Thursday, May 27, 2021

వైశాఖ శుద్ధ పౌర్ణమి ఉగ్ర నరసింహుని అవతార సమాప్తి అరవీర భయంకర శరభేశ్వర జయంతి.

🌸
వైశాఖ శుద్ధ పౌర్ణమి
ఉగ్ర నరసింహుని అవతార సమాప్తి
అరవీర భయంకర శరభేశ్వర జయంతి.

హిరణ్యకశిపుడి
 కడుపును చీల్చి
ప్రేగులను  N వేసుకొని , రక్తాన్ని త్రాగి సంహరించిన ?
ఉగ్ర నరసింహుడు అ.సుర లక్షణాలతో
మరింత ఆగ్రహావేశాలు జ్వాలల్లా పెరిగి , అదేపనిగా ఆకాశమే దద్ధరిల్లే విధంగా , 
విశ్వMmmM?.మే భయంతో వణికిపొయ్యేలా , 
అరణ్యములో వేగంగా తిరుగాడుతుంటే 
భూమి యావత్తు కంపించిపోతుంటే...
అహోబిలానికి విచ్చేసిన 
ముక్కోటి దేవతలు భయభ్రాంతులకు లోనై భీతిల్లిపోతూ , అనేక విధాలుగా నారసింహుని శాంతించమని వేడుకోసాగినా , మరింత ఉగ్రావేశంతో అడుగులు వేస్తుంటే.. అడవిలో జ్వాలలు పెరగసాగాయి.
సర్వ దేవతలు భయబ్రాంతులకు లోనై పరమశివుణ్ణి వేడుకొనగా ... వీరభద్రున్ని పంపి , విష్ణువు యొక్క ఆగ్రహాన్ని లొంగదీయమని తెలిపి పంపించగా... తన తీక్షణమైన చూపులతోనే అతిలోక భయంకరుడైన వీరభద్రున్నే అదృశ్యం చేయడంతో..  ఇక పరమశివుడే అత్యంత భీకర శక్తివంతమైన రూపంతో సగం మానవుడిగా , సగం మృగంగా , మరో సగంగా పక్షి రూపంలో అతిపెద్ద పరిమాణంలో , ఒళ్ళంతా పొక్కులతో , అనేక చేతులతో , పటిష్టమైన పంజాలతో , నిప్పు కణితల్లే మండుతూ వున్న మూడు కన్నులతో , అతి పెద్ద శిరోజాలతో , పెద్దదైన తోకతో ,  అతిపెద్ద రెక్కలతో , పొడవైన సూదిగా వుండేలా దంతాలతో , 
భరించలేని బుసలు కొడుతూ ,
వినలేని ఉరుముల్లాంటి గొంతుతో ప్రతిధ్వనులు చేస్తూ... నరసింహునికి శక్తికి మించిన ఆకారంతోనూ పరమశివుడే
వైశాఖ శుద్ధ పౌర్ణమి నాటి సాయంత్రం వేళల్లో
శ్రీ శరభేశ్వర అవతారాన్ని ధరించి
నారసింహుని ఎదుట ప్రత్యక్షమై ,
నరసింహునితో హోరాహోరీగా తలపడగా.. పరమేశ్వరుడు ఇక నరసింహుని అవతార సమాప్తి చేయాలని తన పొడవాటి తోకతో నారసింహుని చుట్టి పైకెత్తి గిరగిరా తిప్పి పడబోయే సమయంలో... వచ్చినది పరమేశ్వరుడే అని నారసింహుడు తలచి ..
ఓ శరభేశ్వరా ! శరభ ! శరభ !! అని పిలుస్తూ..  
నా ఉగ్రరూపాన్ని విరమిస్తున్నాను అని తెలిపి ,
శరభేశ్వరునికి తన సింహపు చర్మ శరీరాన్ని వలచి కానుకగా సమర్పించగా , నారసింహుని తలను పరమేశ్వరుని మెడలోని పుర్రెల హరంలో ఒక్కటై స్థిరపడుతుంది.
ఈవిధంగా నరసింహుని అవతారం
వైశాఖ శుద్ధ చతుర్దశితో జన్మించి
( సరిగ్గా ఇరవై నాలుగు గంటలు మాత్రమే )
వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజుతో
అవతార సమాప్తి కాగా ,
పరమేశ్వరుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శరభేశ్వరునిగా అవతరించి లోక కళ్యాణం గావిస్తాడు.
అనంతరం , శ్రీ నరసింహుడు నిజరూపమైన 
శ్రీ మహావిష్ణువు రూపాన్ని స్వీకరించి , శ్రీలక్ష్మీ సమేతుడై వైకుంఠానికి ప్రయాణం కాగా ,
ప్రదోష సమయంలోనే శరభేశ్వరుడు అవతరించిన పౌర్ణమి అత్యంత పవిత్రమైన పుణ్యపర్వదినంగా ఆరాధించుకోవాలని శివ పురాణం నందు వివరింపబడింది.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS