తంత్రములన్నింటికి మంత్రం యొక్క ఆవశ్యకత లేకపోయినప్పటికీ
కొన్ని సందర్భంలో తంత్రమునకు ఆధార భూతములైన మూలికలు, దైవిక వస్తువులకు, యంత్రాలు మొదలైన వాటిని శక్తివంతం చేయుటకు మంత్రములు ప్రాధాన్యత వహించుచున్నాయి.
తంత్ర శాస్త్రమునకు సంబంధించినంత వరకు మంత్రములు ఐదు విధములుగా చెప్పబడినవి
1)#అధిష్ఠాన_మంత్రములు:-
ఇవి తంత్ర ప్రక్రియలకు సంబంధించిన మూలికలు , దైవిక వస్తువులు యంత్రములు అందు ఆవహించి ఉండే దేవతలకు సంబంధించినవి. ఆయా దేవతా ప్రసన్నత కొరకు ఇవి ఉపయోగపడతాయి.
2) #ఉచ్చాటన_మంత్రములు:-
ఇవి మూలికలు, దైవిక వస్తువులు, యంత్రములు అందు ఆవహించి ఉన్న వ్యతిరేక శక్తులను మరియు విఘ్నములను తొలగించుటకు నిర్దేశించబడినవి.
3) #దిగ్బంధన_మంత్రములు:-
ఇవి మూలికలు,దైవిక వస్తువులు, యంత్రములు అందుగల సహజ శక్తిని వాటి నుండి దాటిపోకుండా చేయుటకు సహకరించగలవు.
4)#జీవికా_మంత్రములు:-
ఇవి మూలికలు, దైవిక వస్తువులు, యంత్రముల యందు నిబిడీకృతమైన ప్రాణ శక్తిని మేల్కొలిపి సాధనకు అనుకూలముగా ఉపయోగపడేవి.
5)#రక్షా_మంత్రములు:-
తంత్ర ప్రక్రియలో సాధకునికి ఆటంకం కలిగించు దుష్టశక్తులను నుండి సాధకుడికి ఎల్లవేళలా రక్షించేవి.
మహాశక్తి జ్యోతిష్య నిలయం
No comments:
Post a Comment