Thursday, November 23, 2017

ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం

ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం
ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం శ్రీ శైల ఆలయ తూర్పు శిఖరం వైపుగా శ్రీ శైలం నుంచి 15 కి.మీ దూరం లో నెలకొని ఉంది.  ఈ ఆలయం కి చేరుకోవాలి అంటే శ్రీశైలం లో నంది సర్కిల్ నుంచి జీపులు వెళ్తుంటాయి. అంటే ఇక్కడ అమ్మవారు ఒక గుహలో స్వయంబుగా వెలిశారు. అమ్మవారు చతుర్భుజాలతో దర్సనం ఇస్తుంది. ఆ చతుర్ భుజాలలో రెండు చేతులలో కమలాలు మరో రెండు చేతులలో ఒక దానిలో జప మాలా మరియొక చేతిలో శివలింగం ధరించి ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి మనమే పూజ అభిషేకా లు చేస్కోవచ్చు. ఇక్కడ ప్రత్యేకం ఏంటి అంటే మనం ఇష్టకామేశ్వరి దేవి కి నుదుటన బొట్టు పెడితే మనుషుల వలే  ఆ నుదురు చాల మెత్తగా తగులుతుంది. మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారం ఇక్కాడ విశేష పూజలు చుట్టూ పక్కల రాష్ట్రాల నుంచి అధిక జనాభ వస్తూఉంటారు. ఆలయ మధ్యాహ్నం 2  గంటల సమయం వరకు తెరచి ఉంటారు. ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు భక్తుల శ్రద్ధగా కోరికలను కోరుకుంటే వాటిని అమ్మవారు ౪౧ (41) రోజులలో ఆ కోరిక ను సిద్ధింప చేస్తుంది  అని భక్తుల నమ్మకం.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS