Monday, May 20, 2024

విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారం నారాయణుడు ఐదు స్వరూపాలతో భాసిస్తున్నాడు

*⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ*



*💥అసలు ఏ నామాన్ని జపించాలి? భగవంతుడి రూపము ఏది? భగవంతుని నామము ఏది? ఇంతమంది దేవుళ్లలో ఎవరికి చెయ్యాలి? ఎలా చెయ్యాలి?*

*ఇంతమందికీ చేయకపోతే ఏమౌతుందో, ఎవరేమనుకుంటారో యిన్ని సందిగ్ధలతో అయోమయంలో పడిపోయి ఇటూ అటూ పరిగెడుతూ, కాలాన్ని వ్యర్థం చేయనవసరం లేదు.*

*నిశ్చయంగా సత్య స్వరూపుడు, పరమాత్ముడు, సర్వవ్యాపి భగవంతుడు అయిన శ్రీ మహావిష్ణువు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం అనెడి ఐదు విధములుగా వేంచేసియున్నాడు.*

*💥విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారం నారాయణుడు ఐదు స్వరూపాలతో భాసిస్తున్నాడు.*
*1) పర,*
*2) వ్యూహ,*

*3) విభవ,*
*4) అంతర్యామి,*
*5) అర్చావతారం.*

*1) #పరస్వరూపం:*
*శుద్ధసత్వంతో, అద్భుత తేజస్సుతో వైకుంఠంలో నిత్యమూ భాసించే, భూదేవీ శ్రీ దేవీ సమేత మూర్తి. కేవలం నిత్యముక్తులకు ఇది దర్శనమిస్తుంది. నిత్య ముక్తులు అంటే జన్మ నుంచి విముక్తి పొందిన వారు.*

*2) #వ్యూహస్వరూపం:*
*జగత్ సృష్టికి మూలకారణమైన స్వరూపం. నాలుగు వ్యూహాలతో ఉన్నది. అవి - వాసుదేవ, అనిరుద్ద, ప్రద్యుమ్న, సంకర్షణ. ఈ వ్యూహాలతో సృష్టి స్థితి లయలను నిర్వహించువాడు. వాసుదేవుడు క్షీర సాగర శయనుడైన మూలమూర్తి. అనిరుద్ధుడు సృష్టికారక చైతన్యం. ప్రద్యుమ్నుడు స్థితి శక్తి. సంకర్షణుడు లయ కారకుడు. అనిరుద్దాంశ బ్రహ్మ, సంకర్షణాంశం రుద్రుడు, ప్రద్యుమ్న తేజం విష్ణువు.*

*3) #విభవస్వరూపం:*
*ధర్మ రక్షణార్ధం లీలగా అవతరించే నారాయణుడు. అప్రాకృత దివ్య మంగళస్వరూపంతో, లీలా విభూతితో ఇలకు దిగిన శ్రీరామ, శ్రీకృష్ణాదులు హరి యొక్క విభవ స్వరూపులు.*

*శ్రీమన్నారాయణుడు ఆయన ధర్మ రక్షణార్ధం మన కోసం ఒక అవతారంగా వస్తాడు. ఆయనను గుర్తించి ఆయనకు దగ్గర అవుతాము.*

*4) #అంతర్యామి:*
*జీవుల హృదయాలలో భాసించే పరమాత్మ. అందరి ప్రవృత్తులకు కారకమై, సత్కర్మానుష్ఠానాలకు అనుమతించే స్వరూపమే అంతర్యామి.*

*ఈ స్వరూపం ఏమిటంటే మన లోపల వడ్లగింజ కొన పరిమాణంలో నీలపు రంగులో జ్యోతిలా వెలుగుతుంటాడు.*

*ఆ అంతర్యామి శరీరాన్ని , ఆత్మని నడిపిస్తూ వెంట ఉంటాడు. మనం చేసే పాప, పుణ్యాలు ఆయనకు అంటవు.*

*జ్ఞానం తెలుసుకొని నడుచుకోవాల్సినది మనమే. దానిని బట్టి పాప పుణ్యాలు మళ్ళీ జన్మలు ఎత్తడం, కష్టాలు పడటం... దానినుంచి బైట పడటమే మోక్షం.*

*5) #అర్చావతారం:*
*అర్చింపబడి అనుగ్రహించేందుకు వివిధ క్షేత్రాలలో వెలసిన భగవద్రూపం.*

*మన కోసం ఇళ్ళలో, దేవాలయాలలో రథోత్సవాలలో ప్రతిష్ఠితమై, మనలను కరుణిస్తోన్న అమృతమయ మూర్తులు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు... శ్రీరంగంలో రంగనాథుడు మొదలైన వారు.*

సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS