Sunday, May 30, 2021

త్రిపుర సుందరి దేవి ఆలయం TRIPURA SUNDARI UDAIPUR Tripura Sundari Temple in Tripura

 త్రిపుర సుందరి దేవి ఆలయం TRIPURA SUNDARI UDAIPUR Tripura Sundari Temple in Tripura


శ్రీ మాత్రే నమః🙏🙏:
త్రిపుర సుందరి దేవి ఆలయం-- ఉదయపూర్-- త్రిపుర..
త్రిపుర రాష్ట్రంలోని అగర్తల రాజధానికి 55 కి:మీ దూరంలో గల త్రిపుర సుందరీదేవి ఆలయం ఎంతో ప్రశస్తమైంది. ఈ ఆలయం 500 సం:ల క్రితంనాటిది. ఎప్పటినుంచో పూజలందుకుంటున్న ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు తెలుగువారు దర్శించుకుంటూ వుంటారు. ఈ ఆలయం కూర్మ (తాబేలు) రూపంలో ఉంటుంది. దీనిని "కూర్మపీఠం" అని కూడా అంటారు. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో, చాలా ఆహ్లాదంగా, సహజసిద్ధమైన ప్రకృతి వాతావరణంలో ఉంటుంది. ఈ ఆలయం ఎదురుగా కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో తాబేళ్లు (కూర్మం) చేపలు (మత్స్యం) ఉంటాయి. వీటిని ఎవరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు కోనేరులో స్నానంచేసి, కోనేరులో ఉన్న తాబేళ్ళకి, చేపలకి ఆహారం వేసి, (పేలాలు… మొద:) దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయం మొత్తం సింధూర వర్ణంతో ఉంటుంది. ఆలయానికి ఒకపక్క, ఆలయానికి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. మరొక ప్రక్క శివుడు, పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ స్వయంగా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. చిన్న ఊరు అయినా దేవాలయ ప్రాంగణంలో మహిళలు ఉపాధి కోసం సహాయ సంఘాలుగా ఏర్పడి, పూజా ద్రవ్యాలకి సంబంధించిన దుకాణాలను నడుపుతున్నారు. ఇక్కడ అమ్మవారికి ఎర్ర మందారాలు తోటి, బిల్వపత్రాలతోటి మాలకట్టి అమ్మవారి అలంకరణ చేస్తారు. నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైన పేడా (పాలకోవా) సమర్పిస్తారు. అమ్మవారి దేవాలయాల్లో 51 శక్తి పీఠాలు ఉన్నాయి. శక్తి పీఠాలు అనగానే అష్టాదశ (18) శక్తిపీఠాలు గుర్తుకొస్తాయి. పురాణాల ప్రకారం 51 శక్తి పీఠాలుగా చెప్తారు. ఈ ఆలయం చిట్టచివరి (51వ) శక్తిపీఠంగా చెప్పవచ్చు. అమ్మవారి "కుడికాలు" పడిన ప్రదేశంగా చెప్తూ ఉంటారు. దేవాలయ గర్భాలయంలో చిన్నద్వారం నుంచి అమ్మవారు మందార, బిల్వపత్రాల మాల అలంకరణతో, ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది. పక్కనే చిన్న అమ్మవారిని ("చోటా మా") చూడవచ్చు. అమ్మని చూడగానే మనసంతా ఆనందంతో నిండిపోయి, మన కోసమే వేచి చూస్తుందా! అన్న భావన కలుగుతుంది. ఈ అమ్మవారి సమక్షంలో జప, తప, హోమాదులు, రుద్ర పునఃశ్చరణ, దేవీ సప్తశతి పారాయణం, దేవీ ఖడ్గమాలా స్తోత్రం, మహిషాసుర మర్దిని స్తోత్రం పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు, బాలా మంత్రం చేసేవాళ్ళు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. పూర్వం ఈ ప్రాంతం బంగ్లాదేశ్ కి దగ్గరగా ఉంటుంది. ఈ అమ్మవారి పేరుతోనే, త్రిపుర రాష్ట్రం ఏర్పడింది అనడంలో సందేహంలేదు. ఈ అమ్మవారిని "త్రిపుర సుందరి, త్రిపుర భైరవి" అని పిలుస్తారు. "మాతా బరీ టెంపుల్" అని ఆ రాష్ట్ర ప్రజలు పిలుచుకుంటారు. ఈ ఆలయాన్ని దర్శించు కోవాలంటే అదృష్టమే కాదు!! పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి.. అన్నిటినీ మించి అమ్మ దయ ఉండాలి...

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS