ్ళే రైలు,1979 (తెలుగు)
మనవూరి పాండవులు,1978 (తెలుగు)
అనోఖా శివభక్త్,1978,హిందీ
గోరంత దీపం,1978 (తెలుగు)
స్నేహం,1977 (తెలుగు)
భక్త కన్నప్ప,1976 (తెలుగు)
సీతాస్వయంవర్,1976 (హిందీ )
శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్,1976 (తెలుగు)
సీతాకల్యాణం,1976 (తెలుగు)
ముత్యాల ముగ్గు,1975 (తెలుగు)
శ్రీ రామాంజనేయ యుద్ధం,1974 (తెలుగు)
అందాల రాముడు,1973 (తెలుగు)
సంపూర్ణ రామాయణం,1971 (తెలుగు)
బాలరాజు కథ,1970 (తెలుగు)
ఇంటి గౌరవం,1970 (తెలుగు)
బుద్ధిమంతుడు,1969 (తెలుగు)
బంగారు పిచిక,1968, తెలుగు
*_సాక్షి,1967 (తెలుగు)_*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS