Sunday, May 30, 2021

శ్రీ రామ సాయి మందిరం (1957)సాయిబాబా రోడ్ చంద్రమౌళి నగర్ గుంటూరు SRI RAMASAI MANDIRAM SAIBABA ROAD CHANDRAMOULINAGAR GUNTUR 63 క్రితం నిర్మాణం జరిగిన శ్రీ సాయి బాబా మందిరం

 శ్రీ రామ సాయి మందిరం (1957)సాయిబాబా రోడ్ చంద్రమౌళి నగర్ గుంటూరు SRI RAMASAI MANDIRAM SAIBABA ROAD CHANDRAMOULINAGAR GUNTUR



63 క్రితం నిర్మాణం జరిగిన శ్రీ సాయి బాబా మందిరం సాయి బాబా రోడ్ చంద్ర మౌళి నగర్ గుంటూరు శ్రీ రామసాయి మందిరం...సాయిబాబా రోడ్డు..చంద్రమౌళీ నగర్...గుంటూరు.. ఓం శ్రీ సాయిరామ్🙏🙏 గుంటూరు చంద్రమౌళీ నగర్, సాయిబాబా రోడ్ లో ఉన్న ఈ మందిరం 1957 ఫిబ్రవరి 2వ తేదీన నిర్మాణం జరిగింది. ఈ రోడ్ లో బాబా మందిరం ఉండటం వలన ఈ రోడ్ కి సాయిబాబా రోడ్ అని పేరు వచ్చింది. ఈ మందిరం శ్రీ దామరాజు వెంకటేశ్వరరావు గారు (జల్లా పోలీసు సూపరింటెండెంట్ రిటైర్డ్ )వారి స్వగృహ ప్రాంగణము నందు ఈశాన్యభాగంలో వారి వంశస్థుల కోసం ఏర్పాటు చేసుకున్న పూజామందిరం. సాయిభక్తుల సౌకర్యార్ధం దీనిని మందిరంగా మార్చి దర్శనార్థం వీలుకల్పించారు. మందిర నిర్వాహకులు దామరాజు వెంకటేశ్వరరావు గారి కుమారుడు శ్రీ దామరాజు బాలసుబ్రహ్మణ్యం గారు( డి.ఐ.జి ఆఫ్ పోలీసు రిటైర్డ్) ప్రస్తుతం శ్రీరామసాయిబాబా మందిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మందిరం ఈశాన్యభాగంలో ఉండటం వలన వరప్రదాయిని, విగ్రహం కూడా చాలా పురాతనమైనది. ఈ విగ్రహం ఆసమయంలోనే జైపూర్ నుండి తెప్పించబడినది. ఆలయంలోకి ప్రవేశించగానే మందిరద్వారం, ఒకవైపు దామరాజు వెంకటేశ్వరరావు గారు గోవుతో ఉన్న ఫొటో, మధ్యలో బాబావిగ్రహం చిన్నది, మరోవైపు వారి సతీమణి ఫొటో కనిపిస్తాయి. చిరునవ్వుతో (నగుమోముతో) బాబా మూల విగ్రహాన్ని ఎంతో అందంగా అలంకరించి, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాబా విగ్రహం వెనుక శ్రీ సీతారామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలు, శ్రీ కృష్ణుని విగ్రహం దర్శనమిస్తాయి. వాటి ప్రక్కనే గాయత్రీదేవి , పరమాచార్య శంకరాచార్యులు, ధ్యాన నిమగ్నలైన బాబా, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరభారతి, విశ్వంజీగారు, సత్యసాయి బాబా ఫొటోలు ఉంచబడ్డాయు. బాబా పాదాల దగ్గర దత్తత్రేయ విగ్రహం, ఇతర దేవీదేవతల విగ్రహాలు ఉన్నాయి. ద్వారానికి ఒకవైపు గణపతి విగ్రహం, మరో వైపు బాబా పాదుకలు ఉంచబడ్డాయి. గురు సాంప్రదాయంలో గురువు కన్నా గురుపాదుకలకు ఎక్కువ ప్రాధాన్యత విశిష్టత ఉంది. మందిరం చుట్టూ గోడలపై గాయత్రీదేవి, దత్తాత్రేయుడు, గణపతి పెద్ద చిత్రాలు ఉన్నాయి. బాబాగారి ఏకాదశ సూత్రాల బోర్డు ఏర్పాటు చేశారు. శ్రీరామ నవమికి కళ్యాణోత్సవం, దత్తజయంతి రోజు విశేష పూజలు, గురు పౌర్ణమి, ఏకాదశి రోజున విశేష అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయప్రాంగణం ఎంతో విశాలంగా పెద్ధపెద్ధ రావిచెట్లు, వేపచెట్లు వివిధ వృక్షాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహరాజ్ గారు, బాపట్ల వేంకట పార్ధసారధి గారు, ఆలూరి గోపాలరావుగారు, చోడవరపు సాంబమూర్తి గారు, కొప్పరపు రామారావు గారు, వాడరేవు గురవరాజు గారు లాంటి నిస్వార్ధ సాయిభక్తులు ఆరోజుల్లో ఈ మందిరాన్ని దర్శించి, ఎంతో మక్కువతో దామరాజుగారు నిర్మించుకున్న ఈ మందిరాన్ని ఎంతో కొనియాడారు. గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహరాజ్ గారు "ఓం శ్రీ సాయిరామ్ " జపయజ్ఞ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఆలయం దామరాజు గారు సాయిబాబా మీద ఎంతో ప్రీతితో, అనురక్తితో నిర్మించారు. ఈశాన్యంలో ఈమందిర నిర్మాణం ఉన్నందువలన, ఏదైనా కోరికలు కోరకున్న తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భక్తులు సాయిబాబా రోడ్, చంద్రమౌళీ నగర్ లో ఉన్న ఈ మందిరాన్ని దర్శిస్తారని ఆశిస్తూ...
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS