ముద్రావిశేషములు
(సఙ్కలనమ్:డి.నారాయణరావు,విద్యానగర్,హైదరాబాద్,తెలంగాణా రాష్ట్రం)
శ్లో॥అర్చనే జపకాలేచ ధ్యానే కామ్యేచ కర్మణి।
స్నానేచావాహనేశంఖే ప్రతిష్ఠాయాంచరక్షణే॥
నైవేద్యేచ తథాzన్యత్ర తత్తత్కల్పప్రకాశితే।
స్థానేముద్రాః ప్రదష్టవ్యాః సర్వలక్షణలక్షితాః॥
(తంత్రసారే)
ఈశ్వర ఉవాచ। ముద్రాప్రదర్శనావశ్యకత
శ్లో॥ఫలస్యసిద్ధయేదేవి ముద్రాయుక్తోనుసిద్ధ్యతి।
తథాముద్రావిహీనశ్చేత్కోటికోటి జపేనతు॥
నసిద్ధ్యతిమహామంత్రస్తస్మాన్ముద్రాశ్చధారయే।
అథముద్రాః ప్రవక్ష్యామిసర్వతంత్రేషుగోపితాః।
యాభిర్విరచితాభిశ్చమోదంతేమంత్రదేవతాః॥
(తంత్రసారమహాగ్రంథే)
తా॥అర్చనాద్యుపచారములయందు సర్వలక్షణలక్షితములగు ముద్రలను ప్రదర్శింపవలయును అని తంత్రసారమున చెప్పబడినది.
మరియు ముద్రాహీనుడైనచో కోట్లకొలది జపము చేసినను మహామంత్రము సిద్ధించదు. సర్వతంత్రములయందు
రహస్యముగా నుంచబడిన ముద్రలను చెప్పెదను. అట్టి ముద్రల రచించిన మంత్రదేవతలు సంతోషమును
పొందుదురు అని శివుడు పార్వతికి చెప్పెను.
ముద్రాప్రదర్శన ఫలం
శ్లో॥ముదంకరోతిదేవస్యద్రావయేద్దుఃఖపాతకే।
ఇతిముద్రానిరుక్తస్యమంత్రశాస్త్రేపిశ్రూయతే॥
ముద్రాశ్చదర్శయేద్యత్నాద్దేవసాన్నిధ్యకారణం।
దర్శితాస్తాస్తు దేవానాం మోదకాద్ద్రావకాన్మునే॥
(అగస్త్యసంహిత)
తా॥ముద్రాశబ్దమున మొదటి యక్షరమగు 'ము' అనుదానికి దేవునకు ముదమును చేయునది యనియు 'ద్రా'
అనుదానికి దుఃఖపాపములను తరిమివేయును అని అర్థము
కనుక దైవానుగ్రహ కారణములయిన ముద్రలను ఆయా సమయములయందు ప్రయత్నముచేసి
ప్రదర్శించవలయును. అట్లు చూపబడిన ముద్రలు దేవతలకు సంతోషమును కలిగించును.పాపమును పారద్రోలును.
ఏతా ముద్రా లక్ష్య సంగ్రహ।తంత్రసారాది మహాగ్రన్థేభ్య ఉదాహృతాః॥
ఇందు పొందుపరచిన ముద్రాలక్షణములు లక్ష్య సంగ్రహ తంత్రసారాది మహాగ్రంథములందుదహరించబడినవి.
అంకుశముద్రా లక్షణమ్
శ్లో॥వామాంగుష్ఠంతు తర్జన్యా సంగృహ్యదక్షిణేనతు।
కృత్వోత్తానంతథాముష్ఠిరంగుష్ఠంతు ప్రసారయేత్॥
తా॥ఎడమబొటన వ్రేలిని కుడిచూపుడు వ్రేలితో చుట్టి కుడి బొటన వ్రేలు ఊర్ధ్వముగా పిడికిలి చేసి అంగుష్ఠ ప్రసారము
చేసిన అంకుశముద్రయగును.
గ్రంథాంతరే:-
శ్లో॥మధ్యమానామికాభ్యాంచ కనిష్ఠాంగుళినాతథా।
ముష్టింకృత్వా కుంచితోధోముఖీచేత్సవ్యతర్జనీ।
అంకుశీముద్రికాజ్ఞేయాతీర్థాకర్షణకర్మణి॥
తా॥మధ్యమానామికా కనిష్ఠాంగుళులచే ముష్టిని చేసి వంచిన చూపుడువ్రేలు అధోముఖము కలదైనచో అంకుశ
ముద్రయగును.
కూర్మముద్రా లక్షణమ్
శ్లో॥అకుంచితాంగుళితలంవామహస్తస్యగోపయేత్।
దక్షహస్తతలేనాథహూర్ధ్వపృష్ఠేనయత్నతః॥
కుంచితేదక్షిణేవక్త్రంకృత్వాతర్జన్యనామికే।
పూర్వపాదౌదుకృత్వాచబద్ధ్వాసంపుటసంజ్ఞయా॥
కుంచితాంగుళిహస్తేనకుర్యాచ్చేత్తత్ప్రయత్నతః।
మంత్రజాపీమంత్రవేదీముద్రాకూర్మస్యసాస్మృతాః।
కూర్మాఖ్యముద్రాసకలందదాతినిజవాంచితమ్॥
తా॥ఎడమచేతియొక్క వంచబడిన(అధోముఖముగా) వ్రేళ్ళప్రదేశమును కుడిహస్తముచే పైకి పృష్ఠభాగము కలుగునట్లు
కప్పి, కుడిచేతి ముఖభాగమును ముందు పాదములుగా చేసి కుంచితాంగుళి హస్తముతో చేసిన కూర్మముద్ర
యగును.ఈ ముద్ర తన మనోవాంఛితమునీడేర్చును.
తార్క్ష్య ముద్రాలక్షణమ్
శ్లో॥హస్తౌతువిముఖౌకృత్వా గ్రధయిత్వాకనిష్ఠికే।
మిధస్తర్జనికేశ్లిష్టేశ్లిష్టావంగుష్ఠకౌతథా॥
మధ్యమానామికేద్వేతుద్వౌపక్షావివచాలయేత్।
ఏషాగరుడముద్రాఖ్యానిర్విషీకరణామతాః॥
తా॥ఎడమచేతి పృష్ఠమున కుడిచేతి పృష్ఠమునుంచి,చిటికెన వ్రేళ్ళు,చూపుడు వ్రేళ్ళు,బొటనవ్రేళ్ళు ఒకదానికొకటి తగిల్చి
మధ్యమానామికలను ఱెక్కలవలె విదల్చవలయును.అట్లుచేసిన తార్క్ష్య ముద్రయగును. ఈ ముద్ర విషమును
హరించునని చెప్పబడినది.
ధేనుముద్రా లక్షణమ్
శ్లో॥హస్తద్వయేతథావక్త్రేసమ్ముఖేచపరస్పరమ్।
వామాఙ్గుళీర్దక్షిణానామఙ్గుళీనాఞ్చసంధిషు॥
ప్రవేశ్యమధ్యమాభ్యాంచతర్జన్యౌతుప్రయోజయేత్।
కనిష్ఠేద్వేzనామికాభ్యాం యుజ్యాత్సాధేనుముద్రికా।
భవేదియంధేనుముద్రారాజ్యభక్తిప్రదాయినీ॥
తా॥రెండు చేతులు దేవునికభిముఖముగానున్నుమరియు నొకదాని కొకటి అభిముఖముగా దగ్గరగానుంచి ఎడమచేతి
అనామికపై కుడిచేతి చిటికెన వ్రేలినిన్నీమరియు ఎడమచేతి చిటికిన వ్రేలిపై కుడిచేతియుంగరపు వ్రేలున్ను
ఎడమచేతి మధ్యవ్రేలిపై కుడిచేతి చూపుడు వ్రేలున్నూ,ఎడమచేతి చూపుడు వ్రేలిపై కుడిచేతి మధ్యవ్రేలున్నూ ఉంచిన
ధేనుముద్ర యగును.ఈ ధేనుముద్ర దైవసన్నిధిని ప్రదర్శించిన రాజ్యప్రాప్తియు,భక్తియు గలుగును.
కుంభముద్రా లక్షణమ్
శ్లో॥దక్షాఙ్గుష్ఠం పరాఙ్గుష్ఠే క్షిప్త్వాహస్తద్వయేనతు।
సావకాశాంత్వేకముష్టిం కుర్యాత్కుంభాఖ్యముద్రికా॥
తా॥కుడిబొటన వ్రేలిని ఎడమబొటన వ్రేలిమీద ఉంచి హస్తద్వయముచే లోపల అవకాశము కలుగునట్లు పిడికిలి
(ముష్టి) పెట్టిన కుంభముద్ర యగును.
లిఙ్గముద్రా లక్షణమ్
శ్లో॥ఉధృత్యదక్షిణాఙ్గుష్ఠం వామాఙ్గుష్ఠేనయోజయేత్।
వామాఙ్గుళీర్దక్షిణీభిరంగుళీభిశ్చవేష్టయేత్।
లిఙ్గముద్రేయమాఖ్యాతాశివసాన్నిధ్యకారిణీ॥
తా॥కుడి బొటనవ్రేలిని ఎత్తి దానిని ఎడమ బొటనవ్రేలితో కలిపి ఎడమవ్రేళ్ళను కుడివ్రేళ్ళతో చుట్ట పెట్టిన
లిఙ్గముద్రయగును.ఇది శివసాన్నిధ్యమును కలిగించును.
అన్యచ్చ గ్రంథాంతరే:-
శ్లో॥అంగుష్ఠోర్ధ్వం తథాముష్టిం కృత్వావామేనవేష్టయేత్।
తా॥కుడి బొటనవ్రేలు ఊర్ధ్వముగా ముష్టిని చేసి ఆ బొటనవ్రేలిని ఎడమ బొటనవ్రేలితో చుట్టిన లిఙ్గముద్రయగును అని
గ్రన్ధాన్తరమున గలదు.
స్థాపనముద్రా లక్షణమ్
శ్లో॥అధోముఖాభ్యాంహస్తాభ్యాంస్థాపినీముద్రికామతా।
తా॥రెండు చేతులను బోర్లించి బొటనవ్రేళ్ళను ఉంగరంవ్రేలి మొదట తగిల్చిన స్థాపనముద్రయనబడును
ఆవాహనముద్రా లక్షణమ్
శ్లో॥హస్తాభ్యామఞ్జలింబధ్వాzనామికామూలపర్వణి।
అంగుష్ఠేనిక్షిపేత్సేయంముద్రాహ్యావాహినీమతా॥ (తంత్రరాజే)
తా॥అంజలి ఘటించి ఉంగరపు వ్రేళ్ళ మొదటి కణుపులయందు బొటనవ్రేళ్ళనుంచిన ఆవాహనముద్ర యనబడును.
సన్నిధాపనముద్రా లక్షణమ్
శ్లో॥ఉత్తానాంగుష్ఠయోగేన ముష్టీకృతకరద్వయం।
సన్నిధీకరణీనామముద్రాదేవార్చనావిధౌ॥ (తంత్రరాజే)
తా॥రెండు పిడికిళ్ళను ఒకదానికొకటి అభిముఖముగానుంచి బొటనవ్రేళ్ళను ఊర్ధ్వముఖముగా నుంచిన సన్నిధాపన
ముద్రయగును.
సన్నిరోధనముద్రా లక్షణమ్
శ్లో॥అంగుష్ఠగర్భిణీసైవముద్రాస్యాత్సన్నిరోధినీ।
తా॥బొటనవ్రేళ్ళను ముడిచి పిడికిళ్ళను బిగించి రెండును పరస్పరము నభిముఖముగా నుంచిన సన్నిరోధన
ముద్రయగును.
అవకుణ్ఠనముద్రా లక్షణమ్
శ్లో॥సవ్యహస్తకృతాముష్టిర్దీర్ఘాధోముఖతర్జనీ।
అవకుణ్ఠనముద్రేయమభితోముద్రితామతా॥ (లక్ష్యసంగ్రహే)
తా॥కుడిచేతి పిడికిలి దీర్ఘముగా, క్రింది ముఖముగల చూపుడు వ్రేలు కలదైనచో అవకుంఠనముద్ర యగును.
యోనిముద్రా లక్షణమ్
శ్లో॥మధ్యమేకుటిలేకృత్వాతర్జన్యుపరి సంస్థితే।
అనామికామధ్యగతే తథైవహి కనిష్ఠికే॥
సర్వాస్సర్వత్రసంయోజ్య అంగుష్ఠపరిపీడితాః।
ఏషాతుప్రథమాముద్రా యోనిముద్రేతిసంజ్ఞికా॥
తా॥మధ్యమవ్రేళ్ళు కొంచెము వంచి చూపుడువ్రేళ్ళ చివరి భాగములపై మధ్యమవ్రేళ్ళు,అగ్రభాగములను తగిల్చి
ఉంగరపు వ్రేళ్ళను పరస్పరము తర్జనీ మధ్యమములలో నుంచి రెండు మధ్యవ్రేళ్ళ క్రింద ఆ విధముగానే చిటికెన
వ్రేళ్ళ నుంచి బొటనవ్రేళ్లతో నొక్కబడిన యోనిముద్ర యగును.
పఞ్చామృతస్నానాదౌ పఞ్చవక్త్రముద్రాం ప్రదర్శ్య
పఞ్చాస్యముద్రా లక్షణమ్
శ్లో॥దక్షవామకరాఙ్గుళ్యోమిళితాశ్చేత్పస్పరం।
పఙ్చాస్యనామ్నీముద్రేయ భక్తిశౌర్యవిధాయినీ॥
తా॥కుడిచేతివ్రేళ్ళ చివరిభాగములు, ఎడమచేతి వ్రేళ్ళ చివరిభాగములు ఒకదానితోనొకటి కలిసిన
పఞ్చాస్యముద్రయగును.ఇది భక్తిని,శౌర్యమును కలుగజేయును.
వస్త్రముద్రా
శ్లో॥కనిష్ఠానామికాముక్తా ముష్టిస్స్యాద్వస్త్రముద్రికా।
తా॥చిటికెనవ్రేలి చేతనూ,ఉంగరపువ్రేలి చేతనూ విడువబడినముష్టి (పిడికిలి) వస్త్రముద్రయగును.
యజ్ఞోపవీతముద్రా
శ్లో॥అంగుష్ఠస్యాగ్రపర్వంతు మధ్యమాంగుళినాస్పృశేత్।
యజ్ఞోపవీతముద్రాస్యాద్దేవదేవప్రియాధికా॥
తా॥బొటనవ్రేలి మొదటి కణుపును మధ్యమాంగుళిచే తాకిన యజ్ఞోపవీత ముద్రయగును.ఇది శివునికి మిక్కిలి
ప్రీతికరము.
ఆభరణముద్రా
శ్లో॥కనిష్టికాగ్రపర్వంతు స్పృశేదంగుష్ఠకేనతు।
జ్ఞేయాంభూషణముద్రాసాదేవదేవప్రియంకరీ॥
తా॥చిటికెనవ్రేలి చివరి కణుపును బొటనవ్రేలితో తాకిన ఆభరణముద్రయగును.ఈ ముద్ర దేవదేవునకు ప్రీతికరమైనది.
గన్ధముద్రా
శ్లో॥జ్యేష్ఠాగ్రేణ కనిష్ఠాగ్రం స్పృశేద్గన్ధస్య ముద్రికభాగముతో
అన్యచ్చ గ్రన్ధాన్తరే
శ్లో॥కనిష్ఠానామికాముక్తా ముష్టిస్యాద్గన్ధముద్రికా।
తా॥కుడిచేతి బొటనవ్రేలు కుడిచేతి చిటికెన వ్రేలు చివరిభాగమును స్పృశించిన గన్ధముద్రయగును.
(లేక) - చిటికెనవ్రేలిని ఉంగరపువ్రేలిని వదలి మిగిలినవ్రేళ్ళయొక్క ముష్టి (పిడికిలి) పట్టిన గన్ధముద్రికయగునని
గ్రన్ధాన్తరమందు చెప్పబడినది.
పుష్పముద్రా
శ్లో॥అధోముఖంకరంకృత్వాతర్జన్యగ్రేణయోజయేత్।
అంగుష్ఠాగ్రంతుముద్రైషా పుష్పాఖ్యాపరమేశ్వర॥
తా॥కుడిచేతిని బోర్లించి బొటనవ్రేలి చివరి భాగమును జూపుడు వ్రేలి చివరి భాగముతో కలిపిన పుష్పముద్రయగును.
అక్షమాలాముద్రా
శ్లో॥అంగుష్టఃతర్జన్యాగ్రేతు గ్రథయిత్వాంగుళిత్రయమ్।
ప్రసారయేదక్షమాలా ముద్రేయంపరికీర్తితా॥
తా॥బొటనవ్రేలిని చూపుడువ్రేలితో కలిపి మిగిలిన మూడు వ్రేళ్ళను జాచిన అక్షమాలా ముద్రయన బడును.
ధూపముద్రా లక్షణమ్
శ్లో॥నచ్ఛిద్రమఙ్గుళీనాంతు సమాశ్లిష్యాzగ్రబంధనం।
ఊర్ధ్వాంగుష్ఠాతథాకృత్వా ధూపముద్రాంప్రదర్శయేత్॥
తా॥వామ దక్షిణ హస్తాంగుళ్యగ్రములను రంధ్రములు కలుగునట్లు కలిపి బంధించి బొటనవ్రేళ్ళను ఊర్ధ్వముఖములుగా
నుంచి కలిపిన ధూపముద్రయగును.
దీపముద్రా
శ్లో॥సర్వాంగుళీశ్చసంహృత్య మధ్యమేద్వేప్రదర్శయేత్।
హస్తయోరుభయోశ్చాపి దీపముద్రాప్రకీర్తితా॥
తా।వామ దక్షిణ హస్తాంగుళుల నన్నిటిని ముడిచి మధ్యాంగుళులను కలిపి చూపిన దీపముద్రయగును.
నైవేద్యముద్రా
శ్లో॥అనామాగ్రంస్పృశేద్దేవి జ్యేష్ఠాగ్రేణతుదేశికః।
నైవేద్యముద్రాకథితా దేవానాంప్రీతిదాయినీ॥
తా॥అనామికయొక్క చివరిభాగమును బొటనవ్రేలి చివరిభాగముతో తాకిన నైవేద్యముద్రయగును.ఈ ముద్ర దేవతలకు
సంతోషము కలిగించును.
No comments:
Post a Comment