Sunday, May 23, 2021

లోహా తాబేలు ప్రతిమ

 లోహా తాబేలు ప్రతిమ 


🌺1. తాబేలు ప్రతిమ ని ఇత్తడిలో గాని , క్రిష్టల్ లో గాని తీసుకొని దానిని ఇత్తడి ప్లేట్ లో గాని, పింగాణి లేదా గాజు పాత్రలోగాని నీటిని పోసి తాబేల్ ని ప్లేట్ తో సహా ఉత్తరం దిక్కున ఉంచాలి.

🌺2. ప్రతిరోజు ఉదయాన్నే ప్లేట్లో ఉన్న నీటిని తీసివేసి కొత్త నీటిని పోసి ఉత్తరం దిక్కున ఉంచాలి. ప్లేట్ లో నీటిని పోసేటప్పుడు మన మనస్సులో ఉన్న కోరికలను మనస్సులో  తలచుకుంటు నీటిని పోయాలి.

🌺3. తాబేలు నీటిలో ఉంటే ఎక్కువ రోజులు బ్రతుకుతుంది. కాబట్టి తాబేలుని నీటిలో ఉంచటం వలన తాబేలుకి సహజ వాతావరణంలో ఉంచాము అన్న అనుభూతి కలుగుతుంది. బ్రతికి ఉన్న తాబేలుని కూడ ఎక్వేరియంలో ఉంచి ఉత్తరం దిక్కున ఉండవచ్చు.

🌺4. తాబేలు ని విష్ణు భగవానుడి స్వరూపంగా కొలుస్తారు.వాస్తు శాస్త్రం రీత్యా ఉత్తరం దిక్కు బుధుడికి చెందిన దిక్కు అని ,ఉత్తరం కుబేర స్ధానంగా భావిస్తారు.

జోతిష్యశాస్త్రం లో బుధగ్రహానికి అదిదేవుడు విష్ణు భగవానుడు.🌺

🌺ఉపయోగాలు 🌺

🌺5. తాబేలుని నీటిలో ఉంచి ఉత్తరం దిక్కున ఉంచటం వలన బుధగ్రహా దోషాలు తొలిగిపోతాయి.

🌺6. తాబేలు ఉన్న ఇంటి లో పిల్లలు అందరు మంచి విద్యతో విద్యావంతులుగా ఎదుగుతారు.మంచి వాక్శుద్ది తో భావప్రకటన చేయగల సామర్ధ్యం కలిగి ఉంటారు.

🌺7. తాబేలు ఉన్న ఇంటిలో వాస్తు దోషాలు ఉంటే కొంత వరకు దోష నివారణ జరుగుతుంది.ఆ ఇంటిలో ఉన్న మనుషులకు మానసిక ప్రశాంతత కలుగుతుంది.

🌺8. తాబేలు ఉన్న ఇంటిలో ధనానికి ఎటువంటి లోటు ఉండదు.

🌺9. తాబేలు షాపులలో ఉంచటం వలన వ్యాపారాభివృద్ధి ఉంటుంది.🌺

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS