Thursday, November 23, 2017

శ్రీరాముని జాతకం.

శ్రీరాముని  జాతకం.
వాల్మికి మహర్షి రామాయణంలో బాలకాండలో 18 వ సర్గ లో 8. 9. 10  శ్లోకాలలో శ్రీరాముని జనము    అప్పటి గ్రహస్తితిని,  లగ్నాన్ని ఇలా చెప్పాడు.  లగ్నం కర్కాటకం ,లగ్నములో గురు చంద్రులు. మరియు  రవి మేషంలోను, మకరంలో కుజుడు, కర్కాటకంలో గురువు.  మీనంలో శుక్రుడు, తులలో శని. ఈ ఐదు గ్రహములు  ఉచ్చ స్తితి పొందియున్నవి. మిగిలిన గ్రహముల స్తితి వాల్మీకి చెప్పలేదు.  ఇలా గ్రహములు ఉన్నచో  ఫలాలు ఎలా ఉండునో , శాస్త్రమున ఏమి చెప్పిరో  వివరించెదను. ఈ గ్రహములు  కుడా లగ్నమునుండి , 1 వ  4 వ, 7 వ, 9 వ  10 వ  స్తానాలలో ఉన్నారు.  ఇందులో 1, 9,  కొణములుగను, 4,7,10 కేంద్రములగను  శాస్త్రమున చెప్పబడినవి.  
లగ్నము కర్కాటకము  -  ఈ రాశికి అధిపతి చంద్రుడు  లగ్నములో నున్నాడు. మరియు వృద్ధి చంద్రుడు ఫలములు.  దృఢ శరీరము కలవాడు, చిరంజీవి, నిర్భయుడు, బలిష్టుడు, అగును.
రవి మేషమున ఉచ్చస్తితి  పొందిన.-  భూములు, ధనము, భార్య పుత్రులు, కీర్తి, శౌర్యము, పరాక్రమము, కలుగును. కాని విరోధము, దేశము విడిచిపోవుట,సంచార వినోదము కలుగును. 
కుజుడు మకరమున  ఉచ్చస్తితి పొందిన -  రాజ్యము, రాజస్నేహము, భూమి ధనము, వాహనములు, విదేశ యానము, రాజ సన్మానము, భార్యవలన దుఃఖము,  కలాహము, జయము కలుగును.ఇక్కడ కొంచం కుజదోషముచెప్పాలి  7 వ ఇంట కుజుడు బలదోషమైనా, కర్కాటక లగ్నం వలన, చంద్ర, గురు దృష్టి వలన కొంత  దోషం నివృత్తి అయినది.   అందుచే కొంత కాలము భార్యతో ఎడబాటు తప్పలేదు.
గురుడు కర్కాటకమున ఉచ్చస్తితి పొందిన  -  రాజ్యము, మహా సౌఖ్యము, కీర్తి, మనోవిలాసము, రాజ్యాభిషేకము, స్వకులమునకు అధిపతి అగుట, విదేశయానము, కృశించిన శరీరము, దుఃఖము కలుగును.
శుక్రుడు మీనమున ఉచ్చస్తితి పొందిన   -  స్తీ మూలమున నష్టము, లోకవిరుద్ధమైన ధర్మాచరణము, తల్లి తండ్రులకు దుఃఖము,  రాజ సన్మానము, భార్యతో భోగములు, భోజనము,,  భార్యా పుత్రులతో సుఖము కలుగును.  ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్నను శత్రువు ఇంట నున్నాడు.  అందుచే  అంత శుభములు కలుగవు.
శని తులలో ఉచ్చలో నున్న ఫలములు  -   గ్రామములకు సభలకు అధిపతి. వినోద శీలము, పిత్రునాశనము, బంధువులతో కలహము, దేశాటన చేయుట, దుఃఖము, రోగభయము, రాజులతో వైరము, యుద్ధము సంభవించును. 
జ్యోతిష శాస్త్రమున చెప్పిన ఈ ఫలములు శ్రీరాముని జీవితమున  ఎక్కువ భాగము కనిపించును.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS