Thursday, August 17, 2023

ద్వార లక్ష్మీ పూజ (గడప పూజ).

ద్వార లక్ష్మీ పూజ (గడప పూజ). 


ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపిని కొలుచుకోవడం ,రెండు ఇంటి గడపకు పూజ చేయడం...

ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వార లక్ష్మి అని కూడా అంటారు.. ఈ గడపకు ,ఎర్రమన్ను,పసుపు ,కుంకుమ,పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే ,ఎందుకు చేయాలో తెలియక పోయినా పెద్దవారి నుండి సంప్రదాయం గా ఆచరిస్తున్నారు... గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు.. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖసంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం, ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని హెచ్చరించడం..

ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిస్కారం తెలుసుకుందాం..

పెళ్లి కాని అమ్మాయిలు, ఎన్ని సంబంధాలు చూసిన కుదరక, జాతకం దగ్గర, కానుకల విషయంలో నే ఎదో ఒక ఆటంకం తో ఆలస్యం అవుతున్న అమ్మాయిలు..16 రోజులు ఈ గడపకు పూజ చేయాలి..

పూజ విధానం:
1.ఉదయం 3 గంటలకు ఈ పూజ చేయాలి 16 రోజులు పాటు ఆటంకం లేకుండా ఇదే సమయంలో చేయాలి
2.మొదట గడపను నీటితో మూడు సార్లు కడగాలి ,తర్వాత పాలుపోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దీ పాలతో పోసి చేతితో గడపను పాలతో తుడవాలి, తర్వాత చివరిగా ఇంకోసారి నేటితో గడపను శుభ్రం చేయాలి,
3.గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి.
4.చిన్న పళ్లెం లో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవునైయి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి
5.ఇంకో పళ్లెం లో బెల్లం అటుకులు, తాంబూలం.. పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకునే మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకుని, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం..చదువుకుని హారతి ఇవ్వాలి... 
6. గడప దగ్గర పెట్టిన దీపం కి నమస్కరించి కొండ ఎక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి..
7. పూజ అయిన వెంటనే వెళ్లి నిద్రపోకూడదు, ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయిన పర్వాలేదు..
8. ఆ పదహారు రోజులు పూజ గదిలో దీపం వెలిగించిన చాలా శుభం.

పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం 3 గం లకు పూజ చేసి, ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి... లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకు కు సంబందించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకుని పదహారు రోజులు ఈ గడప పూజ చేయచ్చు..

ఇంట్లో సమస్య ఇంటిపైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్ట్ గొడవ ఇంటి పైన ఉన్నా.. ఆ ఇంటి యజమాని కానీ భార్య భర్తల ఇద్దరు కలసి కానీ, భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలి అని వేడుకుని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మి నారాయణ, అష్టోత్తరం, మణిద్వీపవర్ణన చదువుకుని హారతి ఇవ్వాలి .ఆ ఇంటి పైన ఉన్న సమస్య తీరిపోతుంది..
ఇదే విదంగా గడపకు పూజలు చేసి ఎన్ని సమస్యలు పరిష్కరించే వారు పూర్వీకులు..

పిల్లాడి రుద్రయ్య

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS