*శ్రీ గురుభ్యోనమః*
🙏💐🙏💐🙏
*సత్సంగం అంటే ఏమిటి?*
*సత్ + సంగము = సత్సంగము*
*సంగము అంటే కలయిక, స్నేహము...*
*సత్ అంటే సత్యమైనది, నిత్యమైనది, చావు పుట్టుకలు లేనిది, ఆది, అంతాలలో కూడా నిలిచి ఉండేది, ఏ రూపమూ లేని, అన్ని రూపాలూ తానే అయి ఉన్నది, విశ్వం అంతటా వ్యాపించి ఉన్నది, అన్నింటిలోనూ, అందరిలోనూ ప్రాణశక్తిగా వెలుగుతున్నది ఏదైతే ఉన్నదో అది సత్.*
*అంటే ఏం స్ఫురణకు వస్తున్నది?*
*దేవుడు, భగవంతుడుగా మనం చెప్పుకుంటున్న పరమాత్మగుర్తిస్తున్నాము కదా !..*
*నిజమే. ఇదే విషయాన్ని వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు భగవద్గీత (శృతి, స్మృతి పురాణాలు) అన్నీ రూఢి చేస్తున్నాయి.*
*ఇలాంటి సత్ పదార్థము గురించి ఎక్కడైతే గోష్ఠి జరుగుతుందో, ఎక్కడైతే పురాణ కాలక్షేపం జరుగుతుందో, ఎక్కడైతే చర్చ, బోధ జరుగుతుందో అక్కడ మన మనసును నిలిపి ఉంచడాన్ని, అలాంటి సత్ పదార్థము తో మనసుకు స్నేహం కల్పించడాన్ని "సత్సంగము" అంటారు.*
సత్సంగమును
*1) సత్పదార్థేన సంగః*
*(2) సత్ శాస్త్రేణ సంగః*
*(3) సజ్జన సంగః*
అని మూడు విధాలుగా వివరించారు.
*ఈ సృష్టిలో కన్పించే ప్రతిదీ ఒక తత్వాన్ని తెలియపరుస్తుంది... బాహ్యంగా ఒక అర్థాన్ని ఇచ్చినా, అంతరార్థము వేరొకటి ఉంటుంది. పదార్థములోని ఈ యదార్థమే (అంతరార్థమే) తత్వము. ఈ తత్వము మారదు. తత్వం బోధపడిందా? అనడం మనం వింటూ ఉంటాము. ఈ తత్వమే జ్ఞానము.*
*అటువంటి జ్ఞానం మనకై మనం తెలుసుకోలేము కాబట్టి, ఆ భగవంతుడే గురువు రూపంలో మనకు అందిస్తాడు.*
*ఆ తత్వము సత్ పదార్థము అయితే, దాన్ని బోధించే గురువు సజ్జనుడు. ఆ సత్ పదార్థ జ్ఞానానికి ప్రమాణం శాస్త్రాలు. అవే సత్ శాస్త్రాలు. వీటితో అంటే సత్ పదార్థము మీద, శాస్త్ర ప్రామాణికంగా సజ్జనుడు (గురువు) చెప్పే తత్వ జ్ఞానము మీద మన మనసును లగ్నం చేసి ఉంచడమే సత్సంగము.*
*ఎక్కడో, ఏదో గుడిలో పురాణ కాలక్షేపం అవుతుంది, వినేసి వద్దాం అనుకుంటే అది సత్సంగము ఎన్నటికీ కాదు.*
*త్రికరణ శుద్ధిగా మనసుపెట్టి విని, ఆచరణలో పెట్టాలి. , ఆ విన్నదాని వల్ల ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నించాలి. మానసిక స్థితిలో మార్పు రావాలి. అప్పుడే అది నిజమైన సత్సంగము అవుతుంది.*
*సజ్జనుడైన గురువు లభించడం ఒక వరమైతే, ఆ జ్ఞానాన్ని అందుకోవడం పూర్వ జన్మ సుకృతం.*
*అందరికీ సద్గురువు లభించాలని, సత్ పదార్థము యొక్క తత్వ జ్ఞానము అందరూ అందుకోవాలని మనః పూర్తిగా కోరుకుంటున్నాను...*🙏
*ఓం నమో భగవతే శ్రీ రమణాయ*
🙏💐🙏
No comments:
Post a Comment