Sunday, May 16, 2021

ఆదిశంకరాచార్య చరిత్ర జగద్గురు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర

జగద్గురు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర

.
       *ఆదిశంకరుల వారు జన్మించిన పుణ్యదినం వైశాఖ శుద్ధ పంచమి. జగద్గురువు అనే మాటకి సంపూర్ణంగా తగినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. శంకరులను గ్రహించాలి అంటే ఒక నిర్మలమైన అంతఃకరణం ఉండాలి. వ్యాసుని అవతారం తర్వాత మళ్ళీ అంతటి అవతారం శంకరావతారమే. ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగ మానవులకి జ్ఞానం అందించాలని చెప్పి వ్యాసుడు తాపత్రయ పడి వేదములను విభజన చేసే వేదాంత శాస్త్రమైన బ్రహ్మసూత్రాలను రచించి అటుతర్వాత అష్టాదశపురాణాలు అందించి మహాభారత ఇతిహాసాన్నిచ్చి తద్వారా భగవద్గీత, సనత్ సుజాతీయం మొదలైన బ్రహ్మవిద్యాగ్రంథాలను రచించి ఒక వ్యవస్థను చేశారు* *వ్యాసభగవానులు. కానీ కలిప్రభావం చేత ఉన్న వైదికమతం యొక్క హృదయాన్ని అర్థంచేసుకోలేక అందులో రకరకాల చీలికలు వచ్చి వైవిధ్యాన్ని వైరుధ్యం అనుకునే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. అనేక అవైదికమతాలు పుట్టుకు వచ్చి ఆస్తికత అల్లల్లాడిపోతున్న రోజులవి. ధార్మికత దెబ్బతిన్న రోజులవి, తాత్త్వికత సన్నగిల్లుతున్న రోజులవి. సనాతనధర్మం*
*క్షీణదశకు వచ్చిన సమయంలో అవతరించిన సాక్షాత్ శంకరులే శంకరాచార్యుల వారు*.
*ఏకమేవ అద్వితీయం బ్రహ్మ’ – సృష్టిలో బ్రహ్మ తప్ప అన్యమేదీ లేదనీ, ‘సర్వం ఈశావాస్యం’-* *సకలచరాచరసృష్టి  ఒకే దివ్య చైతన్యంతో నిండి నిబిడీకృతమై ఉన్నదనీ; భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి, బ్రహ్మ* *విద్యాసంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించిన వివేకరత్నం – ఆది శంకరాచార్యులు*. 
*ధర్మజిజ్ఞాసను, బ్రహ్మజిజ్ఞాసతో అనుసంధానం చేశారు. వేదప్రతిపాదిత ‘అద్వైత’తత్త్వం ప్రబోధించారు. జాతీయసమైక్యాన్ని పునరుద్ధరించి సనాతనధర్మరక్షణకోసం జగద్గురుపీఠాలను నెలకొల్పారు*.

*ఆది శంకరాచార్యుల వైభవం* :-

*ఆది శంకరాచార్యులు 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టేలోపు చేసిన స్తోత్రాలు-రచనలు,-భాష్యాల వివరాలు*.

*గణపతి స్తోత్రాలు*:
గణేశ భుజంగస్తోత్రం
గణేశ పంచరత్నస్తోత్రం
వరద గణేశస్తోత్రం
గణేశాష్టకం

*సుబ్రహమణ్యస్తోత్రాలు*:
సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రం

*శివస్తోత్రాలు*:
అర్థనాదీశ్వరస్తోత్రం
దశశ్లోకిస్తుతి
దక్షిణామూర్తిస్తోత్రం
దక్షిణామూర్తి అష్టకం
దక్షిణామూర్తి వర్ణమాలాస్తోత్రం
ద్వాదశలింగస్తోత్రం
కాలభైరవ అష్టకం
శ్రీ మృత్యుంజయ మానసికపూజాస్తోత్రం
శివ అపరాధక్షమాపణస్తోత్రం
శివానందలహరి
శివ భుజంగస్తోత్రం
శివ కేశాది పదాంత వర్ణన స్తోత్రం
శివ మానసపూజ
శివ నామావళి అష్టకం
శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రం
శివ పంచాక్షరస్తోత్రం
శివ పంచాక్షరనక్షత్రమాల
సువర్ణ మాలాస్తుతి
ఉమామహేశ్వరస్తోత్రం
వేదసార శివస్తోత్రం
శివాష్టకం

*అమ్మవారి స్తోత్రాలు* :
అన్నపూర్ణ అష్టకం
ఆనందలహరి
అన్నపూర్ణాస్తోత్రం
అన్నపూర్ణాస్తుతి
అంబాష్టకం
అంబాపంచరత్నం
భగవతి మానసపూజ
భవానీ అష్టకం
భవానీ భుజంగం
భ్రమరాంబా అష్టకం
దేవీభుజంగ స్తోత్రం
దేవి చతుశ్శస్త్య ఉపచార పూజ
దేవీపంచరత్నం
దేవీ అపరాధ క్షమాపణాస్తోత్రం
దేవీ అపరాధ భజనస్తోత్రం
గౌరీదశకం
హరగౌరీ అష్టకం
కాళీ అపరాధ భజనస్తోత్రం
కామ భుజంగ ప్రయాత
కామబింబ అష్టకం
కనకధారాస్తోత్రం
శ్రీలలితాపంచరత్నం
మంత్రముత్రిక పుష్పమాలాస్తవం
మాతృకా పుష్పమాలాస్తుతి
మీనాక్షీస్తోత్రం
మీనాక్షీపంచరత్నం
నవరత్నమాలిక
రాజరాజేశ్వరీ అష్టకం
శారదా భుజంగప్రయాత అష్టకం
సౌందర్యలహరి
శ్యామలా నవరత్నమాలికాస్తోత్రం
త్రిపురసుందరీ అష్టకం
త్రిపురసుందరీ మానసపూజాస్తోత్రం
త్రిపురసుందరీ వేదపదస్తోత్రం

*విష్ణు స్తోత్రాలు* :
అచ్యుతాష్టకం
భగవాన్ మానసపూజ
భజగోవిందం
హరిమీడేస్తోత్రం
హరి నామావళిస్తోత్రం
హరిశరణాష్టకం
శ్రీ విష్ణు భుజంగ ప్రయాతస్తోత్రం
జగన్నాథాష్టకం
కృష్ణాష్టకం
లక్ష్మీనృసింహ పంచరత్నం
నారాయణ స్తోత్రం
పాండురంగాష్టకం
రామ భుజంగ ప్రయాతస్తోత్రం
రంగనాథాష్టకం
లక్ష్మీనృసింహ కరుణారసస్తోత్రం
లక్ష్మీనృసింహ కరావలమ్బస్తోత్రం
షట్పదీస్తోత్రం
విష్ణుపాదాదికేశాంతస్తోత్రం

*హనుమాన్ స్తోత్రాలు*
హనుమత్ పంచరత్నం

*ఇతర స్తోత్రాలు*:
మాతృపంచకం
కౌపీనపంచకం
కళ్యాణవృష్టి
నవరత్నమాలిక
పుష్కరాష్టకం
మోహముద్గర స్తోత్రం

*క్షేత్ర స్తోత్రాలు*:
కాశీపంచకం
కాశీస్తోత్రం
మణికర్ణికాష్టకం
ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం

*నదీస్తోత్రాలు*:
గంగాష్టకం
గంగాస్తోత్రం
నర్మదాష్టకం
యమునాష్టకం

*ప్రకరణ గ్రంథాలు*:
అద్వైత అనుభూతి
అజ్ఞాన భోదిని
అమరు శతకం
అనాత్మశ్రీ వికర్హన×
అపరోక్షానుభుతి
ఆత్మ-అనాత్మ వివేకం
ఆత్మబోధం
ఆత్మజ్ఞాన ఉపదేసనవిధి
దృక్ దర్శన వివేకం
ఆత్మపంచకం
అత్మశతకమ్
అద్వైతపంచకం
అత్మపూజ-పరపూజ
బాలబోధ సంగ్రహం
భోధసారం
అత్మచింతన
బ్రహ్మచింతన
బ్రాహ్మణావలిమాల
ధ్యానాష్టకం
జ్ఞానగంగాష్టకం
గురు అష్టకం
జీవన ముక్త్యానందలహరి
యతి పంచకం
మణిరత్నమాల
మానిషాపంచకం
మాయాపంచకం
మతామ్నాయ
నిర్గుణ మానసపూజ
నిర్వాణ దశకం/సిద్ధాంత బిందు
నిర్వాణమంజరి
నిర్వాణశతకం/ఆత్మశతకం
పంచీకరణం
ప్రభోద సుధాకరం
ప్రశ్నోత్తర రత్నమాలిక
ప్రపంచసార తంత్రం
ప్రాతః స్మరణస్తోత్రం
ప్రౌడానుభుతి
సదాచార సంతానం
సాధనాపంచకం/ఉపదేశపంచకం
శంకరస్మృతి
సన్యాసపథ్థతి
సారతత్వ ఉపదేశం
సర్పత పంచారిక
సర్వసిద్ధాంత సంగ్రహం
సర్వవేదాంతసిద్ధాంతసారసంగ్రహం
స్వాత్మనిరూపణం
స్వాత్మప్రకాశికం
స్వరూపానుసంతానాష్టకం
తత్త్వబోధం
తత్త్వ ఉపదేశం
ఉపదేశసాహస్రి
వాక్యసిత
వాక్యవృతి
వేదాంతకేసరి
వేదాంతశతశ్లోకి
వివేకచూడామణి
ఏకశ్లోకి
యోగతారావళి

*భాష్యగ్రంథాలు* :
విష్ణుసహస్రనామభాష్యం
లలితాత్రిశతిభాష్యం
యోగసూత్రభాష్యం
భగవద్గీతాభాష్యం
ఉపనిషద్భాష్యం
బ్రహ్మసూత్ర భాష్యం

*ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. అవి*.

1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. ఆభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడినీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకలతీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకలపవిత్రతీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణదుకూలపరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపనమంటపప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతుకుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం.
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్రశకలం పెట్టడం
20. సీమంతంలో సిందూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టుపెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంపస్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకు నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడువరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవీతం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూరయుగళభూషణచతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయూరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగుచేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగుచేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పిలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదాంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షుచాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణిమాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకారాలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాసహాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపములగుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం సమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీపదర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము..

       *ఆదిశంకరాచార్య చరిత్ర*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS