Sunday, December 12, 2021

అమ్మవారి యొక్క ఉగ్రమైన నామాలు,రూపాల వెనక పెద్ద Science ఉంది.ఆ అద్భుతమైన Science ను ఇప్పుడు చెప్తున్నాను

అమ్మవారి యొక్క ఉగ్రమైన నామాలు,రూపాల వెనక పెద్ద Science ఉంది.ఆ అద్భుతమైన Science ను ఇప్పుడు చెప్తున్నాను. 


డాకినీ, రాకినీ,లాకినీ,కాకినీ,సాకినీ, హాకినీ,యాకినీ అని అమ్మవారి శక్తులు మన శరీరంలోనే ఉన్నాయి. అమ్మవారు విశుద్ధ చక్రంలో,ఎరుపు రంగులో,ఒక తలతో, డాకినీ రూపంలో మన చర్మం అంతా వ్యాపించి ఉంటుంది. విశుద్ధచక్రము ఆకాశానికి సంకేతం. ఆకాశానికి ఒకే ఒక గుణం ఉంటుంది.అదే శబ్దం. ఆ శబ్దమే డాకినీ తల. ఆకాశం ఎలాగైతే అంతటా వ్యాపించి ఉంటుందో,అదే విధంగా డాకినీ, చర్మం రూపంలో మన శరీరం మొత్తాన్ని వ్యాపించి ఉంటుంది. ఇది డాకినీ తత్త్వం.

ఇక అమ్మవారు అనాహత చక్రంలో నలుపు రంగులో,రెండు తలలతో ,కోరలతో,రాకీనీ రూపంలో మన రక్తంలో కొలువై ఉంటుంది. అనాహతము వాయువుకు సంకేతం.వాయువుకు రెండు గుణాలు ఉంటాయి.  శబ్దం,స్పర్శ. ఇవే రాకినీ యొక్క రెండు తలలు. వాయువుకు కదులుతూ వ్యాపించే గుణం ఉంది. కాబట్టి ఈ రాకినీ రక్తం రూపంలో మన శరీరంలో కదులుతూ ఉంది. నెయ్యి అన్నం తింటే రక్తానికి మంచిది.అందుకే రాకినీ కి స్నిగ్ధ ఔదన ప్రియా అని పేరు. ఇది రాకినీ తత్త్వం.

 ఇక అమ్మవారు మణి పూరక చక్రంలో, ఎరుపు రంగులో,మూడు తలలతో,లాకినీ రూపంలో మన శరీరంలోని మాంసంలో కొలువై ఉంటుంది. మణి పూరకం అగ్నికి సంకేతం. అగ్నికి మూడు గుణాలు ఉన్నాయి.అవే శబ్ద,స్పర్శ,రూపం.అవే లాకినీ యొక్క మూడు తలలు. బెల్లం అన్నం తింటే మన శరీరం లో iron శాతం పెరుగుతుంది. దానివల్ల మన కండరాలు బలంగా ఉంటాయి. అందుకే లాకినీ కి గుడాన్న ప్రీత మానసా అని పేరు. ఇది లాకినీ తత్త్వం. 

ఇక అమ్మవారు స్వాధిష్ఠాన చక్రములో,పసుపు రంగులో,నాలుగు తలలతో, కాకినీ రూపంలో,మన కండరాలలో ఉన్న మేద లో(ఇది మేధ కాదు) అంటే కొవ్వులో కొలువై ఉంటుంది.
 స్వాధిష్ఠానము జలానికి సంకేతం. శబ్దం,స్పర్శ,రూపం,రుచి ఈ నాలుగు జలం యొక్క గుణాలు.అవే కాకినీ యొక్క నాలుగు తలలు. పెరుగు అన్నం శరీరానికి మంచిది. అందుకే కాకినీ కి దధ్యాన్న సక్త హృదయా అని పేరు. ఇది కాకినీ తత్త్వం.

ఇక అమ్మవారు మూలాధార చక్రంలో,ఐదు తలలతో, సాకినీ రూపంలో,మన ఎముకలలో కొలువై ఉంటుంది. మూలాధారం భూమికి సంకేతం. శబ్దం,స్పర్శ,రూపం,రుచి,వాసన ఈ ఐదు భూమి యొక్క గుణాలు.అవే సాకినీ యొక్క ఐదు తలలు. పెసర అన్నం తింటే ఎముకలకు మంచిది. అందుకే సాకినీ కి
ముద్గౌ దనాసక్త చిత్తా అని పేరు. ఇది సాకినీ తత్త్వం.

ఇప్పటి దాకా అమ్మవారు పై నుండి క్రిందికి ప్రయాణం చేశారు.అంటే విశుద్ధం  నుండి మూలాధారం వరకూ ప్రయాణం చేసి ఇప్పుడు పైకి ప్రయాణం చేస్తూ ఉంది. 

ఇక అమ్మవారు ఆజ్ఞా చక్రం లో,తెల్లని రంగులో,ఆరు తలలతో, హాకినీ రూపంలో,ముఖ్య ప్రాణ శక్తిగా,మన ఎముకలలో ఉన్న మజ్జ లో కొలువై ఉంది. మజ్జ అంటే Bone marrow. మనలోని రక్త కణాలు ఉత్పత్తి అయ్యే స్థానం ఇదే. అందుకే అమ్మవారు ముఖ్య ప్రాణ శక్తి రూపంలో మజ్జలో కొలువై ఉంటుంది. ఇది హాకినీ తత్త్వం.

ఇక అమ్మవారు సహస్రార చక్రం లో,అన్ని రంగులలో ప్రకాశిస్తూ,అనేకమైన తలలతో, యాకినీ రూపం లో, మన శరీరంలోని శుక్లము లో కొలువై ఉంటుంది. 

ఈ విధంగా అమ్మవారు వివిధ రూపాలలో,వివిధ చక్రాలలో,పంచభూతాల యొక్క గుణాలతో, మన శరీరంలోని వివిధ స్థానాలలో కొలువై ఉంటుంది. చూశారా అమ్మవారి నామాలలో ఎంత అద్భుతమైన Science ఉందో. ఈ విజ్ఞానాన్ని
మనం బాగా అర్థం చేసుకుని సాధన చేస్తూ ఉంటే మన శరీరం లోని
ప్రాణ శక్తిని విశ్వ శక్తితో ఏకం చేయవచ్చు. విశ్వానికి ఆధారంగా ఉన్న 
ఆ పరాశక్తి తో కలిసి ఒక్కటై పోవచ్చు. 

ఓం నమః శ్రీ లలితాయై పరాభట్టారికాయై నమః   


🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS