Tuesday, May 28, 2024

అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు.* *ఈ రెండూ ఉండి తీరాలి.

*ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు.*


*ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు.*

*ఆ కొడుకు వేదం నేర్చు కున్నాడు.*

*ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు.*

*ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు.*

*గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు.*

*ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు.*

*అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.*
*నీవు ఈ ఆవులను కొట్టవద్దు.*
*తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.*

*బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.*

*ఈ పిల్లవాడు వేదమంత్రము లను చదువు కుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడు తుండేవాడు.*

*వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి.*

*ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు.*

*ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి.*

*రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి.*

*ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెటన పాలతో శివాభిషేకము చేయదలచాడు.*

*రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు.*

*అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం.*

*రుద్రాధ్యాయం అంత గొప్పది.*

*అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి.*

*అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.*

*ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు.*

*‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు.*

*ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు.*

*చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు.*

*పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ.*
*అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు.*

*కాసేపయింది.*

*కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు.*

*ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి.*

*ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారము లతో శివాలయ నిర్మాణం చేశాడు.*

*తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు.*

*ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది.*

*అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.*

*అవును అతడు చెప్పింది నిజమే.*

*వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు.*

*ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు.*

*అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు.*

*కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు.*

*అది ఛిన్నాభిన్నమయింది.*

*అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.*

*తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు.*

*ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు.*

*ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు.*

*తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి.*

*క్రిందపడిపోయాడు.*

*నెత్తుటి ధారలు కారిపోతున్నాయి.*

*కొడుకు చూశాడు.*

*‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించ వలసిందే’ అన్నాడు.*

*నెత్తురు కారి తండ్రి మరణించాడు.*

*ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నా భిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు.*

*నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు.*

*అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు.*

*మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను.*

*ఇవాల్టి నుండి నీవు మా కుటుంబం లో అయిదవ వాడవు.*

*నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు.*

*అయిదవ స్థానం చండీశ్వరుడి దే.*
*నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.*

*ఇకనుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు.*

*భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది.*

*దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు.*

*భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది.*

*అది పత్నీభాగం.*

*కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి.*

*పార్వతీ నేను ఈవేళ చండీ శ్వరుడికి ఒక వరం ఇచ్చే స్తున్నాను.*

*నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.*

*ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు.*

*చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు.*

*ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు.*

*ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు.*

*ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది.*

*అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు.*

*మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు.*

*ప్రసాద తిరస్కారం మహాదోషం.*

*అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు.*

*శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి.*

*అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు.*

*చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు.*

*ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు.*

*ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణా ధికారం ఉంటుంది.*

*దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.*

*లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది.*

*అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది.*

*మీకు ఇచ్చినది ప్రసాద రూపము.*

*దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు.*

*అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలి పెట్టేయ్యకూడదు.*

*నంది మీద పెట్టడం కాదు.*

*చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు.*

చండీశ్వర వృత్తంతం

*చిటిక చిన్నగా మాత్రమే వేయాలి.*

*అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు.*

*ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు.*

*చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో.*

*పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు.*

*పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు.*

*ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము.*

*మన భాగ్యమే భాగ్యం.*

*అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు.*

*ఈ రెండూ ఉండి తీరాలి.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS