Wednesday, May 9, 2018

యంత్రమును ఎందుకు పూజించాలి?యంత్ర ప్రభావము వల్లనే ఆ ప్రాంతం మొత్తం పాజిటివ్ శక్తిగా ఉంటుంది.

యంత్రమును ఎందుకు పూజించాలి?
యం యంత్రమును ఎందుకు పూజించాలి? త్రం అనేది ఎవరైనా ఒక దేవతామూర్తి యొక్క బీజాక్షరాల సమూహముతో జ్యోతిష్య మరియు తాంత్రిక శాస్త్రాల రీత్యా ఉన్న మంత్రములతో ఆ ప్రత్యేకమైన చక్రములలో నిక్షేపము చేసి మొత్తానికి ఆ యంత్రములో సర్వ శక్తులను, అష్ట దిగ్పాలకులను ఆవాహనం చేసే ఒక దివ్యమైన చక్రం. యంత్రములో ఉన్నటువంటి బీజాక్షరాల ప్రభావం వలన నెగెటివ్ ఎనేర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనేర్జీ పెరుగుతుంది. ఎక్కడైతే యంత్ర స్థాపన జరుగుతుందో అక్కడి నుండి నెగెటివ్ ఎనేర్జీ దూరమయ్యి పాజిటివ్ ఎనేర్జే వచ్చి చేరుతుంది. ఈ యంత్ర సాధనా ప్రభావం మన మనస్సుపై పడుతుంది. మానవుని శరీరమును నిత్యం ప్రభావితం చేసేది మనస్సు మాత్రమే. ఆ మనస్సు పై మానవుని సకల ఆరోగ్యము కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా దేవాలయమునకు వెళ్ళినపుడు మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ దేవాలయము నుండి అడుగు బయట పెట్టగానే ఏదో మాయ కమ్మినట్టు మన మనస్సు యధా విధిగా మారిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే దేవాలయములో ప్రతిష్ట చేసిన విగ్రహాల క్రింద వివిధ వేద మంత్రములతో, బీజాక్షరములతో ఒక యంత్రమునకు జీవం పోసి ప్రతిష్ట చేసి ఉంచుతారు. ఆ యంత్ర ప్రభావము వల్లనే ఆ ప్రాంతం మొత్తం పాజిటివ్ శక్తిగా ఉంటుంది. ఆ పాజిటివ్ శక్తి మన మనస్సు పై పడి మన మనస్సును ఉత్తేజపరుస్తుంది. ఏ సమస్య గురించి మనకు బాధలు కలుగుతున్నాయో అలాంటి ప్రతి సమస్యకు ఒక నిర్ధిష్టమైన యంత్రమును తెలుపటం శాస్త్రమును అవపోసన పట్టిన ఒక్క జ్యోతిష్యునికే ఇది సాధ్యపడుతుంది. ఆ నిర్ధిష్టమైన యంత్రమును ప్రత్యేక బీజాక్షరాలతో, నిర్ధిష్టమైన రోజుల కాలము పాటు శ్రద్ధగా పూజించినట్లైతే సమస్య నుండి విశ్రాంతి లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే యంత్రం అనేది భగవంతునికి ప్రతిబింబం లాంటిది.యంత్రము అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత వాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతామూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తాయి. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి, పరిపూర్ణమైన పంచొపచార పూజ , ప్రక్రియలు అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు. కాకపోతే ఆ యంత్రమునకు మనమునిర్వర్తించే పూజ ప్రక్రియలపై వాటి ఫలితము ఆధారపడి ఉంటుంది. యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజా అని అంటారు. కొందరు తాంత్రికము అనగానే అది ఏదో చెడు కలిగించే ప్రక్రియ అని అంటారు. కానీ ఇది ఎంత మాత్రము నిజము కాదు. ఇతరులకు చెడు కలిగించే ప్రక్రియను ‘కుతంత్రము’ అంటారు. ఔషధ ప్రయోగముకు, రాజ్యపాలనముకు, దేవాలయ నిర్మాణముకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దేవాలయ ఆగమ శాస్త్రములు, వామచారము ఇవన్నిటిని తంత్రములు అని పిలుస్తారు.  యంత్రములోని మధ్యభాగములో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుంది అని తంత్ర శాస్త్రములోని నమ్మకము. ఒక్కొ యంత్రము  ఆ యా దేవతామూర్థులకు సంబంధించి నిర్ధిష్టమైన రేఖా చిత్రాల రూపములో చెక్కబడి ఉంటుంది. తంత్ర శాస్త్రములో శక్తికి, శక్తి యొక్క ప్రతిరూపాలకి ఈ యంత్రమును ఉపయోగిస్తారు. ఎంతో శక్తివంతమైన యంత్రములు వాటికి సంబంధించిన బీజమంత్రములతో ధ్యానము గావించి , నిర్ధిష్టమైన రోజుల పాటు, నిర్ధిష్టమైన సంఖ్య సార్లు జపించి సిద్ధి పొంది ఆ యంత్రము నుండి పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు.   కావలిసిన వారు సంప్రదించగలరు

తిరువణ్ణామలై ( అరుణాచలం ) స్మరణ మాత్రం చేత ముక్తినిచ్చే క్షేత్రం.

తిరువణ్ణామలై ( అరుణాచలం ) స్మరణ మాత్రం చేత ముక్తినిచ్చే క్షేత్రం.
అరుణాచలేశ్వరుడు :
మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.
అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.
అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.
మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు. 
దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.
ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.
అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.
మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.
అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.
అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.
ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.
అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.
అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రామించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీరు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును మనం పొందుతాము.

దశ మహావిద్యలంటే ఏవి?

దశ మహావిద్యలంటే ఏవి?
1. కాళీ
2. తార
3. త్రిపుర సుందరి
4. ధూమావతి
5. భువనేశ్వరి
6. భైరవి
7. ఛిన్నమస్త
8. మాతంగి
9. బగళాముఖి
10. కమలాత్మిక
అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్ధాలని, అంతరార్ధాలని తెలుగు వారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహా విద్యల సాధన చేసి అందులో ఉన్న శక్తి కేవలం గ్రంధాలుగా కాక నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. వారు వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మ వారికి అంకితం చేసినప్పుడు అన్నారుట, " అమ్మా ! ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియజెయ్యి. ఏ భాగం నీకు నచ్చక పోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను " అని. అలా ఆయన ఆ మహా గ్రంధాన్ని చదవడం మొదలు పెట్టే సరికి, ఆ అమ్మ వారు కరుణాసముద్రయై ప్రతి పద్యానికో మెరుపు ఆకాశంలో చూపించిదిట. అంతటి దివ్య శక్తిని దర్శనీయంగా చూడడానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశ మహావిద్యలు దేన్ని సూచిస్తాయి అని సందేహం వస్తుంది. వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్నీ సౌమ్యం గా ఉండవు. ఉదాహరణకి కాళీ విగ్రహం ఎప్పుడూ ముండ మాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రి వాడైన కాళి దాసుకి కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒక సారి కోపంగా ఉంటుంది. ఒక సారి సంతోషంగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తే ఒకటి పీకుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవ్వరు? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్న, కొట్టుకున్నా ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.
ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.
కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి కాలం మనకి అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే అనంత బయొలాజికల్ క్లాక్ లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిని శక్తి. ఇది అర్ధం కావాలంటే శ్రీ కృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనో తరంగ విశ్వసృష్టి స్పందన. దీన్ని తారా దేవి తెలియజేయ గలదు. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యా శక్తులుగా ఉపాసించడమే దశ మహా విద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది. సాధరణంగా వీటిని ఉపాసించే వారు వీటి విసృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు. పట్టు పంచ కట్టుకుంటేనే పవిత్రత, తలస్నానం చేస్తేనే మనిషి అని కాకుండా (అంటే లేకపోతే కాదని కాదు సుమా) ఇంకొంచెం విభిన్నంగా బ్రహ్మత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది అర్ధం కావాలంటే ఇంకో ఉదాహరణ హిమాలయాల్లో ఉండే యోగులని చూస్తే, వాళ్ళు రోజూ ఏ విధంగా పూజ చేస్తూ ఉండి ఉంటారు? మానస సరోవర ప్రాంతాల్లో ఉండే సాధకులు, శంభలగా టిబెట్లో పిలవబడే, షాంగ్రీలా అని చైనాలో కొలవబడే, శంభల గ్రామం అని భవిష్యపురాణంలో చెప్పబడిన ప్రాంతాలలో యోగులు ఎలా ఉంటారు? అక్కడ 'పవిత్రత ' తాలూకు నిర్వచనం ఏమిటి. వాళ్ళ భోజనపు అలవాట్లేమిటి? వస్త్రధారణ ఏమిటి, అసలు దాని ప్రాశస్త్యం వాళ్ళ దృష్టిలో ఏమిటి? నిజంగా శివపార్వతులు మనకి కనిపిస్తే వాళ్ళు ఏ బట్టల్లో ఉండి ఉంటారు? కళాంజలి చీర కట్టుకుని, కుమార్ జ్యూవలర్స్ వారి వడ్ఢాణాలు పెట్టుకుని ఉంటుందా అమ్మవారు ? ఇలాంటి వేల ప్రశ్నల జవాబులు కలిపితే కానీ బ్రహ్మత్వ స్వరూపం తాలూకు స్వరూపం ఆవగింజంత అర్ధం కాదు.
వేల పర్వతాలంతకన్నా ఎక్కువ వేదాలు. అవి అర్ధం కావేమోనని వాటి సారం ఉపనిషత్తులు. వాటి సారం అనుభవేక సారం కావాలని ఉపాసనలు. ఉపాసనా సిద్ధికి ఉపదేశాలు, మంత్రాలు. అప్పటికి అర్ధం కావేమోనని భజనలు, ప్రార్ధనలు. అవీ రావేమో నని పండగలు, పబ్బాలు. ఇంకెంత చెప్తారు ఋషులు?
దృశ్యం సర్వమనాత్మా స్యాద్ దృగేవాత్మా వివేకినః
ఆత్మా నాత్మా వివేకోయం కధితో గ్రంధ కోఠిభిః
(ఆత్మా నాత్మ వివేకము - శ్రీ ఆది శంకరులు)
ఈ విశ్వంలో మనకి కనిపించే ఈ సమస్త పదార్ధాలూ అనాత్మయే! అంటే ఆత్మ కానివే. వీటిని చూసే వాడు మాత్రమే ఆత్మ. అంటే బ్రహ్మ అని అర్ధం. ఆ బ్రహ్మత్వాన్ని నిరాకార రూపంగా సాధన చేయగల వారు యోగ శాస్త్రాన్ని (పతంజలి) అవలంబించి ఆ దివ్యశక్తిని అనుభవేకవేద్యం కావించుకున్నారు. అలా కాక నిరాకారము సర్వాకార స్వరూపం కనుక, ఆ శక్తి యోగులకి, ద్రష్టలకు దేవతామూర్తిగా - గాయత్రి వంటి బ్రహ్మ స్వరూపిణిగా అగుపించినపుడు ఆమె రూపాన్ని, మంత్ర స్వరూపాన్ని వారు మనకి అందించారు. అందుకే మంత్ర జపం చేసే ముందు కొందరు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. అందులో అర్ధం తమలో ఆ మంత్రాన్ని దాన్న తత్వాన్ని విలీనం చేసుకోవడమే! మంత్రంలో ఒకటిగా, ఆ శక్తిలో ఒకటిగా తమ
చేతులలో (కర్మ పరికరములు కరములు కనుక), వేళ్ళలో ఆ శక్తి స్వరూపాలను ఆవాహన చేస్తున్నాము. దాన్ని కరన్యాసము అని అంటున్నాము.
ఓం తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః !!
వరేణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః!!
భర్గో దేవశ్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః !!
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః!!
ధీయోయోన జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః !!
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః!!

స్త్రీ 220 పర్యాయ పదములు


స్త్రీ
220 పర్యాయ పదములు
1. అంగన
2. అంచయాన
3. అంబుజాలోచన
4. అంబుజవదన
5. అంబుజాక్షి
6. అంబుజనయన
7. అంబురుహాక్షి
8. అక్క
9. అతివ
10. అన్ను
11. అన్నువ
12. అన్నువు
13. అబల
14. అబ్జనయన
15. అబ్జముఖి
16. అలరుబోడి
17. అలివేణి
18. అవ్వ
19. ఆటది
20. ఆడది
21. ఆడగూతూరు
22. ఆడుబుట్టువు
23. ఇంచుబోడి
24. ఇంతి
25. ఇదీవరాక్షి
26. ఇందునిభాష్య
27. ఇందుముఖి
28. ఇందువదన
29. ఇగురాకుబోణి
30. ఇగురాకుబోడి
31. ఇభయాన
32. ఉగ్మలి
33. ఉజ్జ్వలాంగి
34. ఉవిధ
35. ఎలతీగబోడి
36. ఎలనాగ
37. ఏతుల
38. కంజముఖి
39. కంబుకంఠ
40. కంబుగ్రీవ
41. కనకాంగి
42. కన్నులకలికి
43. కప్పురగంధి
44. కమలాక్షి
45. కరబోరువు
46. కర్పూరగంది
47. కలకంఠి
48. కలశస్తిని
49. కలికి
50. కలువకంటి

51. కళింగ
52. కాంత
53. కించిద్విలగ్న
54. కిన్నెరకంఠి
55. కురంగానయన
56. కురంగాక్షి
57. కువలయాక్షి
58. కూచి
59. కృషమధ్యమ
60. కేశిని
61. కొమ
62. కొమరాలు
63. కొమిరె
64. కొమ్మ
65. కోమ
66. కోమలాంగి
67. కొమలి
68. క్రాలుగంటి
69. గజయాన
70. గరిత
71. గర్త
72. గుబ్బలాడి
73. గుబ్బెత
74. గుమ్మ
75. గోతి
76. గోల
77. చంచరీకచికుర
78. చంచలాక్షి
79. చంద్రముఖి
80. చంద్రవదన
81. చక్కనమ్మ
82. చక్కెరబొమ్మ
83. చక్కెర
84. ముద్దుగుమ్మ
85. చాన
86. చామ
87. చారులోన
88. చిగురుంటాకుబోడి
89. చిగురుబోడి
90. చిలుకలకొలోకి
91. చెలి
92. చెలియ
93. చెలువ
94. చేడి(డియ)
95. చోఱుబుడత
96. జక్కవచంటి
97. జని
98. జలజనేత్ర
99. జోటి
100. ఝషలోచన

101. తనుమధ్య
102. తన్వంగి
103. తన్వి
104. తమ్మికింటి
105. తరళలోచన
106. తరళేక్షణ
107. తరుణి
108. తలిరుబోడి
109. తలోదరి
110. తాటంకావతి
111. తాటంకిని
112. తామరకంటి
113. తామరసనేత్ర
114. తియ్యబోడి
115. తీగ(వ)బోడి
116. తెఱువ
117. తెలిగంటి
118. తొగవకంటి
119. తొయ్యలి
120. తోయజలోచన
121. తోయజాక్షి
122. తోయలి
123. దుండి
124. ధవలాక్షి
125. ననబోడి
126. నళినలోచన
127. నళినాక్షి
128. నవల(లా)
129. నాంచారు
130. నాచారు
131. నాచి
132. నాతి
133. నాతుక
134. నారి
135. నితంబవతి
136. నితంబిని
137. నీరజాక్షి
138. నీలవేణి
139. నెచ్చెలి
140. నెలత
141. నెలతుక
142. పంకజాక్షి
143. పడతి
144. పడతుక
145. పద్మముఖి
146. పద్మాక్షి
147. పర్వందుముఖి
148. పల్లవాధర
149. పల్లవోష్ఠి
150. పాటలగంధి

151. పుచ్చడిక
152. పుత్తడిబొమ్మ
153. పువు(వ్వు)బోడి
154. పువ్వారుబోడి
155. పుష్కరాక్షి
156. పూబోడి
157. పైదలి
158. పొల్తి(లతి)
159. పొల్తు(లతు)క
160. త్రీదర్శిని
161. ప్రమద
162. ప్రియ
163. ప్రోడ
164. ప్రోయాలు
165. బంగారుకోడి
166. బాగరి
167. బాగులాడి
168. బింబాధర
169. బింబోష్ఠి
170. బోటి
171. భగిని
172. భామ
173. భామిని
174. భావిని
175. భీరువు
176. మండయంతి
177. మగువ
178. మచ్చెకంటి
179. మడతి
180. మడతుక
181. మత్తకాశిని
182. మదిరనయన
183. మదిరాక్షి
184. మసలాడి
185. మహిళ
186. మానవతి
187. మానిని
188. మించుగంటి
189. మించుబోడి
190.మీనసేత్రి
191. మీనాక్షి
192. ముగుద
193. ముదిత
194. ముదిర
195. ముద్దరాలు
196. ముద్దియ
197. ముద్దుగుమ్మ
198. ముద్దులగుమ్మ
199. ముద్దులాడి
200. ముష్ఠిమధ్య
201. మృగలోచన
202. మృగాక్షి
203. మృగీవిలోకన
204. మెచ్చులాడి
205. మెఱుగారుబోడి
206. మెఱుగుబోడి(ణి)
207. మెలుత
208. మెళ్త(లత)మెల్లు(లతు)
209. యోష
210. యోషిత
211. యోషిత్తు
212. రమణి
213. రామ
214. రుచిరాంగి
215. రూపరి
216. రూపసి
217. రోచన
218. లతకూన
219.లతాంగి
220. లతాతన్వి
మీ
సుదర్శనం శ్రీనివాస సూరి

ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.

మనకు తెలియని శ్రీశైల దివ్యక్షేత్ర మహిమలు:
ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది.
పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో.
అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు.
కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.
ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది.
అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి.
అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది.
ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది.
సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ!
కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చిందీవిడ?
అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.
ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటేఅక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్కశ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే...

కదంబ వృక్ష మహిమ :

కదంబ వృక్ష మహిమ :
క‌దంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు.
దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్‌సిస్.
ఇది ఆకురాల్చ‌దు. ఎప్ప‌టికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువ‌గా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. దీని క‌ల‌ప‌ను బొమ్మల తయారీకి ఉప‌యోగిస్తారు. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుందంటున్నారు. ఉష్ణ మండల ప్రాంతంలో విరివిగా ల‌భిస్తుందంటున్నారు బయాల‌జిస్టులు.
పురాణాల్లో కదంబ వృక్షం:
ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తరభారతంలో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతంలో పార్వతీవృక్షమనీ అంటారు. ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షము అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’.. అలాగే దీనికి పార్వతీవృక్షమని కూడా పేరు. నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు ‘నారాయణా నారాయణి’ లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.
హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం..
అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. గార్దబాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమిమీద, మనుషులతో, జంతువులతో మరణంలేకుండా ఉండాలని వరం కోరతాడు. శివయ్య తథాస్సు అని అంతర్థానమవుతాడు. వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రున్ని తరిమికొడతాడు గార్దబుడు. దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంటపెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు. గార్దబాసురుని చంపమని కోరతాడు శ్రీమహావిష్ణువు. అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు. నువ్వు గార్దబాసురుని చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు. దానికి శివయ్య నువ్వు గనుక గార్దబాసురుని చంపినట్టైతే నేనే దాసుడిగా మారతానని దానికి మరో మాట కలుపుతాడు. అయితే మోహినీ రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి. దక్షిణాన ఉన్న గార్దబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు. అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్యరూపంలో వస్తుంది పార్వతీదేవి. అమ్మవారి అందానికి ముగ్దులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరతారు. మరోవైపు మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు. దీంతో కదంబాసురున్ని ఆకాశంలోకి ఎగరేసి.. తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు. ముఖం తోడేలు.. మొండెం మనిషి రూపంలో ఉండి… పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు. అలా సంహరిస్తున్న తరుణంలో అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరిని సంహరిస్తుంది అమ్మవారు. దీంతో గార్దబాసురుని సంహారం జరిగిపోయింది. అయితే సరదాగా అన్న మాట మాటే కాబట్టి… రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలు అందించాడు శివుడు.
జ్యోతిష్య శాస్త్రంలో….
ఆ కదంబ వృక్షానికి పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు. గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు. పసుపు, కుంకమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు. గ్రహదోషాలు ఉన్నవాళ్లు… కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. ఓం శక్తిరూపణ్యై నమః మంత్రంతో పూజించాలి అంటారు.
ఇదండీ.. కదంబ వృక్ష మహిమ. ఈ వృక్షం ఎందరికో నీడనివ్వాలని కోరుతోంది .

హనుమజ్జయంతి ప్రత్యేకం

       
  హనుమజ్జయంతి ప్రత్యేకం                                హనుమ - ఆచార్యుడు
       జీవునిలో భగవంతుని పొందాలి అనే ఆర్తి కలిగినపుడు, భగవానుడే ఆచార్యుని ఎంచి, జీవుని వద్దకు పంపుతాడు.
       ఆచార్యుడు వేద సంపన్నుడు, భగవదనుభవము పొందినవాడు కావలెను.
    "శ్రోత్రియమ్ బ్రహ్మనిష్ఠమ్" అని శ్రుతి.
అ) శ్రోత్రియుడు
        హనుమ మొదటగా రామలక్ష్మణులను కలసి మాటలాడినప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో హనుమను ప్రశంసించిన విషయం అతిగొప్పది.
      హనుమ ఋగ్వేద,యజుర్వేద,సామవేదములను అధ్యయనము చేసినవాడని విశేషణాలతో పొగడబడ్డాడు.
      ఋగ్వేదమున ప్రతివర్ణానికీ స్వరముంటుంది. గురువు వద్ద ఎంతో శిక్షణ పొందినగానీ దానిని సరిగా చదువలేరు. అందుకని హనుమను "ఋగ్వేద వినీతుడు" అన్నాడు రాముడు. 'వినీతుడు' అంటే 'శిక్షితుడు".
        యజుర్వేదంలో ఒక అనువాకంలో వాక్యము మరొక అనువాకంలో కనబడుతూంటుంది. అవి కలియకుండ ధారణ అవుసరం. అందుచే "యజుర్వేద ధారిణః" అన్నాడు.
        సామవేదము గాన ప్రధానము. గానములో మార్పులు చేయు జ్ఞానము "విదుషత్వము". అది కలవాడని హనుమను శ్రీరాముడు "సామవేద విదుషః" అని గుర్తించాడు.
     కాబట్టి హనుమ మూడుగా నున్న వేదాలకు సంబంధించి,
శిక్షణ పొందినవాడు,  జ్ఞప్తియందుంచుకొనేవాడు,  ప్రయోగించువాడు అని
మెచ్చుకోబడి శ్రోత్రియుడయ్యాడు.
ఆ) బ్రహ్మనిష్ఠుడు
         వేదాధ్యయన జ్ఞానముతో అభ్యాసము చేయుచూ, భగవత్తత్త్వము అనుభవించుట బ్రహ్మనిష్ఠ.
      రామలక్ష్మణులను తన భుజస్కంధాలపై ఆసీనులను చేసి, సుగ్రీవుని వద్దకు తీసుకు వెళ్ళాడు హనుమ. తద్వారా పరమాత్మతో అనుభూతి పొంది, బ్రహ్మనిష్ఠుడయ్యాడు.
    పరమాత్మ వేదజ్ఞానపరాయణుడైన హనుమను గుర్తించి, తాను హనుమకు పరమాత్మానుభూతి కూడా కలిగించి ఆచార్యుని చేశాడు.
        "లంక" అనే దేహంలో,
        "సీత" అనే జీవుని,
        "రావణుడు" అనే ఇంద్రియాలు బంధించి యుంచితే,
      ఆ "సీత" అనే జీవుడు
          "రాముడు" అనే పరమాత్మను పొందాలని ధ్యానిస్తున్నప్పుడు,
          "హనుమ" అనే ఆచార్యునితో అక్కడకు,
          "అంగుళీయకము"తోపాటు తన సందేశాన్ని భగవంతుడైన శ్రీరాముడు పంపాడు.
    మనం కూడా ఆ సందేశం పొందాలి.
    సరియైన విషయమై
శిక్షణ(Training),
జ్ఞప్తి(Memory),
జీవితంలో ఆచరణ(Application) అనే మూడూ శ్రోత్రియునిగా తయారుచేసి, తద్వారా,
      సాధనలో అనుభూతితో బ్రహ్మనిష్ఠునిగానూ చేసి,
      మనలను తావలెనే మార్చి అనుగ్రహిస్తాడు హనుమ.
          జై శ్రీరామ్ జై హనుమాన్
                    =x=x=x=
    — రామాయణం శర్మ
            భద్రాచలం
     హనుమజ్జయంతి ప్రత్యేకం
2. హనుమంతుడు - కుండలినీ యోగ సాధకుడు
        యోగి, కుండలినీశక్తిని మూలాధారము నుండి పైకి ప్రయాణింపజేసి, స్వాధిష్ఠాన - మణిపూర - అనాహత - విశుద్ధ - ఆజ్ఞా చక్రములను అతిక్రమించి, చివరికి సహస్రారపద్మాతర్గత బిందు స్వరూపమైన పరబ్రహ్మ సాక్షాత్కారమున పొందుతాడు. అదే యోగ సిద్ధి.
        హనుమంతుడు జితేంద్రియుడు. అంటే ఇంద్రియ చాపలం లేనివాడు. బుద్ధిమతాంవరిష్ఠుడు. అనగా ఇతర విక్షేపములు లేని బుద్ధి, లక్ష్యశుద్ధి కలవాడు.
1. మూలాధారం:
        హనుమంతుడు మహేంద్రపర్వతం నుండి ఆకాశంలోకి ప్రయాణించడం అంటే మూలాధారంనుంచీ కుండలినీ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేయడం.
2. స్వాధిష్ఠాన చక్రం:
        మైనాకుడు సహాయం చేయవచ్చినా అదికూడా గమనానికి అవాంతరమే కదా! ప్రలోభాలకీ సుఖాలకీ ఆశించక, ఆటంకాన్ని దాటటం స్వాధిష్ఠానాన్ని అతిక్రమించడం.
3. మణిపూర చక్రం:
       తనని సురస మ్రింగెదనని, తన నోట ప్రవేశింపమని అడ్డగించింది. ఆ సురస నోట ప్రవేశించి, బయటపడి తప్పించుకొనడం మణిపూర చక్రాన్ని అతిక్రమించడం.
4. అనాహత చక్రం:
       సింహిక ఛాయాగ్రహణం చేయగా, దానిని సంహరించటం అనాహతాన్ని దాటి పైకి సాగటము.
5. విశుద్ధి చక్రం:
       లంకా ప్రవేశానికి లంకానగర అధిష్థాన దేవత అడ్డువచ్చింది.
      ఆమెను గెలవటం విశుద్ధి చక్రాన్నతిక్రమించడం.
6. ఆజ్ఞా చక్రం:
         మండోదరిని చూచి సీతయే అని పరమానందం పొందాడు.
        కానీ లక్షణాలనిబట్టీ, వివేచనచేనూ ఆమె సీత కాదనుకొన్నాడు.
       ఆజ్ఞా చక్రాన్ని చేరిన కుండలిని, అదే గమ్యమనుకొని ఆనందపడి, మరల విచక్షణా జ్ఞానంచే,  గమ్యానికి ఇంకా ప్రయత్నం చేయవలసి ఉందని గ్రహించడం ఆజ్ఞా చక్రాన్ని దాటటం.
7. సహస్రార చక్రం:
         అశోకవనంలో సీతాదేవిని చూచి, ఆనందించడం సహస్రార చక్ర ప్రవేశం.
         ఆరు చక్రాలనీ జయించుకొని వచ్చిన సిద్ధపురుషునికి సహస్రార చక్రాంతర్గత బిందురూపిణి అయిన శ్రీ భువనేశ్వరీ దర్శనమైనదని అర్థం.
        చివరకు సీతారాములను తిరిగి కలిపి అయోధ్య చేర్చిన ఆంజనేయ సమారాధనలో సర్వేశ్వరి సాయుజ్యం గోచరిస్తుంది.
         ఈ విధంగా మారుతి యోగసిద్ధుడు.
                    =x=x=x=
  — రామాయణం శర్మ
          భద్రాచలం

భయాందోళనలను రూపుమాపే శ్వేతార్క ఆంజనేయ స్వామి


భయాందోళనలను రూపుమాపే శ్వేతార్క ఆంజనేయ స్వామి
''ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్''
ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించేవారికి ఎలాంటి బాధలు, భయాలు ఉండవు.
ఏ విధమైన చీడలు, పీడలు సోకవు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరతాయి.

తెల్ల జిల్లేడు మొక్క కాండం మీద ఆంజనేయ రూపాన్ని చెక్కి శ్వేతార్క ఆంజనేయ స్వామిని రూపొందిస్తారు.
శ్వేతార్క ఆంజనేయ స్వామిని చెక్కేవారు ఆ సమయంలో నియమనిష్టలతో ఉండాలి. స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాలి. బ్రహ్మచర్యం పాటించాలి.
శ్వేతార్క ఆంజనేయ స్వామిని ''హనుమజ్జయంతి'' నాడు పూజించడం శ్రేష్టం. లేదా అక్షయతృతీయ నాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి పూజ జరుపుకోవడం ఉత్తమం. ఈ రోజుల్లో వీలు కుదరకపోతే, మంగళవారం లేదా శనివారం నాడు ప్రార్ధించవచ్చు. ఆవేళ దశమి తిధి గనుక కలసివస్తే మరీ మంచిది.
ఇంతకీ శ్వేతార్క ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏమిటి అంటే :......
దుష్ట శక్తుల పీడనుండి, గ్రహాల దుస్థితినుండి రక్షిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి. అంతేకాదు, బాలారిష్ట దోషాలను తొలగిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి.
కొందరు పిల్లలకు పుట్టుకతో బాలారిష్ట దోషాలు వస్తాయి. ఈ దోషాలు పిల్లలు పదమూడో ఏట అడుగు పెట్టేవరకూ అనేక రకాలుగా పీడిస్తాయి.
ఇలా బాలారిష్ట దోషాలు ఉన్న చిన్నారులు ఏదో ఒక జబ్బు బారిన పడుతుంటారు. కొందరు పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడతారు. ఇంకొందరు చిన్నారులు చీటికిమాటికి అనారోగ్యం చేసి అవస్త పడుతూ, బాగా చిక్కిపోతారు.
కొందరు బాలలు స్కూలుకు వెళ్ళమని మారాం చేస్తారు. వారిని ఎంత ఒప్పించినా స్కూలుకు పంపడం సాధ్యపడదు. మరికొందరు పిల్లలు మంచి తెలివి ఉండి కూడా చదువుకోరు. సోమరులుగా తయారౌతారు. ఆరోగ్యం దెబ్బ తినడం, చదువుకు దూరం కావడమే కాకుండా కొందరు చిన్నారులు భయాందోళనలకు గురవుతారు. ఈ రకమైన బాలారిష్టాల నుండి గట్టేక్కిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి.
దెయ్యాలు, భూతాలు అనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గాలి సోకడం, దెయ్యం పట్టడం, చేతబడులు లాంటి తాంత్రిక శక్తుల మాట వింటే చాలు భయాందోళనలు ఆవరిస్తాయి. వీటి బారిన పడినవారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఇలాంటి దుష్ట శక్తుల బారినుండి శ్వేతార్క ఆంజనేయ స్వామి కాపాడతాడు.
శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఎలా అర్చించాలి అంటే:........
పూజ ప్రారంభించే రోజున పొద్దున్నే స్నానం చేసి, పూజాస్థలంలో కడిగిన పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. పీటమీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిమీద ఒక పళ్ళాన్ని ఉంచాలి. ఆ పళ్ళెంలో అక్షింతలు, పూలు, సింధూరం జల్లి, వాటిమీద శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఉంచాలి.
శ్వేతార్క ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించి, పూలమాల వేసి, దీపారాధన చేయాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి.
శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తిపూర్వకంగా ప్రార్ధించాలి. జపమాల చేత ధరించి -
''ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్''
అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
జపం ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. నీరాజనం, మంత్రపుష్పం మొదలైన సేవలు ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామి పాదాల వద్దనున్న అక్షింతలు తీసి, తలమీద జల్లుకోవాలి.
ఆ తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ఉద్వాసన చెప్పి, విగ్రహం తీసి, పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాలి. ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని మన పూజా మందిరంలో ప్రతిష్టించుకున్న పిదప రోజూ చేసే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక శ్వేతార్క ఆంజనేయ స్వామిని ధ్యానించాలి.
''ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్'' మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించేవారికి ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. ఏ విధమైన చీడలు, పీడలు సోకవు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరతాయి.
జై శ్రీ రామభక్త హనుమాన్

వినాయకుడు నివసించే లోకం ఏమిటో తెలుసా

వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః
మహాగణపతిం మనసా స్మరామి
వినాయకుడు నివసించే  లోకం ఏమిటో తెలుసా !
వినాయకుడి లోకాన్ని స్వనంద లోకమంటారు.
బ్రహ్మ నివసించే ప్రదేశాన్ని బ్రహ్మలోకమంటారు. విష్ణుభగవానుడు విష్ణులోకంలోని క్షీరసముద్రంగా పేరుగాంచిన పాలసముద్రంలో నివసిస్తాడు. శివుడు కైలాసంలో నివసిస్తాడు. వివిధ దేవతలు వివిధలోకాలలో నివసిస్తారు. అదేవిధంగా వినాయకుడు స్వనంద లోకంలో నివసిస్తాడు.
హిందువులకు అత్యంత ప్రీతికరమైన దైవం బహుశా వినాయకుడే కావచ్చు. మనకు ఏ దేవుడు ఇష్టదైవమైనప్పటికి, వారిని పూజించేముందు తొలిపూజలను అందుకునేది మాత్రం బొజ్జగణపయ్యే!
గజముఖంతో, గుజ్జురూపంతో ఉండే గణేశుడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ప్రేమిస్తారు. లంబోధరుని భక్తుల తుదిలక్ష్యం ఈ భువనాన్ని వీడిన తరువాత అతని సన్నిధిని చేరుకోవడమే!
మీకు కూడా ఈ లోకాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మరెందుకు ఆలస్యం? చదవండి!
స్వనంద లోక ప్రస్తావన:
గణేశ పురాణ ఉత్తరకాండలోని యాభై ఒకటవ అధ్యాయంలో ఈ లోకము గురించిన ప్రస్తావన ఉంది. ఈ పురణంను ముద్గల అనే ఋషి రచించారు.
ఈ అధ్యయంలో రచయిత, ఈ లోకంలో భోగభాగ్యాలు మిగిలిన అన్ని లోకాలకన్నా గొప్పగా ఉంటాయని వర్ణించారు.
స్వనంద లోకానికి అర్ధం: గణేశుని లోకాన్ని స్వనంద భవనం లేదా స్వనంద భువనం లేదా స్వనంద నిజాలోకమని కూడా అంటారు. ఈ అన్ని పేర్లకు అర్ధం ఒక్కటే - పరమానంద నిలయం.
స్వనంద లోక సృష్టి: స్వనంద లోకం కామదాయిని యోగ శక్తిగా పిలుచుకునే గణేశుని శక్తి చేత సృజించబడినది. ఈ పీఠం లేదా దీవి ఐదువేల యోజనాల వైశాల్యం కలిగి ఉంటుంది.
స్వనంద లోకానికి మార్గం: ఈ లోకానికి దరిచూపే మార్గాన్ని దివ్యలోకం అంటారు. ఈ మార్గం చాలా కఠినతరమైనది. గణేశుని లోకాన్ని చేరుకోవడం అంత సులభతరం కాదు. అతి పవిత్రమైన మునులకు కూడా ఈ లోకం చేరుకోవడం అసాధ్యం. ఈ లోకాన్ని చేరుకోవాలంటే, యోగ, దాన, యజ్ఞ,వ్రతాలతో లేదా వేదాంత జ్ఞానం అధ్యయనం చేసి అవలంబించడం ద్వారా మాత్రమే కుదురుతుంది. వినాయకుని కృపకు పాత్రులైనవారు చేరుకోవచ్చు. నిరంతరం ధ్యానించడం ద్వారా మాత్రమే ఆయన కృపకు పాత్రులవ్వవచ్చు.
భ్రమరాంబిక పాలకులు: గణేశుని రాజభవంతి చుట్టూ వెయ్యి యోజనాల శూన్యత ఉంటుంది. దీనిని దాటడం ఎవరికి సాధ్యం కాదు. దీనిని ఎవరైనా దాటాలనుకుంటే భ్రమరాంబిక పాలకులను ఎదుర్కోవాలి. వీరు కూడా వినాయకుని యోగ శక్తులచే సృష్టించబడ్డారు. ఈ పాలకులు బంగారు రంగులో, వేయి సూర్యుల కాంతితో అలరారుతుంటారు. వారు ఉగ్రరూపంతో, దట్టమైన కేశాలతో ఉంటారు.
స్వనంద లోకంలోని భోగభాగ్యాలు: స్వనంద లోకంలోని సిరులకు కొదవులేదు. రహదారులు బంగారం మరియు మణులతో చేయబడ్డాయి. కంటిచూపుమేర అమూల్యమైన రాళ్లు నిండి ఉంటాయి. ఈ లోకంలో లేమికి చోటులేదు.
గణేశుని సింహాసనం: ఈ విశ్వానికి ఉత్తరదిక్కున చెరకు రసంతో నిండిన మహాసముద్రం ఉంది. దీని మధ్యలో వేయి రెక్కలున్న, అందమైన , పెద్ద ,ఎర్రకలువ పూవు ఉంటుంది. దీనిలోని బంగారంలో వజ్రవైఢూర్యాలు, అమూల్యమైన రత్నాలు పొడగబడి తయారైన సింహాసనం ఉంటుంది. దీనిపై వినాయకుడు ఆసీనుడై ఉంటాడు.
వినాయకుని రూపం: వినాయకుడు తొమ్మిది ఏళ్ల బాలునివలె ఉంటాడు. ఆయన రక్తవర్ణంలో కాషాయవర్ణ తిలకధారి అయి ఉంటాడు. ఆయనకు, తన తండ్రి అయిన శివుని వలేె మూడుకళ్ళు ఉంటాయి. ఇవి సూర్యచంద్రులు మరియు అగ్నిని సూచిస్తాయి. గుండ్రంగా ఉండే భూమి ఆయన పొట్ట. ఆయన శరీరం పై ఉండే కేశాలు, నక్షత్రాలు మరియు గ్రహాలు. ఆయన శరీరంపై స్వేదం నదులు, సముద్రాలు మరియు మహాసముద్రాలు. ఆయన శరీరం బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఉంటుంది. ఆయన దివ్య మాల అనే పూలదండ వేసుకుని ఉంటాడు. ఆయన విలువైన వస్త్రాలు ధరించిన సువస్త్రధారి. ఆయన చుట్టూ దివ్య పరిమళాలు నిండి ఉంటాయి. ఆయన అందమైన కిరీటం (ముక్తాభరణ) ధరించి ఉంటాడు. తండ్రి వలె అర్ధచంద్రుని జటాజూటంలో కలిగి ఉంటాడు. ఈ అలంకరలతో ఉన్న వినాయకుని స్మరణ మాత్రం చేత మన పాపాలు తొలగిపోతాయని చెప్పబడివుంది.
గణేశుని సేవకులు: బాలగణేశుని అష్టసిద్ధులు సేవిస్తాయి. వీటికి స్త్రీ రూపం ఉంటుంది. తాంత్రిక గ్రంధాలలో అష్టసిద్ధులను గణేశుని అష్టభార్యలుగా వర్ణించారు. పవిత్ర గ్రంధాలైన వేదాలు మానవరూపాన్ని పొంది గణేశుని కీర్తిస్తాయి. వివిధ చిత్రాలు వినాయకుని బాలరూపంలో కూడా జ్ఞానానికి, నైపుణ్యానికి అధిపతిగా చూపిస్తాయి.
స్వనంద లోకానికి ద్వారాలు: ఈ లోకానికి నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలుంటాయని చెప్పబడి ఉంది. ప్రతి ద్వారం వద్ద ఇద్దరు ద్వారాపాలకులు కాపు కాస్తుంటారు. వీరు పొట్టిగా, పూర్తి అనురక్తితో కూడిన వారై ఉంటారు. చతుర్భుజులైన వీరు చాలా బలవంతులు. రెండు చేతులతో ఆయుధాలు కలిగి ఉంటారు. మూడవ చేతిలో దండం ఉంటుంది. నాలుగవ చేయి తర్జని ముద్రతో ఉంటుంది. తర్జని ముద్రలో చూపుడు వేలు మరియు బొటన వేలు ఒకదానికొకటి అంటుకుని ఉంటాయి. ఈ ముద్ర ఆత్మ మరియు గణేశుని అనుసంధానాన్ని తెలియజేస్తుంది. తూర్పు ద్వారాల వద్ద విఘ్న రాజు, అవిఘ్న రాజు కాపలా ఉంటారు.దక్షిణ ద్వారం వద్ద బలరామ, స్వక్త్రలు, పడమర ద్వారం వద్ద గజకర్ణ, గోకర్ణులు మరియు ఉత్తర ద్వారం వద్ద సుసౌమ్య, శుభదాయకులు కాపలా ఉంటారు. మిగిలిన స్వనంద లోకమంతటికి తేజోవతి, జ్వాలిని అనే పేరు కలిగిన శక్తులు కాపలా ఉంటాయి.
స్వనంద లోకంలో ఇతర నివాసితులు: స్వనంద లోకంలో వివిధ దేవతలు, మనుష్య ఆత్మలు మరియు వినాయకుని కృపకు పాత్రులైన ఇతర పుణ్య జీవులు ఉంటారు. వీరు వేలసంఖ్యలో ఉదుంబ్ర వృక్షం చుట్టూ దోమలవలె వినాయకుని చుట్టూ ఉంటారు. మనోకామన సిద్ధినిచ్చే వృక్షాలతో కూడిన దట్టమైన అడవులు కూడా ఈ దీవిలో ఉంటాయి.
వినాయకుని ఎలుక: వినాయకుని వాహనం ఎలుక అని మనందరికి తెలిసినదే. ఈ ఎలుక నిజానికి అగ్నిదేవుడని, శివునిచే కానుకగా ఇవ్వబడ్డాడని కథనం. ఈ ఎలుజ కూడా స్వనంద లోకంలో ఉంటుంది. ఇది బాలగణేశుని చెంత నిత్యం ఉంటుంది.
జై శ్రీ వినాయక స్వామినే నమః

జపం, జపమాలలు - ఫలితాలు

జపం, జపమాలలు - ఫలితాలు 
జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు.

జపమాలలు 3 రకాలు
1. కరమాల
అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.
2. అక్షమాల
‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా  ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.
3. మణిమాలలు
రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.
ఫలితములు
రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాల జపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటి గుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపు మాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసి మాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.
జపం 3 విధాలుగా ఉంటుంది
1. వాచింకం
మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.
2. ఉపాంశువు
తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.
3. మానసికం
మనస్సులోనే మంత్రాన్ని జపించడం.
వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడా చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్ట దేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం చెబుతోంది. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.
ఎలా చేయాలి..?
తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.
త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా
తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే
అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.
దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.
గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు.  
జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో 'పగడాల మాల' కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి. చింతా గోపీ శర్మ సిద్ధాంతి

ఆంజనేయుడికి..ఇష్టమైన..పుష్పాలేంటో..మీకు.. తెలుసా.

ఆంజనేయుడికి..ఇష్టమైన..పుష్పాలేంటో..మీకు..
తెలుసా.
వైశాఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||
ఆంజనేయ స్వామి..
వసంతఋతువు,
వైశాఖ మాసం
కృష్ణపక్షంలో,
దశమి తిధి,
శనివారం,
పూర్వాభాధ్రా నక్షత్రమున,
వైధృతౌ మధ్యాహ్న కాలమున అంజనీదేవికి జన్మించాడు.
ఆంజనేయుడు అంజనాదేవి కేసరుల ముద్దుబిడ్డ. సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి. ఆంజనేయ నామమహిమ అనితరమైనది.
అలాంటి మృత్యుంజయుడైన ఆంజనేయునికి.. పొన్నపువ్వు,
మొగలి,
పొగడ,
నంధివర్ధనము,
మందారము,
కడిమి,
గజనిమ్మ,
పద్మము,
నల్లకలువ,
మద్ది,
సువర్ణ పుష్పం,
గౌరీ మనోహరం,
ఎర్ర గన్నేరు,
కనకాంబర,
ముళ్ళుగోరింట,
మెట్ట తామర,
పొద్దు తిరుగుడూ,
మంకెన,
బండికెరి వెంద,
అడవిమల్లె,
కొండగోగు దింటెన,
సన్నజాజి,
మల్లె,
గులాబి,
మోదుగ,
సంపంగి,
జిల్లేడు,
చంధ్త్ర కాంత,
సురపున్నాగ,
కుంకుమ పువ్వు మొదలగు పుష్పాలు ఇష్టం.
అలాగే..
తులసి,
మాచిపత్రి,
ఎర్రకలువ,
గోరింట,
ఉత్తరేణి,
పసుపు,
అక్షింతలు,
తిరుమారేడు,
నేరేడు, పత్రాలు ఇష్టము..
తమలపాకులు కూడా ఆంజనేయునికి మహా ప్రీతికరమైనవని పండితులు అంటున్నారు.
పైన చెప్పిన పుష్పాలు, పత్రాలతో స్వామివారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
సమస్త గ్రహ దోషాలు తొలగుటకు , శీఘ్రంగా ఉద్యోగం దొరకుటకు...
ఒం నమో భగవతే రుద్రాయ నమః కోటీశ్వరాయ నమో నమః సిద్ధి రూపో రుద్రో అజ్ఞాయపతి స్వాహ "
మంత్ర సిద్ధి కొరకు : ప్రతీ రోజు 1080 సార్లు 48 రోజులు జపించాలి. జై శ్రీరామ్..!!
సర్వే జనా సుఖినో భవంతు..!!
                         శ్రీ మాత్రే నమః

శ్రీతులసి మహిమ ( తులసిచెట్టు

శ్రీతులసి మహిమ ( తులసిచెట్టు

తులసి,బృంద,బృందారిణి,విశ్వపూజిత,విశ్వపావని,పుష్పసార,నందినీతులసి,కృష్ణసేవిత అను 8 నామములతో తులసిని పూజించినవారికి అశ్వమేధయాగమును చేసినట్టి ఫలితము కలుగును.

శ్రీతులసికి నిత్యము భక్తితో ప్రదక్షిణముచేసి నమస్కరించుటవలన అశుభములన్నియు తొలగి సర్వపాప ప్రక్షాళణ జరిగి అనంతమైన పుణ్యఫలము కలుగును.సర్వాభీష్టములు నెరవేరును.

ఆంజనేయస్వామిని తులసిదళములతో పూజించుట
సర్వాభీష్టసిద్ధి.

ప్రతి ద్వాదశియందును తులసివన మధ్యమున శ్రీమహావిష్ణు సహస్రనామ పఠనము చేయువారికి సర్వాభీష్టములు సిద్ధించును.

ఒకసారికోసిన తులసిదళములు ఆరు రోజులవరకు పూజార్చనలకు ఉపయోగించవచ్చును.

ద్వాదశి రోజులలోనూ,శ్రవణా నక్షత్రమందును,అమావాస్య,పూర్ణిమ తిధులయందును,శుక్ర,మంగళ వారములలోనూ,మధ్యాహ్నము, సాయంసంధ్యలయందును,రాత్రులయందునూ తులసిదళములనుకోయుట మహాపాపము.

కృష్ణతులసి పూజకు అత్యంతయోగ్యమైనది.
తులసిమాల:—
ॐ దీనిని ధరించుటవలన సర్వపాపములు నశించును.
ॐ  ఆరోగ్యరీత్యా రక్తపోటును రానీయదు
ॐ  విష్ణుసంబంధములగు మంత్రజపములకు అత్యంత ప్రశస్తమైనది.కోరినకోర్కెలు నెరవేరును.
ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

గురువు కోసం అన్వేషణ చేసేవాళ్ళు,గురు చరిత్ర చదవండి

గురువు కోసం అన్వేషణ.
గురువు కోసం అన్వేషణ చేసేవాళ్ళు,గురు చరిత్ర చదవండి, రోజూ పారాయణ చేయండి,గురువులు తప్పక దర్శన మిస్తారు. మీ పట్టుదల శ్రద్ధ,భక్తిని బట్టి గురువులు లబిస్తారు.
ఎంత తీవ్రముగా మీ కోరిక వుంటే అంత తొందరగా దొరుకుతారు. మనసులో వేదన, పరితాపము వుండాలి. గురువులను మీ భక్తి శ్రద్దలతో మెప్పిస్తే, వాళ్ళు మీకు మంత్ర దీక్ష ఇస్తారు.
డబ్బుతో గురువులను కొనకూడదు. ధనాశ చూపి మంత్రములను పొందకూడదు. చాలా శ్రద్దతో, తపనతో భక్తీ తో మంత్రములను పొందాలి.
గురువులు పర దేవతా స్వరూపము. వారి అనుగ్రహము మీ పైన కలగాలి, అంత వరకు వేచి వుండాలి.
ఒక బ్యాంకు లో ఇంటి మీద అప్పు తీసుకోవాలంటే 15సం. లింకు డాక్యుమెంట్ అడుగుతారు. మధ్యలో ఎక్కడ లేక పోయానా, ఆ లింక్ తెగి పోయినట్లే. ఆ ఆస్తి ఎలావచ్చిందో తెలిపే లింక్ డాక్యుమెంట్ తీసుకొని రమ్మంటారు.
అదే విధముగా గురువులకు కూడా ఆ మంత్ర దీక్ష ఎలా వచ్చినదో తెలిపే లింక్ వుండాలి. ఎవరి నుంచి ఎవరికీ వచ్చినది తెలపాలి.  దీనినే గురు త్రయము అని అంటారు.
౧. స్వ గురువు
౨. పరమ గురువు
౩,  పరమేష్టి గురువు
వీరి పేర్లు తెలిసి వుండాలి, గురు పరంపర అవిచ్చిన్నంగా వుండాలి. మద్యలో ఎక్కడా తెగి వుండ కూడదు.
తల్లి దండ్రుల ఆస్తి పిల్లలకు వచ్చినట్లు, గురువుల తపశక్తి శిష్యులకు గురు త్రయము ద్వారా వస్తుంది.
గురు త్రయమునకు కూడా మంత్రము వున్నది. రోజూ గురు త్రయమును స్మరించి, వారి పాదములను స్పృశించి, మిగతా మంత్రానుష్టానము చేయవలెను.
గురు.త్రయము లేకుండా తీసుకొనిన మంత్రముల ద్వారా సాధకునికి  రక్షణ వుండదు. ఆ మంత్రములు అంతగా ఫలించవు.  గురు త్రయము  అనేది సాధకునికి రక్షణ కవచము. అది లేనిదే చాలా కష్టములు ఎదుర్కోన వలసి వస్తుంది.
అది లేకుండా ఎవరైనా మంత్రములు ఇస్తే, ఆ ఇచ్చిన గురువులకు అంత బాధ్యత లేదు, అయన మీ బాధ్యత తీసుకోలేదు అని అర్ధము. గురువులు శిష్యుల బాధ్యత తీసుకోవలెను. అప్పుడే శిష్యుడు చేసే తప్పులు దోషములు గురువుకు అంటుతాయి. 
నిత్యకర్మానుష్ఠానములో, మంత్రానుష్టానములో  చేసే తప్పుల వలన కలిగే పాపములు, దోషములు  గురువుకు కూడా కొంత సంక్రమిస్తాయి. శిష్యుడు తప్పు చేస్తే అది గురువుకు చెందుతుంది.
అందు వలన కొంత మంది గురు త్రయము ఇవ్వకుండా మంత్రములు ఇస్తారు. దాని వలన మనకు లాభము వుండదు. మన కోసము తన తపము త్యాగము చేసే వాడె గురువు. అటువంటి త్యాగశీలి మనకు కావాలి.
అంతే గాని ఎవరి దగ్గర అంటే వారి దగ్గర తీసుకొంటే దాని వలన ఉపయోగము ఉండదు. మంత్రము ఫలించదు. మంత్రానుష్టానము చేసేవాడె ఇంకొరికి మంత్రము ఇవ్వగలడు.  అప్పుడే ఆ మంత్రము ఫలించును.
కొంత మంది ఒక్కో మంత్రము ఒక్కో గురువు దగ్గర తీసుకొంటూ వుంటారు. ఇలా చేయ కూడదు. గురువు అనే వాడు ఒక్కడే వుండాలి. ఒక్కరి దగ్గరనే మంత్ర దీక్ష తీసుకోవాలి.
మనకు నచ్చ లేదని గురువులనుమార్చకూడదు.
నమ్మకముతో గురువులను ఆశ్రయించాలి. గురువుల కోసము మన:,ధన:,ప్రాణములను సహితము ధారాలంగా అర్పించే విధముగా మనము వుండాలి.
గురువులు శిష్యులను తన కన్న బిడ్డలుగా చూడాలి. ప్రతి చోటా ఇద్దరికీ త్యాగము మిన్నగా వుండాలి. త్యాగము లేనిదే గురు శిష్య పరంపర కోన సాగదు.
కావున మీరందరు గురు పరంపర తో కూడిన మంత్ర దీక్షలు తీసుకొని, మంత్రములను అనుష్టానము చేస్తూ,నిత్య జీవితములోని, సంసారములోని కష్టనష్టాలను దూరం చేసుకొని, ఆ పర దేవత కృపకు పాత్రులు అగుదురని ఆశిస్తూ,..
ఓం శ్రీ గురుః  పరమ కారణ భూతాశక్తిః  ... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది.
శ్రీవిద్యా పూర్ణ దీక్ష నొసగిన శ్రీ గురువులు  శ్రీ పరాదేవి స్వరూపులే. శ్రీ గురుదేవుల అనుగ్రహము చేత మహా వాక్య ప్రాప్తి, ( శ్రీవిద్యా పూర్ణ దీక్ష యందు మహా వాక్యములతో గూడిన మహా పాదుకలను ఇచ్చెదరు.)
దాని వలన బ్రహ్మాత్మైక్య సిద్ది లభించుచున్నందున శ్రీ గురువులే పరమ కారణమైన పరాశక్తి స్వరూపులని,       శ్రీ గురువులకు శ్రీ మాతకు అభేదము అని చెప్పు చున్నది.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
                           శ్రీ మాత్రే నమః

ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది...

ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది...
రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ,  కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా..  వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...
మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???
నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేముని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం...
ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా  మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి...
శ్లో" తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే !
ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు !!
( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం ) 
తాత్పర్యం : తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు...
మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక  లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు....
మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే..  ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కాసారి ఆలోచించండి, తెలియనివార్కి తెలియచేసి వారికి సాయం చేయండి.....
                     

శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి.


శ్వేతార్క గణపతి :
శ్వేతార్కంలో 'శ్వేతం' అంటే తెలుపు వర్ణం, 'అర్క' అంటే సూర్యుడు. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి. శ్వేతార్క మూలంలో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకోగలిగితే శుభప్రదం. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి. బాగా పాతబడిన తెల్లజిల్లేడు మొదళ్ళు కొన్ని గణపతి రూపం ధరిస్తాయని, అటువంటి బహు అరుదు అని చెప్పవచ్చు.
జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతకచక్రంలో సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ప్రతిష్టించి పూజించాలి. శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకు నేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. పండితుల్ని, పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టించుకోవాలి. వినాయక చవితి పండుగ రోజున ఈ శ్వేతార్క గణపతిని ప్రతిష్టించి పూజ చేసుకోవాలి.
పూజా విధానము
తెల్లజిల్లేడు చెట్టు 45 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగానే గణపతి రూపం వస్తుంది. ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున వేరును స్వీకరించాలి. శ్వేతార్క మూల గణపతిని శుద్ధమైన నీటితో కడిగి, తర్వాత దానిపై ఎర్రని వస్త్రం మీద పెట్టి పూజ చేయాలి. పూజలో ఎర్ర చందనం, అక్షతలు, ఎర్రపూలు సింధూరం ఎరుపు రంగు ఉండే వస్తువులే ఎక్కువగా వాడాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వీటితో ఒక నాణాన్ని దక్షిణ గా సమర్పించి తర్వాత ఈ దిగువ మంత్రాలతో గణేశునికి పూజ చేయాలి.
ఓం గం గణపతయే నమః
ఓం గ్లౌం గణపతయే నమః
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ ఫాలచంద్రాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం లంబోదరాయ నమః
మంత్ర జప ఆరంభానికి ముందే ఎన్ని సార్లు మంత్ర పఠనం చేసేది సంకల్పం చెప్పుకోవాలి. మంత్ర జపం చేసే సమయంలో ఎర్రని జప మాల, రుదక్ష్రమాల వాడడం మంచిది. ప్రతి జపమాలలోనూ 108 గింజలు ఉంటాయి. ఒకసారి అన్ని గింజలు లెక్కిస్తూ పూజ చేస్తే 108 సార్లు జపం చేసినట్టవుతుంది. అలా పది సార్లు జపమాల చేయడమంటే 1000 సార్లు నామ జపం అవుతుంది. ఈ విధంగా ఎన్ని జపమాలలు పూజ చేయాలనుకుంటారో ఆ ప్రకారం చేయాలి. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి.
తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట.శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి, మట్టిని కడిగివేసి, నీళ్లలో నానబెట్టి జాగ్రత్తగా పరి శీలించినట్టయితే ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు. తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి.
ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదని శాస్త్రం చెబుతోంది. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు.
శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుందిట, ఏదైనా శుభముహూర్తాన శుచియైన తర్వాత ఆవునెయ్యి, గోరోజనం సిద్ధంగా ఉంచుకుని, ఈ ఆవు నెయ్యి గోరోజనంలో శ్వేతార్క మూలాన్ని గంథంలాగా అరగదీసి ఇష్టదైవాన్ని మనసులో ప్రార్ధిస్తూ నుదుటి మీద తిలకం వలె ధరిస్తే ఆ తిలకానికి ఉన్న వశీకరణ శక్తి స్వయంగా వస్తుంది. 
శరీర రక్ష కోసం శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని, వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని, శ్వేతార్క వేరుని తాయిత్తులలో ధరించటంగాని చేస్తే శుభప్రదం.....

ఓం నమో భగవతే వాసుదేవాయ

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి?
ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన. (భవిష్యపురాణం)..
ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఈ నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆతరంగాలు కలిపురుషుడు ని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరం లో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చుస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చుస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి ఒస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను.
ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి. అన్నాడు. వ్యాసుడు నవ్వి. ఇది నీరాజ్యం. ఈకలికాలం నీది. నీకు సందేహమా? ఎఇద్దరుని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!
కుశలమే! నారాజ్యంలో నేను కాకా నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం '' ఒమ నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ

హనుమాన్ జయంతి … పూర్తి కథ.

హనుమాన్ జయంతి … పూర్తి కథ.
హనుమాన్ జయంతి
ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో … ఎక్కడ ఆయన నామం వినిపిస్తుందో … అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయనను మించిన భక్తుడు లేడంటూ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు. అలాంటి హనుమంతుడి జన్మ వృత్తాంతంలోకి వెళితే … ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువుదీరి ఉండగా, ‘పుంజికస్థల’అనే అప్సరస … బృహస్పతితో పరిహాసమాడబోయింది. ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి, భూలోకాన ‘వానర స్త్రీ’గా జన్మించమని శపించాడు.
తీవ్రమైన ఆందోళనకి లోనైన ఆమె శాపవిమోచనం ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. కారణ జన్ముడైన వానరవీరుడికి జన్మను ఇచ్చిన తరువాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చునంటూ ఆయన అనుగ్రహించాడు. దాంతో ‘పుంజికస్థల’భూలోకాన ‘అంజనాదేవి’గా జన్మించి, కాలక్రమంలో ‘కేసరి’అనే వానరుడిని వివాహమాడింది. శాపవిమోచానార్ధం తనకి వీరుడైనటువంటి పుత్రుడిని ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుడిని ప్రార్ధించింది.
 *హనుమాన్ జయంతి … పూర్తి కథ.*
ఈ నేపథ్యంలో రాక్షస సంహారం కష్టతరంగా మారడంతో, పరమేశ్వరుడి అంశతో జన్మించినవాడి వలనే అది సాధ్యమని బ్రహ్మ – విష్ణు భావించారు. అయితే పరమశివుడి వీర్య శక్తిని పార్వతీదేవి భరించలేకపోవడంతో , వాయుదేవుడి ద్వారా దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది. అలా శివాంశ సంభూతుడైన హనుమంతుడు  ‘వైశాఖ బహుళ దశమి’ రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు.( చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపడం తెలంగాణాలో ఆచారం )
తల్లి ఆలనాపాలనలో పెరుగుతోన్న హనుమంతుడు, ఆకాశంలోని సూర్యుడిని చూసి దానిని తినే పండుగా భావించి కోసుకురావాలనే ఉద్దేశంతో ఆకాశ మార్గాన బయలుదేరాడు. ఆయన్ని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి కింద పడిపోయిన హనుమంతుడి ‘ఎడమ దవడ’కి గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు. దాంతో దేవాధి దేవతలంతా అక్కడికి చేరుకొని హనుమంతుడు చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించారు.
అలా దేవతల నుంచి వరాలు పొందిన హనుమంతుడి అల్లరి చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దాంతో ఎవరైనా గుర్తు చేస్తే తప్ప, అతని శక్తి అతనికి తెలియకుండా ఉండేలా రుషులు శపించారు. సూర్య భగవానుని అనుగ్రహంతో సకల విద్యలను అభ్యసించిన హనుమంతుడు, రామాయణానికి ఓ నిండుదనాన్ని తీసుకు వచ్చాడు. సుగ్రీవుడిలో కదలిక తీసుకు వచ్చి అతని సైన్యాన్ని ముందుకు నడిపించడంలోనూ … లంకలో ఉన్న సీతమ్మవారి ఆచూకీ తెలుసుకోవడంలోను … వారధి నిర్మించడంలోను … యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు ‘సంజీవిని’ పర్వతాన్ని పెకిలించి తీసుకు రావడంలోను హనుమంతుడు కీలకమైన పాత్రను పోషించాడు. అందుకే హనుమంతుడులేని రామాయణాన్ని అస్సలు ఊహించలేం.
 *హనుమ ఆరాధన*
‘త్రిపురాసుర సంహారం’ సమయంలో పరమ శివుడికి శ్రీ మహా విష్ణువు తన సహాయ సహకారాలను అందించాడు. అందువల్లనే లోక కల్యాణం కోసం శ్రీ మహా విష్ణువు రామావతారం దాల్చినప్పుడు, శివుడు … ఆంజనేయస్వామిగా అవతరించి, రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దుష్ట గ్రహాలను తరిమికొట్టి ఆయురారోగ్యాలను ప్రసాదించే హనుమంతుడిని పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఎంతో ఇష్టపడతారు.
ఇక ప్రతి ఊరిలో రామాలయం వుంటుంది … ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులో ఉంటాడు. అందువలన ఈ హనుమజ్జయంతి రోజున ప్రతి ఊరిలో ఆయనకు ప్రదక్షిణలు చేయడం … ఆకు పూజలు చేయించడం … ఆయనకి ఇష్టమైన ‘వడ’ మాలలు వేయించడం జరుగుతుంటుంది. ఈ రోజున ఆంజనేయ స్వామి దండకం … హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
హనుమాన్ జయంతి:
యత్ర యత్ర రఘునాథకీర్తనం – తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం* – *మారుతిం నమత రాక్షశాంతకామ్
“యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును”శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
విశేషాలు:
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దిನములు – శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.
 *హనుమాన్ జయంతి*
స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.
పంచముఖ హనుమాన్:
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది.
తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి,దుష్ట ప్రభావలను పోగొట్టీ,శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.
 *హనుమాన్ జయంతి రోజున పూజ ఎలాచేయాలి?:*
చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.
పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్‌ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం
 *హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత:*
హనుమాన్ చాలీసా అంటే ఆత్మలకు భయం అని మరియు హనుమంతుడు అంటేనే ధైర్యానికి మారుపేరు అని తెలియచెప్పిన ఈ చాలీసా అత్యంత ప్రసిద్ధి చెందింది. అత్యంత శక్తివంతమైనది అని పిలువబడుతున్న ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్ర భక్తుడు గొప్ప నైష్ఠిక భక్తుడు, తులసీదాస్ రచించారు. తులసీదాస్, రచించిన రచనలలో అత్యంత ఉత్తమమైనది, ముఖ్యమైనది తులసీ రామాయణము. హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్నకు వస్తే, చాలీసాలోని శ్లోకాలకు అర్థమేమిటి, దీనియొక్క శక్తివంతమైన మహిమ ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ వ్యాసం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచెపుతుంది. దాదాపు హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలతో ముడిపడి ఉంది.
వివిధ శ్లోకాలను దోహాలుగా కూడా పిలుస్తారు. చాలీసాలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు హనుమాన్ చాలీసా చదవటంవలన కలిగే మొత్తం ప్రయోజనాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం. హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత హనుమాన్ చాలీసాలోని ప్రారంభ దోహా “జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర ” వల్లే వెయటం వలన జీవితంలో స్వాభావిక దివ్య జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞాన సహాయంతో, జీవితంలో ప్రతిష్టంభించిన అనేక సవాళ్లు, దాదాపు అసాధ్యం అనుకున్నవాటిని సాధించగలుగుతారు. మహావీర్ విక్రమార్కుడుతో మొదలయ్యే ‘మూడవ దోహా’ ప్రజలలో బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సహవాస ప్రభావాలనుండి బయట పడడానికి సహాయపడుతుంది. చాలీసాలోని ఏడవ మరియు ఎనిమిదవ శ్లోకాలు, శ్రీరాముడి ఆత్మతత్వాన్ని అర్థం తెలియచేస్తాయి మరియు దేవుని దివ్యసన్నిధికి చేరువ చేస్తాయి. 14వ మరియు 15వ దోహాలు ఒక వ్యక్తి కీర్తిప్రతిష్టలు పొందటానికి సహాయం చేస్తాయి.
మీ పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం మరియు మీ సామర్త్యం పట్ల అందరి ప్రశంసలు అందుకుంటారు. 11వ ఛౌపయి చదవటం వలన పాములు మరియు విషజంతువుల భయం తొలగించడానికి సహాయం లభిస్తుంది. 16వ మరియు 17 చౌపాయి  చదటం వలన జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగటానికి సహాయపడుతుంది. అది ఒక కార్యాలయంలో వద్ద ప్రమోషన్లు కావొచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించినది అయిఉండవొచ్చు. 20వ దోహా చదవటం వలన జీవితంలో అనేక సవాళ్లను అధిగమించవొచ్చు మరియు అనేక అడ్డంకులు తొలగిపోయి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. 24వ ఛౌపయి, ముఖ్యమైనది, ఢాకిణి పిశాచాలు, భూతాలు మరియు చేతబడి ప్రభావాలు పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. చాలీసాలోని ప్రతి దోహాతో ముడిపడి జీవులకు అనేక లాభాలు ఉన్నాయి. అందువలన హనుమాన్ చాలీసాకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.
 *ఆంజనేయస్వామికి సింధూరం ఎందుకు పూస్తారు?*
ఈ ఆనుమానం, సందేహం చాలామందికి వుంది. దీనికో పౌరాణిక కధ వుంది. రామాయణకాలంలో సీతమ్మవారు పాపిడిలో సింధూరం ధరించేది. ఒకసారి ఆంజనేయస్వామి అది చూసి అలా ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మని అడీగారు. అందుకు సీతమ్మ నీ స్వామి, నాస్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయుష్షు పెరగాలనీ ఆయనకి అన్నీ శుభాలు జరగాలనీ పాపిడిలో సింధూరం ధరిస్తాను. ఆడవారు పాపిడిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుష్షు పెరుగుతుంది, వారికి అన్నీ శుభాలు జరుగుతాయి అని చెప్పిందట.
ఆంజనేయస్వామి రాముడికి పరమ భక్తుడు. ఆయన వూరుకుంటాడా!? వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సిధూరం పూసుకొచ్చాడు. సీతమ్మ అడిగిందట. ఒళ్ళంతా సిధూరం ఎందుకు పూసుకున్నావని. దానికి ఆయన సమాధానం, ‘అమ్మా, నువ్వు పాపిడిలో సింధూరం పెట్టుకుంటేనే స్వామి ఆయుష్షు పెరుగుతుందనీ, శుభం జరుగుతుందనీ అన్నావు కదా, మరి నేనాయన భక్తుణ్ణి, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకా ఎక్కువగా అన్నీ శుభాలే జరుగుతాయనీ, ఆయన చిరంజీవి కావాలని ఇలా పూసుకున్నాను’ అని చెప్పాడు.
ఇది వాల్మీకి రామాయణంలో కధకాదు. రామాయణాన్ని చాలామంది రచయితలు చాలాసార్లు రాశారు. తర్వాత వచ్చిన రామాయణంలో వచ్చిన కధ ఇది.
అది పురాణ కధ అనుకోండి. లౌకికంగా చూస్తే ఆంజనేయస్వామి వాయుదేవుని పుత్రుడు, సూర్యదేవుని శిష్యుడు. వారిరువురూ ఎంతో తేజస్సు కలవారు. అందుకే ఆంజనేయస్వామి అమిత తేజోమూర్తి. ఎరుపు లేక సింధూరం తేజస్సుకి చిహ్నం. ఆయన తేజస్సుకి చిహ్నంగా ఆయనను సింధూరంతో అలంకరిస్తే స్వామి చూడటానికే ఎంతో తేజోవంతుడుగా కనుల విందు చేస్తాడనీ, ఆయన తేజస్సూ, శక్తీ మనకి వెంటనే స్ఫురిస్తుందనీ అలా అలంకరిస్తారు.
ఇంకొక విషయం తెలుసా ఆంజనేయస్వామి రామ భక్తుడుకదా. శ్రీరామ పూజ ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి వుంటాడు. ఆ పూజ చూడటానికీ, ఆ నామ కీర్తన వినటానికీ. అందుకే శ్రీరామచంద్రుని పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ఆసనాన్ని వేసి వుంచాలిట. అక్కడ ఆంజనేయస్వామి ఆసీనుడై శ్రీ రామ పూజ తిలకిస్తాడని నానుడి.
అందరికీ ఆ ప్రసన్నాంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని, సకల బాధలు తొలగి సుఖంగా ఉండాలని ఆశిస్తూ..!
 జై శ్రీమన్నారాయణ 
హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.
రెండవది తత్తుల్యమైన రోజు ఒకటున్నది. అది హనుమద్వ్రతం అని చేస్తారు. ఇది వైశాఖ బహుళ దశమి మధ్యాహ్నం స్వామియొక్క ఆవిర్భావం కనుక హనుమజ్జయంతి. హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS