Thursday, May 3, 2018

మీ ఇంటి ముందు దిష్టిగుమ్మడికాయ కట్టారా.

మీ ఇంటి ముందు దిష్టిగుమ్మడికాయ కట్టారా.
ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు,కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి.
ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నపుడు దానికి ఒక అగరబత్తిని  వెలిగించి గుచ్చండి .
ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది.మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రబావాన్ని అది లాక్కుంటుంది .
ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుల్లిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి.
వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి. ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి.
గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష,నరపీడ,నరదృష్టి, నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.
పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టేయాలి.ఇప్పటివరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టేయండి.  ఇలా గురువారం రోజు గానీ.. ఆదివారం రోజు గానీ కట్టాలి.. 
                        శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS