Wednesday, August 30, 2023

శ్రీచక్రార్చన అనగానేమీ??వాటి వివరణ🌹🌻

  శ్రీచక్రార్చన అనగానేమీ??వాటి వివరణ



 శ్రీమాత్రేనమ:  శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. అయిననూ పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో.

మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడినది.


శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము. శరీరంలోని షట్చక్రాలకూ, శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబధము కలదు.


శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. 


అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు.


నాలుగు శివ చక్రములు, ఐదు శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ వుంటుంది.


తొమ్మిది చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత వసిస్తూ వుంటుంది. చివరన బిందువులో కామకామేశ్వరులు నిలయమై వుంటారు.


శివ, శక్తి, చక్రములతో కలసి శివశక్తైక్య రూపిణి లలితాంబిక అయినది.


అర్ధనారీశ్వర తత్వమై, కామ కామేశ్వరుల నిలయమై, సృష్టికి ప్రతి రూపమై వెలుగొందినది ఈ శ్రీచక్రము.


సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రము. శ్రీ దేవి నిలయమే ఈ శ్రీచక్రము. శ్రీచక్రమే శ్రీదేవి. శ్రీదేవియే శ్రీచక్రము.


శ్రీచక్రము 3 రకములుగా లోకంలో పూజింపబడుచున్నది. ౧. మేరు ప్రస్తారము ౨. కైలాస ప్రస్తారము ౩. భూ ప్రస్తారము.


సప్త కోటి మహా మంత్రములతో సర్వ దేవతా స్వరూపమైన శ్రీచక్రమును విప్పూజించిన యెడల, సర్వ శక్తులూ, జ్ఞానము, మోక్షము ప్రాప్తించునని


మన పూర్వీకులు, ఋషులు విప్వక్కాణించి యున్నారు.


శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. ఆ ద్వారాలలో గనుక ప్రవేశించి నట్లైతే దేవీ సాక్షాత్కారం లభించినట్లే.


ఈ శ్రీవిద్యను మొదట్లో పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించెను. పరమేశ్వరుడు జగత్తునందు గల ప్రాణుల కామ్య సిద్దుల కొరకు చతుషష్టి (64) తంత్రములను సృష్టించెను.


కామేశ్వరీ దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్ధములు ఒక్క మంత్ర తంత్రము వలన కలుగునట్లుగా శ్రీవిద్యా తంత్రమును, శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరుని చే నిర్మింపబడినవి. శ్రీచక్రము అన్ని మంత్ర, యంత్ర, తంత్రములలో కెల్లా గొప్పదని, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరి యొక్క ప్రతి రూపమని చెప్పుదురు. కాబట్టి అధికారముకల వారికి శ్రీవిద్యా తంత్రము, మిగతా వారికి చతుషష్టి (64) తంత్రములు అని మన ఋషులు నిర్దేశించిరి. ఈ శ్రీవిద్యోపాసన వలన, శ్రీచక్రార్చన వలన ఈశ్వరానుగ్రహం చే ఆత్మ విచారణ యందు ఆసక్తి కలిగి, ఐహిక భోగముల యందు విరక్తి కలుగును. అందువలన బ్రహ్మ జ్ఞానము లభించును. అందుకే దీనిని బ్రహ్మవిద్య అని అన్నారు.


శ్రీవిద్యా మహా మంత్రములు అనునవి మోక్ష సాధనమగు మార్గములుగా చెప్పబడినవి.


ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము కావలయును అనేవారికి ఇవి నిర్దేశింపబడినవి.

  🌹శ్రీమాత్రే నమః🙏🌺  

శ్రీ కనకధారా స్తోత్రం

 శ్రీ కనకధారా స్తోత్రం



🌺శ్రీ శంకరాచార్యులచే రచించబడిన కనకధారా స్తోత్రమును ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును

శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్దయేమిలేకపోయేసరికి బాధతో, ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది. స్వామి నా దగ్గర బిక్ష ఇవ్వడానికి ఈ ఉసిరి మాత్రమే ఉంది. అని గురువుకి సమర్పించింది. ఆమె భక్తికి ఆచార్యుల హృదయం ద్రవించి, ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు. లక్ష్మీదేవి ప్రసన్నయై, స్వామి కోరినట్లు, ఆ ముసలమ్మ ఇంట కనకవర్షం కురిపించింది. ఆ స్తోత్రమే కనకధారస్తోత్రం.

ఈ స్తోత్రమును పఠించినవారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభీష్ట సిద్ధి కలుగచేస్తుంది. 🌺


🌺అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ

భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం |

అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా

మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 ||

భావం: మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక.. 🌺


🌺ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని |

మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || 2 ||

భావం:  పెద్ద నల్లకలువపైనుండు ఆడుతుమ్మెదవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాత అయిన యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక...


ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం

ఆనందకంద మనిమేషమనంగతంత్రం |

ఆకేకర స్థిత కనీనికపక్ష్మనేత్రం

భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః || 3 ||

భావం: నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగును గాక.


బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరినీలమయీ విభాతి |

కామప్రదా భగవతోపి కటాక్షమాలా

కళ్యాణమావహతు మే కమలాలయాయాః || 4 ||

భావం: భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక 🌺


🌺కాలాంబుదాళి లలితోరసి కైటభారేః

ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |

మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || 5 ||

భావం:  కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక..


ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్

మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |

మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం

మందాలసం చ మకరాలయకన్యకాయాః || 6||

భావం: ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ధి కన్య అగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షము నాయందు ప్రసరించునుగాక


విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం

ఆనందహేతురధికం మురవిద్విషోపి |

ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం

ఇందీవరోదరసహోదరమిందిరాయాః || 7 ||

భావం:  సమస్త దేవేంద్ర పదవి నీయగలదియు, మురవైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండును గాక 🌺


🌺ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర

దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |

దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || 8 ||

భావం:  పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక


దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా

అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |

దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం

నారాయణ ప్రణయినీ నయనాంబువాహః || 9 ||

భావం:  శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడ ననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక.


గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి

శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |

సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై

తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || 10 ||

భావం:  వాగ్దేవత అనియు, గరుడధ్వజ సుందరి అనియు, శాకంభరి అనియు, శశిశేఖర వల్లభా అనియు పేరు పొందినదియు, సృష్టి, స్థితి, లయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అగు లక్ష్మీదేవికి నమస్కారము. 🌺


🌺శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై

రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై |

శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై

పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై || 11 ||

భావం:  పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.


నమోస్తు నాళీకనిభాననాయై

నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |

నమోస్తు సోమామృత సోదరాయై

నమోస్తు నారాయణ వల్లభాయై || 12 ||

భావం: పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని వల్లభయును అగు లక్ష్మీదేవికి నమస్కారము.


నమోస్తు హేమాంబుజ పీఠికాయై

నమోస్తు భూమండల నాయికాయై |

నమోస్తు దేవాదిదయాపరాయై

నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై || 13 ||

భావం:  బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయిక అయినదియును, దేవతలలో దయయే ముఖముగా గలదియును, విష్ణువునకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 🌺


🌺నమోస్తు దేవ్యై భృగునందనాయై

నమోస్తు విష్ణోరురసిస్థితాయై |

నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై

నమోస్తు దామోదరవల్లభాయై || 14 ||

భావం:  భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణు వక్షస్థల వాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము.


నమోస్తు కాంత్యై కమలేక్షణాయై

నమోస్తు భూత్యై భువనప్రసూత్యై |

నమోస్తు దేవాదిభిరర్చితాయై

నమోస్తు నందాత్మజవల్లభాయై || 15 ||

భావం:  తామరపువ్వు వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము..


సంపత్కరాణి సకలేంద్రియ నందనాని

సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |

త్వద్వందనాని దురితాహరణోద్యతాని

మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||

భావం:  పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కల్గించునవి, సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగ గలవి, పాపములను నశింపచేయునవి, ఓ తల్లీ అవి ఎల్లపుడును నన్ను అనుగ్రహించుగాక. 🌺


🌺యత్కటాక్ష సముపాసనావిధిః

సేవకస్య సకలార్థసంపదః |

సంతనోతి వచనాంగమానసైః

త్వాం మురారిహృదయేశ్వరీం భజే || 17 ||

భావం:  ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరి యగు లక్ష్మీదేవిని మనోవాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును.


సరసిజనిలయే సరోజహస్తే

ధవళతమాంశుకగంధమాల్యశోభే |

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || 18 ||

భావం: కమలములవంటి కన్నులు గల ఓ తల్లీ, చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ, విష్ణుప్రియా, మనోఙ్ఞురాలా, ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాతా, నన్ననుగ్రహింపుము.


దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్ |

ప్రాతర్నమామి జగతాం జననీమశేష

లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్ || 19 ||

భావం: దిగ్గజములు కనకకుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను. 🌺


🌺కమలే కమలాక్ష వల్లభేత్వం

కరుణాపూరతరంగితైరపాంగైః |

అవలోకయ మామకించనానాం

ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || 20 ||

భావం: శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రధముడను, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణాకటాక్షముతో చూడుము.


దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః

కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే |

దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్

ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || 21 ||


స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం

త్రయీమయీం త్రిభువనమాతరం |

రమామ్ గుణాధికా గురుతరభాగ్యభాగినో

భవంతి తే భువి బుధభావితాశయాః || 22 ||


ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నరు. 🌺

దీపారాధన-ఎలాచేయాలి..?

 దీపారాధన-ఎలాచేయాలి..?



మన నిత్య జీవితంలో పూజ అయినా, వ్రతమైనా, శుభకార్యమైనా దీపారాధనతోనే మొదలు పెడతాము. దీపంలో దేవతలు, వేదాలున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపారాధనతో శాంతి, కాంతి చేకూరుతాయి. దీపానికి చాలా విశిష్ట ఉందని, అందుచేత దీపారాధన ఒక పద్ధతిగా, నిష్టగా చేయాలి.


నిజానికి దీపారాధన గురించి అనేక విషయాలు వాడుకలో ఉన్నాయి. శివుడికి ఎడమవైపు దీపారాధన చేయాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చేయకూడదనీ అంటారు. అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దాని మీద వెండి దీపారాధన కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, అమ్మవారికి పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. అగ్గిపుల్ల ద్వారా నేరుగా కుందులలోని దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.


దీపారాధన కుందిలో అయిదు వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్తమామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాలుగవది గౌరవ, ధర్మవృద్ధులకూ, అయిదోది వంశాకభివృద్ధికి అని చెప్పవచ్చు.


దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనకు ఉద్ధేశించిన దీపాల నుంచి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదు. ఇక ఇంటి ముందు తులసి మొక్కముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు. 


శనీశ్వరుడంటే అందరికీ భయం. అసలు, మనలో జీవ శక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత ఆయనే. శనీశ్వడికి అరచేతి వెడల్పుగల నల్లగుడ్డలో ఒక చెంచా నల్ల నవ్వులు పోసి మూటకట్టి, ఆమూట చివర వత్తిగా చేసి, ఇనప ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలి. ఈ దీపారాధనకూడా శివుడు, శనీశ్వరుడు, ఆంజనేయస్వామి ముందు చేసి శని దోషాలు పోవాలని నమస్కరించాలి.


వెండి దీపాలతో ఆరాధన

వెండి ప్రమిదల్లో నేతితో గానీ, కొబ్బరి నూనెతో గానీ, నువ్వుల నూనెతోగానీ, . దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవికి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తే.. వారు అనుకున్న పనులు సకాలంలోనే పూర్తవుతాయి. 


భక్తి శ్రద్ధలతో చేసే పవిత్రమైన దీపారాధన, చీకట్లనే కాదు పాపాలను సైతం తరిమేసి సుఖసంతోషాల తేజస్సును ప్రసాదిస్తుంది. వెలుతురు ప్రవాహమై మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది!

దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా

 దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా 


🌺1. #శైలపుత్రి 

ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడి చేత త్రిశూలం, ఎడమ చేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైన పాడ్యమి నాడు పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు తరిస్తారు.🌺

🌺2. #బ్రహ్మచారిని

ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉంది. దుర్గామాత రెండవ అవతారం ఇదేనని చెబుతారు. ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి ఉంటారు. శివుడిని భర్తగా పొందటం కోసం నారదుడి ఆదేశానుసారం ఘోర తపస్సు చేసినది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే విజయం లభిస్తుందని చెబుతారు.🌺

🌺3. #చంద్రఘంట 

శ్రీ దుర్గామాత మూడవ అవతారం చంద్రఘంట అవతారం. ఈ అమ్మవారు గంటాకృతితో ఉన్న అర్ద చంద్రుడిని శిరస్సున ధరించి ఉంటుంది. ఈ అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం వారణాసి లో ఉంది. ఈ అమ్మవారు దశ భుజాలతో దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారిని ప్రార్థిస్తే భయం, అపజయం దరికి రావు అని నమ్మకం.🌺

🌺4. #కూష్మాండ 

శ్రీ దుర్గామాత నాలుగవ అవతారం కూష్మాండ. ఈ అమ్మవారు సింహ వాహనం పైన అష్టభుజాలతో దర్శనం ఇస్తుంది. అందుకే ఈ అమ్మవారిని అష్టభుజి దేవి అని కూడా అంటారు. ఈ అమ్మవారి ఆలయం కాన్పూర్ లో ఉంది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే శీఘ్రంగా కటాక్షించి రక్షిస్తుంది.🌺

🌺5. #స్కందమాత

నవదుర్గలలో ఐదవ అవతారం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి అని అర్ధం. స్కందుడి తల్లి కనుక ఈ దేవిని స్కందమాత అని అంటారు. ఈ దేవి బాలస్కందుడిని తన ఒడిలో కూర్చుబెట్టుకొని మాతృమూర్తిగా భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ దేవిని ఆరాదిస్తే పతనం లేకుండా కనుకరిస్తుంది.🌺

🌺6. #క్యాత్యాయని

నవదుర్గలలో ఆరవ అవతారం క్యాత్యాయని. కోత్స అనే ఒక ఋషి పార్వతీదేవి తనకి కూతురిగా జన్మించాలంటూ ఘోర తపస్సు చేయగా అతడి కూతురిగా జన్మించింది. అందువలనే ఈ దేవికి క్యాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ అవతారంలో దర్శనం ఇచ్చే ఆ దేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.🌺

🌺7. #కాళరాత్రి 

నవదుర్గలలో ఏడవ అవతారం కాళరాత్రి. ఈ దేవి శరీరం ఛాయా చీకటి తో నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అనే పేరు వచ్చినది. ఈ దేవి వాహనం గాడిద. ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తుంది కనుక ఈ దేవిని శుభకరీ అని కూడా అంటారు. ఈ దేవి ఆలయం కూడా వారణాసి లో ఉంది.🌺

🌺8. #మహాగౌరి 

నవదుర్గలలో ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈ దేవి హిమాచలం కంటే తెల్లని ధవళ కాంతితో శోభిస్తుంటుంది. అయితే శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి ఘోర తపస్సు చేయగా ఆమె శరీరం నల్లబడుతుంది. ఇక ఆ దేవి భక్తికి మెచ్చిన స్వామివారు గంగా జలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారు. అప్పటినుండి ఆమె మహాగౌరి గా ప్రసిద్ధి చెందింది.🌺

🌺9. #సిద్ధిధాత్రి

శ్రీ దుర్గా మాత అవతారాలలో తొమ్మిదవ అవతారం సిద్ధిధాత్రి. ఈ దేవతని దేవతలు, సిద్దులు, మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తారు. ఈ దేవి బుద్ది, విద్య, భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది.

ఈవిధంగా శ్రీ దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఉండగా.... ఈ తొమ్మిది అవతారాలకు సంబంధించిన ఆలయాలు అన్ని కూడా వారణాసి లో ఉన్నాయి.🌺

మహాలక్ష్మి రహస్య నామావలి🙏🌷

 మహాలక్ష్మి రహస్య నామావలి🙏🌷



హ్రీం క్లీం మహీప్రదాయై నమః.

హ్రీం క్లీం విత్తలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం మిత్రలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం మధులక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం కాంతిలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం కార్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం కీర్తిలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం కరప్రదాయై నమః.

హ్రీం క్లీం కన్యాలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం కోశలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం కావ్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం కలాప్రదాయై నమః.

హ్రీం క్లీం గజలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం గంధలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం గృహలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం గుణప్రదాయై నమః.

హ్రీం క్లీం జయలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం జీవలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం జయప్రదాయై నమః.

హ్రీం క్లీం దానలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం దివ్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ద్వీపలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం దయాప్రదాయై నమః.

హ్రీం క్లీం ధనలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ధేనులక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ధనప్రదాయై నమః.

హ్రీం క్లీం ధర్మలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ధైర్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ద్రవ్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ధృతిప్రదాయై నమః.

హ్రీం క్లీం నభోలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం నాదలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం నేత్రలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం నయప్రదాయై నమః.

హ్రీం క్లీం నాట్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం నీతిలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం నిత్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం నిధిప్రదాయై నమః.

హ్రీం క్లీం పూర్ణలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం పుష్పలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం పశుప్రదాయై నమః.

హ్రీం క్లీం పుష్టిలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం పద్మలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం పూతలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ప్రజాప్రదాయై నమః.

హ్రీం క్లీం ప్రాణలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ప్రభాలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ప్రజ్ఞాలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ఫలప్రదాయై నమః.

హ్రీం క్లీం బుధలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం బుద్ధిలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం బలలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం బహుప్రదాయై నమః.

హ్రీం క్లీం భాగ్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం భోగలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం భుజలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం భక్తిప్రదాయై నమః.

హ్రీం క్లీం భావలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం భీమలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం భూర్లక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం భూషణప్రదాయై నమః.

హ్రీం క్లీం రూపలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం రాజ్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం రాజలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం రమాప్రదాయై నమః.

హ్రీం క్లీం వీరలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం వార్ధికలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం విద్యాలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం వరలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం వర్షలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం వనలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం వధూప్రదాయై నమః.

హ్రీం క్లీం వర్ణలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం వశ్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం వాగ్లక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం వైభవప్రదాయై నమః.

హ్రీం క్లీం శౌర్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం శాంతిలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం శక్తిలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం శుభప్రదాయై నమః.

హ్రీం క్లీం శ్రుతిలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం శాస్త్రలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం శ్రీలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం శోభనప్రదాయై నమః.

హ్రీం క్లీం స్థిరలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం సిద్ధిలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం సత్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం సుధాప్రదాయై నమః.

హ్రీం క్లీం సైన్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం సామలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం సస్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం సుతప్రదాయై నమః.

హ్రీం క్లీం సామ్రాజ్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం సల్లక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం హ్రీలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ఆఢ్యలక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ఆయుర్లక్ష్మ్యై నమః.

హ్రీం క్లీం ఆరోగ్యదాయై నమః.

హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మ్యై నమః.

 

🌷🙏ఇతి శ్రీ మహాలక్ష్మ్యాః రహస్యనామావలిః సంపూర్ణా 

గండ భేరుండ నరసింహ రూపం - ఆధ్యాత్మిక,మంత్ర శాస్త్ర విశ్లేషణ.........!!

 గండ భేరుండ నరసింహ రూపం - ఆధ్యాత్మిక,మంత్ర శాస్త్ర విశ్లేషణ.........!!


 ఇది అష్ట ముఖ గండభేరుండ నరసింహాకారం. దీనిని "గండభేరుంఢ పక్షి నృసింహ స్వామి" అంటారు. హిరణ్య కశ్యపుడితో, యుద్ధం చివరి దశలో ....ఆ దైవం చివరికి ఈ రూపాన్ని ప్రకటించాడు. మంత్ర రాజ పద మూల మంత్రంలో "సర్వతో ముఖం" అనే పదం ఉంది. హిరణ్య కశ్యపుడు, నృసింహుని చూసినపుడు , అతనికి నృసింహుడు అనేక రూపాలతో కనిపించాడు. 1. సింహం 2. పులి 3. కోతి 4. ఎలుగుబంటి 5. అడవి పంది 6. గరుడ 7. గుఱ్ఱం 8. మొసలి. 8 తలలు, 32 చేతుల అనుష్టుప్ మూల మంత్రం / మంత్ర రాజ పద మూల మంత్రం లోని 32 అక్షరాలను సూచిస్తాయి్ ఒక్కో అక్షరం/ఒక్కో బీజాక్షరం, 1,00,008 ఉపాక్షరాలను సూచిస్తుందో. ఇక్కడ హిరణ్య కశ్యపుడు, దైవాన్ని ...తన హృదయంలోనూ, బాహ్యం లోనూ, చూడగలిగాడు గనుక (అంతర బహిశ్చ తత్సర్వ వ్యాప్య నారాయణ స్థితః....), రెండుతలల పక్షి రూపం , ఇందుకు సూచనగా కనిపిస్తుంది. అహం స్థితికి, నిజ స్థితికి ఇది ప్రతీక.


    ఈ రూపంలో ఉన్న దైవం "అఘోర మూర్తి".  అద్భుతాన్ని మించే అందం, గహన గంభీరం, మానసాతీతం. హిరణ్య కశ్యపుని చంపేటపుడు...ఈ రూపంలో దైవం దర్శన మివ్వగానే, అతడు ఈ రూపం చూసి ఆత్మజ్ఞానం పొందాడట. అతను సరిగ్గా చనిపోయేముందు , గరుత్మంతుడు దయతో,  హిరణ్య కశ్యపుడి చెవిలో , "నరసింహుడి చరమ శ్లోకం" చెప్పాడు. అందుకే మనం , హిరణ్య కశ్యపుడి తల వద్ద "శ్వేత గరుడిని"చూడవచ్చు. ఈ "గండభేరుండ నరసింహ రూపం" , నృసింహుని యొక్క అరుదైన రూపం.


   "గండభేరుండ నృసింహం భావయామి"

ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమి చెయ్యాలి

 ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న ప్రతి

పని లో విజయం కావాలన్నా ఏమి చెయ్యాలి 🌺🙏

   


🌺శ్రీ మారుతి కృప ఉంటే ఎంతటి జటిలమైన సమస్య

అయినా సులువుగా తీరిపోతుంది. మనం చేసే పని

విజయవంతం కావాలన్న, కార్యం లో ఉన్న

ఆటంకాలు తొలగాలన్నా  ఆంజనేయ స్వామి

వారిని ఒక క్రమ పద్దతిలో ఆరాధించాలి.

ఉద్యోగం,వ్యాపారం, ఆరోగ్యం,ధనం మొదలగు

యే కోరికైనా  మారుతిని ఆరాధిస్తే నెరవేరుతుంది.

అందుకు ఈ క్రింది విధంగా చేయాలి. 🌺


🌺ప్రతి రోజు శ్రీ హనుమాన్ చాలీసా ని 11 సార్లు

ఒకే ఆసనం మీద కూర్చొని మధ్యలో లేవకుండా

చదవాలి. అంటే 11 సార్లు వరుసగా చదవాలి.

ప్రారంభం లో 1 గంట పడుతుంది. అలవాటు

అయ్యాక 40 నిముషాల్లో పూర్తవుతుంది.


11 సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత

ఒక సారి "శ్రీ రామ రక్షా స్తోత్రం" చదవాలి


మంగళవారం రోజు ఒక పూట ఉపవాసం ఉండి

అన్ని నియమాలు పాటించాలి.


మంగళవారం రోజు కొబ్బరికాయను స్వామి

వారికి సమర్పించాలి. వీలుంటే నెలకు ఒక

మంగళవారం రోజు ఆకుపూజ ను స్వామి

వారికి చేయించాలి.


ఈ విధంగా చేస్తూ ఉంటే మీ సమస్యలు ఎంత   జటిలమైనవి అయినా క్రమంగా తొలిగిపోతాయి. స్వామి వారి పై పూర్తి విశ్వాసం తప్పనిసరి. తండ్రి ఆంజనేయ అందరిని చల్లగా చూడు తండ్రి

విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని శ్రీమహాలక్ష్మికి పేరు ఎందుకొచ్చింది?

 విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని శ్రీమహాలక్ష్మికి పేరు ఎందుకొచ్చింది? ఓం శ్రీ మాత్రే నమః



ఒక రోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది చెప్పండి అని అంది. ఆమె మాటలను విన్న శ్రీహరి, అమెకు పరమేశ్వరానుగ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడా జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు.


అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూ లోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు. అయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళ గంగను చేరుకుని ఓ అశ్వత్ధ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది. అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు.


గణనాథుని విన్నపం మేరకు, లక్ష్మీదేవి తపస్సుకు విఘ్నాలు కలుగజేయ సాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనస్సు లగ్నం కాకపోవడంతో దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహన్ని పొందుతుంది. ఆనాటి నుండి ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు.


ఆమె చట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమయి అగ్ని బయటకు వచ్చి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. అది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొర పెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూ లోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె అభీష్ఠం నెరవేరలంటే రుద్ర హోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడు. అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.


వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశి రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్వఘ్నంగా ముగియడంతో, హోమ గుండం నుంచి ఓ వికృత రూపం బయటకు వచ్చి ఆకలి, ఆకలి అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి తన ఖడ్గంతో తన వామ భాగపు స్తనాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా, ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీ దేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఏలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్ధించింది.


అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, తథాస్తు నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్వాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమ గుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూ లోకవాసులు బిల్వవృక్షంగా పిలుస్తారు. మూడు దళాలతో ఉండే మారేడు దళాలతో పూజించే వారికి సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పాడు.

శ్రీ రామ నామం

 శ్రీ రామ నామం



 ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీ రామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు. 


శ్రీ రామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట.అదెలాగో చూద్దాం.


1⃣ రామ అంటే రాముడు పలుకుతాడు తెలిసిందే


2⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడే


3⃣ శ్రీ అంటే లక్ష్మి


4⃣ రా అంటే విష్ణువు (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)


5⃣ మ అంటే శివుడు (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)


6⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. 


అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. 


అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. 


మరి రామ అన్నపుడు హనుమ వస్తే పార్వతీ కూడా వచ్చింది కదా.


రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు. గమనించండి. 


శ్రీ రామ శ్రీ రామ అని అంటూనే వుందాము. 

మన ఈ మానవ జన్మ తరింద్దాము.🕉👏🌷

"శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం"....

 ఈ స్తోత్రం పఠించి.. ఫలితాలు పొందవచ్చు........!!

ఇళ్లు,స్థలాలు కొనుటకు మరియు అమ్ముటకు,

కోర్టు సమస్యల పరిహారం కొరకు,

సోదరులమధ్య మరియు

ఆలుమగలు అన్యోన్యతకు,

మృగశిర,చిత్త మరియు ధనిష్ఠా నక్షత్రముములవారు,

కుజ దశ జరుగుతున్నవారు,

శ్రీఘ్ర వివాహం కొరకు,

కుజ దోష పరిహారం,

సంతానం కోసం


"శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం"....



భక్తి శ్రద్దలతో 41రోజులు పారాయణ చేసి సుబ్రమణ్య స్వామికి కళ్యాణం జరిపించిన శుభ అనుకూల ఫలములను పొందగలరు


అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రమహామంత్రస్య అగస్త్యోభగవానృషిః | అనుష్టుప్ఛందః | సుబ్రహ్మణ్యో దేవతా | మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |


ధ్యానం |

షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |

శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||

పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |

ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం ||


ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |

అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః ||


గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |

సప్తమః కర్తికేయశ్చ కుమరశ్చాష్టమస్తథా ||


నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |

ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ ||


త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |

క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః ||


షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |

బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః ||


కవిత్వేచ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |

కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ ||


విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |

యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవం ||

త్రిపుర సుందరి స్తోత్రం: అర్థంతో కూడిన సాహిత్యం,,🌺🙏

 త్రిపుర సుందరి స్తోత్రం: అర్థంతో కూడిన సాహిత్యం,,



🌺త్రిపుర సుందరి స్తోత్రం తరచుగా త్రిపుర సుందరి అష్టకంగా పరిగణించబడుతుంది, ఇది త్రిపుర సుందరి దేవిని స్తుతించడానికి శ్రీ ఆదిశంకరాచార్య స్వరపరిచిన గొప్ప శ్లోకం. ఒక శక్తివంతమైన దేవత మరియు దస మహా విద్యలలో ఒకరు, ఆమె వరాలను ప్రసాదించడానికి మరియు తన భక్తుల కోరికలను నెరవేర్చడానికి ప్రసిద్ధి చెందింది. 🌺


🌺త్రిపుర సుందరి స్తోత్రం సాహిత్యం అమ్మవారి రూపాన్ని, గుణాలను, దైవ స్వభావాన్ని వివరిస్తూ గొప్ప అర్థాన్ని ఇస్తుంది. అలాగే, ఈ సాహిత్యం భక్తులపై అమ్మవారి అభిరుచులను మరియు ఆమె మాతృ స్వభావాన్ని వివరిస్తుంది.


ఈ స్తోత్రం 8 చరణాలను కలిగి ఉంది..

త్రిపుర సుందరి స్తోత్రం..


కదంబ వన చారిణీం ముని కదంబ కాదంబినీం

నితాంబ జిత భూదారాం సురనీతంబినీ సీవితాం

నవాంబురుహ లోచన అభినవాంబుధ

శ్యామలాం త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీ మాశ్రయే (1)


కదంబ వృక్షాల అడవులలో సంచరించే ఓ దేవత త్రిపుర సుందరీ, ఆధ్యాత్మిక దాహంతో నిండిన మునికి ఆనందకరమైన మేఘాల సమూహంలా పనిచేస్తుంది.

తన తుంటిచేత పర్వతాలను జయించినవాడా, ఓ గొప్ప గుణాలు కలిగిన దివ్య కన్యలచే సేవింపబడినది.

కమలాన్ని పోలిన కన్నులు గలవాడూ, కొత్తగా ఏర్పడిన మేఘంలా ఉన్నవాడూ, ముదురు నీలం రంగులో ఉన్నవాడూ,

మూడు కన్నుల దేవత యొక్క భార్య, ఓ త్రిపుర సుందరీ, నేను నిన్ను శరణు వేడుతున్నాను. 🌺


🌺కదంబ వన వాసినీం కనక వల్లకీ ధారిణీం

మహార్హమణి హరిణీం ముఖ సమ్ముల్ల సద్వాఅరుణీం

దయావిభవ కారణీం విసద-రోచనా చారిణీం

త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీ మాశ్రయే (2)


ఓ కదంబ వృక్ష వనాలలో నివసించే త్రిపుర సుందరీ, బంగారు వీణను ధరించి,

విలువైన రత్నాలు పొదిగిన నగలు (హరం) ధరించి, అమృతంతో ప్రకాశించే ముఖం.

కరుణామయుడు, శ్రేయస్సును ప్రసాదించేవాడు మరియు విశాలమైన రూపాన్ని సూచించే పెద్ద కన్నులు ఉన్నవాడు,

మూడు కన్నుల దేవుడి భార్య, ఓ త్రిపుర సుందరి, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను.


కదంబ వన శాలయ కుచ భరోల్ల సన్మాలయ

కుచోపమిత శైలయా గురుకృపాల సద్వేలయ

మదారుణ కపోలయ మధురగీత వాచాలయ

కాయపి ఘన నీలయ కవచిత వయం లీలయా (3)


ఓ త్రిపుర సుందరీ, కదంబ వనాలను తన ఆరాధనగా చేసుకున్న, వక్షస్థలం చుట్టూ ఉన్న పూలమాలలతో ఆరాధించబడిన త్రిపుర సుందరీ,

ఎవరి వక్షస్థలం పర్వతాలను పోలి ఉంటుందో (తల్లి పోషణను సూచిస్తుంది), అన్ని సమయాలలో కృపను ప్రసాదించేది, ఎవరి చెంపలు

ఎర్రగా ఉంటాయి మరియు అతని పదాలు ముదురు రంగులో ఉండే మేఘాల వంటి మధురమైన పాటలు

. ఆమె నాటకం యొక్క దయతో ఉన్నాము. 🌺


🌺కదంబ వన మద్యగాం కనక మండలోపస్థితాం

షడం భూరుహ వాసినీం సతతసిద్ధ సౌదామినీం

విదంబిత జప-రుచిం వికచ-చంద్ర చూడామణిం

త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీ మాశ్రయే (4)


ఓ కదంబ వనాల మధ్యలో నివసించే త్రిపుర సుందరీ,

ఆరు కమలాలలో నివసించే బంగారు ప్రదేశంలో ఆసిన్నురాలై, పూర్తిగా వికసించిన జప పుష్పాల (మందార) శోభను పోలిన దివ్య జ్ఞానాన్ని సాధించడానికి జ్ఞానులకు నిరంతరం వెలుగునిచ్చే మూలాధారం, త్రిపుర దేవత, త్రిపుర దేవత తలపై ఉన్న చంద్రునిచే అలంకరించబడినది. సుందరీ, నేను నిన్ను శరణు వేడుచున్నాను.


కుచఞ్చిత విపంచికాం కుటిల కుంతలా లాంకృతాం కుశేశాయ

నివాసీం కుటిల చిత్త విద్వేషినీం మదారుణ

విలోచనాం మనసిజారీ సమ్మోహినీం

మాతంగ ముని కన్యకాం మధుర భాషిణీ మాశ్రయే (5)


మూడు దేవత త్రిపుర సుందారి, బోసమ్ మీద ఉన్న వినాతో ఉన్నది, తామర తాళాలతో నిండినది, తామర (సాహస్రారా చక్రం యొక్క తామర) లో నివసించేది, దుష్ట చర్యలకు వ్యతిరేకంగా ఉన్న మాధుజ్ (భగవంతుడి నుండి బయటపడటం బ్రహ్మ యొక్క మనస్సు) సేజ్ మాతంగా కుమార్తె, ఎప్పుడూ మధురమైన సంభాషణలు చేస్తుంది, నేను నిన్ను

ఆశ్రయం ఆశ్రయిస్తున్నాను. 🌺


🌺స్మరేత్ ప్రధమ పుష్పిణీం రుధిర-బింధు నీలాంబరాం

గృహీత మధు పాత్రికాం మద విఘుర్ణ నేత్రాంచలం

ఘన స్థాన భరూన్నతాం గలిత చూలికాం శ్యామలాం

త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీ మాశ్రయే (6)


ఓ త్రిపుర సుందరీ దేవి, మన్మదపు మొదటి పుష్పబాణాన్ని పట్టుకున్నది, ఎర్రటి బిందువు (కుంకుమ), నీల వస్త్రాలతో అలంకరించబడినది, అమృతపు కుండను పట్టుకుని, శక్తితో నిండిన కన్నులతో, ఎవరి వక్షస్థలం అధిక బరువుతో ఉంటుందో (సృష్టి యొక్క తల్లి యొక్క పోషణ స్వభావాన్ని సూచిస్తుంది) తార) మూడు కన్నుల దేవత యొక్క భార్య, ఓ దేవత త్రిపుర సుందరి, నేను

నిన్ను

ఆశ్రయిస్తున్నాను


సకుంకుమ విలేపనాం అలిక చుంభీ కస్తూరికాం

సమంద హసితే క్షణం శశర చాప పాశాంకుశం

అశేష జన మోహినీ అరుణ మాల్య భూషాంబరం

జప కుసుమ భాసురాం జపవిధౌ స్మరం అంబికాం (7)


ఓ త్రిపుర సుందరీ దేవి, దేహమంతా వెర్మిలియన్ ముద్దలు పూయబడినది, కస్తూరి వంటి సువాసనలతో నుదుటిపై పూయబడినది, ఆమె

సున్నితమైన చిరునవ్వు మరియు ఆహ్లాదకరమైన కళ్ళను ప్రదర్శించే అన్ని ప్రాణులను చూసుకునేది, ఆమె బాణాలు, విల్లు, పాము మరియు చేతుల్లో గొడ్డలితో అలంకరించబడింది.

ఎర్రని దండలు, ఆభరణాలు మరియు వస్త్రాలతో అలంకరింపబడిన, సమస్త ప్రాణులను మంత్రముగ్ధులను చేయగలది,

మందార పూలతో కనిపిస్తున్నావు, నేను జపం చేయడానికి కూర్చున్నాను , ఓ అంబికా దేవి. 🌺


🌺పురంధర పురంద్రికాం చికుర-భంధ సైరంద్రికాం

పితామహ పతివ్రతాం పాతు పతీర చర్చరతాం

ముకుంద రమణీ మణి లాస దళంక్రియా

కారీణీం భజామి భువనాంబికాం సుర వధూతికా చేతికాం (8)


ఇంద్రుని జీవిత భాగస్వామి అయిన త్రిపుర సుందరీ, ఇంద్రాణి (పురంధర పురంధ్రికా - పుర ప్రభువు భార్య - ఇంద్రుడు) తన జుట్టును అమర్చడానికి బ్రహ్మ - సరస్వతి గంధపు ముద్దలను పూయడానికి గంధపు ముద్దలను పూయడానికి ఓ త్రిపుర సుందరీ, విష్ణువు (ముకుంద) యొక్క స్త్రీలను కలిగి ఉన్నవాడా, నిన్ను ఆరాధించే గొప్ప విష్ణువు (ముకుంద) ప్రపంచాలు), ఆమె పరిచారకులుగా

ఖగోళులు

సేవలందించారు


త్రిపుర సుందరి స్తోత్రం/అష్టకం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు

త్రిపుర సుందరి స్తోత్రం యొక్క సాహిత్యం మరియు అర్థంలో, ఈ స్తోత్రం త్రిపుర సుందరి దేవిని ధ్యానించడానికి మరియు ఆమె దివ్యమైన ఆనందాన్ని పొందడానికి ఈ స్తోత్రం ఉపయోగపడుతుందని పరోక్షంగా ఈ గొప్ప శ్లోకం యొక్క ప్రయోజనాలను వివరించడం జరిగింది.


దేవి తన రక్షణ కోసం మరియు తల్లి వంటి ప్రకృతిని ప్రసాదించడం కోసం పవిత్ర గ్రంథాలలో వివరించబడింది. ఒక భక్తుడు అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే, వారు మహామాత త్రిపుర సుందరి యొక్క దివ్యమైన ఆనందాన్ని ప్రసాదిస్తారు. 🌺శ్రీ మాత్రే నమః. 

పుత్రులుఏడురకాలుగా_జన్మిస్తారు.........!!

 పుత్రులుఏడురకాలుగా_జన్మిస్తారు.........!!


          .1) పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించిన వాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.

2) తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.

3) పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.

4) పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.

5) పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ - సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.

6) పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.

7) ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.



ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.

శనిదేవుడిని ఇలా పూజిస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడని తెలుసా?

 శనిదేవుడిని ఇలా పూజిస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడని తెలుసా?



👉సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతారు.శనిదేవుడిని ఈ రకంగా పూజిస్తే మనకు కష్టాలను కాదు ఐశ్వర్యాన్ని ఇస్తాడని మీకు తెలుసా..?


సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతారు. మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటాం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే ఆయనను తప్పక ఆరాధిస్తారు.


‘నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం’ 


భావం :—  నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు, రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు, యమాగ్రజం-యముడికి సోదరుడు, ఛాయా మార్తాండ సంభూతం: ఛాయా దేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు, తం నమామి శనేశ్చరం: అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. 

ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మిమల్ని అనుగ్రహిస్తాడు.


శనీశ్వరుడిని ఎప్పుడూ శని శని అని పిలవకూడదట. శనీశ్వరా అని మాత్రమే పలకాలి. విశేషం ఏమంటే ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఉదాహరణకి శివుడిని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం, ఆయన అలా అనుగ్రహిస్తాడు... వెంకటేశ్వర స్వామి పేరులోనూ ఈశ్వర శబ్దం ఉంది. ఈశ్వర శబ్దం ఉంది కాబట్టే ఆయన కలియుగ దైవంగా మారి మన కోరికలను నెరవేరుస్తున్నాడు.

అలాగే శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శివుడిలా, వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

శనీశ్వరుడికి బయపడాల్సిన పనిలేదు. నవగ్రహా మండపానికి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి. నమస్కరించడం వల్ల, శనివార నియమాల్ని పాటించడం వల్ల, నీలం లేదా నలుపు రంగు వస్త్రాల్ని ధరించడం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల, తప్పక అనుగ్రహిస్తాడు.


శనీశ్వరుడి వల్ల కలిగే దోషాలు అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనాసరే మీకు యోగంతోపాటు పీడని కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మ శని, ద్వాదశ శని, లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురిచేస్తాడు. ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి, గౌరవిస్తారో అలాంటి వాళ్లను అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడు కూడా శని పీడ రావాలనే కోరుకోవాలట.


ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ మీకు అందించి వెళ్తాడు. మాకు శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం, ఐశ్వర్యం కూడా రాదట. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీకలిగించాలని భక్తిశ్రద్ధలతో కోరుకోవాలట. శనీశ్వరుడి ఆరాధించాలి.


చక్కగా నీలిరంగు పుష్పాలతో పూజించి, శివారాధన, హనుమాన్, అయ్యప్ప ఆరాధనా చేయాలట. అలాగే శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడట. కొద్ది ఇబ్బందులు ఎదురైనా అంతకు మించి ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది తెలిసిన తర్వాత శనీశ్వరుడు అంటే భయం తొలగిపోతుంది.

ఆడవారు ఋతుక్రమంలో ఉన్నపుడు వేరుగా, అంటే ఏమీ ముట్టుకోకుండా ఉండాలంటారు.

 ఆడవారు ఋతుక్రమంలో ఉన్నపుడు వేరుగా, అంటే ఏమీ ముట్టుకోకుండా ఉండాలంటారు.


ఎందుచేత? అది ఆడవారిలో సహజంగా జరుగు శరీరమార్పేకదా! మరి అలా వేరుగా ఉంచటమనేది ఆరోగ్యపరంగా మన పెద్దలు పెట్టిన ఆచారమా, లేక దైవసంబంధంగా దోషమని పెట్టినారా? ఆ సమయంలో దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు, దైవసంబంధ కార్యక్రమాలలో పాల్గొనకూడదు అంటారు ఎందువలన? నిజంగా అది చాలా దోషమా? దేవుడు అంతటా ఉన్నాడు కదా! మరి వేరుగా ఉండడం వంటి అశౌచాలు ఎందుకు పాటించాలి? అసలు వేదాల్లో వీటికి ఆధారముందా? ఇది అనాగరికం కాదా? వివరంగా సమాధానమివ్వండి. 


ఈ విషయంలో అనేకమంది అనేక విధాలుగా ప్రశ్నిస్తున్నారు. కొందరు వీటికి వేదాధారం ఉందా? కల్పితమా? అని కూడా అడుగుతున్నారు. అన్నిటికీ కలిపి - మీ ప్రశ్నను ఆధారంగా సమాధానమిచ్చేందుకు ప్రయత్నిస్తాం. 


మానవుల ఇహపర సౌఖ్యం కోసం సూక్ష్మ విషయ దర్శనం చేసిన శాస్త్రాలు అవతరించాయి. అవి వేదాలను ఆధారం చేసుకుని ఉన్నాయి. వేదాలు అపౌరుషేయాలు. దోష శంకా కళంకాలు లేనివి. అవి మానవ సుఖ జీవనం కోసం కొన్ని ఆచారాలనీ, నియమాలనీ ఉపదేశించాయి. వాటిని పాటించడం ప్రతి వైదికుని కర్తవ్యం. మడి, మైల అనే పదాలను మనం వింటుంటాం. అవి శుభ్రతను మటుకే తెలుపుతాయని అనుకోవడం పొరపాటు. వాటి వెనుక మనకు గోచరించని, కానీ మన జీవనంపై ప్రభావం చూపించే సూక్ష్మశక్తుల గురించిన పరిజ్ఞానం ఉంది. జాత, మృత అశౌచాదులలో మనం శారీరకంగా, మానసికంగా శుద్ధంగా ఉన్నా 'మైల' అనే పరిపాటి లోకంలో ఉంది. కాబట్టి వేదం ఎలా చెప్పిందో అదే ఆచరణలో ఉండాలి. మన యుక్తులూ, మార్చుకోవడాలు వైదిక ఆచారం కానేరదు. 


స్త్రీలు ప్రతిమాసం ఋతుకాలంలో విడిగా ఉండడం మన పూర్వీకుల ఆచారం. దీనికి ఆధారం యజుర్వేదంలో రెండవ కాండలోని ఐదవ ప్రపాఠకం. అందులో విశ్వరూపవధ, రజస్వలా వ్రతాలు ముఖ్యంగా చెప్పబడి ఉన్నాయి. అది ఇలా ఉంది. 

- పూర్వం బృహస్పతి తపస్సుకు పోగా, ఇంద్రుడు త్వష్ట కుమారుడైన విశ్వరూపుని గురువుగా చేసుకున్నాడు. ఆయనకు మూడు తలలు. వాటితో అతడు సోమపానం, సురాపానం, అన్నభోజనం చేసేవాడు. 


ఒకప్పుడు తనకు లభించిన యజ్ఞభాగాన్ని రాక్షసులకి ఇవ్వడంతో కోపం చెందిన ఇంద్రుడు వజ్రాయుధంతో అతని శిరస్సుని ఖండించాడు. అవి పక్షులై బ్రహ్మ హత్యాదోషాన్ని ధరించి ఇంద్రునికి ఆ దోషాన్ని ఇవ్వసాగాయి. దాంతో ఇంద్రుని ఇంద్రత్వానికే ఆపద వచ్చింది.


యజ్ఞం ద్వార కొంతమేరకు తొలగించి, మిగిలిన ఆ దోషాన్ని మూడు భాగాలు చేసి, పుచ్చుకున్న వారికి కోరిన వరమిస్తానన్నాడు. ఒక భాగాన్ని పృధివి తీసుకుంది. వరంగా - భూమిపై ఎక్కడైనా తవ్వితే కొన్ని రోజులకు ఆ భూమి సమమయ్యేలా కోరింది. అలాగేనని వరమిచ్చాడు ఇంద్రుడు. వృక్షాలు ఒక భాగాన్ని పుచ్చుకున్నాయి. కొన్ని కొమ్మలు నరికినా వృక్షం మృతి చెందక మళ్ళీ వేరే శాఖలు మొలిచేలా వరాన్ని పొందింది. అలాగే స్త్రీలు చివరిభాగం తీసుకొని, దానికి బదులుగా పుత్రోత్పత్తి సామర్థ్యాన్ని వరంగా పొందారు. అందువల్ల ఆ రజస్వలాకాలంలో వారికి బ్రహ్మహత్యాదోషం ఉంటుంది. ఆ దోషం ఉండడంవల్ల, ఆ రోజుల్లో వారితో సల్లాపాలు చేయరాదు, సమానంగా కూర్చోరాదు. ఒకటిగా భోజనం చేయరాదు. వారిని తాకరాదు. వారు వండినవి తినరాదు. అలా నియమాలు పాటించని పక్షంలో కొన్ని కష్టాలు వస్తాయని కూడా వేదమంత్రాలు చెప్తున్నాయి. ఇది వేదం చెప్పిన గాధ. పైగా - ఇందులో ఎన్నో సంకేతాలు ఉంటాయి. శరీర నిర్మాణంలో దేవతా శక్తులే ఇంద్రియాధిదేవతలు. మన శరీరంలో మనకు తెలియని మార్పులు జరుగుతున్నట్లే మనపై ప్రభావం చూపే సూక్ష్మ ప్రపంచంలోనూ జరుగుతాయి. ఇంద్రుడు ప్రధాన దేవతా శక్తి. ఆశ్చర్యంగా, కాలగమనాన్ని ఆధారం చేసుకొని మారే శరీరనియమంలో అంతు తెలియని దైవిక రహస్యాలను వేదం వివరిస్తుంది. ఇంద్రియాతీత సత్య దర్శనమే కదా వేద విజ్ఞానం. 


కొన్ని ధర్మాలని పాటించలేకపోవచ్చు. కానీ మన అశక్తత వల్ల వదలి, వాటిని ధర్మాలేకావనీ, మనం చేసిందే ధర్మమనీ ఋషి విజ్ఞానాన్ని తూలనాడడం ఎందుకు? ఆధునిక కాలంలో వాటిని పాటించడం శ్రమమనీ, అవి మూఢ నమ్మకాలనీ స్త్రీలను తక్కువ చేయడమేనన్న భావాలున్నాయి. కానీ అవి సరికావు. ఇది వైదిక ఆచారమే. మన పూర్వీకులు పాటిస్తూ వచ్చిన ధర్మమే. మనకు పట్ట లేదని అవి మూఢనమ్మకాలనడం సబబు కాదు. స్త్రీలు ఇంద్రునికి సహాయం చేసి, దోషాన్ని తాము తీసుకొని అనుభవిస్తున్నారని వారి గొప్పదనాన్ని తెలుపుతోంది కనుక, వారిని తక్కువ చేయడం ఏ మాత్రమూ కాదు. 


పైగా ఇది శరీరం దోషం. వ్యక్తిత్వ దోషం కాదు. ఇది అవమానకరమూ కాదు. దేశ, కాలపరిస్థితులను బట్టి కొన్ని అనుకూలించకపోయినా, శక్తివంచన లేకుండా యధాశక్తి వాటిని ఆచరించవచ్చు. ఇంట్లో ఇతరుల్ని తాకకుండా , వండకుండా విశ్రాంతిగా ఒకే చోట ఉండడం ఎప్పుడైనా కుదురుతుంది. శ్రద్ధ ఉన్నప్పుడు తప్పకుండా ఆచరించగలం. నెలలో కేవలం ఆ కొద్దిరోజులు జాగ్రత్తపడడం, కొంచెం శ్రమ అయినా, అసాధ్యం కాదు. బైట ప్రపంచం గురించి విడిచిపెట్టండి, మన ఇంట్లో మనం జాగ్రత్తగా ఉండగలం.

నాలుగవ రోజున స్నానం చేశాక, నీళ్ళలో పసుపు కలిపి ఆ దోషాలన్నీ పోయేలా భగవత్ సమర్పణ చేసి స్నానం చేస్తారు. ఇంట్లో ఆ మూడు నాళ్ళు మసలిన చోటంతా పసుపు నీళ్ళు జల్లి ఇల్లు కడుగుతారు. పైగా - మంత్రం జపించేవాళ్ళు ఉన్న ఇంట, దీపారాధన, దేవతాపూజలు జరిగే ఇంటా ఇటువంటి 'మైల'లు కలిస్తే ఆ మంత్రశక్తి, దైవశక్తి నశిస్తాయి. దీనికి ఎన్నో నిదర్శనాలున్నాయి. తాయెత్తులు, యంత్రాలు వంటివి కూడా రజస్వలా స్త్రీ స్పర్శతో శక్తిహీనమవుతాయి. మళ్ళీ సంప్రోక్షణ చేస్తేగానీ వాటిలో శక్తి చేరదు. 


'అంతటా దేవుడున్నాడు కదండీ' అనే వేదాంత వచనాన్ని దీనికి అన్వయించడం తప్పు. అంతటా దేవుడున్నాడనిపిస్తే - ఒకే చోట దేవతాపూజ చేయడం ఎందుకు? దేహ స్పృహ ఉన్నంతకాలం ఆచారం పాటించవలసిందే. 


ఈ విధమైన అశౌచంలోనున్న స్త్రీ శరీరం నుండి ప్రసరించే సూక్ష్మ విద్యుదయ స్కాంత తరంగాల ఆవరణ (ఆరా) దివ్యంగా ఉండదు. విపరీత శక్తులతో ఉంటుంది. ఇది సూక్ష్మ ప్రపంచాన్ని దర్శించగలిగిన వాళ్ళకి తెలుస్తుంది. 


నిత్యం దీక్షగా ఉన్న స్త్రీలు ఆ నాలుగు రోజులు మంత్ర జపం, స్తోత్ర పారాయణ, దీపారాధన వంటివి చేయరాదు. (మానసికంగా నామస్మరణ చేస్తే తప్పులేదు). తిరిగి స్నానాదులు చేశాక (అయిదవరోజు నుండి) వాటిని కొనసాగించవచ్చు. అప్పుడు, మధ్యలో ఆపిన దోషం ఉండదు. అలా కాకుండా ఆ నాలుగు రోజుల్లోనూ వాటిని కొనసాగిస్తే, పాపం సంక్రమిస్తుంది. ఆ సమయంలో దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొన్నా దోషమే. మామూలుగా నిత్యం సహజంగా మలినాలు విసర్జించాక, స్నానం చేస్తేనే గానీ పూజాదులకు పనికిరాదంటారు. మరి ఈ విషయంలో నియమాలుంచడం ఎంత అవసరమో ఆలోచించండి!


దేవాలయాదుల వాతావరణమంతా మంత్ర శక్తిచేత, నిత్యానుష్ఠానాలచేత పునీతమై ఉంటుంది. అందులో ఇటువంటి అశౌచమున్నవాళ్ళు ప్రవేశిస్తే, ఆ వాతావరణం లోని సూక్ష్మంగా ఉన్న పవిత్రత దెబ్బతింటుంది. 


మన దేవతల గురించి, మంత్రాల గురించి చెప్పిన వేదపురాణాలే ఈ విషయాలూ చెప్పాయి. దేవత పై నమ్మకం ఉంటే వీటిని నమ్మవలసిందే. 'శుచి' అనేది అభివృద్ధి చెందిన నాగరికతకి చిహ్నం. అయితే -మనకో సందేహం రావచ్చు - బైట ఎందరో అలా ఉంటున్నారు కదా! అని. బైటవిషయం మనకు జ్ఞాతం కాదు. మన మటుకు మనం జాగ్రత్తపడితే చాలు. అందుకే దైవమందిరాన్ని ప్రత్యేకంగా ఉంచుతాం. బైటకి వెళ్ళివచ్చిన బట్టలతో ముట్టుకోం. స్నానం చేసి, శుద్ధజలాన్ని పట్టుకొని, శుద్ధవస్త్రాల్ని కట్టుకొని 'పుండరీకాక్ష' (భగవంతుని) నామం స్మరించుతాం. అప్పుడు శుచి వస్తుంది. తెలిసి అటువంటి వాటిని కలుపుకోకూడదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆవరణలో ఉన్న ప్రాంతమంతా అశుచి అవుతుంది.


ఆరోగ్యరీత్యా కూడా - ఆ నాలుగు రోజులూ స్త్రీకి విశ్రాంతి అవసరం. అప్పుడు కూడా ఆమెకు విశ్రాంతినివ్వకుండా, ఇంటి పనులు చేయించడం మగవాడి దౌర్జన్యమే. అప్పటి 'ఇన్ఫెక్షన్' ప్రభావం గురించి విజ్ఞాన శాస్త్రమూ చెప్పింది. భారతీయ విజ్ఞానంలో భౌతికవిజ్ఞానం, సూక్ష్మ ప్రపంచ విజ్ఞానం కలిసి ఉంటుంది. భౌతిక విజ్ఞానం ఇంకా ఎదుగుతోంది. ఇప్పటికే మన ఆచారాల్లో కొన్నింటి ఆరోగ్య రహస్యాలు అంగీకరిస్తున్నారు. ఇంకా ఈ సైన్స్ ఎదిగితే, అన్నిటినీ అంగీకరిస్తారు. కానీ ఈ లోపలే మనం వీటిని పోగొట్టుకోకూడదు. ఈ నాలుగు రోజులూ ఆమె ఇంట్లో కలవకూడదు. ఇంటి యజమానిగానీ, ఇంకెవరైనాగానీ దీపారాధన పూజ చేయవచ్చు. 


మన చుట్టూ జగత్తులో దైవీశక్తులూ, విపరీత శక్తులు ఉంటాయి. విపరీత శక్తుల ప్రభావం పడకుండా ఉండేందుకే శౌచాన్ని పాటించాలి. 


'ఇవి కుదరవు' అని తప్పించుకుంటే నష్టపోయేది మనమే. ఆ నష్టానికి సిద్ధపడితే వదలవచ్చు. శాస్త్రాన్ని పాటించడం వల్ల పాటించిన వారికే ప్రయోజనం కానీ ఇంకెవరికోకాదు. మన శ్రేయస్సు కోసమే సూక్ష్మదర్శనం కలిగిన ఋషులు సదాచార నియమాలను పేర్కొన్నారు. అవి పాటించడం కొందరికి సాధ్యంకాక పోవచ్చు. అంతమాత్రం చేత వాటిని తీసిపారేయడం తగదు కదా! నిప్పునీ, నీటినీ సమానంగా చూడగలిగే ద్వంద్వాతీత అవధూత స్థితిలో ఉన్నవారికే విధినిషేధాలు ఉండవుగానీ, నిప్పు నీరూ, మంచీ చెడూ, శీతోష్ణాలూ, సుఖదుఃఖాలూ తెలిసిన దేహస్పృహ కలిగిన మనందరికీ విధినిషేదాలున్నాయి

శక్తిపీఠాలు అంటే ఎన్నున్నాయి ఎక్కడెక్కడున్నయ్

 శక్తిపీఠాలు అంటే ఎన్నున్నాయి ఎక్కడెక్కడున్నయ్



పురాణ కథ..

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయదలంచి అందరినీ ఆహ్వానించాడు, కానీ తనకిష్టం లేని శివుడిని పెళ్ళాడిందన్న కోపంతో తన కూతురైన సతీదేవి (దాక్షాయణి) ని, అల్లుడైన శివుడిని పిలవలేదు,

ఈ కార్యక్రమ విషయం తెలిసిన సతీదేవి, శివుడు వారించినా వినకుండా, పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని ప్రమథగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది గాని, అక్కడ తన తండ్రి వల్ల అవమానానికి గురయ్యింది.

ముఖ్యంగా తండ్రి చేస్తున్న శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి మరణించింది.దీనికి ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. .

సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.

సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.

ప్రతీ శక్తిపీఠంలోనూ, దాక్షాయణీ, భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.శక్తిపీఠాలు ఉన్న స్థలాలను గుర్తించడంలో భిన్నాభిప్రాయాలు, భేదాభి ప్రాయాలున్నాయి.

ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి:


🙏18 శక్తిపీఠాలు..🙏

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం.


లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే

ప్రద్యుమ్నే శృంఖళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగుళాంబా, శ్రీశైలే భ్రమరాంబికా

కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారణాస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్

సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్


1. శాంకరి - శ్రీలంక🙏

ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.


2. కామాక్షి - కాంచీపురం.🙏

తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

3. శృంఖల ప్రద్యుమ్ననగరం.🙏

పశ్చిమ బెంగాల్ ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

4. చాముండి - క్రౌంచ పట్టణం.🙏

మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

5. జోగుళాంబ-అలంపూర్.🙏

తెలంగాణ 'తుంగభద్ర' & కృష్ణ నదుల సంగమ క్షేత్రంలో ఉంది.

6. భ్రమరాంబిక - శ్రీశైలం.🙏

ఆంధ్రప్రదేశ్ - కృష్ణానదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతంగా ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి.

7. మహాలక్ష్మి - కొల్హాపూర్..🙏

మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

8. ఏకవీరిక - మాహుర్యం..🙏

లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతనుదర్శించుకొనవచ్చును.

9. మహాకాళి - ఉజ్జయిని..🙏

మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

10. పురుహూతిక - పీఠిక్య..🙏

లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

11. గిరిజ - ఓఢ్యదేశం ఒడిశా..🙏

జాజ్‌పూర్ కే రోడ్ నుండి 20 కిలోమీటర్లు - వైతరిణీ నది తీరాన ఉంది.

12. మాణిక్యాంబ - దక్షవాటిక..

లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో.🙏

13. కామరూప-హరిక్షేత్రం..

అసోం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నదీతీరాన వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.🙏

14. మాధవేశ్వరి -ప్రయాగ..🙏

(అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపం -

ఈ అమ్మవారిని అలోపీదేవి అని కూడా అంటారు.

15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం..

కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ - 🙏ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడుజ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.🙏

16. మంగళ గౌరి - గయ.🙏

బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

17. విశాలాక్షి - వారణాసి..ఉత్తర ప్రదేశ్.🙏

18. సరస్వతి - జమ్ముకాష్మీరు.🙏

అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉందంటారు.


🙏51 శక్తి పీఠాలు..🙏


1- సంఖ్య-స్థలము

2- శరీరభాగము / ఆభరణము

3- శక్తిరూపము

4- శివరూపము


1. హింగుళ, కరాచీ నుండి 125 కి.మీ., పాకిస్తాన్

బ్రహ్మరంథ్రము (శిరోభాగము)

కొత్తారి

భీమలోచనుడు


2. షర్కారె,సుక్కార్ స్టేషను వద్ద, కరాచీ, పాకిస్తాన్

కన్నులు

మహిషమర్దిని

క్రోధీశుడు


3. సుగంధ, షికార్ పూర్, బారిసాల్ నుండి 20 కి.మీ., బంగ్లాదేశ్ - సోంధ్ నది ఒడ్డున

ముక్కు

సునంద

త్ర్యంబకేశ్వరుడు


4. అమరనాధ్ శ్రీనగర్ నుండి 94 కి.మీ, కాష్మీర్

గొంతు

మహామాయ

-త్రిసంధ్యేశ్వరుడు


5.జ్వాలాముఖి, కాంగ్రా, పఠాన్ కోట్ వద్ద

నాలుక

సిద్ధిద (అంబిక)

ఉత్తమ భైరవుడు


6. జలంధర్ (దేవీ తాలాబ్)

ఎడమ స్తనము

త్రిపురమాలిని

భీషణుడు


7. వైద్యనాధం, దేవోగర్, ఝార్ఖండ్

గుండె

జయదుర్గ

వైద్యనాథుడు


8. గుజ్యేశ్వరి మందిరము, పశుపతినాథ మందిరం వద్ద, నేపాల్

మోకాళ్ళు

మహాశిర

కపాలి


9. మానస, టిబెట్కు దగ్గర, కైలాసపర్వత సమీపమున మానస సరోవరంలో ఒక శిల

కుడి చేయి

దాక్షాయిని

అమరుడు


10. బిరాజా, ఒడిషా

నాభి

విమల

జగన్నాథుడు


11. ముక్తినాథ మందిరం, గండకి నది ఒడ్డున, పోఖ్రా, నేపాల్

నుదురు

గండకీ చండి

చక్రపాణి


12. బహుళ, అజయ నది ఒడ్డున, కేతుగ్రామ్, కటువా దగ్గర, బర్ద్వాన్, పశ్చిమ బెంగాల్

ఎడమ చేయి

బహుళా మాత

భిరుకుడు


13. ఉజ్జయిని, గుస్కురా స్టేషను, బర్ద్ వాన్, పశ్చిమ బెంగాల్

కుడి మణికట్టు

మంగళ చండిక

కపిలాంబరుడు


14. ఉదయపూర్ వద్ద, త్రిపుర, మతబారి కొడలపైన, రాధాకిషోర్ గ్రామం

కుడి కాలు

త్రిపురసుందరి

త్రిపురేశుడు


15. ఛొట్టోగ్రామ్, చంద్రనాధ్ కొండలపైన, సీతాకుండ్ స్టేషను వద్ద, చిట్టగాంగ్ జిల్లా, బంగ్లాదేశ్

కుడి చేయి

భవాని

చంద్రశేఖరుడు


16. త్రిస్రోత, శల్బారి గ్రామం, జల్పాయ్ గురి జిల్లా, పశ్చిమబెంగాల్

ఎడమ కాలు

భ్రామరి

అంబరుడు


17. కామగిరి, కామాఖ్య, నీలాచల పర్వతాల వద్ద, గౌహతి, అస్సాం

యోని

కామాఖ్య

ఉమానందుడు


18. జుగాద్య, ఖీర్ గ్రామ్, బర్ద్వాన్ జిల్లా, పశ్చిమబెంగాల్

కుడి పాదము

జుగాద్య

క్షీర ఖండకుడు


19. కాళిపీఠ్, కాళీఘాట్, కొలకత్తా

కుడి బొటనవేలు

కాళిక

నకులీషుడు


20. ప్రయాగ, త్రివేణీ సంగమము, అలహాబాదు, ఉత్తర ప్రదేశ్

కుడి వేళ్ళు

లలిత

భవుడు


21. జయంతి, కాలాజోర్ బోర్ భోగ్, ఖాసి గ్రామం, జయంతియా పరగణాలు, సిల్హెట్ జిల్లా, బంగ్లాదేశ్

ఎడమ తొడ

జయంతి

క్రమదీశ్వరుడు


22. కిరీత్, కిరీత్ కొండ గ్రామం, లాల్ బాగ్ కోర్ట్ స్టేషను వద్ద, ముషీరాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్

కిరీటము

విమల

సంవర్తుడు


23. వారణాసి (కాశి), గంగానది ఒడ్డున మణికర్ణికా ఘట్టము, ఉత్తరప్రదేశ్

చెవిపోగు

విశాలాక్షి, మణికర్ణి

కాలభైరవుడు


24. కన్యాశ్రమము, కన్యాకుమారి, కుమాఱి మందిరం ప్రాంగణంలో భద్రకాళి గుడి, తమిళనాడు

వీపు

శర్వాణి

నిమీశుడు


25. కురుక్షేత్రం, హర్యానా

మడమ ఎముక

సావిత్రి

స్థాణువు


26. మణిబంధ్, పుష్కర్, గాయత్రి కొండల వద్ద, ఆజ్మీర్, రాజస్థాన్

రెండు చేతి కడియాలు

గాయత్రి

సర్వానందుడు


27. శ్రీశైల్, జైన్ పూర్, సిల్నెట్, బంగ్లాదేశ్

మెడ

మహాలక్ష్మి

సంబరానందుడు


28. కంచి, కొపై నది వద్ద, బోల్పూర్ స్టేషను, బీర్బమ్, పశ్చిమబెంగాల్

ఎముక

దేవగర్భ

రురుడు


29. కల్మాధవ్, శోన్ నది ఒడ్డున కొండ గుహలో, అమరకంటక్, మధ్యప్రదేశ్

ఎడమ పిరుదు

కాళి

అసితాంగుడు


30. షోన్ దేశ్, నర్మదా నది మూలము వద్ద, అమరకంటక్, మధ్యప్రదేశ్

కుడి పిరుదు

నర్మద

భద్రసేనుడు


31. రామగిరి, చిత్రకూటం, ఝాన్సీ, మాణిక్ పూర్ వద్ద, ఉత్తరప్రదేశ్

కుడి స్తనం

శివాణి

చందుడు


32. వృందావనం, భూతేశ్వర మాధవ మందిరం, ఉత్తరప్రదేశ్

కేశాభరణం

ఉమ

భూతేశ్


33. శుచి, శుచితీర్థం శివమందిరం, కన్యాకుమారి వద్ద, తమిళనాడు

పై దవడ పండ్లు

నారాయణి

సంహరుడు


34. పంచసాగరం (స్థలం తెలియదు)

క్రింది దవడ పండ్లు

వారాహి

మహారుద్రుడు


35. కార్తోయతాత్, భవానీపూర్ గ్రామం, సెర్పూర్, బగురా జిల్లా, బంగ్లాదేశ్

ఎడమకాలి పట్టీ

అర్పణ

వమనుడు


36. శ్రీ పర్వతం, లడక్ వద్ద, కాష్మీర్ - (శ్రీ శైలం, ఆంధ్రప్రదేశ్ అని కూడా చెబుతారు)

కుడికాలి పట్టీ

శ్రీ సుందరి

సుందరానందుడు


37. విభాష్, తమ్లుక్ వద్ద, తూర్పు మేదినీపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్

ఎడమ కాలి మణికట్టు

కపాలిని (భీమరూప)

సర్వానందుడు


38. ప్రభాస్, వీరవల్ స్టేషను, సోమనాథ్ మందిరం వద్ద, జునాగధ్ జిల్లా, గుజరాత్

ఉదరం

చంద్రభాగ

వక్రతుండుడు


39. భైరవ పర్వతం, శిర్పా నది ఒడ్డున, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్

పై పెదవి పైభాగం

అవంతి

లంబ కర్ణుడు


40. జనస్థానం, గోదావరీ లోయ, నాసిక్ వద్ద, మహారాష్ట్ర

చుబుకం

భ్రామరి

వికృతాక్షుడు


41. సర్వశైలం, గోదావరీ తీరం, రాజమండ్రి వద్ద, కోటిలింగేశ్వర మందిరం, ఆంధ్రప్రదేశ్

బుగ్గలు

రాకిణి / విశ్వేశ్వరి

వత్సనాభుడు / దండపాణి

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS