Friday, May 31, 2024

ఆంజనేయ సర్వస్వం

🌹           *ఆంజనేయ సర్వస్వం*   

       🌹

🚩 ఆంజనేయుడి తల్లి పేరు అంజనాదేవి

🚩 ఆంజనేయుడి తండ్రి పేరు కేసరి

🚩 ఆంజనేయుడి జన్మ తిథి వైశాఖ బహుళ దశమి

🚩 ఆంజనేయుడు ఈశ్వరాంశతో పుట్టాడు

🚩 ఆంజనేయుడు వాయుదేవుని వరం వలన పుట్టాడు

🚩 ఆంజనేయుడి జనన కారకులు శివ పార్వతులు, అగ్ని, వాయువులు

🚩 ఆంజనేయుడి గురువు సూర్య భగవానుడు

🚩 ఆంజనేయుడిని శపించినవారు భృగు శిష్యులు

🚩 ఆంజనేయుడినికి గల శాపం తనశక్తి తనకు తెలియకుండా ఉండడం

🚩 ఆంజనేయుడి శాప పరిహారం స్తుతించినా, నిందించినా తన శక్తి తను గ్రహించుట.

🚩 ఆంజనేయుడు నిర్వహించిన పదవి సుగ్రీవుని మంత్రి

🚩 ఆంజనేయుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం పంపానదీ తీరం

🚩 ఆంజనేయుడు వాలిని సంహరింపని కారణం యేందిరా అంటే - తల్లిఅజ్ఞ

🚩 ఆంజనేయుడి సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం శ్రీ పరాశరసంహితం

🚩 సీతాదేవిని నెతుకుటకు ఆంజనేయుని దక్షిణ దిక్కుకు తోలినారు

🚩 ఆంజనేయుడి ఆదేశంతో వానరులు ప్రవేశించిన బిలం స్వయంప్రభది.

🚩 సముద్ర లంఘనం కోసం ఆంజనేయుడు ఎక్కిన పర్వతం మహేంద్రపర్వతం

🚩 ఆంజనేయుడు దాటిన సముద్ర విస్తీర్ణము 100 యోజనములు

🚩 ఆంజనేయుడికి అడ్డు వచ్చిన పర్వతం మైనాకుడు

🚩 ఆంజనేయుడికి  ఆతిథ్యం ఇవ్వాలని సముద్రుడు తలచినాడు 

🚩 మైనాకుని ఆంజనేయుడు రొమ్ముతో తాకాడు

🚩 ఆంజనేయుడు మైనాకుడిని చేతితో స్పృశించి అనుగ్రహించాడు

🚩 ఆంజనేయుడికి ఏర్పడిన 2 వ విఘ్నం సురస

🚩 సురస నాగజాతి జాతి స్త్రీ

🚩 ఆంజనేయుడి శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు దేవతలు సురసను  తోలినారు
 
🚩 ఆంజనేయుడికి ఏర్పడిన 3 వ విఘ్నం సింహిక

🚩 సింహిక ఆంజనేయుని నీడ పట్టి ఇగ్గినాది

🚩 లంకను కాపాడడం సింహిక వృత్తి 

🚩 ఆంజనేయుడు లంకలో సువేల పర్వత ప్రాంతంలో వ్రాలినాడు

🚩 ఆంజనేయుడు వెళ్లిన పర్వతం పేరు త్రికూటాచలం

🚩 ఆంజనేయుడు లంకలోకి పిల్లిపిల్ల అంత రూపంలో దూరినాడు

🚩 లంక ప్రవేశద్వారం కాడ లంకిణి ఆంజనేయుని అడ్డగించినది

🚩 లంకిణిని ఆంజనేయుడు ఎడమ చేతిపిడికిలితో కొట్టాడు 

🚩 ఆంజనేయుడు లంకలోకి ప్రాకారందూకి  ప్రవేశించాడు 

🚩 శతృపురంలోకి *ఎడమ కాలు ముందు పెట్టి ప్రవేశించటం* అనే శాస్త్ర నియమం ఆంజనేయుడు పాలించినాడు

🚩 మండోదరిని చూసి ఆంజనేయుడు సీతమ్మగా భ్రమించాడు

🚩 ఆంజనేయుడు ప్రవేశించిన వనం అశోకవనం

🚩 ఆంజనేయుడు అందించిన అద్భుత సందేశం యేందిరా అంటే *జీవనృద్రాణిపశ్యతి* (బ్రతికి ఉండిన కార్యములు సాధించవచ్చును)

🚩 ఆంజనేయుడు సీతమ్మను శింశుపా వృక్షము క్రింద చూచాడు

🚩 సీతమ్మకు ఆంజనేయుడు రాముడి ఉంగరం ఆనవాలుగా ఇచ్చాడు

🚩 సీతమ్మ ఆంజనేయునికి చూడామణిని తన ఆనవాలుగా ఇచ్చింది

🚩 ఆంజనేయుడు అశోకవనం ద్వంసం అనంతరం జంబుమాలిని చంపాడు

🚩 ఆంజనేయుడి చేతిలో రావణ సుతుడు అక్షయ కుమారుడు మరణించినాడు 

🚩 ఆంజనేయుడు సముద్రం తిరిగి దాటడానికి అరిష్ట పర్వతం ఆధారం చేసుకున్నాడు 

🚩 ఆంజనేయుడు సముద్రం దాటడానికి 30 ఘడియలు సమయం పట్టింది ?

🚩 *జయము జయము వీరాంజనేయులు* 🚩

హనుమాన్ సర్వస్వం

*🌹హనుమాన్ సర్వస్వం🌹*


*పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం  ప్రశ్నలు జవాబులు.* 

🚩1) శ్రీ హనుమంతుని తల్లి పేరు?
జవాబు : అంజనా దేవి !
🚩2) హనుమంతుని తండ్రి పేరు?
జవాబు : కేసరి !
🚩3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : కశ్యపుడు !
🚩4) అంజన పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : సాధ్య !
🚩5) హనుమంతుని జన్మ తిథి ఏది?
జవాబు : వైశాఖ బహుళ దశమి!

🚩 6) హనుమంతుని జన్మ స్థలం ఏది?
జవాబు : తిరుమల  - అంజనాద్రి.
🚩7) హనుమంతుని నక్షత్రము ?
జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము.
🚩8) హనుమంతుని జనన లగ్నం  ?
జవాబు : కర్కాటక.
🚩9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?
జవాబు : వైదృవీయోగం లో 
🚩10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?
జవాబు : ఈశ్వరాంశ 

🚩11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?
జవాబు : వాయుదేవుని వరం వలన.
🚩12)హనుమ జనన కారకులు ?
జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు.
🚩13) హనుమంతుని గురువు ?
 జవాబు : సూర్య భగవానుడు.
🚩14) హనుమంతుని శపించిన వారు ?
 జవాబు : భృగుశిష్యులు.
🚩15) హనుమంతునికి గల శాపం ?
 జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం.

🚩16) హనుమంతుని శాప పరిహారం ?
 జవాబు : స్తుతించినా,
నిందించినా తన శక్తి తను గ్రహించుట.
🚩17) హనుమంతుని బార్య ?
 జవాబు : సువర్చలా దేవి.

🚩18) సువర్చాలా దేవి మాతామహుడు ?
జవాబు : విశ్వకర్మ.

🚩19) హనుమంతుని మాతామహుడు ?
 జవాబు : కుంజరుడు.

🚩20)సువర్చల తల్లి పేరు ?
 జవాబు : సంజాదేవి, ఛాయాదేవి.

🚩21) హనుమంతుని బావమరుదులు ?
 జ : అశ్వనీ దేవతలు, శని,యముడు.

🚩22) హనుమంతుని వివాహ తేదీ ?
 జ : జేష్ఠ శుద్ధ దశమి.

🚩23) హనుమంతుని తాత, అమ్మమ్మ ?
 జ : గౌతముడు , అహల్య.

🚩24) హనుమంతుని మేన మామలు ?
 జ : శతానందుడు, వాలి, సుగ్రీవులు.

🚩25)హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది ?
 జ : సుగ్రీవుని మంత్రి.

🚩26) హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ?
 జ : ఋష్యమూక పర్వతం.

🚩27) శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు ?
 జ : భిక్షుక రూపం.

🚩28) హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది ?
 జ : పంపానదీ తీరం .

🚩29)హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు ?
 జ : శ్రీరాముడు.

🚩30)హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు ?
 జ : శ్రీరామ సుగ్రీవులకు.

🚩31)హనుమంతుడు వాలిని సంహరింపని కారణం?
జ : తల్లి అజ్ఞ.

🚩32)హనుమంతుడు లక్ష్మణుని కి ఆసనంగా వేసినది ?
 జ : చందన వృక్ష శాఖ.

🚩33)హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ?
 జ : శ్రీ పరాశర సంహిత.

🚩34)హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు ?
 జ : తార, రమ.

🚩35) చైత్ర మాసంలో హనుమత్ పర్వదినం ?
 జ : పుష్యమి నక్షత్రం గల రోజు.

🚩36) సీతా దేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కుకు పంపారు.?
 జ : దక్షిణ దిక్కు.

🚩37)వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ?
 జ : ఆశ్లేష నక్షత్రం.

🚩38) హనుమంతుడి ఆదేశం తో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది ?
 జ : స్వయంప్రభది.

🚩39) ప్రాయోప ప్రవేశ యత్నం లో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి ?
 జ : సంపాతి.

🚩40) సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ?
 జ : మహేంద్ర పర్వతం.

🚩41)హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము ?
 జ : 100 యోజనాలు.

🚩42)హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం ?
 జ : మైనాకుడు.

🚩43)హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు ?
 జ : సముద్రుడు.

🚩44) మైనాకుని హనుమంతుడు ఎం చేశాడు?
 జ : రొమ్ము తో తాకాడు.

🚩45) మైనాకుడు హనుమంతుడిని ఎల అనుగ్రహించాడు.?
 జ : చేతితో స్పృశించి.

🚩46)హనుమంతుని కి ఏర్పడిన 2 వ విఘ్నం ?
 జ : సురస.

🚩47) సురస ఏ జాతి స్త్రీ ?
 జ : నాగజాతి.

🚩48) సురస నుండి హనుమంతుడు ఏలా తప్పించుకున్నాడు.?
 జ : ఉపాయంతో.

🚩49) సురసను పంపిన దెవరు ?
 జ : దేవతలు.

🚩50) సురసను దేవతలు ఎందుకు పంపారు ?
 జ : హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు .

🚩51) హనుమంతునికి ఏర్పడిన 3 వ విఘ్నం ?
 జ : సింహిక.

🚩52) సింహిక హనుమంతుని ఎం చేసింది ?
 జ : నీడ పట్టి లాగింది.

🚩53) సింహిక వృత్తి ఎమిటి ?
 జ : లంకను కాపాడడం.

🚩54) హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది ?
 జ : శ్రీ పరాశర మహర్షి చే.

🚩55) హనుమంతుడు లంక లో ఏ ప్రాంతంలో వాలాడు.?
జ : సువేల పర్వత ప్రాంతం లో.

🚩56) హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు ?
 జ : త్రికూటాచలం.

🚩57) సువేల పై హనుమంతుడు ఎందుకు అగాడు ?
 జ : సూర్యాస్తమయం కోసం.

🚩58) లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు?
 జ : పిల్లి పిల్ల అంత వాడు అయ్యి.

🚩59) లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు ?
 జ :లంకిణి

🚩60)  లంకిణిని హనుమంతుడు ఎల కొట్టాడు ?
 జ : ఎడమ చేతి పిడికిలి తో.

🚩61) లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ?
 జ : ప్రాకారం దూకి.

🚩62) శతృపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఎమిటి ?
 జ : ఎడమ కాలు ముందు పెట్టీ పోవడం.

🚩63) ఎవరిని చూసి హనుమంతుడు సీతగా బ్రమించాడు ?
 జ : మండోదరిని.

🚩64)హనుమంతుడు ప్రవేశించిన వనం ?
 జ : అశోక వనం.

🚩65) అశోక వనం ఏ పర్వతం పైన ఉన్నది ?
 జ : సుందర పర్వతం.

🚩66)లంకా నగరం ఏ పర్వతం పై ఉన్నది ?
 జ : నీల పర్వతం.

🚩67)శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షి చే ఎవరికి చెప్పబడింది ?
 జ : మైత్రేయ మహర్షి కి.

🚩68)హనుమంతుడు అందించిన అద్భుత సందేశం ?
 జ : జీవనృద్రాణిపశ్యతి. -(బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు)

🚩69) సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు ?
 జ : శింశుపా వృక్షము.

🚩70) సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు ?
 జ : రాముడి ఉంగరం.

🚩71) హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఎమి ఇచ్చింది ?
 జ : చూడామణీ.

🚩72)హనుమంతుడు అశోక వనం ద్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు ?
 జ : జంబుమాలిని.

🚩73) హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు ?
 జ : అక్షయ కుమారుడు.

🚩74)హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు ?
 జ : ఇంద్రజిత్తు నకు.

🚩75) హనుమంతుని రావణ దర్భారు లో ఎవరు ప్రశ్నించారు. ?
 జ : ప్రహస్తుడు .

🚩76) సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం ?
 జ : అరిష్ట పర్వతం.

🚩77) సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది ?
 జ : 30 ఘడియలు.

.              *🚩జై శ్రీరామ్🚩*

              *_🌻శుభమస్తు🌻_*
                             ఇట్లు
                              మీ
              అవధానుల శ్రీనివాస శాస్త్రి 
               ❀┉┅━❀🕉️❀┉┅━❀
          🙏 సర్వే జనాః సుఖినోభవంతు
         🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
        🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

Thursday, May 30, 2024

కర్మ- భోగము

*హరేకృష్ణ.....*


*కర్మ- భోగము*

*మనకు పూర్వ జన్మ కర్మల వలననే ఈ జన్మలో, తల్లి, తండ్రి, అన్న, అక్క, భార్య, భర్త, ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు, శత్రువులు మిగతా సంభంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి. ఎందుకంటే మనం వీళ్లకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును.*

*అసలు "మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు"*

*మనకు "పూర్వ జన్మలో సంబంధం వున్న వాళ్ళే" ఈజన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు, అవి మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు...*

1. *ఋణానుబంధం:- గత జన్మలో మనం ఎవరి వడ్డయినా రుణం తీసుకుని వుండచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండచ్చు. అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపం లో వచ్చి మీ వద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యేవరకు మనతోనే వుంటారు.*

2. *శత్రువులు - పుత్రులు:-                              మన పూర్వ జన్మలో శత్రువులు మన పై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపం లో తిరిగి పుడతారు, అలా పుట్టితల్లి తండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, నానా గొడవలూ చేస్తారు. జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే వుంటారు. ఎల్లప్పుడును తల్లితండ్రులను నా నా యాతనా పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితునలు చేస్తూ ఆనందపడుతూంటారు.*

3. *తటస్థ పుత్రులు :- వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు.. మరో వైపుసుఖంగా కూడా వుంచరు, వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు. వాళ్ళ వివాహానంతరం తల్లి తండ్రులకు దూరంగా జరిగి పోతారు.*

4. *సేవా తత్పరత వున్న పుత్రులు:- గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవచేసి వుండవచ్చును, ఆ రుణాన్ని తీర్చుకోవటానికి కొడుకు లేదా కుతూరు రూపంలో ఈ జన్మలో వస్తారు. అలా వచ్చి బాగా సేవను చేస్తారు. మీరు గతం లో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది, మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే, ఈ జన్మలో మన ముదుసలి తనం లో మనకు సేవ చేస్తారు. లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసే వారుకూడా మనవద్ద వుండరు.*

*ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది అని అనుకోవద్దు. ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్టవచ్చును. ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును, వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును. ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్యాకుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా కూతురు గా మీ ఇంట పుడతారు, లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీ తో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు.*

*అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్యవద్దు. ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం ఎక్కువ చేసి అనుభవంలోకి తెస్తుంది. మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతా లో నూరు రూపాయలు గా జమ చెయ్య బడతాయి. ఒకవేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాత నుంచి నూరు రూపాయలు తీసివేయబడతాయి.(అనగా పాప పుణ్యాలు)*

*కొద్దిగా ఆలోచించండి " మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు, మళ్లి ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు ? ఇప్పటివరకు పొయినవాళ్లు ఎంత బంగారం, వెండి పట్టికుపోయారు? మీరు పోయె ముందు మీ బ్యాంకు లో ఉన్న నగా, నట్ర, డబ్బు మూలుగుతుందో అదిపూర్తిగా పనికి రాని సంపాదన కదా. ఒకవేళ మీ మీ సంతానం సమర్థులైతే మీరు వదిలిన డబ్బు దస్కం వాళ్లకు అనవసర వస్తువు కదా, వాటి అవసరం వాళ్లకు లేదు కదా, వొక వేళ వాళ్ళు ఆ డబ్బు దస్కం వాడుకున్నట్లయితే వాళ్ళు ఎందుకూ కొరగాని వాళ్ళుగా, చేతకాని వాళ్ళుగా అయిపోతారు. కదా, వాళ్ళు సదరు డబ్బు, నగా నట్రా వాడుకుని కొద్ది రోజుల్లోనే వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుని తీరుతారు. ఆ తర్వాతే వాళ్లకు శాంతి లభిస్తుంది.*

*నేను, నాది, మీది అన్నది అంతా ఇక్కడికి ఇక్కడే పనికి రాకుండా పోతుంది. ఏది కూడా మన వెంట రాదు. ఒకవేళ మీ వెంటవస్తే గిస్తే మీ పుణ్య ఫలం వెంట వస్తుంది. కావున ఎంత వీలయితే అంత "మంచికర్మలు" చెయ్యండి. హరేకృష్ణ*.          🙏🌹🌴🪔🌴🌹🙏

Wednesday, May 29, 2024

కర్పూర హారతి కాకుండా దీపహారతి ఇచ్చే సంప్రదాయం కూడా మనకు ఉంది.

🌹🌺🌸🥀🌾🌷💐

*దీపాలతో హారతి ఇవ్వవచ్చా?*


*కర్పూర హారతి కాకుండా దీపహారతి ఇచ్చే సంప్రదాయం కూడా మనకు ఉంది.*

*ఆవునేతిలో తడిపిన వత్తిని వెలిగించి హారతిస్తారు ఇందుకోసం రెండు, మూడు ఐదు, ఏడు ఇలా బేసి సంఖ్యలలో దీపాలు వెలిగిస్తారు.*

*అత్యధికంగా నక్షత్ర హారతి అంటే ఇరవై ఏడు ఒత్తులతో హారతినిస్తారు. అయిదు కంటే ఎక్కువ దీపహారతులను సాధారణంగా ఆలయాల్లోనూ, నదీహారతుల్లోనూ మాత్రమే ఇస్తారు.*

*హారతి పళ్లేలను రూపొందించిన విధానాన్ని బట్టి ఆయా పేర్లతో పిలుస్తారు.*

*నాగదీపం, రథదీపం, పురుషదీపం, మేరు దీపం, పంచబ్రహ్మదీపం, గజ దీపం, వృషభ దీపం, కుంభ హారతి, నేత్ర హారతి, బిల్వహారతి, రుద్ర, చక్ర, నారాయణ నవగ్రహ హారతుల వంటివి ఎన్నో ఉన్నాయి.

*హారతుల్లో రకరకాలున్నాయి. వత్తుల సంఖ్యను బట్టి హారతులకు పేర్లున్నాయి.*

*నంది హారతి - 3*
*సింహహారతి - 3*
*పంచహారతి - 5*
*నాగహారతి - 5*
*నేత్రహారతి - 2వత్తులు*
*బిల్వ హారతి - 3* 
*కుంభహారతి - 3*
*రుద్రహారతి - 11*
*నారాయణ హారతి - 16*
*చంద్రహారతి 16*
*నక్షత్ర హారతి - 27* 
*వృక్ష హారతి 32*
*రథహారతి -632*

*హారతి ఉత్సవాలలో, ఆలయాలలో ఒత్తులతో దీపహారతి ఇచ్చినప్పటికీ చిట్టచివరిగా అఖండ కర్పూర హారతికూడా తప్పనిసరిగా ఇస్తారు*

Tuesday, May 28, 2024

అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు.* *ఈ రెండూ ఉండి తీరాలి.

*ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు.*


*ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు.*

*ఆ కొడుకు వేదం నేర్చు కున్నాడు.*

*ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు.*

*ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు.*

*గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు.*

*ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు.*

*అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.*
*నీవు ఈ ఆవులను కొట్టవద్దు.*
*తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.*

*బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.*

*ఈ పిల్లవాడు వేదమంత్రము లను చదువు కుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడు తుండేవాడు.*

*వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి.*

*ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు.*

*ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి.*

*రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి.*

*ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెటన పాలతో శివాభిషేకము చేయదలచాడు.*

*రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు.*

*అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం.*

*రుద్రాధ్యాయం అంత గొప్పది.*

*అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి.*

*అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.*

*ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు.*

*‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు.*

*ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు.*

*చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు.*

*పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ.*
*అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు.*

*కాసేపయింది.*

*కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు.*

*ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి.*

*ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారము లతో శివాలయ నిర్మాణం చేశాడు.*

*తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు.*

*ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది.*

*అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.*

*అవును అతడు చెప్పింది నిజమే.*

*వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు.*

*ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు.*

*అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు.*

*కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు.*

*అది ఛిన్నాభిన్నమయింది.*

*అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.*

*తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు.*

*ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు.*

*ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు.*

*తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి.*

*క్రిందపడిపోయాడు.*

*నెత్తుటి ధారలు కారిపోతున్నాయి.*

*కొడుకు చూశాడు.*

*‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించ వలసిందే’ అన్నాడు.*

*నెత్తురు కారి తండ్రి మరణించాడు.*

*ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నా భిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు.*

*నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు.*

*అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు.*

*మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను.*

*ఇవాల్టి నుండి నీవు మా కుటుంబం లో అయిదవ వాడవు.*

*నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు.*

*అయిదవ స్థానం చండీశ్వరుడి దే.*
*నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.*

*ఇకనుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు.*

*భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది.*

*దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు.*

*భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది.*

*అది పత్నీభాగం.*

*కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి.*

*పార్వతీ నేను ఈవేళ చండీ శ్వరుడికి ఒక వరం ఇచ్చే స్తున్నాను.*

*నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.*

*ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు.*

*చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు.*

*ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు.*

*ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు.*

*ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది.*

*అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు.*

*మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు.*

*ప్రసాద తిరస్కారం మహాదోషం.*

*అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు.*

*శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి.*

*అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు.*

*చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు.*

*ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు.*

*ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణా ధికారం ఉంటుంది.*

*దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.*

*లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది.*

*అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది.*

*మీకు ఇచ్చినది ప్రసాద రూపము.*

*దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు.*

*అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలి పెట్టేయ్యకూడదు.*

*నంది మీద పెట్టడం కాదు.*

*చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు.*

చండీశ్వర వృత్తంతం

*చిటిక చిన్నగా మాత్రమే వేయాలి.*

*అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు.*

*ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు.*

*చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో.*

*పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు.*

*పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు.*

*ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము.*

*మన భాగ్యమే భాగ్యం.*

*అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు.*

*ఈ రెండూ ఉండి తీరాలి.

Monday, May 27, 2024

పంచముడైన ఛోఖా మేళా పాండురంగనికి అతి ప్రియమైనవాడు .

చోఖా మేళా .
సాయిబాబా చాందపాటిల్ పెళ్లి బృందంతో షిరిడీకి వచ్చినప్పుడు ఖండోబా మందిరమందిరములోకి అడుగుపెట్టబోతే ఆ మందిర పూజారి 
మహల్సాపతి అడ్డుకోబోయాడు .
అప్పుడు బాబా కోపం తెచ్చుకోకుండా 
"నీ అభిమతాన్ని అనుసరించి నేను 
దూరంనుండే దైవ దర్శనం చేసుకుంటాలే ! దానికి నీకు అభ్యంతరం లేదనుకుంటాను .మీ పురాణాలలో ఒక కధ ఉన్నది .
పంచముడైన ఛోఖా మేళా పాండురంగనికి అతి ప్రియమైనవాడు .
పాండురంగని వద్ద పూజ చేసే పురోహితులకంటే వందరెట్లు శ్రేష్ఠుడు .
శ్రీహరి ద్వారానికి చేరుటకు శ్రద్ధతో 
ప్రయత్నించేవారు తప్ప మిగిలినవారందరూ పంచములే !
ఎవరి ఆంతర్యం పరిశుద్ధంగా ఉంటుందో 
వారు సర్వత్రా పరిశుద్ధులే ! అని బాబా 
మహాల్సాపతితో అన్నారు .
మహారాష్ట్రలో ఛోఖా మేళా గురించి 
తెలియని వారుండరు .అతడు పాండురంగ భక్తుడు .ఆతనిని ఆలయ పూజారులు పండరీ ఆలయం లోపలికి 
రానివ్వలేదు .కానీ అంతటా పాండు రంగని చూసి మైమరచిపోయే భక్తుడు .

Saturday, May 25, 2024

సత్సంగం అంటే ఏమిటి?




*శ్రీ గురుభ్యోనమః*
🙏💐🙏💐🙏

*సత్సంగం అంటే ఏమిటి?*


*సత్ + సంగము = సత్సంగము*
*సంగము అంటే కలయిక, స్నేహము...*
*సత్ అంటే సత్యమైనది, నిత్యమైనది, చావు పుట్టుకలు లేనిది, ఆది, అంతాలలో కూడా నిలిచి ఉండేది, ఏ రూపమూ లేని, అన్ని రూపాలూ తానే అయి ఉన్నది, విశ్వం అంతటా వ్యాపించి ఉన్నది, అన్నింటిలోనూ, అందరిలోనూ ప్రాణశక్తిగా వెలుగుతున్నది ఏదైతే ఉన్నదో అది సత్.* 

*అంటే ఏం స్ఫురణకు వస్తున్నది?*

*దేవుడు, భగవంతుడుగా మనం చెప్పుకుంటున్న పరమాత్మగుర్తిస్తున్నాము కదా !..*  

*నిజమే. ఇదే విషయాన్ని వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు భగవద్గీత (శృతి, స్మృతి పురాణాలు) అన్నీ రూఢి చేస్తున్నాయి.*  


*ఇలాంటి సత్ పదార్థము గురించి ఎక్కడైతే గోష్ఠి జరుగుతుందో, ఎక్కడైతే పురాణ కాలక్షేపం జరుగుతుందో, ఎక్కడైతే చర్చ, బోధ జరుగుతుందో అక్కడ మన మనసును నిలిపి ఉంచడాన్ని, అలాంటి సత్ పదార్థము తో మనసుకు స్నేహం కల్పించడాన్ని "సత్సంగము" అంటారు.*

సత్సంగమును 

*1) సత్పదార్థేన సంగః*  
*(2) సత్ శాస్త్రేణ సంగః*     
*(3) సజ్జన సంగః*

అని మూడు విధాలుగా వివరించారు. 

*ఈ సృష్టిలో కన్పించే ప్రతిదీ ఒక తత్వాన్ని తెలియపరుస్తుంది... బాహ్యంగా ఒక అర్థాన్ని ఇచ్చినా,  అంతరార్థము వేరొకటి ఉంటుంది. పదార్థములోని ఈ యదార్థమే (అంతరార్థమే) తత్వము. ఈ తత్వము మారదు. తత్వం బోధపడిందా? అనడం మనం వింటూ ఉంటాము. ఈ తత్వమే జ్ఞానము.*  


*అటువంటి జ్ఞానం మనకై మనం తెలుసుకోలేము కాబట్టి,  ఆ భగవంతుడే గురువు రూపంలో మనకు అందిస్తాడు.*


*ఆ తత్వము సత్ పదార్థము అయితే, దాన్ని బోధించే గురువు సజ్జనుడు. ఆ సత్ పదార్థ జ్ఞానానికి ప్రమాణం శాస్త్రాలు. అవే సత్ శాస్త్రాలు. వీటితో అంటే సత్ పదార్థము మీద, శాస్త్ర ప్రామాణికంగా సజ్జనుడు (గురువు) చెప్పే తత్వ జ్ఞానము మీద మన మనసును లగ్నం చేసి ఉంచడమే సత్సంగము.*   

*ఎక్కడో, ఏదో గుడిలో పురాణ కాలక్షేపం అవుతుంది, వినేసి వద్దాం అనుకుంటే అది సత్సంగము ఎన్నటికీ కాదు.*
 
*త్రికరణ శుద్ధిగా మనసుపెట్టి విని, ఆచరణలో పెట్టాలి. , ఆ విన్నదాని వల్ల ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నించాలి.  మానసిక స్థితిలో మార్పు రావాలి. అప్పుడే అది నిజమైన సత్సంగము అవుతుంది.*

*సజ్జనుడైన గురువు లభించడం ఒక వరమైతే, ఆ జ్ఞానాన్ని అందుకోవడం పూర్వ జన్మ సుకృతం.*

*అందరికీ  సద్గురువు లభించాలని, సత్ పదార్థము యొక్క తత్వ జ్ఞానము అందరూ అందుకోవాలని మనః పూర్తిగా కోరుకుంటున్నాను...*🙏

*ఓం నమో భగవతే శ్రీ రమణాయ*
🙏💐🙏

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన.

బాలా అమ్మవారి గాజులు శాస్త్రి గారి ఇంట్లో ఆడవారు ఒకసారి గాజులు కొంటున్నారు. గాజులు అమ్మే అతను అందరికీ గాజులు వేసాడు. అతను వేసిన గాజులకు ఎంతయ్యింది అంటే 6 మందికి 6 డజన్లు వేసాను కనుక డజనుకు 12 రూపాయలు చొప్పున 72 రూపాయలు అన్నాడు అతడు.


మా ఇంట్లో ఉన్నది 5 మంది ఆడవారే కదా అన్నారు ఇంట్లోని వారు.కాదు ఇందాక ఒక చిన్న పిల్ల కూడా గాజులు వేసుకుని లోపలికి వెళ్ళింది కదా అన్నాడతను. అప్పుడు శాస్త్రి గారు పూజ గదికి వెళ్లి చూడగా అక్కడ చిన్న పిల్లలకు సరిపోయే 12 గాజులు ఉన్నాయి. శాస్త్రి గారికి అర్థం అయ్యింది.6 డజన్లకు డబ్బులు ఇచ్చారు

ఇంకొక విషయం తెలుసా అక్కడ ఆ చిత్రంలో కనిపిస్తున్న పసిపాప ఎవరో కాదు సాక్షాత్తుగా ఆ "బాలా" అమ్మవారే .

శాస్త్రి గారి ఇంటిని ఫోటో తీస్తుంటే గుమ్మం దగ్గర ఎవరూ లేరు,ఫోటో కడిగి చూస్తే ఈ పాప అందులో కనిపించింది.

*భగవంతుడు భక్త సులభుడు*...

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన.

వారు పూజ చేసే టప్పుడు ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట. అది వారి అనుభవం.

అలిపిరి మెట్ల మార్గం కు అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

**అలిపిరి* *మెట్ల మార్గం కు అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?*

🍈🌺🌼🌸🍋🍓🍌🍅
కొండ క్రింద ఉన్న ఈ "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు.

అసలు " అలిపిరి " అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా ... ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ " అలిపిరి " అనే పదం లేదు.

అయితే, " అలిపిరి " అనే ఈ పదం ఎలా పుట్టింది ... ?

దీని వెనుక చరిత్ర ఏమిటి ... ?
అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు.

పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం," తిరుపతి " నగరం ఇప్పటిలాగా లేదు.

ఇప్పుడు " అలిపిరి " అని పిలుస్తున్న ప్రాంతానికి-
"అలిపిరి" అన్న పేరు కూడా లేదు.
అది ( 1656 - 1668 ) ప్రాంతం .

ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన " రాక్షసి తంగడి & తళ్ళికోట " మొ || యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు.

ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతిపరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు.

పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ( ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా - కుతుబ్ షా & వజీర్ల సైన్యం, " ఆలీ " అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత " ఆలీ " సైన్యం తిరుపతికి చేరుకుంది.

అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం.

ఇప్పుడు " మంచినీళ్ళ కుంట " అని చెప్పుకుంటున్న
" నరసింహ తీర్థమే " అప్పటి తిరుపతి గ్రామం.

ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని " నరసింహ తీర్థం రోడ్ " అనే పిలుస్తారు.

ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు :

ఒకటి : శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అనీ & తిరుమల లాంటి దివ్య క్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవమ్ విశ్వాసం భారత దేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన, ఈ దేవాలయం పై దాడి చేసి స్వామి వారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే, హిందువుల దేవుడు బలహీనుడనీ తద్వారా, ప్రజలందరూ " అల్లా " యే గొప్ప దేవుడని భావించి, " ఇస్లాం " మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన.

రెండోది : శ్రీ కృష్ణ దేవరాయలు, భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులూ & అపారమయిన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని.

అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు, " ఆలీ " ( కమాండర్ ఇన్ చీఫ్ ) ని సమీపించి నీక్కావలసింది బంగారమే కదా ! మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ & పురుషుల వద్ద వున్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు.

దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్చందంగా ఇచ్చిన బంగారం, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబూ & ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి, తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు.

సరిగ్గా ఇప్పుడు " అలిపిరి " అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే, శ్రీ ఆది వరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు.

మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి, దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు.

అప్పుడు , శ్రీ స్వామి వారి " అమృత వాణి " వాడికి వినబడింది, దైవం పైనే దాడికి సిద్ధపడ్డావా ? ఎంత ధైర్యం ... ? అని. అప్పుడు ఆలీ బిగ్గరగా రోదిస్తూ ... క్షమాభిక్ష అడిగి, నేత్ర దానం చెయ్యమని వేడుకున్నాడు.

అప్పుడు దయార్ద్రచిత్తుడయిన స్వామి వారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు.

దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు "ఆలీ".

ఉర్దూ లేక హిందీ భాషలో " ఫిర్ నా " అంటే వెనక్కి మళ్ళడం, " ఫిరే ' అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం.

ఎప్పుడు, ఎక్కడా ఓటమెరుగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ " ఆలీ ఫిరే, ఆలీ ఫిరే " అని చెప్పుకునేవారు.

కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్లిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుదిరిగాడు " ఆలీ ఫిరే ",
"ఆలీ ఫిరే" అని సూచిస్తూ ... చాటింపులు సైతం వేయించారు.

" ఆలీ " ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు.ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు " అలీ ఫిరే"
ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదం - ఆలి పిరే గా రూపాంతరం చెంది ఇప్పుడు " అలిపిరి గా స్థిరపడింది.

ఇదీ మనమిప్పుడు " అలిపిరి " గా పిలుచుకునే ప్రదేశం యొక్క యదార్థమైన చరిత్ర.

ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదిరిగిన కారణంగా, ఈనాడు మనం చూస్తున్న " అలిపిరి ఏర్పడింది. 🙏🙏🙏🙏🙏

Thursday, May 23, 2024

బొట్టు అనేది పార్వతీదేవి చిహ్నం..!

శుక్రవార శుభోదయ వందనాలు..!!🙏
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏
బొట్టు అనేది పార్వతీదేవి చిహ్నం..!


'బిందు' అనే సంస్కృత పదం నుండి 'బిందీ' వచ్చింది, దీని అర్థం బొట్టు. . 
హిందూ ధర్మానికి చెందిన మహిళలు దీనిని 
తమ నుదుటి మీద, రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు. 
దీనిని పార్వతీదేవి చిహ్నంగా పరిగణిస్తారు. 

కుంకుమను అమ్మవారి ప్రసాదంగా భావించి, సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను ప్రార్థిస్తూ, నుదుటన పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. 

ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. 

నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. 

బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. 

చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

నుదుట బొట్టుపెట్టుకునేందుకు పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైనది. 
పసుపు మన శరీరంపై అమితమైన ప్రభావాన్ని చూపుతుంది. 
రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని ఇనుమడింప జేస్తుంది. 
కురుపులను, గాయాలను మాన్పుతుంది. 
కుష్ఠు రోగాన్ని కూడా రూపుమాపే శక్తి పసుపుకు ఉంది. కఫాన్ని అరికడుతుంది. 

అసలు నొసటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి...
మన శరీరంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలకు మిగిలిన అవయవాలకు ఒక్కొక్క అధి దేవత ఉన్నారు. 
వారిలో లలాట అధిదేవత బ్రహ్మ. 
పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడ్డాయి. 
అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది. 

ద్వాదశ పుండ్రాలను పెట్టుకోక పోయినా, 
కనీసం బొట్టు అయినా పెట్టుకోవాలి. 
అప్పుడు దేవుని పూజించినట్లే అవుతుంది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. 
అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది. 
ఇందులో నిగూఢార్థముంది. 

మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు. 
ఆ జీవుడు జాగ్రదావస్థలో భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సంచరిస్తుంటాడు. 
మన నొసటిపై పెట్టుకున్న కుంకుమబొట్టుపైన సూర్యకాంతి ప్రసరిస్తే, 
కనుబొమల మధ్య నుండే ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. 

ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానము కనుబొమల మధ్య నుండే ఆజ్ఞాచక్రము. 
కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే అవుతుందని పెద్దలంటారు. 
మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని పురోహితులు అంటున్నారు.

ఈ బొట్టు మహిళలను మరియు వారి భర్తలను కాపాడే స్త్రీ శక్తిని సూచిస్తుందని హిందువులు నమ్ముతారు. 
సాంప్రదాయకంగా ఇది పెళ్ళి అయిపోయిందని సూచించే ఒక చిహ్నం. 
దీనిని హిందూ వివాహిత స్త్రీలు పెట్టుకుంటారు.

భారతదేశంలోని టాప్ టెన్ తంత్ర దేవాలయాలు

🙏🙏🙏🌹🌹🌹
భారతదేశంలోని టాప్ టెన్ తంత్ర దేవాలయాలు 

కామాఖ్య దేవాలయం, గౌహతి, అస్సాం ::


తంత్ర మార్గం యొక్క అనుచరులు కొన్ని నిర్దిష్ట హిందూ దేవాలయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇవి తాంత్రికులకు మాత్రమే కాకుండా "భక్తి" సంప్రదాయానికి చెందిన వ్యక్తులకు కూడా ముఖ్యమైనవి. ఈ దేవాలయాలలో కొన్నింటిలో "బలి" లేదా జంతువుల ఆచార బలి నేటికీ నిర్వహించబడుతుంది, మరికొన్నింటిలో, ఉజ్జయిని మహాకాళ దేవాలయం వలె, "ఆరతి" ఆచారాలలో చనిపోయినవారి బూడిదను ఉపయోగిస్తారు. ఇక్కడ మొదటి పది తాంత్రిక పుణ్యక్షేత్రాలు లేదా "శక్తి పీఠాలు" ఉన్నాయి.

భారతదేశంలో విస్తృతంగా ఆచరించే, శక్తివంతమైన తాంత్రిక ఆరాధనలో కామాఖ్య కేంద్రంగా ఉంది. ఇది ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో, నీలాచల్ కొండపై ఉంది. ఇది దుర్గా దేవి యొక్క 108 శక్తి పీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం, శివుడు తన భార్య సతీ మృతదేహాన్ని మోస్తున్నప్పుడు కామాఖ్య ఉనికిలోకి వచ్చింది మరియు ఆమె "యోని" (స్త్రీ జననేంద్రియాలు) ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో నేలపై పడిపోయింది. ఈ ఆలయం ఒక సహజమైన గుహ మరియు నీటి బుగ్గ. భూమి యొక్క ప్రేగులకు మెట్ల ఫ్లైట్ డౌన్, ఒక చీకటి, రహస్యమైన గది ఉంది. ఇక్కడ, పట్టు చీరతో కప్పబడి, పూలతో కప్పబడి, "మాత్రా యోని" ఉంచబడుతుంది. కామాఖ్య వద్ద, తాంత్రిక హిందూమతం శతాబ్దాలుగా తరతరాలుగా తాంత్రిక పూజారులచే పోషించబడుతోంది.

కాళీఘాట్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ ::

కలకత్తా (కోల్‌కతా)లోని కాళీఘాట్, తాంత్రికులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర. సతీదేవి శవాన్ని ముక్కలుగా కోసినప్పుడు ఆమె ఒక వేలు ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు. ఇక్కడ కాళీ దేవి ముందు అనేక మేకలను బలి ఇస్తారు మరియు అసంఖ్యాక తాంత్రికులు ఈ కాళీ ఆలయంలో తమ స్వీయ-క్రమశిక్షణకు ప్రతిజ్ఞ చేస్తారు.

పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలోని బిష్ణుపూర్ వారి తాంత్రిక శక్తులను ఆకర్షించే మరొక ప్రదేశం. మానస దేవిని ఆరాధించాలనే ఉద్దేశ్యంతో, వారు ప్రతి సంవత్సరం ఆగస్టులో జరిగే వార్షిక పాము ఆరాధన పండుగ కోసం బిష్ణుపూర్‌కు వెళతారు. బిష్ణుపూర్ పురాతన మరియు ప్రసిద్ధ సాంస్కృతిక మరియు చేతిపనుల కేంద్రం.

వైటల్ టెంపుల్, భువనేశ్వర్, ఒరిస్సా ::

భువనేశ్వర్‌లో, 8వ శతాబ్దానికి చెందిన వైటల్ దేవాలయం శక్తివంతమైన తాంత్రిక కేంద్రంగా ఖ్యాతిని పొందింది. ఆలయం లోపల శక్తివంతమైన చాముండ (కాళి), ఆమె పాదాల వద్ద శవంతో పుర్రెల హారాన్ని ధరించి ఉంది. తాంత్రికులు ఆలయం యొక్క మసక వెలుతురు అంతర్భాగం ఈ ప్రదేశం నుండి వెలువడే పురాతన శక్తి ప్రవాహాలను గ్రహించడానికి అనువైన ప్రదేశంగా భావిస్తారు.

ఎక్లింగ్, రాజస్థాన్ ::

రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలోని ఎక్లింగి శివాలయంలో నల్ల పాలరాయితో చెక్కబడిన అసాధారణమైన నాలుగు ముఖాల శివుని చిత్రం చూడవచ్చు.  ఆలయ సముదాయం దాదాపు ఏడాది పొడవునా తాంత్రిక ఆరాధకుల స్థిరమైన ప్రవాహాన్ని ఆకర్షిస్తుంది.

బాలాజీ, రాజస్థాన్ ::

జైపూర్-ఆగ్రా హైవేకి దూరంగా భరత్‌పూర్ సమీపంలోని బాలాజీ వద్ద తాంత్రిక కర్మల అత్యంత ఆసక్తికరమైన మరియు ప్రసిద్ధ కేంద్రాలలో ఒకటి. భూతవైద్యం అనేది బాలాజీ వద్ద ఒక జీవన విధానం, మరియు "ఆత్మలు ఆవహించిన" సుదూర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో బాలాజీ వద్దకు వస్తారు. ఇక్కడ ఆచరించే కొన్ని భూతవైద్యం ఆచారాలను చూడటానికి ఉక్కు నరాలు అవసరం. తరచుగా ఏడుపులు మరియు అరుపులు మైళ్ళ దూరం వరకు వినబడతాయి. కొన్నిసార్లు, 'రోగులు' భూతవైద్యం చేయడానికి రోజుల తరబడి ఉండవలసి ఉంటుంది. బాలాజీ ఆలయాన్ని సందర్శించడం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది.

ఖజురహో, మధ్యప్రదేశ్ ::

ఖజురహో, మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉంది, దాని అందమైన దేవాలయాలు మరియు శృంగార శిల్పాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే, తాంత్రిక కేంద్రంగా దాని ఖ్యాతి గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆధ్యాత్మిక అన్వేషణకు ప్రాతినిధ్యం వహించే ప్రేరేపిత ఆలయ సెట్టింగ్‌లతో కూడిన శరీర కోరికల సంతృప్తి యొక్క శక్తివంతమైన వర్ణనలు ప్రాపంచిక కోరికలను అధిగమించడానికి మరియు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మరియు చివరకు మోక్షం (జ్ఞానోదయం) కోసం మార్గాలను సూచిస్తాయని నమ్ముతారు. ఖజురహో దేవాలయాలను ఏడాది పొడవునా చాలా మంది ప్రజలు సందర్శిస్తారు.

కాల్ భైరోన్ ఆలయం, మధ్యప్రదేశ్ ::

ఉజ్జయినిలోని కాల్ భైరోన్ ఆలయంలో తాంత్రిక పద్ధతులను పెంపొందించే భైరోన్ యొక్క చీకటి ముఖ విగ్రహం ఉంది. ఈ పురాతన ఆలయానికి చేరుకోవడానికి ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతాల గుండా దాదాపు గంట ప్రయాణం పడుతుంది. తాంత్రికులు, ఆధ్యాత్మికవేత్తలు, పాము మంత్రగత్తెలు మరియు "సిద్ధి" లేదా జ్ఞానోదయం కోసం అన్వేషణలో ఉన్నవారు తరచుగా వారి అన్వేషణ యొక్క ప్రారంభ దశలలో భైరోన్ వైపు ఆకర్షితులవుతారు. ఆచారాలు మారుతూ ఉండగా, భైరాన్ ఆరాధనలో పచ్చి, దేశీ మద్యం నైవేద్యంగా మారదు. సముచితమైన వేడుక మరియు గంభీరతతో మద్యాన్ని దేవునికి సమర్పిస్తారు.

మహాకాళేశ్వర దేవాలయం, మధ్యప్రదేశ్ ::

మహాకాళేశ్వర దేవాలయం ఉజ్జయినిలోని మరొక ప్రసిద్ధ తాంత్రిక కేంద్రం. మెట్ల మార్గంలో శివలింగం ఉన్న గర్భగుడిలోకి వెళ్తుంది. పగటిపూట ఇక్కడ అనేక ఆకట్టుకునే వేడుకలు జరుగుతాయి. అయితే, తాంత్రికులకు, ఇది ప్రత్యేక ఆసక్తిని కలిగించే రోజు మొదటి వేడుక. వారి దృష్టి "భస్మ్ ఆరతి" లేదా బూడిద ఆచారంపై కేంద్రీకృతమై ఉంది - ప్రపంచంలోని ఒకే రకమైన కర్మ. ప్రతిరోజూ ఉదయం శివలింగం 'స్నానం' చేసిన బూడిద తప్పనిసరిగా ముందు రోజు దహనం చేసిన శవమై ఉంటుందని చెబుతారు. ఉజ్జయినిలో ఎటువంటి దహన సంస్కారాలు జరగనట్లయితే, బూడిదను అన్ని ఖర్చులతో పొందాలి.
🌹🌹🌹🙏🙏🙏

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS