Tuesday, January 16, 2018

ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది??



ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది??

ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పుపట్టిన కత్తితో ఏ సైనికుడు యుద్ధం చేయలేడు.అందుకే యుద్ధానికి వెళ్లేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి. అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా..జీవిత పరమర్థాన్ని తెలుసుకోవాలన్నా , సాధనమైన శరీరాన్ని అందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రాచీన రుషులు మనకు అందించిన మార్గమే సదాచారం.

ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు. ఆయన తన చివరి రోజుల్లో… భగవంతుడిని ప్రార్థిస్తూ, తాను మరల పుడితే భారత దేశంలో పుట్టాలని కోరుకున్నాడట. అయితే ఈనాటి ఇంగ్లీష్ ఎడ్యుకెటేడ్ ఆధునిక మేధావులు, సెక్యులర్ వాదులు , మార్క్స్ మేకాలే వాదులు మాత్రం పుణ్యభూమి భారత్ విలువ తెలియక ఇప్పటికి మన దేశాన్ని నిందిస్తున్నారు. మాక్స్ ముల్లర్ భారత్ లో పుట్టాలని కోరుకోవడానికి ప్రధాన కారణం సదాచార పూర్ణమైన భారతీయ జీవన విధానం. మానవుడు నిద్రలేవడంతోనే అతని దైనందిన జీవితం ఆరంభమౌతుంది. సదాచారంలో మొదటి అంశం నిద్రలేవటం.

నిద్ర ఎప్పుడు లేవాలి..?

ఈ విషయంలో మన ధర్మ శాస్త్రాలు, వైద్యశాస్త్రం ఏం చెప్పాయి..?
నిద్ర లేచే విషయంలో హిందు ధర్మ శాస్త్రాలు, వైద్య శాస్త్రం కూడా ఒకే మాటగా “బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత” అని, అలాగే “బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితం” అని పేర్కొన్నాయి. ఆయురారోగ్యాలతోపాటు ధర్మాచరణకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ ధర్మ గ్రంథాలు తెలిపాయి.

సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రమంటారు. దీనికి ముందున్నదే బ్రాహ్మీ ముహూర్తం. అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం. ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింపగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. దీనిని ఆదాన సమయం అంటారు.

మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు శిథిలత నిచ్చు సమయం. ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాల శక్తులు సన్నగిల్లుతాయి. దేహం విశ్రాంతి కోరుకుంటుంది. దీనిని విసర్గ సమయం అంటారు. ఆదాన సమయంలో నిద్రపోవటం, విసర్గ సమయంలో మెలకువగా ఉండటం శారీరకంగానూ, మానసికంగానూ అనారోగ్యకరమైంది. దీంతో బుద్ది చురుకుదనం కోల్పోతుంది. లౌకిక వ్యవహారాలకే ప్రాధాన్యత నిచ్చేవారు ఈ వత్యాసం గుర్తించలేరు. ఇలాంటి వారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింప చేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు. అందుకే ఇలాంటి వారికి అవసరమైన శాంతస్థితి చేకూరదు. దీంతో వీరు నిజమైన సుఖ శాంతులకు దూరం అవుతారు. ఈ ప్రవృత్తిని నిశాచర ప్రవృత్తిగా పిలుస్తారు.

వేకువ జామునే నిద్ర లేచే విషయంలో పసిపిల్లలే సదాచారపరులు. చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తాన్నే నిద్రలేస్తారు. వాళ్లను నిద్రలేపుతారు. పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం. బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు సకల పుష్పాలు…ఈ ముహూర్తంలోనే పరిమళాలు వేదజల్లుతాయి. అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ది కూడా వికసించి ఉత్తమ సమాలోచనలు పొందుతుంది. అందుకే ఇది బ్రాహ్మీ ముహూర్తం అయ్యింది. బ్రాహ్మీ అంటే సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్లు తుడుచుకోవాలి. కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్లకు హఠాత్తుగా వెలుగు చూపటం దోషం. అందుకై ఇలా చన్నీటితో తుడుచుకోవాలి.

ఆ తర్వాత ‘సముద్ర వసనే దేవి! పర్వత స్తనమండలే, విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే’ అని భూదేవికి నమస్కరించిన తర్వాతే పాదం భూమిపై మోపే ఆచారం మన పెద్దలది. మన దైనిందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము. కాబట్టే మనకు తిండిని ప్రసాదించే, జీవితాంతం మనలను భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకొని నెత్తిన కాలు పెట్టుటం కనీస కర్తవ్యం. కాలు తగిలితే సారీ చెప్పుకొనే నాగరికతను చూస్తున్న మనం…భూదేవిని క్షమించమని ప్రార్థనను చేయలేమా?

నిద్రలేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతోంది. నిద్రలేవగానే శ్రోతియుని , గుణ సంపన్నుని, గోవును, అగ్నిని, సోమయాజిలాంటి వారినే చూడాలని, పాపిష్ఠివారిని, అమంగళకర వ్యక్తులను చూడతగనది అంటారు. ఇలా అనడంలో నిద్రలేచిన వెంటనే చేసే దర్శనం ఆరోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఎప్పుడైన ప్రమాదం జరగగానే ఛీ..నిద్రలేస్తూ ఎవరి మొగం చూచానో అనుకోవడం మనం చూస్తాం. చాలా మంది నిద్రలేవగానే అరచేతిని చూచుకొంటారు.

కరాగ్రే వసతే లక్ష్మీ-కరమధ్యే సరస్వతీ! కరమూలే స్థితో బ్రహ్మా- ప్రభాతే కరదర్శనం!! అనేది ఆర్ష వ్యాక్యం. అరచేతి అగ్రభాగం లక్ష్మీస్థానం. మధ్యభాగం సరస్వతి స్థానం. కరమూల బ్రహ్మ లేదా గోవింద స్థానం. కాబట్టే ఉదయం లేవగానే అరచేతిని చూచుకొంటారు. అరచేతిలో శ్రీరామ వ్రాసి కన్నుల కద్దుకొవడం కొందరు చేస్తారు. నిద్రలేవనగానే ఏ విధంగానైన దర్శనం అయ్యేటట్లు చేసుకోవడం మంచిది.

దైవ ప్రార్థన తర్వాత ముఖం, కాళ్లు చేతులు కడుగుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. అనంతరం జలపానం చేయాలి. ప్రాతఃకాల జలపానం ఎంతో ఆరోగ్యప్రదం. రాత్రి నిద్రకు ముందు రాగి, వెండి , కంచు లేదంటే మట్టి పాత్రలో మంచినీరుంచి ప్రాతః కాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది. వాత పిత్తశ్లేష్ఠు, ప్రకోపాలు తొలగటమేకాక హృద్రోగం, కాస, శ్యాస, క్షయ, అస్మరీ..మూత్రంలో రాళ్లు, గ్రహణీ….రక్త విరేచనాలు, అతిసార, అతి మూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమిస్తాయి. అంతేకాక సంతోషం, బలం, ఆయుర్వృద్ధి, వీర్యవృద్ధి,ఆరోగ్యం కలుగుతాయి. జలపానం చేశాక కొంత సేపు నడవడం మలబద్దకాన్ని పొగడుతుంది.

బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతః స్మరణ కర్త్యవంగా మన పెద్దలు చెప్పారు. ప్రాతఃస్మరణతో పుణ్యము, సంస్కారం, చేకూరుతాయి. ఇష్టదైవాలతోపాటు, మహనీయులను, పుణ్యతీర్థాలను స్మరించటం, మహనీయుల జీవిత విశిష్టతను తెలుసుకొని ఆచరణలో వారిని ఆదర్శంగా స్వీకరించడం జీవితానికి ధన్యత.

Friday, January 12, 2018

అష్ట వినాయకులు – అష్ట శక్తులు

                                     ...


అష్ట వినాయకులు – అష్ట శక్తులు

శ్రీ గణేశుడు సాధన చేసి శివపిత అయిన పరమాత్ముని ద్వారా అష్ట శక్తులను ప్రాప్తి చేసుకున్నాడు. కనుకనే అతనికి అష్టవినాయకుడు అన్న పేరుతో గాయనము ఉంది, పూజ జరుగుతుంది. వారి ప్రతి ఒక్క పేరులో ఆ శక్తి మరియు దాని మహత్వము స్పష్టమవుతుంది. అదేవిధంగా మనము కూడా శివపితను స్మరించి, సాధనతో ఈ అన్ని శక్తులను ప్రాప్తి చేసుకోగలము.

శ్రీ గణేశునికి అనేక పేర్లు ఉన్నాయి, ప్రతి ఒక్క పేరు గుణవాచకము మరియు కర్తవ్య వాచకమైనది. శివ పుత్రుడైన గణేశునికి శివారాధనద్వారా అనేక దివ్య శక్తులు ప్రాప్తించాయి, వాటి స్వరూపము కర్తవ్యాల రూపములో ప్రసిద్ధము.

*శ్రీ మోరేశ్వరుడు..! మన బుద్ధిని శుద్ధంగా, పవిత్రంగా తయారుచేసే కర్తవ్యము చేసేవారిని మోరేశ్వర్ అని అంటారు.

*శ్రీ వరద వినాయకుడు..!! మహాదాని మరియు వరదానీ దృష్టిద్వారా సర్వుల మనోకామనలను పూర్తి చేసే శక్తిని ప్రాప్తి చేసుకున్న కారణంగా శ్రీ గణేశుని శ్రీ వరద వినాయకుడు అని అంటారు.

*శ్రీ విఘ్నేశ్వరుడు..!! పరమాత్మ స్మృతిద్వారా భక్తులందరి విఘ్నాలను దూరము చేస్తారు మరియు ఏ కార్యమునైనా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు కనుక శ్రీ గణేశుని విఘ్న వినాశక రూపములో పూజిస్తారు.

*శ్రీ మహా గణపతి...!! ఆత్మలందరి అపరాధాలను స్వయములో ఇముడ్చుకునే శక్తి అనగా క్షమించే మహా శక్తి ఉన్న కారణంగా శ్రీ గణేశుని శ్రీ మహా గణపతి అని అంటారు.

*శ్రీ చింతామణి..!! ప్రభు చింతనద్వారా అందరి వ్యర్ధ చింతలను సమాప్తము చేసే శక్తి ఉన్న కారణంగా శ్రీ గణేశుని పేరు శ్రీ చింతామణి అయింది.

*శ్రీ బల్లాలేశ్వరుడు..!! నిరంతర ఈశ్వరీయ స్మృతిద్వారా అనేక పరిస్థితులను ఎదుర్కొనే శక్తి (బలము) శ్రీ గణేశునికి ప్రాప్తించిన కారణంగా వారిని శ్రీ బల్లాలేశ్వరుడు అని అంటారు.

*శ్రీ గిరిజాత్మజుడు..!! ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా తన మానసిక స్థితిని అచలంగా, దృఢంగా ఉంచుకునే శ్రీ గణేశుని శ్రీ గిరిజాత్మజుడు అని అంటారు.

*శ్రీ సిద్ధి వినాయకుడు..!! యోగ తపస్య ద్వారా ప్రతి సంకల్పాన్ని సిద్ధింపచేసుకునే శక్తి అనగా సర్వుల మనోకామనలను పూర్తి చేసే శక్తిని ప్రాప్తి చేసుకున్న శ్రీ గణేశున్ని శ్రీ సిద్ధి వినాయకుడు అని అంటారు.

ఇదేవిధంగా రాజయోగముద్వారా అనగా శివ పరమాత్మ స్మృతిద్వారా, యోగ-తపస్యలద్వారా దివ్య శక్తులను ప్రాప్తి చేసుకునే శివపుత్రులకు శ్రీ గణేశుడు ప్రతీక.

అష్ట వినాయకుడు..
అష్టవినాయక లేదా ఎనిమిది గణేష్లు భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది, అష్టవినాయక యాత్ర లేదా తీర్థయాత్ర వినాయకుడి ఎనిమిది పవిత్ర ఆలయాలు ఉన్నాయి .అన్ని ఎనిమిది అష్టవినాయక్ ఆలయాలు స్వయంభూ (స్వీయ-ఆవిర్భావం) మరియు జాగ్రూత్.

వివిధ ప్రదేశాలలో గణేష్ . గణేశ్వర్, మహంగపాటి, చింతామణి, గిరిజత్మాక్, విగ్నేశ్వర్, సిద్వివినాయక్, బల్లలేశ్వర్, వరద వినాయక్లు వివిధ గణేష్ పేర్లు. ఈ టెంపుల్స్ మోర్గావ్, రంజంగాన్, థిర్, లెనియద్రి, ఓఝర్, సిద్దాత్క్, పాలి మరియు మహద్ వద్ద ఉన్నాయి. ఈ ప్రదేశాలు పూణే, అహ్మద్ నగర్ మరియు రాయ్గడ్ జిల్లాలో ఉన్నాయి. 8 వినాయకాల్లో 6, పూణె జిల్లాలో 2, రాయ్గడ్ జిల్లాలో ఉన్నాయి, కానీ పూణే ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి

పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు.



పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు.

పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు.

ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల శయనమందిరము ( తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు.పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు.

అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.

పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు !
హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్తసులభుడు, హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేదపండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు.

ఆంజనేయస్వామి నవావతరాలు..!! ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చల ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు. వానరాకార ఆంజనేయస్వామి.

ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు. పంచముఖాలు ఐదు దిక్కులను దృష్టిని సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి.

తూర్పుముఖముగా హనుమంతుడు:.
తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు

దక్షిణముఖంగా
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.

పడమర ముఖంగా
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు

ఉత్తరముఖముగా
ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు

ఊర్ధ్వంగా
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.

శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి..
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.

"శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు
అలాగే ఆంజనేయ స్వామికి 'శ్రీరామజయం' అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

ఇంటి గడప ముందు #ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న #లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి



ఇంటి గడప ముందు #ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న #లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.
నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.
పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.
ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

గ్రహాలు అధిదేవతలు పూజావిధానాలు

గ్రహాలు అధిదేవతలు పూజావిధానాలు
ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. ఆయా గ్రహ అధిదేవతను ఉపాసిస్తే ఆ గ్రహ తీవ్రత తగ్గుతుంది. రవి కి రామావతారాన్ని, చంద్రుడికి కృష్ణావతారాన్ని, కుజుడికి నరసింహ అవతారాన్ని, బుధుడికి బుద్ధావతారాన్ని, గురువుకి వామనావతారాన్ని, శుక్రుడికి పరశురామావతారాన్ని, శనికి కూర్మావతారాన్ని, రాహువుకి వరాహావతారాన్ని, కేతువు కి మీనావతారాన్ని పూజించాలి. నవగ్రహాలలో ఏ గ్రహం యొక్క తీవ్రత అధికంగా ఉందో తెలుసుకొని శ్రీమన్నారాయణ అవతార ధ్యానం చేస్తే ఆ గ్రహా తీవ్రత తగ్గుతుంది. ఇది ఒక విధమైన శాంతి.
కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి.
దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.
ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని, రామావతారాన్ని, శివుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.
సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవాడు పార్వతీపరమేశ్వరులను, కృష్ణావతారాన్ని, ఆరాధించాలి. పొంగళి నైవేద్యం పెట్టాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.
మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను, నరసింహ అవతారాన్ని,సుబ్రమణ్యేశ్వర స్వామిని, మంగళ చండిని పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.
బుధవారం: బుధవారం విష్ణువు, బుద్ధావతారాన్నిఆరాధించాలి. పెసరపప్పు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి భార్య కుమారులు, మిత్రులు, తదితరులకు చక్కటి విద్య, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
గురువారం: గురువారం వామనావతారాన్ని, సాయిబాబా, హయగ్రీవుడిని, దత్తాత్రేయను ఆరాధించాలి. ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.
శుక్రవారం: శుక్రవారం పరశురామావతారాన్ని,లక్ష్మీదేవిని,లలితాదేవిని పూజించాలి. ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.
శనివారం: శనివారం కూర్మావతారాన్ని, రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు.

Thursday, January 11, 2018

లక్ష్మి మంత్రశక్తి ప్రవాహం



లక్ష్మి మంత్రశక్తి ప్రవాహం

ప్రతి అక్షరం బీజాక్షరం, ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా ఆలోక్యమయ్యే అతీంద్రియ శక్తి మంత్రం.

అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా..ఉదాహరణకి ఈ లక్ష్మి మంత్రాన్ని చూడండి. ఎంతో అపురూపమైన ఈ మంత్రాన్ని ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు సిద్ధిని, లబ్దిని, దివ్యానుభూతిని పొందవచ్చు.

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః స్వాహా

ఈ మంత్ర స్వరూపాన్ని కొంచెం వివరంగా అర్ధం చేసుకుందాం.మంత్రాలలో సర్వ సాధరణంగా వుండేది 'ఓం'. ఓంకారానికి అనేక అర్ధాలున్నాయి. అందులో ఒకటి,

ఆధునిక పరిభాషలో చెప్పాలంటే Hello to Divine Plane. ఎప్పుడు కొత్త Software నేర్పినా మొదట "Hello World!" అనే program తో మొదలవుతుంది.

అలాగే మంత్రం కూడా ఓంకారంతో మొదలవుతుంది. "ఓం" అనగానే దేవతామండలానికి సంకేతం వెడుతుంది. "శ్రీం" అనగానే అది లక్ష్మికి సంబంధించిన తలానికి చేరుతుంది. "హ్రీం" అనగానే జగత్తంతా సర్వవ్యాపకంగా వున్న ఆ పరాశక్తి, "భువనేశ్వరి" శక్తిని మన మంత్రం ప్రచోదనం చేస్తుంది.

ఆ విధంగా మంత్రంలో వున్న అక్షరాలు ఒక IP Address లా, ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఫోన్ నంబర్ లా ఆయా తలాలలోకి ప్రయాణిస్తాయి. బీజాక్షర ప్రభావం మహాశక్తిని అనంత సృష్టిలోనూ, మనో శక్తిని అంతర్లీనంగా సాధకునిలోనూ ప్రేరేపించి మనిషిని మనీషిగా తీర్చి దిద్దుతుంది.

మంత్ర ఉపాసకుడైన వ్యక్తి ఆవిధంగా Internet తో connect అయిన computer లా విశ్వంతో అనుసంధానం కాగలడు. ఉపాసన సిద్ధించినపుడు దార్శినికుడై,'నేను ' అనే తన చిన్న పరిధిని దాటి మహావిశ్వరహస్యాలనర్ధం చేసుకోగలడు ఏ కొత్త విషయాన్నైన వెంటనే గ్రహించగలడు.

అట్టి యోగి అనంతప్రకృతి ప్రణాళికలో భాగం కనుక Google లో వెతికి కనుక్కున్నట్టు విశ్వ జ్ఞానభండారం లోంచి విషయాలని తెలుసుకోగలడు. ఒకటి Internet ఇంకోటి Innernet.

లలితా సహస్రనామంలో అందుకే ఈ రహస్యాన్ని చెపుతారు - 'అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా ' అని. మనిషిలో అంతర్లీనంగా వున్న ఆ అమ్మని గుర్తించి ఆరాధిస్తేనే ఆమె దొరుకుతుంది, మరే బాహ్య అట్టహాసాలకి ఆ జగజ్జనని పట్టుబడదు అని అర్ధం.

ఇక్కడ ఒక్కసారి తిలక్ మాటలు గుర్తుకొస్తాయి 'కిటికీ కవితలోంచి, 'గదికి మది కూడా గవాక్షాలుంటాయి..... తెరచే కిటికినిబట్టి పరతెంచే పుష్పపరాగం వుంటుంది...' అని. మంత్ర నిర్మాణంలో బీజాక్షరాల ఎంపిక,కలయిక, వరుస కూడా ప్రధానమైన విషయాలే. రైలు ముందు ఇంజనులా ఏ తత్వాన్ని మనం పిలుద్దామనుకున్నామో ఆ తత్వ బీజాక్షరం ముందు ప్రాముఖ్యతని పొందుతుంది.

మన మామూలు ఆలోచన ప్రకారంగా చూస్తే లక్ష్మిని ధనంకోసం, సరస్వతిని చదువుకోసం, కాళిని నిశ్చయ సకల్పంకోసం, కార్తవీర్యార్జునిడిని పోయిన వస్తువులు దొరకడంకోసం అలా departments గా ఉపాసిస్తున్నా, మంత్రశాస్త్ర గ్రంధాలు బీజాక్షరాల ఎంపికతో ఒకే దేవతని ఏ సంకల్పంకోసమైనా ప్రార్ధించవచ్చు అని చెపుతున్నాయి.

ఉదాహరణకి 'ఐం దుర్గాయై నమః ' అన్న మంత్రం విద్యని, 'శ్రీం దుర్గాయై నమః ' అన్న మంత్రం లక్ష్మిని ఇస్తుంది.'క్లీం దుర్గాయై నమః' ఏ సంకల్పాన్నైనా సిద్ధింపచేస్తుంది, ఉదాహరణకి సంతాన ప్రాప్తికి అది మంచి మంత్రం. 'దుం దుర్గాయై నమః ' అనే దుర్గా మంత్రం దుర్గాదేవి మూలమంత్రంగా సిద్ధము, ప్రసిద్ధము కనుక ఆ మంత్రాన్ని దుర్గానుగ్రహాన్ని పొందడానికి తద్వారా పురుషార్ధాలని (పురుష=పురు+ష=dweller of hearts=omnipresent vital force that pervades life force ~ పరబ్రహ్మ, పరమేశ్వర, నారాయణ తత్వం), కామ్యాతీతమైన పరమార్ధాలని సాధించ వచ్చు.

ఆవిధంగా నిరాకారనిత్య చైతన్యాన్ని ఒక ఆకృతిలోనో, ఒక్కో ఆకృతిలోనూ కూడా దర్శించవచ్చును. దేవతలకి వాళ్ళవాళ్ళ రూపాలున్నప్పటికి వాళ్ళుకూడా ఒక మూలతత్వ ప్రతిరూపాలే. పదార్ధం (Matter) అణువుల సముదాయం ఎలాగో, అణువులు పరమాణు నిర్మితం ఎలాగో అలాగే దేవతలు కూడా పరబ్రహ్మత్వంతో నిర్మితమై, నిర్దేశితమై ఉంటారు.

అందుకే మన పెద్దవాళ్ళు ఏదైనా కష్టమైన పనిని "ఇదేమైనా బ్రహ్మ విద్యా?" అనడం పరిపాటి అయింది. ఆ బ్రహ్మవిద్య పట్టుబడితే అన్నిటిలో నారాయణున్ని, నారాయణునిలో అన్నిటిని దర్శించవచ్చు.

మళ్ళీ వొక్కసారి మనం పైన అనుకున్న లక్ష్మి మంత్రాన్ని చూస్తే,

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః స్వాహా

దీన్ని రెండుభాగాలుగా విభజిద్దాం. ముందు.

"ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం" చూస్తే అందులో స్పష్టంగా ఒక ఆకృతి,Symmetry కనిపిస్తాయి ఈ విధంగా:

"ఓం (శ్రీం హ్రీం శ్రీం) - - - - (శ్రీం హ్రీం శ్రీం) ఓం"

పైన చూపినట్టు హ్రీంకారము శ్రీంకారంతో wrap చేయబడి వుంది.ఆ విధంగా చేయటంవల్ల మంత్రాక్షరాలు శక్తివంతంగా వివిధ శక్తుల మేళవంగా అవుతాయి. దీన్ని మంత్ర సంపుటీకరణ అనికూడా అంటారు. మొత్తం మంత్రభాగం 'ఓం' తో సంపుటీకరించబడివుంది.

ఈ మంత్ర నిర్మాణంలో ఇంకో ప్రత్యేకత వుంది..

(ఓం (శ్రీం (హ్రీం (శ్రీం (కమలే (కమలాలయే () ప్రసీద) ప్రసీద) శ్రీం) హ్రీం) శ్రీం) ఓం) --> 1st Part

మహాలక్ష్మ్యై నమః స్వాహా --> 2nd Part

బీజాక్షరాలు Symmetrical గా కమలం (Lotus)లో రేకుల్లా (Petals) వున్నట్లు గమనించ వచ్చు - మొదటి భాగంలో.

ఇక రెండో భాగం పద్మానికి కాడగా వుంటుంది. అయితే ఈ మంత్రం కమలంగా ఎందుకు వున్నట్లు? ఎందుకంటే ఇది లక్ష్మి మంత్రం కనుక, లక్ష్మీ దేవి 'కమలాసన ', 'పద్మప్రియ ' కనుక.

ప్రతి దేవతకి వారి వారి మూల బీజాక్షరాలని వాడడం ద్వారా మంత్రాన్ని మరింత శక్తివంతంగా చేయవచ్చు అని పైన చెప్పుకున్నాం. 'దుం' దుర్గకు ప్రీతికరమని అనుకున్నాం. 'సం ' సూర్యబీజాక్షరం, 'గం' గణపతి బీజాక్షరం, 'ఐం' సరస్వతి బీజాక్షరం, అలా ఆయా దేవతల మంత్రాలలో బీజాక్షరాలు కనిపిస్తుంటాయి, సాధకులను అనుగ్రహిస్తుంటాయి.

మంత్రాణి పల్లవోపేతం బీజశక్తి సమన్వితం |
యధా తంత్రకృతం జప్త్యా సద్యస్సిద్ధి ప్రదంస్మృతం ||

మంత్రములన్నీ ఆయాపనులకు సంబంధించిన పల్లవములతో కూడి బీజశక్తి సమన్వితములై సరియగు విధానముతో జపము చేయుట వలన వెనువెంటనే సిద్ధించగలవు అని అర్ధం. మంత్రములు ఫలించునపుడు స్వప్నములుగా దేవతలు సంకేతములు ఇవ్వడం జరుగుతుంది.

విధి విధానంగా పూర్తి చేయలేనివారు బ్రామ్హణ సహాయంగా చేయించి తాయారు చేసిన లక్ష్మి కవచాన్ని ధరించి మంత్ర పఠనం ద్వారా పూర్తి లబ్ది పొందవచ్చు.

ఇలా అనేక మంత్రాలు విస్సా ,గ్రీన్ కార్డు లలా పని చేస్తాయి వాటిని గురుముఖతః తెలుసుకొని లబ్ది పొందవచ్చు.

ముఖ్యంగా ఏ మంత్రమైనా.. గురుముఖతా తీసుకుని..చేయాలి.

శుభమస్తు...శ్రీ మాత్రే నమః

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

హనుమాన్ చాలిసా .
సుప్రసిద్ద హిందీ ప్రాచీన కవి ,శ్రీరామ భక్తులలో
అగ్రగణ్యుడు 'రామచరిత మానస్ 'అనే పేరుతో రామాయణం రచించిన గోస్వామి
తులసీదాసు తీర్థములు దర్శిస్తూ పండరీపురం చేరి ,అక్కడ కొంతకాలం నివసించాడు .నిత్యకృత్యాల్లో భాగముగా ఓ
రోజున 'చంద్రభాగా ' నదిలో స్నానం చేసి
పండరినాథుని ధ్యానిస్తూ నదీతీరాన కూర్చుని ఉన్నాడు .అదే సమయములొ ఒక అంధుడు ఇంట్లొ తగాదాపడి అత్మహత్య చేసుకొందామని అక్కడికొచ్చాడు .ధ్యానం లో
ఉన్న తులసిదాసును ఆ అంధుడు పాదాలు
తగిలాయి .అతడు పడిపొయాడు .తులసి
వెంటనే ఆ అంధుణ్ణి పైకి లేపి ,అలింగనం చేసుకుని 'క్షమించు నాయనా ! నీ కృపాదృష్టిని నాపై ప్రసరింపచెయ్యి .ఇటు చూడు 'అన్నాడు .అంతే ...ఆ అంధుడికి చూపువచ్చింది .పరమానందంతో తులసిదాసు పాదాలపైబడి 'స్వామీ ! మీరు
నా పాలిట సాక్షాత్తూ పాండురంగస్వామి వే
నాకు దృష్టిని ప్రసాదించారు .మరోజన్మకు
నన్ను అర్హుణ్ణి చేశారు .ఈ పునర్జన్మను అధ్యాత్మిక సేవతో సద్వినియోగము చేసుకొంటాను 'అని అన్నాడు .అందుకు తులసిదాసు 'నాయనా !ఇది నా మహిమకాదు .నేను సామాన్యుణ్ణి .విఠల ప్రభువు అనుగ్రహ పాప్తి కలిగింది .నీకు అది దివ్యదృష్టి .నీ శేష జీవితాన్ని దైవచింతనలో
ధన్యం చేసుకో 'అని పలికాడు .
తులసిదాసు జీవితంలో ఇలాంటి సంఘటనలెన్నో సంభవించాయి .ఇవన్నీ
భగవంతుడు ఆయనద్వారా వ్యక్తం చేయించినవే .ఈ విషయం ఆ కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తెలిసింది .తనకొలువుకు రావాల్సిందిగా
అహ్వానించాడు .'నీకు చాలా మహిమలున్నట్లు తెలిసింది ...నాకు కొన్ని చూపించు .మెప్పించి పారితోషికాలు స్వీకరించు 'అని కబురు పంపాడు .
అందుకు తులసిదాసు ' పాదుషా చక్రవర్తీ !
నేను రామదాసును .నాలో ఏ మహిమలూ
లేవు .నిమిత్రమాత్రుణ్ణి. ఏమైనా ,ఎక్కడైనా వ్యక్తమైతే అవి శ్రీరామచంద్రమూర్తి లీలలు !'
అని బదులిచ్చాడు .అక్బరుకు ఆగ్రహం
కలిగింది .' ఎమిటీ !పాదుషానే ధిక్కరిస్తున్నావా ! నా మాట విననివాళ్లకు
మరణదండన తప్పదని సంగతి నీకు తెలియదా 'అని గద్దించాడు .తులసిదాసు
వినమ్రుడై బదులు పలికాడు .'మరణమే శరణ్యమని రాముని సంకల్పమైతే ఆ మరణం ఆపినా ఆగదు .'అన్నాడు .అక్బరు క్రోధం తారాస్థాయికి చేరుకొంది .తన ఆజ్ఞను
కాదనీ ధిక్కరించినందుకు భటులని పిలచి
తులసిదాసును కొరడాదెబ్బలతో కొట్టవలిసినదిగా ఆదేశించాడు .తులసి రెండు
చేతులు జోడించి 'రామనామ 'స్మరణం చేశాడు .భటుల చేతిలో కొరడాలు లేచినవి
లేచినట్లే ఉండిపోయాయి .అక్బరుతో సహా
భటులను భయంకర చూపులతో ,అరుపులతో అసంఖ్యాకమైన
కోతులు బెదిరించసాగాయి .అందరూ కంపించసాగారు .చుట్టూ చేరిన కోతులు వాళ్లను అడుగైనా కదలినివ్వడం లేదు .అక్బరు దిగ్బ్రాంతి చెంది దిక్కుతోచని
స్థితిలో ఉండిపోయాడు .తనపొరపాటును తెలుసుకున్నాడు .తులసిదాసు పాదాలమీద
పడి కన్నీరుమున్నీరుగా విలపించసాగాడు .
తులసికి ఏమీ అర్థం కాలేదు .కారణమడిగితే
తనదయనీయ స్థితిని వివరించాడు అక్బరు .
తనకే కోతులు కనిపించడంలేదే .భక్తి ప్రపత్తులతొ హనుమను ప్రార్ధించాడు .
'స్వామీ !నాపై ఎందుకింత నిర్దయ .వీరందరికీ
దర్శనమిచ్చి కరుణించావు కదా !నాకెందుకు
ఆ సౌభాగ్యం ప్రసాదించవు ?నేను చేసిన
అపరాధం ఏదైనావుంటే క్షమించు 'అంటూ
దుఃఖబాష్పధారలు స్రవిస్తుంటే ,ఎలుగెత్తి
వాయునందనుణ్ణి అనేక విధాలా స్తుతి చేశాడు .పవన సుతుని దర్శనం పొంది
పరమానందభరితుడై పోయాడు .
అదే 'హనుమాన్ చాలిసా 'గా జగత్ప్రసిద్ది
పొందింది .మారుతి కటాక్ష వరమహిమ చేత
తులసిదాసు విరచిత 'హనుమాన్ చాలిసా '
మోక్ష తులసిదళమై రామనామ జపసాధకులను పునీతం చేస్తుంది

ప్ర‌ముఖ యంత్ర‌ములు – వాటి ఫ‌లితాలు



ధనాకర్షణ యంత్రం

ఆర్ధిక సమస్యలను పారద్రోలుటకు చేయుచున్న పనులయందు ధనలాభం చేకుర్చుటకు అప్పుల ఊభి నుండి మానవులను బయటకు తీసి ప్రసాంతత చేకుర్చుటకు ధనలక్ష్మి కటాక్షం పొందుటకు ఆర్ధిక సమస్యలనుండి కాపాడి లక్ష్మీకటాక్షం పొందుదురు ఈ యంత్రము వలన ధనలాభం చేకూరును మానవులకువ్యాపార అభివృద్దికి కలుగ జేసి దినదినాభివృద్ది తో మానవులు ఆర్దికభాధలు లేకుండా చేసి కుటుంబము ఆనందముగా జీవించుటకు ఉపయోగపడి ఇంటిలోనవారందరికి వర్చస్సు ఆరోగ్యము ఆర్ధిక పుష్టి కలుగజేసి ఆనందమయ జీవితం గడుపుటకు దోహదపడును.

ఈ యంత్రం ఇంటిలో దేముని మందిరం నందు ఉంచి ప్రతీ రోజు ఈ మంత్రంజపించవలెను.

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం మహాలక్ష్మి నమః

అని కనీసం 11 సార్లు యంత్రమును చుస్తూ పఠించి మనసున మీరు కోరిన కోరికను యంత్రములో ఉన్న మహాలక్ష్మి దేవికి విన్నవించుకోవలెను.
మీ ఏకాగ్రత శ్రద్ధ భక్తి తో మీరు అమోఘమైన ఆర్ధిక విజయాలు సాదింతురు ఈ యంత్రం వ్యాపార స్థలం లో తూర్పు ఈశాన్యం లేక ఉత్తరము ను చూచునట్లు గా యజమాని కుర్చునున్న కుర్చీ వెనుక గోడకు స్తాపన చేసిన యెడల యంత్రము నుంచి ప్రసరించు అద్భుతమైన శక్తీ కిరణములు ల వలన యజమానికి మంచి తేజస్సు ఆకర్షణ శక్తీ లభించి మంచి ప్రశాంత చిత్తము కలిగి వ్యాపారాభివ్రుది జరుగును సమస్త జనులకు ధనాకర్షణ యంత్రం ఆకర్షణకు గురిచేసి వ్యాపారాభివ్రుదికి పూర్తిగా ఉపకరించును ప్రతిరోజూ దుకాణం తెరచిన వెంటనే మనః పూర్వకముగా యంత్రమునకు నమస్కరించవలెను దుకాణం మూసేటప్పుడు యంత్రమునకు నమస్కరించవలెను.

ఈ యంత్రమువలన (1) ధనలాభం (2) ధాన్యం (3) వాహనం (4) సువర్ణములు మణి మాణిక్యాలు (5) పుత్రులు (6) సేవకదాసిజనం (7) బంధువులు (8) మిత్రులు అనబడే అష్ట ఐ స్వర్యాలు సిద్దించును.

*శ్రీ చ‌క్రం*

హిందూమ‌త చింత‌న ప్ర‌కారం ఈ లోకంలోని స‌ర్వ‌శ‌క్తులు ఆదిశ‌క్తి నుండి ఉద్భ‌వించాయి. ఈ విశ్వ‌జ‌న‌నికి ఒక నిర్ధిష్ట రూపంలేదు. అయితే ధ్యాన‌శ‌క్తితో ఆ రూపాన్ని ద‌ర్శించిన రుషులు ఒక యంత్ర‌రూపం మ‌న‌కు ప్ర‌సాదించారు. ఈ యంత్రం రేఖ‌లు, వృత్తాలు, త్రిభుజాలుగా ఈ సువిశాల విశ్వానికి ప్ర‌తిబింబంగా రూపొందించారు. అటువంటి యంత్ర‌రూపాల్లో అద్భుత‌మైన‌ది శ్రీ‌చ‌క్రం. శ్రీ చ‌క్ర ప‌రిలేఖ‌న విధి అతిపురాత‌న అధ‌ర్వ‌ణ‌వేద‌ము, ఉప‌నిష‌త్తులు, ప‌ర‌మానంద తంత్ర‌ము, నామ‌కేశ్వ‌ర తంత్ర‌ము మొద‌ల‌గు మంత్ర‌తంత్ర శాస్త్రముల‌లో చెప్ప‌బ‌డి వున్న‌ది. శ్రీ చ‌క్రంలో స‌మ‌స్త‌మూలాలు, మూల‌కాలు, మ‌హిమాన్వితులైన దేవ‌త‌లు, మంత్రోచ్ఛార‌ణ‌లు, కేంద్రంలో ఒక బిందువు వున్నాయి. ఆ కేంద్రంలో వున్న బిందువు, విచ్చుకుని మొల‌కెత్తేందుకు సిద్ధంగా వున్న విత్త‌నాన్ని సూచిస్తుంది. త‌న‌లో నుండి కొత్త‌శ‌క్తి ఇవ్వ‌గ‌ల‌టాన్ని తెలియ‌జేయ‌డం ఆ బిందువు యొక్క ఉద్దేశం. మొద‌ట బిందువు, ఆ కేంద్ర బిందువు చుట్టూ త్రికోణ‌ము ఆ పైన అష్ట‌కోణ‌ము త‌రువాత ద‌శ‌కోణ‌ముల య‌గ్మ‌ము ఆ పైన ప‌దునాల్గు కోణాలు. ఆ త‌రువాత అష్టాద‌శ కోణ‌ములు (ప‌దునెనిమిది) యుగ్మ‌ము, ఆపైన అష్ట‌ద‌ళ‌క‌మ‌ల‌ము, దానిపైన షోడ‌శ‌ద‌ళ‌క‌మ‌ల‌ము, దానిని బ‌ట్టి మూడు వృత్తాలు, దాని చుట్టూ చ‌తుర‌స్రాకార‌ముగా నాలుగు ద్వారాలు గ‌ల భూపుర‌త్ర‌య‌ము అదియే ప‌ర‌దేవ‌త యొక్క శ్రీ చ‌క్ర‌ము. బ్ర‌హ్మ విద్య‌ను శ్రీ విద్య‌గాను, దాని రూప‌మును శ్రీ చ‌క్ర‌ముగాను భావిస్తారు. ఛాందోగ్యోప‌నిష‌త్ నుండి సృష్టికి ముందు స‌త్ అనే చిద‌గ్నిగా భావింప‌బ‌డే బ్ర‌హ్మ ప‌దార్ధ‌ము వున్న‌ది. అది మ‌హాబిందువు. మొద‌టిది అది అనేక‌ముగా అగుదును అని సంక‌ల్పించి మ‌హాకార‌ణ రూప‌మైంది. దాని శ‌క్తి యొక్క క్షేత్ర‌రూప‌మే శ్రీ చ‌క్ర‌ము అని తెలుస్తోంది. కేంద్ర‌బిందువు చుట్టూ మొత్తం తొమ్మిది త్రిభుజాలుంటాయి. వీటిలో ఐదు త్రిభుజాలుపైన‌, మొన‌దేలిన భాగం కిందివైపున వుంటాయి. మిగిలిన నాలుగు త్రిభుజాల మొన‌దేలిన భాగంపై వైపున వుంటాయి. ఈ త్రికోణాల భుజాలు ఒక‌దానిని మ‌రొక‌టి దాటుకుంటూ చేసే ప్ర‌యాణంలో మొత్తం మ‌రో 43 త్రిభుజాలు ఏర్ప‌డ‌తాయి. ఈ త్రిభుజ‌రూపాల చుట్టూ మూడు వృత్తాలుంటాయి. వీటిలో లోప‌లి ఐదు త్రిభుజాలుపైన‌, మొన‌దేలిన భాగం కిందివైపున వుంటాయి. మిగిలిన నాలుగు త్రిభుజాల మొన‌దేలిన భాగంపై వైపున వుంటాయి. ఈ త్రికోణాల భుజాలు ఒక‌దానిని మ‌రొక‌టి దాటుకుంటు చేసే ప్ర‌యాణంలో మొత్తం మ‌రో 43 త్రిభుజాలు ఏర్ప‌డ‌తాయి. ఈ త్రిభుజ‌రూపాల చుట్టూ మూడు వృత్తాలుంటాయి. వీటిలో లోప‌లి వృత్తానికి 8 రేకులు, వెలుప‌ల వృత్తానికి 16 రేకులు వుంటాయి. వీటిని చుట్టి రెండు మంద‌మైన గీత‌లు వుంటాయి. ఈ గీత‌ల‌న్నీ నాలుగు దిక్కుల నాలుగు ద్వారాల‌లాగే తెరుచుకుంటాయి. శ్రీ‌చ‌క్రం భౌతిక‌, మాన‌సిక‌, జీవ‌శ‌క్తుల క‌ల‌యిక‌తో కూడిన‌ది. ఈ శ‌క్తులు బాహ్య అంత‌రంగ‌శ‌క్తులు రెండిటిని క‌లిగిన‌ది. దీనినే కుండ‌లిని శ‌క్తి అంటారు. ఇదే స‌ర్వ‌శ‌క్తి రూపం. జ‌గ‌జ్జ‌న‌ని మాన‌వ శ‌రీరంలోని వృత్తంలో నిద్రిస్తుంటుంది. దీనిని త‌ట్టి బైట‌కు తీసేందుకు ఉద్దేశించిన‌వే ధ్యానం, ప్రాణాయామాలు, లోప‌లి వృత్తంలోని కుండ‌లిని శ‌క్తి, బ‌య‌టి వృత్తం లేదా అత్యున్న‌త వృత్తంలోకి తీసుకురాగ‌లిగేందుకు మ‌నిషి త‌న ఆత్మ‌శ‌క్తిని తెలుసుకొన‌డం జ‌రుగుతుంది. అది భ‌గ‌వంతుని రూపాన్ని కాంచ‌టం అంటారు. దీనిని సాధించ‌డం కోసం మ‌నిషి సాధ‌న చేయాలి.

*శ్రీ సుద‌ర్శ‌న చ‌క్ర మ‌హాయంత్ర‌ము*

ఈ యంత్ర‌ము రాగి లేక వెండి రేకు మీద దైవ‌జ్ఞుల‌చే త‌యారు చేయించుకొని, యంత్ర సంస్కార‌, ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌, జీవ‌క‌ళాన్యాసాదుల‌ను గావించి, శుభ‌ముహూర్త‌మున పూజా స్థాన‌మందుంచి పూజాదులు ప్రారంభించ‌వ‌ల‌యును.

పూజావిధి ఈ సుద‌ర్శ‌న‌ము – శ్రీ మ‌హా విష్ణువు యొక్క ప్ర‌ధాన ఆయుధ‌ము. ఈ స్వ‌రూప‌ము – స‌ర్వుల‌కు ర‌క్ష‌ణ క‌ల్గించుట‌లో అమోఘ‌మైన‌ది.

స‌ర్వ‌జ‌న్మ‌ల పాప‌ముల‌నుహ‌రించి సుఖ‌శాంతుల‌ను చేకూర్చున‌ట్టి – ఈ యంత్ర‌మును దీక్ష‌, నియ‌మ‌, నిష్ఠ‌ల‌తో 40 రోజులు నిత్య‌షోడ‌శోప‌చార పూజ‌లు జ‌రుపుచుండ‌వ‌లెను. ఓం ఆం హ్రీం క్రోం స‌హ‌స్రార హుం ఫ‌ట్ స్వాహా అనే మూల మంత్రాన్ని ప్ర‌తిరోజు 2500 సార్లు జ‌పించుచూ, మొత్త‌ము ఒక ల‌క్ష జ‌ప‌ము చేయ‌వ‌లెను. జ‌ప ఫ‌ల‌మును యంత్ర‌మున‌కు ధార‌బోయ‌వ‌లెను. అప్పుడు యంత్ర‌ము శ‌క్తివంత‌మ‌గును. పిద‌వ ఈ యంత్ర‌మును శుభ‌ముహూర్త‌మున గృహ‌మునందు స్థాపించుట‌యో లేక పూజా మందిర‌ము నందుంచి నిత్య‌పూజాదులు చేయ‌వ‌లెను.

ఈ క్రింద చెప్ప‌బ‌డిన సుద‌ర్శ‌న మంత్రంతో ఈ యంత్ర‌ముకు 41 రోజుల‌లో 3,00,000 జ‌పం, త‌ర్ప‌ణం చేయించి అధివాస‌ములు చేయించి దీనికి సుద‌ర్శ‌న హోమం చేయించి వ్యాపార సంస్థ‌లో కానీ, గృహ‌ము నందు కానీ ప్ర‌తిష్ఠించిన ఎడ‌ల ఈ యంత్ర ప్ర‌భావంతో న‌ర‌ఘోష‌పోయి శ‌తృసంహారం జ‌ర‌గ‌గ‌ల‌దు అని ప్రాచీన సాంప్ర‌దాయ‌ము. అయితే ఈ యంత్రం ఉన్న ఇంట అశౌచ‌ము క‌లిసిన ఎడ‌ల దీని ప్ర‌భావం స‌రిగా ప‌నిచేయ‌దు. త‌త్ర్ప‌భావంగా ప్ర‌తికూల ఫ‌లిత‌ములు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. దీనిని ప్ర‌తిష్ఠా విధానంగా ప్ర‌తిష్ఠ చేయ‌వ‌లెను. దీనిని బ్రాహ్మ‌ణ ముఖ‌తః జ‌పం చేయించి హోమ త‌ర్ప‌ణాదులు చేయించి ప్ర‌తిష్ఠించ‌వ‌లెను.

*శ్రీ మ‌త్స్య మ‌హాయంత్ర రాజ‌ము*

యంత్ర విశిష్ట‌త‌ శ్రీ మ‌హా విష్ణువు యొక్క ద‌శావ‌తార‌ముల‌లో మొట్ట‌మొద‌టి అవ‌తార‌మే మ‌త్స్యావ‌తార‌ము వేద స‌ముద్ధ‌ర‌ణ‌కై అవ‌త‌రించిన శ్రీ మ‌హావిష్ణువు రూప‌ము. ఈ యంత్ర‌ము, ఇత‌ర యంత్ర‌ముల క‌న్నా చ‌లా విశిష్ట‌మైన‌ది. స‌మ‌స్త వాస్తు దోష నివార‌ణ యంత్ర రాజ‌ము ముఖ్య‌ముగా విశేషించి ఈ యంత్ర‌ము – వాని ప్ర‌స్థార‌ము నందు గ‌ల స‌ప్తావ‌ర‌ణ‌ల‌లోను అతి ముఖ్యము శ‌క్తివంత‌మైన బీజాక్ష‌ర‌ముల‌తో రూపొందించ‌బ‌డి, స‌ర్వ సాంప్ర‌దాయాను కూల‌ముగా నిర్మించ‌బ‌డిన‌దీ యంత్ర‌ము. పూజా విధి ఈ మ‌త్స్య యంత్ర‌మును శాస్త్రానుసార‌ముగా దైవ‌జ్ఞుల‌చే త‌యారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ క‌ళాన్యాస‌, ప్రాణ‌ప్ర‌తిష్టాదుల‌ను జ‌రిపించి, శుభ స‌మ‌య‌మున యంత్ర పూజ‌, జ‌పాదుల‌ను ప్రారంభించ‌వ‌లెను. ఈ యంత్ర‌మును శ‌క్తివంత‌ముగా చేయుట‌కై విధి విధాన‌మును మిగిలిన యంత్రముల క‌న్న కొంచెము ఎక్కువ‌గానే నిర్ధేశింప‌బ‌డిన‌ది. గావున ఆ విధ‌ముగా స‌ర్వ‌ము దీక్ష‌తో నిర్వ‌హించి శుభంబుల‌బ‌డ‌య‌వ‌ల‌సిదిగా ప్రార్థ‌న‌.

*శ్రీ వాస్తు పురుష మ‌హా యంత్ర‌ము*

ఈ వాస్తు పురుష మ‌హా యంత్ర‌మును గృహ నిర్మాణ స‌మ‌య‌మునందు, శంకుస్థాప‌న‌ల యందు లేదా మీరు నివ‌సించు నివాస గృహ‌మునందుగాని ఈ యంత్ర‌మును స్థాపించిన మీ గృహ‌ముల‌లో గ‌ల స‌మ‌స్త వాస్తు దోషాలు తొల‌గిపోయి ఆ ఇంటి య‌జ‌మానికి అందులో కాపుర‌ముంటున్న వారికి ఆయురారోగ్య భాగ్య‌ములు మ‌రెన్నో శుభాలు క‌లుగును. ఈ వాస్తు పురుష మ‌హాయంత్ర‌ము గృహ‌మునందు, షాపింగ్ కాంప్లెక్స్‌నందు, రైస్ మిల్లులు, ఫ్యాక్ట‌రీలు, సినిమాహాళ్లు మొద‌లైన అన్ని నిర్మాణ‌ముల యందు స్థాపించిన ఎడ‌ల ఆ క‌ట్ట‌డ‌ముల‌లో గ‌ల వాస్తు దోష‌ములు తొల‌గిపోవును.
ఈ యంత్ర‌ము రాగితో గాని, వెండితోగాని త‌యారు చేయించి నూత‌న క‌ట్ట‌డాలు ప్రారంభించే ముందు ఈ యంత్ర‌మును ప‌సుపు కుంకుమ‌ల‌తో పూజించి కొబ్బ‌రియాకాయ కొట్టి సాంబ్రాణి ధూపం వేయాలి. ఈ మ‌హాయంత్ర‌మును పూజామందిరంలో వుంచి, నిత్య‌ము ఏదో ఒక పండుగాని, ప‌టిక‌బెల్లం చిప్స్‌గాని నైవేద్యంగా పెట్టి రెండు అగ‌రుబ‌త్తిలు వెలిగించి వాస్తు పురుషుని మ‌న‌సున త‌ల‌చి మూల మంత్ర‌మైన ఓం వేదాత్మ‌నాయ విద్య‌హే హిర‌ణ్య గ‌ర్భాయ ధీమ‌హి త‌న్నో బ్ర‌హ్మ ప్ర‌చోద‌యాత్ అనే మంత్రాన్ని జ‌పించి న‌మ‌స్క‌రించాలి. ఈ విధంగా ప్ర‌తినిత్య‌ము చేయాలి. ఈ విధంగా యంత్ర‌మును స్థాపించిన మీ గృహ‌ములో గ‌ల వాస్తు దోషాలు తొల‌గిపోయి మీకు ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాలు, భోగ భాగ్యాలు క‌లుగును.

యంత్ర‌ములు త‌యారీ, విశిష్ట‌త‌

యంత్ర‌ము పూర్వ‌కాల‌మున నిష్ఠాగ‌రిష్టులైన వారు ద్విజ‌త్వం పొందిన‌వారు మంచి గురువును ఆశ్ర‌యించి సేవ చేసి గురువు అనుగ్ర‌హం చేత మంత్రోప‌దేశం పొంది ఆ మంత్ర‌మును త్రిక‌ర‌ణ శుద్ధిగా కొన్ని ల‌క్ష‌ల‌, కోట్ల సార్లు ప్ర‌య‌త్న‌పూర్వ‌కంగా జ‌ప‌ము చేసి మంత్ర‌సిద్ధి పొందిన త‌రువాత శాస్త్రోక్తంగా వాటి తిధి, వార‌, న‌క్ష‌త్ర కాల‌ముల‌కు అనుగుణంగా బంధువుల నుండి మొద‌లుకొని వుండే కోణాల‌ను త్రికోణ‌, చ‌తుఃకోణ‌, పంచ‌కోణ‌, అష్ఠ‌కోణ మ‌రియు అష్ఠ‌ద‌ళ‌, అష్ఠ‌ద‌ళ‌ములు మొద‌లుగా గ‌ల వాటి ఆకార‌ములు హెచ్చుత‌గ్గులు లేకుండా వాటిలో బీజ‌మంత్ర‌ములు లిఖించి, వాటిని త‌గిన రీతిలో యంత్ర‌ము నందు శ‌క్తిని నింపి ఇచ్చేవారు. కానీ ప్ర‌స్తుత కాలంలో మంత్ర సిద్ధి పొందిన వారు త‌క్కువ‌గా వుండి అందుబాటులో లేక‌పోవ‌డంతో యంత్ర‌మును పంచ‌లోహ‌ముల‌తో త‌యారు చేయుట జ‌రుగుతుంది. మంత్ర‌శ‌క్తిని బీజ‌శ‌క్తిని పంచ‌లోహ‌ములు సులువుగా గ్ర‌హించ‌గ‌ల‌నందున యంత్ర‌మును పంచ‌లోహ‌ముల‌తో త‌యారు చేసి, భ‌క్తుల‌కు అందించుట జ‌రుగుతున్న‌ది. ఏఏ లోహ‌ము ఎంతెంత మోతాదులో వుండాలో వాటిని స‌మానంగా స‌రిప‌డు మోతాదులో క‌లిపి కాలధ‌ర్మానుగుణంగా శ‌క్తి యంత్రంలో కేంద్రీకృత‌మ‌గున‌ట్లుగా నిక్షిప్తం చేసి ముద్రించి వాటికి వుండే యంత్రాధిష్టాన దేవ‌తా క‌ళ‌ను ఆవాహ‌న చేసి యంత్రం వెనుక బ్ర‌హ్మ‌క‌మ‌లం రేకు గ‌జ‌రేశ పుంజ‌ము9ను అమ‌ర్చి ప్ర‌తిష్టించి ఇవ్వ‌బ‌డును. ఈ యంత్ర‌ము నందు సంస్కృత బీజ‌మంత్ర‌ముల‌ను నిక్షిప్తం చేసి యంత్ర కోణాలు బీజ‌ములు ఊర్ధ్వ‌ముఖ దీప‌న‌మై వెలుగొందుతూ దోష‌ర‌హిత‌ముగా శ‌క్తి ప్ర‌వాహాలుగా మారి ఆ శ‌క్తి చుట్టుప‌క్క‌ల ప్ర‌స‌రించి ఆ ప్రాంత‌మును ప‌విత్రంగా, చైత‌న్య‌ముగా చేయును. దేవాల‌యంలో వున్న మూల‌విరాట్ విగ్ర‌హ‌మున‌కు ఎంత ప్రాధాన్య‌త వుంటుందో అలాగే పంచ‌లోహ విగ్ర‌హ‌మూర్తుల‌కు కూడా అంతే ప్రాధాన్య‌త వుండును. ఉదాహ‌ర‌ణ తిరుప‌తిలో వెంక‌టేశ్వ‌ర‌స్వామికి చేసే సేవ‌లు అన్ని ఉత్స‌వ విగ్ర‌హ‌ముల‌కు కూడా చేయుదురు. ఉత్స‌వ మూర్తులు మాన‌వ‌నిర్మిత విగ్ర‌హ‌ములు, పంచ‌లోహ‌ముల‌తో త‌యారు చేయ‌బ‌డిన‌వి. చాలా విశిష్ట‌త క‌లిగిన‌వి. శ్రీ‌శ్రీ‌శ్రీ ల‌లితా త్రిపుర సుంద‌రీ పీఠం వారిచే త‌యారు చేయ‌బ‌డిన యంత్ర‌ముల‌కు కూడా ప‌రిపూర్ణ శ‌క్తి వుండును అనుట‌లో సందేహం లేదు. ఈ యంత్ర‌ములు చాలా శ‌క్తివంత‌మైన‌వి. ప్ర‌త్యేక నియ‌మ‌, నిష్ట‌ల‌ను, భ‌ద్ర‌త‌ల‌ను పాటిస్తూ భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో లోక‌క‌ళ్యాణ‌ము కొర‌కు త‌యారు చేయుట జ‌రుగుతున్న‌ది. యంత్ర‌ము త‌యారు చేయుట‌కు అయిన ఖ‌ర్చును మాత్ర‌మే దీనికి ధ‌ర‌గా నిర్ణ‌యించ‌డం జ‌రుగుతున్న‌ది. కానీ దీని ధ‌ర నిర్ణ‌యింప‌రానిది. అమోఘ‌మైన‌ది. ఏ యంత్ర‌ము వ్యాపార కాంక్ష‌తో ఇచ్చుచున్న‌ది కావు. స‌నాతన ధ‌ర్మంనందు విధిత‌మైన తంత్ర‌, మంత్ర‌, యంత్ర ర‌హ‌స్య విద్య యొక్క ప్రాముఖ్య‌త ప్ర‌యోజ‌నం ప్ర‌జ‌లు అంద‌రూ అనుభ‌వించి ఈ క‌లియుగంలో వారి ఇష్ట‌మైన కోరిక‌ల‌ను నెర‌వేర్చుకొని వారి జ‌న్మ‌ను సార్ధ‌క‌ము చేసుకొని భ‌గ‌వంతుని మ‌హిమావిశేషాల‌ను అంద‌రికి విశిధ‌ప‌ర‌చ‌గ‌ల‌ర‌ని మ‌న‌సా, వాచా, క‌ర్మ‌ణా, త్రిక‌ర‌ణ శుద్ధిగా న‌మ్ముతున్నాము.

పంచ‌లోహ‌ముల విశిష్ట‌

పంచ‌లోహాలు అన‌గా రాగి, ఇత్త‌డి, వెండి, కంచు, బంగారం వీటిని పంచ‌లోహాలు అని అంద‌రు. ఇవి పంచ‌భూతాల‌తో స‌మానంగా ప‌నిచేయును. పంచ‌భూత‌ములు మాన‌వ శ‌రీరంలో పంచ ఇంద్రియాల‌కు స‌మానంగా ప‌నిచేయును. పంచ‌భూత‌ములు మానవ శ‌రీరంలో పంచ ఇంద్రియాల‌కు స‌మానంగా ప‌నిచేయును. రాగి-అగ్ని-నేత్ర‌ము, కంచు-వాయువు-నాసిక‌ము, వెండి-నీరు-నాలుక‌, బంగార‌ము-ఆకాశ‌ము-క‌ర్ణం-, ఇత్త‌డి-భూమి-చ‌ర్మం. మాన‌వునికి పంచ ఇంద్రియాల వ‌ల్ల నిత్య‌క‌ర్మ‌లు ఆచ‌ర‌ణ జ‌రుగుతున్న‌ది. కావున మాన‌వుడు చేసిన నిత్య‌క‌ర్మ‌ల‌లో త‌న‌ను కాపాడుట‌కు అనేక పాప‌ములు చేయుచూ త‌న ఇంద్రియ శ‌క్తిని కోల్పోయి అనేక ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఇంద్రియ‌శ‌క్తిని కోల్పోకుండా ఈ పంచ‌లోహాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. కావున యంత్రానికి పంచ‌లోహాల‌ను వాడుట‌కు ప్రాముఖ్య‌త‌ను ఇస్తున్నారు. పంచ‌భూతాలు అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, నీరు ఇవి పంచ‌భూత‌ములు. ఇవి మాన‌వునిపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయి. నిత్య‌జీవితంలో మాన‌వుడు నిద్రావ‌స్థ‌లో త‌న శ‌రీరంను చైత‌న్య‌ప‌రుచుకొని ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి పంచేంద్రియ శ‌క్తితో చూడ‌గ‌లుగుతూ, విన‌గ‌లుగుతూ, మాట్లాడ‌గ‌లుగుతూ వాస‌న పీల్చ‌గ‌లుగుతూ, స్ప‌ర్శ‌జ్ఞానంను అనుభ‌విస్తూ, రుచిని ఆశ్వాదిస్తూ మొద‌లుగా గ‌ల పంచ‌జ్ఞాన‌శ‌క్తిని పంచ‌భూతాల నుండి గ్ర‌హించును. అక్క‌డ మాన‌వునికి వున్న మ‌న‌స్సును నియంత్రించుకోలేక అంద‌రిని ఈ అయిదు శ‌క్తుల‌ను దుర్వినియోగ‌ప‌రుస్తూ అనేక ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాడు. తీవ్ర‌మైన మాన‌సిక క్షోభ‌కు గురై చైత‌న్యం కోల్పోతూ నిర్జీవ‌మైన జీవితంను గ‌డుపుతున్నాడు. పంచ‌లోహాముల‌కు కూడా ప్ర‌కృతిలో వుండే పంచ‌భూత శ‌క్తి నిత్య‌చైత‌న్య‌మై వెలుగొందే శ‌క్తిని నిరంత‌రం క‌ల్పించుట వ‌ల‌న మాన‌వుని జీవ‌న మ‌నుగ‌డ‌కు పంచ‌లోహ‌ములు ప్ర‌ధాన మంత్ర‌, తంత్ర శ‌క్తివాహ‌కాలుగా ప‌నిచేసి ర‌క్షించి కాపాడును.

ప్ర‌ముఖ యంత్ర‌ములు – వాటి ఫ‌లితాలు

1. శ్రీ పూర్ణ శ్రీ చ‌క్ర మ‌హామేర మ‌హా యంత్రం : చుట్టుప‌క్క‌ల ప‌రిస్థితుల‌ను దైవ‌శ‌క్తితో క‌లుపుతూ ప‌రిపూర్ణ ఆధ్యాత్మిక‌, ఆనందంతో పాటు అద్వితీయ మ‌న‌శ్శాంతిని ప్ర‌సాదించి, ఆజ్ఞానంను తొల‌గించి జ్ఞాన‌శ‌క్తిని పెంపొందించుచూ, పునఃజ‌న్మ‌లేకుండా చేయును. ప్ర‌తీ ఇంటి దైవ‌మందిరంలో వుండ‌వ‌ల‌సిన యంత్ర‌రాజం.
2. శ్రీ మ‌హాగ‌ణ‌ప‌తి మ‌హా యంత్రం : స‌ర్వ‌కార్య‌సాఫ‌ల్య‌త‌, ఆటంక దోషాలు తొల‌గుట‌, సంతోష‌ము, ఐశ్వ‌ర్యం, ఈతిభాద‌లు నుండి విముక్తి, ఆలోచ‌నాశ‌క్తి పెరిగి, బుద్ధిశ‌క్తితో ఏ కార్య‌మునైన‌ను స‌ర్వ‌సిద్ధి సాధించ‌గ‌ల ఏకైక యంత్రం.
3. శ్రీ చ‌క్రం యంత్రం : మ‌న‌శ్శాంతి, ఆక‌ర్ష‌ణాశ‌క్తి, సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెంపొందించుట‌లో స‌హాయ‌ప‌డ‌గ‌ల మ‌హాయంత్రం. ముఖ‌వ‌ర్చ‌స్సు పెరిగి స‌ర్వ‌జ‌న వ‌శీక‌ర‌ణ క‌లిగించే యంత్రం.
4. స‌ర్వ‌జ‌న మ‌న‌, ధ‌న‌, ఆక‌ర్ష‌ణ సామ్రాజ్య ల‌క్ష్మీ మ‌హా యంత్రం శ్రీ మ‌హాసుద‌ర్శ‌న యంత్రం : ఇది మూడు యంత్రాలు క‌లిగిన యంత్రం. వ్యాపార
అభివృద్ధి, స‌మ‌స్త కార్య‌, వ్య‌వ‌హార జ‌యం, స‌మ‌స్త శ‌త్రునాశ‌నం, వాస్తు భూదోష నివృత్తి, అఖండ కీర్తి, అఖండ వ్యాపార దిన‌దినాభివృద్ధి
క‌లిగించే ఏకైక యంత్రం.
5. శ్రీ శూలినీ శ‌ర‌భేశ్వ‌ర ప్ర‌త్యంఘీరా యంత్రం రాజం : స‌ర్వ‌శ‌త్రు నివార‌ణ‌, స‌ర్వ రోగ‌నివార‌ణ‌, చేత‌బడులు, బాణామ‌తి, వశీక‌ర‌ణ‌, స‌క‌ల తాంత్రిక బాధ‌ల నుండి పూర్తి విముక్తి క‌లిగించి, మ‌న‌శ్శాంతి క‌లిగించును. ప్ర‌యోగ‌ము చేసిన వారి ప్ర‌యోగ‌మున‌కు తిరిగి వారి వ‌ద్ద‌కే పంపించ‌గ‌ల మ‌హిమాన్విత యంత్రం.
6. స‌మ‌స్త వాస్తు దోష ప‌రిహార యంత్రం : అన్ని ర‌కాల వాస్తు దోషాల నుండి గృహ‌మును కాపాడి, భూమిలో వుండే దోషం కూడా ప్రార‌ద్రోలి, గృహ‌మున‌కు
వైభ‌వం తీసుకురాగ‌ల మ‌హిమాన్విత వాస్తు యంత్రం. వీధి దోషాలు, శూల దోషాలు, గ‌ర్భ‌దోషాలు ద్వారా దోషాలు నివృత్తి చేయ‌గ‌ల యంత్రం.
7. సంతాన‌గోపాల యంత్రం : శ్రీ కృష్ణుణ్ణి యొక్క తేజఃపూర్ణ యంత్ర‌రాజం, స్త్రీ గ‌ర్భ‌స్థ సంతాన దోషాలు, పురుష వీర్య దోషాల‌ను పార‌ద్రోలి ఎటువంటి జాత‌క దోషాలు వున్న‌ను నివారించి సంతాన‌ప్రాప్తి అందించ‌గ‌ల ఏకైక యంత్రం.
8. శ‌త్రు జ‌య యంత్రం : మ‌న‌చుట్టు వుండి మ‌న‌ము చేసిన ప‌నులు క‌నిబెడుతూ మ‌న‌కు ద్రోహం చేసిన లేదా చేయాల‌ని త‌ల‌పెట్టిన వారిని మ‌ట్టుపెట్టి శ‌త్రు సంహారంగావించి అజాత‌శ‌త్రువుగా కీర్తిప్ర‌తిష్ట‌లు పెంపొందించే మ‌హిమాన్విత యంత్రం.
9. వివాహ సౌభాగ్య యంత్రం : స‌మ‌స్త కుజ‌దోషాల‌ను, నాగ‌దోషాల‌ను, కాల‌స‌ర్ప దోషాల‌ను, పార‌ద్రోలి ఆల‌స్య వివాహ‌మును త్వ‌రిత‌గ‌తిన చేయ‌గ‌ల స‌మ‌స్త వివాహ దోష ప‌రిహ‌ర యంత్రం.
10. ధ‌నాక‌ర్ష‌ణ యంత్రం : ఐశ్వ‌ర్య‌ప్రాప్తి, ధ‌న‌యోగం క‌లిగించును. వ్య‌క్తిగ‌తంగా చేయు ప‌నుల యందు విజ‌యాల‌ను క‌లుగ‌జేయును.
11. మ‌హామ‌త్స్య యంత్రం : వాస్తుదోషాల‌ను తొల‌గించి, గృహ‌మున‌కు పున‌ర్జీవ‌నం క‌లుగ‌జేయును. గృహంలో స‌క‌ల శుభాలు, స‌క‌ల మంగ‌ళ‌ముల‌ను,
స‌ర్వాభిష్ఠ‌సిద్ధిని క‌లుగ‌జేయును.
12. లక్ష్మీ కుభేర యంత్రం : స‌మ‌స్త వ్యాపార ఆర్ధిక, స‌మ‌స్య‌ల‌ను స‌రిచేసి నిత్యం వ్యాపారంలో ధ‌న‌లాభం క‌లిగేలా చేసి వ్యాపార సంబంధిత స‌మ‌స్త బాధ‌ల‌ను తీర్చ‌గ‌ల మ‌హాయంత్రం. వ్యాపార అభివృద్ధికి సంపూర్ణ తోడ్పాటు క‌లిగించి, వ్యాపారంలో ఉన్న‌త స్థాయికి చేర్చి చాలా మందికి ఉపాధి క‌లిగించే స్థాయి క‌లుగ‌జేయును.
13. స‌క‌ల ఐశ్వ‌ర్య సామ్రాజ్య ల‌క్ష్మీ క‌టాక్ష మ‌హాయంత్రం : నాలుగైదు ర‌కాలుగా ప‌నిచేయ‌గ‌ల యంత్రం. శ‌త్రు సంహారం, ధ‌న‌ము, ధాన్య‌ము, వాహ‌న‌ము, సువ‌ర్ణ మాణిమ‌య మాణిక్యాదులు, పుత్రులు సేవ‌క దాసీ జ‌నము, బంధువులు అనేడి అష్ఠ ఐశ్వ‌ర్యాలు క‌లుగ‌జేయ‌గ‌ల వ‌ర్ణ‌ణాతీత మ‌హిమాన్విత యంత్రం.
14. ద‌శ‌మ‌హావిద్య మ‌హాయంత్రం : ప‌ది యంత్రాలు ద‌శ‌మ‌హాశ‌క్తి దేవీ దేవ‌త‌ల యొక్క శ‌క్తి స్వ‌రూప‌మైన మహిమాన్విత యంత్రం. కాళీ, తార‌, భ‌గ‌లాముఖి, రాజ‌మాతంగి, త్రిపుర‌సుంద‌రీ, భువ‌నేశ్వ‌రి, చిన్మ‌య‌, క‌మ‌లాశిష్ఠ‌, దుర్మావ‌తి దేవీల యొక్క ప‌ది ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లిగించే అద్భుత యంత్రం.
15. స‌క‌ల రోగ నివార‌ణ యంత్రం : వాత‌, పిత్త‌, క‌ప‌, జ్వ‌ర‌, పాండు, వ్ర‌ణ‌, చ‌ర్మ‌, గ‌ర్భ‌, నేత్ర‌, క‌ర్ణ‌, నాసిక‌, హ‌స్తి సంబంధ స‌క‌ల రోగ నివార‌ణ యంత్రం.
16. స‌ర్వ‌ర‌క్షాక‌ర మ‌హాయంత్రం : పూర్ణ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించి శ‌త్రువుల‌ను లేకుండా చేసి ఊహించ‌ని ఉప‌ద్ర‌వాల‌ను ఉప‌ఘాతాల‌ను తొల‌గించి ఉద్యోగ‌ముల రిత్యా భార్య‌భ‌ర్త‌లు వేరువేరుగా వున్న‌వారికి ఎవ‌రికి ఆప‌ద‌లు క‌ల‌గ‌కుండా ర‌క్షించ‌గ‌ల మ‌హా యంత్రం. వాహ‌నాల ప్ర‌మాదాల నుండి ర‌క్ష‌ణ క‌ల్పించే యంత్రం.
17. ల‌క్ష్మీ నారాయ‌ణ యంత్రం : సంతోషం, స‌త్‌ప్ర‌వ‌ర్త‌న క‌లిగించి ఇచ్చిన మాట‌ల‌ను నిలుపుకునే శ‌క్తిని క‌లిగించి ప‌రువు ప్ర‌తిష్ఠ‌ల‌ను పెంచుతూ కుటుంబంలో వున్న‌వారికి వ‌ర్చ‌స్సును శ్రేయ‌స్సును క‌లిగించి నిరంత‌రం సంతోషం ఆనందాల‌ను క‌లిగించే మ‌హామాన్విత యంత్రం.
18. స‌ర్వాభీష్ఠ సిద్ధి యంత్రం : కుటుంబంలో వున్న వారి అంద‌రి కోరిక‌ల‌ను నెర‌వేరుస్తూ స‌క‌ల దోషాల‌ను పోగొట్టి గృహ‌మున‌కు వైభ‌వం క‌లిగించి మ‌హాల‌క్ష్మీ అనుగ్ర‌హంను, పూర్తిగా ఇంటిలో వున్న‌వారికి కుభేర అనుగ్ర‌హంను క‌లిగించి, మ‌న‌స్సులో వున్న ధ‌ర్మ‌బ‌ద్ద‌మైన కోరిక‌ల‌ను నేర‌వేర్చుకోగ‌లిగిన శ‌క్తిని పూర్తిగా అందించే అనుగ్ర‌హ యంత్రం.
19. దృష్టినివార‌ణ యంత్రం : న‌ర‌ఘోష‌ను పొగొట్టును, చెడు దృష్టిని పొగొట్టును, కుటుంబంలో వున్న‌వారికి మ‌న‌స్ప‌ర్థ‌లు తొల‌గించి ఐశ్వ‌ర్యంక‌లిగించి గృహంలో వున్న‌వారికి సుఖ‌సంతోషాలు అందించును.
20. అమృతవ‌ర్షిణి మ‌హా యంత్రం : ద‌ర్శ‌న మాత్ర‌ముచే స‌క‌ల అభిష్ట‌ములు సిద్ధింప‌చేసి, ఆవిచ్చిన సంత‌త‌ని క‌లిగించి కుటుంబ శ్రేయ‌స్సును క‌లిగించి నిత్య‌సంతోషాల‌ను క‌లిగించి ఇంద్రాద్రి అష్ట‌దిక్పాల‌క అనుగ్ర‌హ‌ముచే అజేయ‌సిద్ధి క‌లుగ‌జేయ‌గ‌ల కుటుంబ క్షేమ‌క‌ర యంత్రం.
21. స‌ర్వ‌కావ్య‌సిద్ధి యంత్రం : ధార‌ణ‌శ‌క్తిని పెంపొందించి, విశేష జ్ఞాప‌క‌శ‌క్తిని అందించి కావ్య‌, నాట‌క అలంకార న్యాయ వైశేషిక పూర్ణ‌ప్ర‌జ్ఞ‌ను అందించి స్థిర కీర్తి ప్ర‌తిష్ఠ‌ల‌ను అందించ‌గ‌ల యంత్రం. శ్ర‌ద్ధ‌, ఆస‌క్తిని అనుర‌క్తిని అందించ‌గ‌ల యంత్రం. శ్రీ‌విద్య ప‌రావిద్యాల‌ను అందించ‌గ‌ల అద్వితీయ యంత్ర‌రాజం.
22. ధ‌న్వంత‌రీ మ‌హాయంత్రం : వైద్యులు ఉంచుకోద‌గ్గ మ‌హిమాన్విత యంత్రం. ఈ యంత్రం వున్న‌చోట స‌మస్త వ్యాధులు దూరంగా పారిపోవును. ధ‌న్వంత‌రీ అనుగ్ర‌హంచే మందులు వాడ‌వ‌ల‌సిన ప‌నిలేకుండానే వ్యాధులు న‌శించును. వైద్యులు వైద్యాల‌యాల‌లో, గృహంలో వుంచుకొన్న వారు చేయు వైద్యం ఫ‌లించి ప‌రిపూర్ణ సంతృప్తి క‌లిగి త‌ద్వారా ఐశ్వ‌ర్య‌సిద్ధి క‌లుగును.
23. మంగ‌ళ‌మూర్తి మ‌హా యంత్రం : వంశ‌పారంప‌ర్యంగా రావాల్సినఆస్తిపాస్తుల‌ను ర‌ప్పించి న్యాయ‌స్థాన త‌గువుల‌ను మ‌న‌కు అనుకూలంగా
తీర్చు వ‌చ్చిన‌ట్లు చేసి అన్నద‌మ్ముల‌, అక్కాచెల్లెళ్ల‌, త‌ల్లిదండ్రుల‌, భార్య‌భ‌ర్త‌ల బంధ‌ముల‌ను కాపాడుతూ కుటుంబంలో వున్నవారంద‌రికీ ఐశ్వ‌ర్య‌వృద్ధిని క‌లిగించి వంశ‌కీర్తిప్ర‌తిష్ట‌ల‌ను న‌లుదిక్కుల చాటింప‌చేసి, రాజ‌కీయ ల‌బ్ధిని నూత‌న వ్యాపార ల‌బ్ధిని క‌లుగ‌జేసి, కీర్తిప్ర‌తిష్ఠ‌లు క‌లుగ‌చేయ‌గ‌ల అద్భుత మ‌హాయంత్రం.
24. కుటుంబ క్షేమ‌క‌ర యంత్రం : రాధాకృష్ణుల భీజసంపుటిత వైభ‌వం యంత్రం. కుటుంబంలో మ‌న‌స్ప‌ర్థ‌లు తొల‌గించి, భార్య‌భ‌ర్త‌ల‌కు అన్యోన్య‌త క‌లిగించి మంచి సంతానం పొందుట‌కు కుటుంబం క్షేమంగా వుండుట‌కు, వంశాభివృద్ధి కొర‌కు, పిల్ల‌ల అభివృద్ధి కొర‌కు, గృహ‌ములో వుంచుకోద‌గ్గ వ‌ల‌సిన మ‌హిమాన్విత యంత్రం.
25. న‌వావ‌ర‌ణ యంత్రం : ల‌లితా త్రిపుర సుంద‌రి దేవి యొక్క స్వ‌రూప‌మైన ఈ యంత్ర మ‌హిమ‌ను వ‌ర్ణించుట‌కు సాధ్య‌ముకాదు. అమ్మ‌వారి ల‌లితా
ఉపాస‌కుల‌కు పూర్ణంగా ఉప‌యోగ‌ప‌డే అద్భుత యంత్రం. ఉపాస‌కుల వాక్‌సిద్ధి ఫ‌లించే మ‌హిమాన్విత యంత్రం. అమ్మ‌వారి ఉపాస‌కులు నోటి నుంచి వ‌చ్చే
ప్ర‌తీ మాట వాస్త‌వ‌రూపం దాల్చును.
26. శ్రీ సుబ్ర‌మ‌ణ్య స‌డాక్ష‌ర యంత్రం : యంత్ర‌ము, నాగ‌దోష‌ములు, కాల‌స‌ర్ప‌దోషాలు నివారించి వివాహం త్వ‌ర‌గా జ‌రుగును. మేధాశ‌క్తి పెంపొందించి, జ్ఞాన శ‌క్తిని క‌లిగించును. స‌క‌ల విద్యాప్రాప్తి క‌లిగించును.
27. పంచ‌ముఖి ఆంజ‌నేయ యంత్రం : భూత‌, ప్రేత పిశాచ బాధ నివార‌ణ క‌లిగించి, కీర్తి, వాక్ ప్ర‌తిభ బుద్ధి య‌శ‌స్సు, ధైర్యం, జ్ఞానం క‌లిగించి గృహానికి ర‌క్ష‌ణ క‌వ‌చంగా వుండును. మ‌న‌లో వుండే భ‌యాలు, భ్రాంతుల‌ను తొల‌గించే దివ్య యంత్రం.
28. మ‌హామృత్యుంజ‌య యంత్రం : మృత్యుభ‌యాన్ని దూరం చేసి వ్యాధుల‌ను నాశ‌నం చేసి దీర్ఘ‌కాలం ఆయురారోగ్య ఐశ్వ‌ర్యంతో జీవించున‌టు్ల చేసి సుఖమ‌య జీవ‌నంను నిర్భ‌య సుఖ‌మును నిశ్చ‌ల భ‌క్తిని సునాయాశ మ‌ర‌ణంనుక‌లుగ‌చేయును. మ‌న‌లో భ‌యాన్ని తొల‌గించి ధైర్యాన్ని నింపే మ‌హా యంత్రం.
29. కాల‌భైర‌వ యంత్రం : మృత్యుభ‌యాన్ని తొల‌గించును. స‌క‌ల భ‌యాల‌ను తొల‌గించి, పీడ ప‌రిహార‌దోషాల‌ను తొల‌గించును. శ‌త్రుభ‌యం, అప‌మృత్యుభ‌యంను తొల‌గించును.
30. సామ్రాజ్య విజ‌య‌ల‌క్ష్మీ యంత్రం : గృహంలో పూర్ణ మ‌న‌శ్శాంతినిక‌లుగ‌జేసి, ఇంటిలో ప్ర‌తీ మూల‌ను కూడా ప్ర‌శాంత‌త‌ను నింపి,మ‌న‌స్సున‌కు శాంతిని చేకూర్చును. స్త్రీ, పురుషుల వియోగ దోషాల‌ను పార‌ద్రోలి సౌభాగ్య‌సిద్ధిని క‌లుగ‌జేయును. చేయ‌వ‌ల‌సిన కార్య‌ముల‌లో విజ‌యం సాధిస్తారు.

ధార‌ణ యంత్ర‌ములు (డాల‌ర్స్‌)

స‌రియ‌గు తిధి, వార, న‌క్ష‌త్ర‌ములు చూసి ఒక శుభ‌ముహూర్త‌మున ర‌జిత‌ము (వెండి)ని అగ్నిలో శుద్ధిచేసి 41 పౌర్ణ‌మి రోజుల‌లో పూజ చేసి చంద్ర క‌ళ‌ను ఆవాహ‌న చేసిన డాల‌ర్‌ను యంత్ర అధిష్ఠాన దేవ‌త తిధి, న‌క్ష‌త్రం ఉన్న రోజున దార‌ణ‌యంత్రం ప‌విత్రమైన యంత్ర ప‌రిక‌ర‌ముల‌తో ముద్రించిన పిద‌ప యంత్రంలో ఉన్న అధిష్టాన దేవ‌త యొక్క క‌ళావాహ‌న చేసి పూజించి జ‌ప‌ఫ‌లమును దైవ‌శ‌క్తిని ఇమిడీకృత‌ము చేసి ధ‌రించుట‌కు ఇవ్వ‌డం జ‌రుగును. కావున ధార‌ణ యంత్ర‌మునందు దేవ‌తాశ‌క్తి మీలో ప్ర‌వేశించి మిమ్మ‌ల్ని స‌ర్వ‌దా కాపాడుతూ స‌ర్వ‌కాల స‌ర్వావ‌స్థ‌ల‌నందు ర‌క్ష‌ణ క‌లిగించి, కాపాడుట‌యే కాక వెనువెంట‌నే మీ కోరిక‌ల‌ను నెర‌వేర్చుకొనుట‌కు దోహ‌ద‌ప‌డుతూ శుభాల‌ను చేకూర్చును.

ధార‌ణ యంత్రాలు (డాల‌ర్స్‌) – వాటి ఫ‌లితాలు

1. స‌క‌ల దృష్టినివార‌ణ డాల‌ర్ : చెడు దృష్టి నుంచి కాపాడును. స‌క‌ల మ‌లిన దోషాల‌ను తొల‌గించును. నిరంత ప్ర‌శాంత‌త‌ను అందించును. ఎనిమిది
దిక్కుల నుంచి మ‌న‌కు చేరే చెడు దృష్టిని నివారించి, స‌క‌ల శ్రేయ‌స్సును క‌లుగ‌జేయును.
2. శ్రీ చ‌క్ర కామాక్ష్మీ డాల‌ర్ : కామాక్ష్మీదేవి అనుగ్ర‌హం క‌లిగించి, ఐశ్వ‌ర్యం, అక‌ర్ష‌ణ‌, ఉద్యోగ‌ప్రాప్తి క‌లిగించును.
3. శ్రీ‌మ‌హాల‌క్ష్మీ ధ‌నాక‌ర్ష‌ణ డాల‌ర్ : అప్పుల‌ను తొల‌గించి ఐశ్వ‌ర్య‌ప్రాప్తి క‌లిగించి నిరంత‌ర ఐశ్వ‌ర్య‌జీవ‌నం క‌లుగ‌జేయును.
4. కాత్యాయ‌నీ మంగ‌ల్య‌భాగ్య డాల‌ర్ : భార్యాభ‌ర్త‌లు ధ‌రించాలి. అన్యోన్య‌దాంప‌త్యంతో కూడిన ఎన‌లేని సుఖ‌సంతోషాల‌ను అందించి ఆద‌ర్శ‌మైన జీవ‌నం కొన‌సాగించ‌డానికి తోడ్ప‌డును.
5. స‌ర‌స్వ‌తీ మ‌హా డాల‌ర్ : విద్యాబుద్ధుల‌ను ప్ర‌సాదించి, సిద్ధిని అందించి ప‌ట్టుద‌ల‌తో అనుకున్న విద్య‌ను సాధించుట‌కు దోహ‌ద‌ప‌డును. స‌మ‌స్త పోటీ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త‌ను సాధించుట‌కు స‌హాయ‌ప‌డును.
6. సంతాన‌ప్రాప్తి డాల‌ర్ : భార్య‌భ‌ర్త‌లు ధ‌రించాల్సిన డాల‌ర్‌. సంతాన‌లేమితో బాధ‌ప‌డేవారికి సంతాన‌ప్రాప్తిని క‌లుగ‌జేయును.
7. ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మీ డాల‌ర్ : అక‌స్మిక ధ‌న‌లాభాలు క‌లుగ‌జేసి, చేయు వ్యాపారాల‌ను అభివృద్ధి చేసి, ఉద్యోగాల్లో ఉన్న‌త అభివృద్ధి క‌లుగ‌జేసి, ఉన్న‌త స్థాయి గ‌ల వ్య‌క్తుల మ‌ధ్య పేరుప్ర‌ఖ్యాత‌లు తీసుకొచ్చును.
8. బాలారిష్ట డాల‌ర్ : చిన్న పిల్ల‌ల‌ను దృష్టిదోషాల నుండి బాలారిష్ట దోషాల‌ను కాపాడి, వ్యాధులు రాకుండా ర‌క్ష‌ణ క‌ల్పించి సుఖ‌మ‌య నిద్ర‌,
సుఖ‌మ‌య జీవ‌న‌ప్రాప్తి క‌లుగ‌జేయును.
9. పంచ‌ముఖ హ‌నుమాన్ డాల‌ర్ : భూత ప్రేత పిశాచ బాధ‌ల‌ను, శ‌నిగ్ర‌హ‌దోషాల‌ను తొల‌గించి, బుద్ధిబ‌లం, య‌శ‌స్సు, బ్ర‌హ్మ‌జ్ఞానంను క‌లిగించును.
10. శ్రీ త్రిపుర సుంద‌రీ డాల‌ర్ : సౌభాగ్య‌సిద్ధి, వ‌శీక‌ర‌ణ‌ప్రాప్తి, స‌మీప‌వ‌ర్తి, స‌క‌ల జ‌నుల వ‌శీక‌ర‌ణ‌, కుటుంబ శ్రేయ‌స్సు క‌లిగించే మ‌హిమాన్విత డాల‌ర్‌.
11. కాల‌భైర‌వ డాల‌ర్ : స‌క‌ల భ‌యాల‌ను, మృత్యుభ‌యాన్ని, పీడ ప‌రిహార దోషాల‌ను తొల‌గించి, అప‌మృత్యు భ‌యంను తొల‌గించి, మ‌నోధైర్యాన్ని
నింపుతుంది.
12. వాహ‌న‌యంత్రం : ద్విచ‌క్ర‌, చ‌తుచ‌క్ర‌, ష‌ట్‌చ‌క్ర‌, అష్ట‌చ‌క్ర‌, ద్వాద‌శీచ‌క్ర వాహ‌న‌యోగం క‌లిగించును. వాహ‌న ప్ర‌మాదాల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించును. య‌జ‌మానికి వాహ‌న సౌఖ్య‌మును క‌లుగ‌జేయును.
13. స‌ర్వ‌ర‌క్ష డాల‌ర్ : స‌మ‌స్త ఈతిబాధ‌ల నుండి ర‌క్ష‌ణ క‌ల్పించి కీర్తిప్ర‌తిష్ట‌లు క‌లిగించి, చేయుచున్న ప‌నుల్లో అభివృద్ధి దోహ‌ద‌ప‌డును.
14. సుబ్ర‌మ‌ణ్యం డాల‌ర్ : కుజ‌దోష నివార‌ణ‌, జ్ఞాన సిద్ధి, కుటుంబ శ్రేయ‌స్సు, విద్యాభివృద్ధి, స‌త్‌ప్ర‌వ‌ర్త‌న క‌లిగించును.
15. గ్ర‌హ డాల‌ర్లు : ఆయా గ్ర‌హ‌వ‌ర్త‌మాన ద‌శ‌లో ధ‌రించిన మంచి ఫ‌లితాలుండును

ర‌విగ్ర‌హ డాల‌ర్ : ర‌విగ్ర‌హ‌దోషాల‌ను పోగొట్టును. ఆరోగ్యం కీర్తిప్ర‌తిష్ట‌ల‌ను పెంపొందించును.చంద్ర‌గ్ర‌హ డాల‌ర్ : చంద్ర‌గ్ర‌హ దోషాల‌ను తొల‌గించి, మ‌న‌శ్శాంతిని ప్ర‌శాంత‌త‌ను క‌లిగించును.కుజ‌గ్ర‌హ డాల‌ర్ : కుజ‌దోషాన్నితొల‌గించి శీఘ్ర వివాహ‌ము క‌లిగించును. అనుకూల భ‌ర్త‌, లేదా భార్య ల‌భించును.రాహుగ్ర‌హ డార‌ల్ : దృష్టిదోషాల‌ను తొల‌గించి, ఆక‌ర్ష‌ణ క‌లిగించును.కేతుగ్ర‌హ డాల‌ర్ : చిత్త‌చాంచ‌ల్య‌మును తొల‌గించి, జ్ఞాన‌శ‌క్తిని పెంపొందించి, ఆనారోగ్యం నివారించును.బుధ‌గ్ర‌హ డాల‌ర్ : బుద్ధిమాంధ్యంను తొల‌గించి, వ్యాపార అభివృద్ధిని క‌లిగించి, కుటుంబ శ్రేయ‌స్సును క‌లిగించును.గురుగ్ర‌హ డాల‌ర్ : ఉద్యోగ‌స్థ‌లాల్లో అధికారుల అనుగ్ర‌హం క‌లిగించును. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క‌లిగించును.శుక్ర‌గ్ర‌హ డాల‌ర్ : దాంప‌త్య‌దోషాల‌ను తొల‌గించి, అన్యోన్య‌దాంప‌త్యం క‌లిగించి, విద్యా అధికార ప్రాప్తి క‌లిగించును.శ‌నిగ్ర‌హ డాల‌ర్ : మృత్యుదోషాల‌ను తొల‌గించి, అనారోగ్యం తొల‌గించి, భయ‌నాశ‌నం చేసి, ఆద్వితీయ అభివృద్ధని కలిగించు
ను.

తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు




తద్దినాలు

పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు.

పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే. వాయనము ఇస్తాము, కూరలు ఇస్తాము, బియ్యము ఇస్తాము అని అంటే కుదరదు. మీరు వుండే ఇంట్లో పెడితేనే చాలా మంచిది.

దేవతలకు చేసే కార్యము కాని, పితృ దేవతలకు చేసే కార్యము కాని రెండూ మీరు వున్న ఇంట్లోనే చేయాలి, అలా చేస్తే అది మీకు మీ ఇంటికి మంచిది.

కర్మ క్షయం కాని జీవుడు మరణించిన వెంటనే ఎక్కడో ఒక చోట పుడతాడు అన్నది నిజమేనా ?? అలాగయితే మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి ?? జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేక ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా.. మరి పితృదేవతగా ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడు? పెళ్ళి/పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అంటారు కదా..వ్యక్తిగతంగా చేసిన పాప పుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినపుడు ఇలా వంశం చేసిన పాపాల వల్ల ఎలా హాని కలుగుతుంది? పిల్లలు లేకపోతే పున్నామ నరక బాధలు తప్పవా?ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా వివరంగా చెప్పవలసి ఉంది. కానీ ఒక అవగాహన ఏర్పడినా చాలు అనే ఉద్దేశంతో, కొందరు స్నేహితులు అడిగినదానికి ఇక్కడ సమాధానం ఇస్తున్నాను.

పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.
కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.
ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు. ఉదాహరణకు..ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది. ఉదాహరణకు మనం మనీఆర్డరు చేసిన అడ్రసులో ఎవరూ లేకపొతే మనకే తిరిగి వస్తుంది కదా. కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.పితృ కార్యమప్పుడు ఒక భోక్తను పితృ స్థానంలో ఇంకొక భోక్తను విష్ణు స్థానంలో కూర్చో పెడతాం .పితృ స్థానంలో కూర్చోపెట్టిన భోక్తకు వాసు రుద్రా ఆదిత్య రూపంలో ఉన్న తండ్రి తథా ముత్తాత మూడు తరాల వారిని ఆవాహన చేస్తాం కదా .అందుకనే భోక్తలను సంతృప్తిగా భోజనం చేయమని తొందర పెట్టకుండా అడిగేది .పూర్వపు రోజులలో భోక్తగా ఉండేవారు ఇప్పుడు నలువురు తినే భోజనం తినేవారు .అరచేతి మన్దమ్ గారెలు బెల్లపు పరవాన్నంలో నెయ్యిపోసుకొని నంచుకు తినేవారు దగ్గరగా పది పన్నెడు గారెలు అవలీలగా తినేవారు భోజనంతో పాటుగా వారు నిజమైన భోక్తలు .ఇప్పుడు అసలు వారు భోజనం చేయటం చాలా తక్కువ షుగర్ అని బీపీ అని .భోక్తగా ఉండాల్సినవారు నియమ నిష్ఠ అంగవైకల్యం లేకుండా ఇంకా చాలా ఉన్నాయ్ .ఈ రోజులలో దొరుకుతున్నారా . ఇంతకుముందు తద్దినం అంటే అపరాహ్నం వచ్చిన తరువాత యింటివారి భోజనం సుమారు నాలుగు గంటల తర్వాతే .ఇప్పుడు తొమ్మిదికి ప్రారంభం పదిన్నరకు పూర్తి కార్యాలయమునకు వెళ్లడం .ఆ ఒక్కరోజు సెలవు పెట్టె వ్యవధి ఉండదు అర్గేంట్ పనులు .అదే వేరే ఏ పనికైనా సెలవులు కావాల్సినన్ని .శ్రద్ద లేని శ్రాద్ధాలు .అదేమంటే పెట్టామా లేదా .ఆప్రాంహం అయితే గానీ పితృదేవతలు రారు .వాళ్ళు రాకుండా తద్దినం ఎవరికోసం .భోక్తల భోజనం కోసమా ఎదో అయిపోయింది అనిఇంచుకోవటానికాజన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు.
సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరుగనప్పుదు ఇరువైపుల పితరులు (ముందు తరాలు, తరువాతి తరాలు) అధోగతి చెందుతారన్నది నిజం. వారు వ్యక్తిగతంగా పుణ్య చరిత్రులైనప్పటికీ ఈ బాధ తప్పదు. అందుకే మనవారు పెళ్ళిళ్ళలో సంప్రదాయానికి అంత విలువనిస్తారు. గతించిన వారి పుణ్య సాంద్రత మరీ ఎక్కువగా ఉంటే ఏ మహర్షివలననో ఉత్తమగతులు మళ్ళీ పొందే అవకాశం ఉంది కానీ ఖచ్ఛితంగా చెప్పలేము. అందుకే ఇదివరకు ఎవరైనా సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళి చేసుకుంటే వారితో తలిదండ్రులు, బంధువులు సంబంధాన్ని త్రెంచుకునేవాళ్ళు. అది అభిమానం లేక కాదు. వారు, వారి పితరులు అధోగతిపాలు కాకూడదని మనసులో బాధపడ్డా అలా చేసే వాళ్ళు.
ఆ పైన పిల్లలు కలిగి, వారు పితృకర్మలు సరిగా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయనేది వాస్తవం. అందుకే మనవారు వంశం కొనసాగాలని అనుకునేవారు. కానీ మన ప్రయత్న లోపం లేకుండా సంతానం కలగనప్పుడు అంతగా విచారించనక్కర్లేదు. దానికి ప్రత్యామ్నాయంగా… దేవతల కళ్యాణాలు, మరి కొన్ని వ్రతాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన ఇది వరకు జన్మలలో చేసిన ఏ పాపం వలన పిల్లలు లేరో ఆ పాపాలని నాశనం చేసి, వారిని, వారి పితరులను కూడా తరింపజేసుకోవచ్చు. …స్నేహితులకు ధన్యవాదములతోశ్లోకం : "దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే "

వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణ భారము వహించిన తండ్రికి క్రృతజ్ఞత చూపడము మానవత్వము విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .

దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం. అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని పురాణ వచనం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును. సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. వైధీకులు రెండూ ను చేయాలి.శ్రాద్ధాచరణ విషయము నందు విశ్వేదేవతలు సాక్షిగా ఉందురు.శ్రీ మహా విష్ణువు శ్రాద్ధమునకు పర్యవేక్షకునిగా వుండును.ప్రధాన దేవతలు పితృదేవతలు ముగ్గురు.తండ్రి,తాత,ముత్తాత ,తండ్రి వసు స్వరూపుడు, తాత రుద్ర స్వరూపుడు, ముత్తాత ఆదిత్య స్వరూపుడు ఈ ముగ్గురూ వసు,రుద్ర,ఆదిత్య లోకముల యందు ఉందురని శాస్త్ర సంప్రదాయము. ఒకొకపుడు ఈ ముగ్గురూ వారి కర్మఫలాను భవానంతరము ఆ లోకములను విడిచి కర్మానుగుణముగ మరో లోకములో ప్రవేశించి ఉండవచ్చును. కానీ వారు ప్రవేశించిన లోకములు వారి స్థితి వసురుద్రాదిత్య లోకముల యందే తెలియబడును. శ్రాద్ధాచరణ విషయములో ఒకానొక స్థితిలో భోక్తలగు బ్రాహ్మణులు లభించనిచో కర్త అరణ్యమునకు వెళ్ళి నాకు బ్రాహ్మణులు లభింపలేదు అందుచేత శ్రాద్ధమును ఆచరించలేక పోవుచున్నాను. అని పెద్దగా ఏడవ వలెను. మరియు శ్రాద్ధాచరణ వాషయంలో ఇట్లుండవలెను. భోక్తలు తమ భోజన కాలములో కర్తవలు తమ కొరకు వండిన భక్ష్యాది పదార్ధములలో అపేక్షిత పదార్ధములను అడిగి భుజించవలెను.ఆయా భక్ష్య పదార్ధములు భుజించవలెనన్న కోరిక ఉన్ననూ సిగ్గుతో అడగలేక భక్షించలేకపోయినచో ఆ దోషము భోక్తలదే. అయిననూ కర్త పరిశీలిస్తూ అడిగివేయనిచో ఆదోషము కర్తదేయగును.
శ్రాద్ధము జరుగుచుండగా విశ్వేదేవతలు వసురుద్రఆదిత్య లోకములకు వెళ్ళి అచటనున్న పితృదేవతలతో ఇట్లు చెప్పెదరు.
ఓ పితృదేవతలారా భూలోకములో మీ పుత్రపౌత్రాదులు మీ కొరకు శ్రాద్ధము ఆచరించుచున్నారు.అని చెప్పెదరు.ఆసమయంలో పితృదేవతలు ఆ లోకములోనే ఉన్నచో భూలోకములో పితృదేవతా స్వరూపముతో భుజించుచున్న బ్రాహ్మణుల భోజన తృప్తిననుసరించి పితృదేవతలు తృప్తి చెందెదరు.ఒకవేళ పితృదేవతలు ఆ లోకములో లేక లోకాన్తరములో ఉన్నచో వారెచట ఉన్నది వసురుద్రాదిత్య లోకములో విచారించి విశ్వేదేవతలు వారేలోకములో ఉండిరో ఆ లోకములో వారికి శ్రాద్ధకర్త సమర్పించిన పిండము మున్నగు ఆహారములను సంక్రమింపజేసెదరు.ప్రస్తుతము పితృదేవతలు ఏ లోకమున ఉండెనో ఆ లోక వాసులు ఏ ఆహారమును తినెదరో అట్టి ఆహారముగా కర్త ఇచ్చిన పిండాది అన్నము మున్నగు పదార్ధములను మార్చి పితృదేవతలకు చెందునట్లు చేసెదరు.అదెట్లనగా పితృదేవతలు పుణ్యవశమున దేవలోకమున ఉన్నచో అప్పుడు భూలోకము లో కర్త ఇచ్చిన పిండాది అన్న విశేషములను దేవతలకు ఆహారమైన అమృత స్వరూపముగా అందించగలరు. రాక్షస లోకములో ఉన్నచో కర్త ఇచ్చిన పిండాది అన్న విశేషములను రాక్షసులకు ఆహారమైన మాంసము,నెత్తురు గా మార్చి భుజింపచేయగలరు. భూలోకములో పశు స్వరూపముగా ఉన్నచో లేత పచ్చగడ్డి మున్నగు పశువులకు యోగ్యమగు ఆహారముగా మార్చి సమర్పించగలరు.

Mee
సుదర్శనంశ్రీనివాససూరి

Wednesday, January 10, 2018

వంట చేయటం ఒక శాస్త్రమే. పాకశాస్త్రమని చెప్పింది మన ఆగమం. నైపుణ్యంతో పాటు ముఖ్యమైన లక్షణాలు కొన్ని ఉండాలి:



వంట చేయటం ఒక శాస్త్రమే. పాకశాస్త్రమని చెప్పింది మన ఆగమం. నైపుణ్యంతో పాటు ముఖ్యమైన లక్షణాలు కొన్ని ఉండాలి:

1. వంట చేసేటప్పుడు పాత్ర శుద్ధి, వస్తుశుద్ధి మరియు దేహశుద్ధి తప్పనిసరి. పాత్రశుద్ధి తినేవారి ఆరోగ్యం కోసం, పరమాత్మ స్వీకరణ కోసం. వస్తుశుద్ధి రుచికోసం, దోషనివారణ కోసం. శరీరశుద్ధి మనసుకు, మనశ్శుద్ధి కర్మకు, కర్మశుద్ధి వంటలలోకి ప్రసరిస్తుంది. స్నానం కుదరకపోయినా, తలదువ్వుకొని (వెంట్రుకలు రాలకుండా), కాళ్లు చేతులు శుభ్రం చేసుకొని చేయాలి. అలాగే దేహపుష్టి కూడా ముఖ్యం. ఓపిక, బలం లేని వాళ్లు వంట చేస్తే వంటలు కూడా నీరసంగానే వస్తాయి.

2. వంట చేసేటప్పుడు ప్రశాంతమైన మనసుతో ఉండాలి. వంటలోని ప్రతి అడుగులోనూ ఈ ప్రశాంతత రుచికి తోడ్పడుతుంది. ముక్కలు సరైన పరిమాణంలో ఉండటం, ఉప్పుకారం సరైన మోతాదులో ఉండటం, సరైన పాళ్లలో ఇతర పదార్థాలు ఉండటం, సరైన విధంగా ఉడకటం...వీటన్నిటిలో వంట చేసే వారి ప్రశాంతత ప్రతిబింబిస్తుంది. పిల్లలపై, జీవితభాగస్వామిపై, అత్తగారిపై, యజమానిపై, వృత్తిపై ఉన్న కోపం వంట చేసే సమయంలో మీ మనసులో ఉంటే, వంట అదే వికారంతో వస్తుంది. అలాగే భారమైన మనసుతో చేస్తే వంట అదే విధంగా రుచిని పొందుతుంది.

3. తినేవారిపై ప్రేమతో చేయాలి. వారంతా సంతోషంగా, తృప్తిగా సరిపడా తినాలి, వారు ఆత్మానందపరితుష్టులవ్వాలి. ఈ ఆలోచనలతో ఉంటే ఫలితం అలానే ఉంటుంది. వీళ్ల దుంపతెగ నేను ఎలా చేసినా వీళ్లకు నచ్చదు, ఎంత తింటారో, వీళ్లు తినే తిండికి ఇదే ఎక్కువ..ఇలాంటి ఆలోచనలతో చేస్తే ఆ భావాలే ఆ వంటలకు అలదుతాయి.

4. ధ్యాస వంటపై ఉండాలి. అష్టావధానం చేస్తే ఫలితం అలానే ఉంటుంది. వంట చేస్తూ ఆఫీసులో పనో లేక సాయంత్రం చూడబోయే సినిమాపైనో లేక పండగకు కొనాల్సిన వస్తువుల గురించో ఆలోచన ఉంటే మోతాదులు సరిగా కుదరవు. వంట కూడా ఒక యజ్ఞమే. ధ్యాస, పవిత్రత అన్నివిధాలా తప్పనిసరి.

5. తినేవారి ఇష్టాయిష్టాలను బట్టి చేయాలి. వండిన పదార్థాన్ని పరమాత్మ భుజిస్తాడు అన్నదానిని నమ్మి చేయాలి.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైన తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం

అని పరమాత్మ చెప్పాడు. అన్నాది పక్వములు, పాకశాస్త్రం, భోక్త అన్నీ యజ్ఞాలే.

కాబట్టి వంట అంటే ఆషామాషీగా టూ మినిట్స్ మ్యాగీలా చేయకండి. లోనికి వెళ్ళే ప్రతి మెతుకు అగ్నిదేవునికి సమర్పణ. శరీరం యజ్ఞకుండం, చేసిన ప్రతి పదార్థం పూర్ణాహుతి ఫలం పొందాలి అన్న భావనతో చేయండి. పదిరకాలు చేయటం కాదు ముఖ్యం, చేసినవి శుద్ధిగా, పవిత్రంగా, సద్భావనలతో చేయటం, ఆ విధంగా భావించి భుజించటం ముఖ్యం.

అన్నాద్భ్వంతి భూతాని....అన్నమునుండే అన్ని ప్రాణులు జన్మించాయి. కాబట్టి అన్నాదులను తయారుచేయటంలో కూడా శ్రద్ధ, భక్తి, పవిత్రత ముఖ్యం. అందుకే మీరు ఎనంతి హోటళ్లలో తిన్నా, ఇంట్లో అమ్మ, భార్య వండిన వంటకు సమానం కానే కావు. ఎందుకంటే ఇంటి ఇల్లాలు ఈ భావనలతోనే చేస్తుంది కాబట్టి. హోటళ్లలో వంటవాడు రోజూ చేసి చేసి, ఎంతో ఎక్కువ మోతాదులు చేసి, సమయాభావం వలన, పదర్థాలు, పాత్రలు, మనస్సు, తనువు శుద్ధిలేక పదార్థాలు శరీరానికి ఆరోగ్యకరం కావు.V.V.S.Nagaraj challakere Karnataka State

108 ప్రాముఖ్యత ఏమిటి?



108 ప్రాముఖ్యత ఏమిటి?

మనం ఏదైనా మంత్రం జపించడానికి 108 సంఖ్య ముఖ్యం. అష్తోత్తరాలలో 108 సంఖ్య నామాలతో దేవతలను ఆరాధిస్తాము. ఇందుకు ప్రముఖమైన కారణం 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108 అని, ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత అని తెలుసు. కానీ వీటికన్నా మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాము.

ఖగోళ పరంగా
సూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6million kms. ఈ దూరాన్ని సూర్యుని చుట్టుకొలత 1391000kms తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108
అలాగే చంద్రునికి, భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లను చంద్రుని చుట్టుకొలత అయిన 3474 kms తో భాగిస్తే వచ్చే సంఖ్య 108
27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108
12 రాశులు , 9 నక్షత్ర పాదాలు = 12 x 9 = 108

హైందవం ప్రకారం
ముఖ్య శివలింగాలు – 108, అందుకే శైవ మతాలు కూడా 108.
గౌడియ వైష్ణవంలో బృందావనలో 108 గోపికలను పూజిస్తారు.
108 వైష్ణవ దివ్య క్షేత్రాలు
కంబోడియాలో ఆంగ్కోర్ వాట్ గుడిలో 108 మంది (అసురులు, దేవతలు) కలిసి సాగరమధనం చేసినట్టు చిత్రింపబడివుంది.
హైందవ భావాలనుండి ప్రేరణ పొందిన బౌద్ధం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహ ను కలిపి ఆరు భావాలను, వాటివల్ల కలిగే అంతర్భావాలైన సుఖము, దుఃఖము, స్తిరత్వబుద్ధిని, గుణించి, అవి బాహ్యంగానైనా, ఆంతరంగానైనా భూత భవిష్యద్ వర్తమానాలలో కలిగిన భావనలను గుణిస్తే 6x3x2x3 = 108
ఒక జీవుని ప్రయాణం “పూర్ణమదః పూర్ణమిదం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పుర్ణాత్పూర్ణముదచ్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” ద్వారా ఇన్ఫినిటీ (8) కు చేరుకునే విధానం 108 symbolism.

ఆయుర్వేదం ప్రకారం 108 మర్మ స్థానాలు, శక్తి కేంద్రాలు
కలారిపయట్టు ప్రకారం ( తరువాత కరాటే గా మారింది) 108 pressure పాయింట్స్
108 డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఉన్న అన్ని అవయవాలు చచ్చుబడిపోతాయి.
108 జపం మనస్సును నిర్మలం చేస్తుంది, లోపలున్న భావాలను అణగదోక్కుతుంది.
సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ, శక్తి తత్త్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. 54x2 = 108
12000 దివ్య సంవత్సరాలు = 43,20,000 మానవ సంవత్సరాలు = బ్రహ్మకు ఒక పగలు = 4000 x 108
108 లో 1 జీవుడిని తెలియచేస్తుంది. 8 జీవుని తత్త్వాలను తెలియ చేస్తుంది. 0 – పరిపూర్ణ భగవత్తత్త్వము. ఈ శరీరాన్ని, జీవుడిని కలిపి నియమించేది పరిపూర్ణ భగవత్తత్త్వము -108.
1+0+8 = 9, చాలా ముఖ్యమైన సంఖ్య. 9 తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలో numberలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది

గణిత పరంగా
108 ఒక abundant number. అంటే వాటి divisors 1+2+3+4+6+12+18+27+36+54 = 163 > 108
Tetranacci number ( ముందటి నాలుగు fibonacci నమ్బెర్లను కలిపితే వచ్చేది) 0,0,1,1,2,4,8,15,29,56,108
హైపర్factorial 1**1 + 2**2 + 3 **3 = 108
ఒక పెంటగాన్ కోణాలు అన్నీ కలిపితే 108
ఒక refactorable number ( వాటి divisors ఎన్నున్నాయో వాటితో భాగింపపడగలిగేది )
ఇంకా మరెన్నో విశిష్టతలను తనలో ఇముడ్చుకున్న సంఖ్యా

ఇటువంటి వైశిష్ట్యం ఉన్నది కనుకనే మన ఋషులు, ద్రష్టలు ఎప్పుడో 108 సంఖ్య ప్రాముఖ్యతను మనకు నామాలలో, ప్రదక్షిణలలో, జపాలలో విధిగా విధించారు. వారి దార్శనికతకు జోహార్లు అర్పిస్తూ

Tuesday, January 9, 2018

చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన



చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన



దక్ష ప్రజాపతి ఇరువై ఏడుగురు కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో మిక్కిలి ప్రేమ చూపెడివాడు,

ఈ విషయమై మందలించిన దక్షుని మాటను మన్నించని చంద్రుని దక్షుడు కోపగించి క్షయ వ్యాధితో బాధపడమని శపించగా, శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు.

అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైనది.
ఓషదులన్ని క్షీణించినవి,

అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడ్కొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కార మడిగారు. అంత చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు.

ప్రభాస తీర్థమున పరమశివునికి దయగల్గి ప్రత్యక్షమవగా చంద్రుడు శాపవిముక్తికై ప్రార్థించెను. అంత పరమేశ్వ రుడు చంద్రుని అనుగ్రహించి కృష్ణపక్షాన కళలు క్షీణించి, శుక్లపక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో భాసిల్లుమని వరమిచ్చాడు.

కళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది.
అత్యల్పదూరం అమావాస్య.
అత్యధిక దూరం పౌర్ణమి.
చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తూఉంటాయి. 16 కళలు అనివీటినే అంటారు. వాటికి పెర్లు ఉన్నాయి ........

చంద్రుని పదహారు కళలు :-

1. అమృత,
2. మానద,
3. పూష,
4. తుష్టి,
5. పుష్టి,
6. రతి ధృతి,
7. కామదాయిని,
8. శశిని,
9. చంద్రిక,
10. కాంతి,
11. జ్యోత్స్న,
12. శ్రీ,
13. ప్రీతి,
14. అంగద,
15. పూర్ణ,
16. అపూర్ణ.
15 తిథులకు
16 ఎందుకు అంటే పూర్తి పౌర్ణమి,పూర్తి అమావాస్య ఘడియలు అనేవి స్వల్ప సమయమే ఉంటాయి.

ఈ 16 కళలకు నిత్యం ఆరాధింపవలసిన దేవతలు ఉన్నారు.....

నిత్యాదేవతలు మొత్తం 16 మంది 15 నిత్యలను త్రికోణంలోని ఒక్కొక్క రేఖ యందు ఐదుగురు చొప్పున పూజించి 16వ దైన లలితా త్రిపుర సుందరీదేవిని బిందువు నందు పూజించాలి.

జాతకం ప్రకారం ఎవరు ఏ తిధిన జన్మిస్తే ఆయా దేవతా మంత్రాలను 11 సార్లు జపించాలి. లేదా ఆయా తిధులను బట్టి ఆయా మంత్రాలను ప్రతిరోజు 11 సార్లు పఠించటం మంచిది.అవి

బహుళ పాడ్యమి నాడు పుట్టిన వారు :-
******************************

“కామేశ్వరీదేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ విదియ నాడు పుట్టిన వారు :-
*****************************

“భగమాలినీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ తదియ నాడు పుట్టిన వారు :-
*****************************

“నిత్యక్లిన్నా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ చవితి నాడు పుట్టిన వారు :-
****************************

“బేరుండా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ పంచమి నాడు పుట్టిన వారు :-
******************************

“వహ్నివాసినీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి.)

బహుళ షష్ఠి నాడు పుట్టిన వారు :-
**************************

“మహావజ్రేశ్వరీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ సప్తమి నాడు పుట్టిన వారు :-
****************************

“శివదూతీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ అష్టమి నాడు పుట్టిన వారు :-
****************************

“త్వరితా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ నవమి నాడు పుట్టిన వారు :-
****************************

“కులసుందరీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ దశమి నాడు పుట్టిన వారు :-
****************************

“నిత్యా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ ఏకాదశి నాడు పుట్టిన వారు :-
*****************************

“నీలపతాకా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ ద్వాదశి నాడు పుట్టిన వారు :-
*****************************

“విజయా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ త్రయోదశి నాడు పుట్టిన వారు :-
*******************************

“సర్వమంగళా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

బహుళ చతుర్ధశి నాడు పుట్టిన వారు :-
*****************************

“జ్వాలామాలినీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

అమావాస్య నాడు పుట్టిన వారు :-
*************************

“చిత్రా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

శుక్ల పాడ్యమి నాడు పుట్టిన వారు :-
**************************

“చిత్రా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల విదియ నాడు పుట్టిన వారు :-
*************************

“జ్వాలామాలినీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల తదియ నాడు పుట్టిన వారు :-
*************************

“సర్వమంగళా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల చవితి నాడు పుట్టిన వారు :-
************************

“విజయా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల పంచమినాడు పుట్టిన వారు :-
*************************

“నీలపతాకా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల షష్ఠి నాడు పుట్టిన వారు :-
**********************

“నిత్యా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం .ం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల సప్తమి నాడు పుట్టిన వారు :-
************************

“కులసుందరీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల అష్టమి నాడు పుట్టిన వారు :-
************************

“త్వరితా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల నవమి నాడు పుట్టిన వారు :-
************************

“శివదూతీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల దశమి నాడు పుట్టిన వారు :-
************************

“మహావజ్రేశ్వరీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల ఏకాదశి నాడు పుట్టిన వారు :-
**************************

“వహ్నివాసినీ దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల ద్వాదశినాడు పుట్టిన వారు :-
*************************

“బేరుండా దేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల త్రయోదశి నాడు పుట్టిన వారు :-
****************************

“నిత్యక్లిన్నా దేవి ”ని
ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
( అనే మంత్రంతో పూజించాలి. )

శుక్ల చతుర్ధశి నాడు పుట్టిన వారు :-
***************************

“భగమాలినీ దేవి” ని
ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః

( అనే మంత్రంతో పూజించాలి. )

పౌర్ణమి నాడు పుట్టిన వారు :-
***********************

“కామేశ్వరీదేవి”ని
ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః

( అనే మంత్రంతో పూజించాలి. )

.............

విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక




విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక
గెలాక్టిక్ సెంటర్
విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలుఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మనసౌరకుటుంబం ఉన్నది పాలపుంత అనబడే ఒకగెలాక్సీలో అని మనకు తెలుసు. ఈ పాలపుంతలోమనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కేలేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈపాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేదిఊహించనలవి గాని శక్తికి కేంద్రం. అది ప్రస్తుతంధనూరాశిలో ఉంది. ఈ ధనూ రాశిలోనే గేలాక్టిక్సెంటర్ దగ్గరగా మూలా నక్షత్రం ఉంది. ఈప్రాంతంలో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉన్నదని సైన్సుఅంచనా వేసింది. ఆ బ్లాక్ హోల్ ఒక పెద్ద నక్షత్రంసైజులో ఉండి, కొన్ని మిలియన్ల సూర్యులసాంద్రతను కలిగి ఉంది. ఇది ఊహించ నలవి గానంత రేడియో తరంగాలనువేదజల్లగల శక్తిని కలిగి ఉంది. మన సూర్యునినుంచి ఇది దాదాపు 30,000 కాంతి సంవత్సరాలదూరంలో ఉంది. మన సూర్యుడు తన సౌరమండలగ్రహాలతో సహా ఈ గెలాక్టిక్ సెంటర్ చుట్టూతా 200మిలియన్ సంవత్సరాలలో ఒకసారి ప్రదక్షిణంచేస్తాడు. దీనికోసం ఆయన శూన్యంలో సెకనుకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు.ఇంకొక విచిత్రం ఏమిటంటే- ఈ విష్ణు నాభి అనేప్రాంతం ఒక ఎక్కుపెట్టబడిన విల్లువంటి ఆకారంలో,ధనుస్సులాగా ఉండి ధనూ రాశి అనే పేరుకు సరిగ్గాసరిపోతూ ఉంటుంది.

విష్ణు నాభి

మన పురాణాలు విశ్వం మొత్తాన్నీ విష్ణుస్వరూపంగా వర్ణించాయి. విశ్వం విష్ణు: అంటూ విష్ణు సహస్ర నామం కూడా చెప్పింది. విష్ణునాబినుంచి ఉద్భవించిన కమలంలో సృష్టిమూలమైన బ్రహ్మ జననం జరిగిందని పురాణాలుచెప్పాయి. మన గెలాక్సీకి కేంద్ర స్థానం అయిన ఈసెంటర్ ను మన భాషలో నాభి అనవచ్చు. నాభిఅనగా కుదురు, కేంద్రం అని అర్ధాలున్నాయి. అంటేవిష్ణునాభి అయిన గెలాక్టిక్ సెంటర్ సృష్టికి మూలంఅవడానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.
ఇక్కడే ఉన్నటువంటి "మూలా" నక్షత్రమండలం ఈఊహకు ఆధారాన్ని కలిగిస్తున్నది. ఇందులో చాలారహస్యాలు దాగి ఉన్నవి. సృష్టిమూలమైన మహాశక్తిఇక్కడే ఉన్నదని మనకు సూచన ప్రాయంగాతెలుస్తున్నది.ఇదే ప్రాంతంలో ఉన్నదని సైన్స్ఊహిస్తున్న బ్లాక్ హోల్ ఆ శక్తి స్వరూపంకావచ్చునా? ఈ విషయం పురాణాలు వ్రాశినమహర్షులకు ఎలా తెలిసి ఉండవచ్చొ, ఈనాడురేడియో టెలిస్కోపులకు కూడా లీలగా మాత్రమేఅందుతున్న ఈ రాశికి వాళ్ళు ఆనాడే కళ్లతోచూచినట్లు "ధనూరాశి" అని ఎలా నామకరణంచేశారో, అందులో బ్లాక్ హోల్ సమీపంలోనినక్షత్రానికి "మూలా నక్షత్ర మండలం" అని ఎలాపేరు పెట్టారో మన ఊహకు అందదు.

రాహుకేతువులు- సృష్టి క్రమం- ఒక అంతుబట్టనిరహస్యం

ధనూ రాశి బాణం ఎక్కుపెట్టిన ఒక విలుకానిరూపంలో ఉంటుంది. ఆ బాణం సరాసరి ఎదురుగాఉన్న మిధున రాశి వైపు గురి పెట్టి ఉంటుంది. ఈవిధంగా ధనూ రాశి నుంచి మిధున రాశి వరకు ఒకగీత గీస్తే, అది జ్యోతిశ్చక్రాన్ని రెండుగా విభజిస్తుంది.మిధున రాశిలో రాహువుదైన ఆర్ద్రా నక్షత్రం ఉన్నది.ధనూ రాశిలో కేతువుదైన మూలా నక్షత్రం ఉన్నది.మిధున రాశి జంట మిధునానికి సూచిక. అనగా స్త్రీపురుషులు జంటగా ఉన్న బొమ్మ ఈ రాశినిసూచిస్తుంది.
దీన్ని బట్టి ఏం అర్ధం అవుతున్నది? మూలానక్షత్రం ఉన్న ధనూ రాశి నుంచి స్త్రీ పురుషుల సృష్టిజరిగడానికి అవసరమైన శక్తి ప్రసారం మిధున రాశివైపు జరుగుతున్నది అని తెలుస్తున్నది. అంటేప్రధమంగా విశ్వంలో జీవావిర్భావానికి మూలంఅయిన శక్తి ప్రసారం ధనూ రాశిలో ఉన్న మూలానక్షత్ర ప్రాంతం నుంచి మిధున రాశి వైపుగా జరిగిఉండవచ్చు.
ఇక్కడే ఇంకొక విచిత్రం ఉన్నది. ఈ నాటికీ శిశుజననం జరిగినప్పుడు బొడ్డు కోయడం జరుగుతుంది.గర్భస్ఘ శిశువుకు బొడ్డు ( నాభి) ద్వారానే తల్లినుంచిపోషణ అందుతుంది. అలాగే విశ్వం మొత్తానికీ శక్తిప్రసారం విశ్వ నాభి అయిన గెలాక్టిక్ సెంటర్లో ఉన్నమూలా నక్షత్రం నుంచి జరుగుతూ ఉండవచ్చు. ఆశక్తి కేంద్రంతో బంధం తెగిన మరుక్షణం జీవిమాయామోహాలకు లోబడి మానవ జన్మలోకిఆడుగు పెట్టటం జరుగుతుండవచ్చు.

శిశు జననానికి పట్టే తొమ్మిది నెలలు-ఇంకో రహస్యం

శిశు జననానికి తొమ్మిది నెలలు పడుతుంది.అలాగే రాశి చక్రంలో ధనూ రాశి తొమ్మిదవది. అంటేమేష రాశిలో తలతో మొదలైన శిశువు రూపంతొమ్మిది నెలలు నిండిన తరువాత ధనూరాశిచివరలో ఈ భూమ్మీదకు వస్తున్నది. తొమ్మిదిరాశులను అధిగమించి, పదవ రాశి మరియు కర్మస్థానం అయిన మకర రాశిలోకి అడుగు పెడుతూమకరం వలె పాకుతూ ఈ కర్మల లోకంలోకి ఆడుగుపెడుతున్నది.

మూడో నెలలో పిండంలోనికి ఆత్మ ప్రవేశంజరుగుతుందని యోగవిదులు చెబుతారు. మూడోనెలలో పిండం ఆడో మగో స్ఫుటంగా తెలుస్తుంది.అందుకనేనేమో, మూడవ రాశి అయిన మిధునంయొక్క గుర్తు- స్త్రీ, పురుషులుగా ఉంటుంది. అంటేలింగ నిర్ధారణ ఆ సమయంలో జరుగుతుంది అనిరహస్య సంకేతంగా సూచితం అవుతున్నది
మూడో రాశి అయిన మిధునం లో ఉన్నపుడు,మూడవ నెలలో, దానికి సూటిగా ఎదురుగా ఉన్నధనూ రాశినుంచి, బాణం లాగా ఆత్మ వచ్చి ఈపిండంలో కుదురుకుంటుందని భావం. ఈ క్రమాన్నిరహస్యంగా సూచిస్తూ ధనూ రాశి నుంచిఎక్కుపెట్టిన బాణం దానికి ఎదురుగా ఉన్న స్త్రీపురుషుల సంకేత రాశి అయిన మిథునం వైపుగాచూస్తూ ఉంటుంది.
అంటే ఆత్మల పుట్టుక మూలా నక్షత్ర మండలప్రాంతంలో జరుగుతుందా? లేక మరణం తర్వాతఆత్మగా విశ్రాంతి తీసుకునే స్థానం ధనూరాశిలోఉన్న మూలా నక్షత్ర ప్రాంతంలోని విపరీతమైనమహా శక్తి కేంద్రం అయిన బ్లాక్ హోల్కావచ్చునా? మనమందరమూ మరణం తర్వాత చేరవలసిన స్థానం ఇదేనా? ఇదొక పరమ శాంతిమయ, తేజోమయ లోకం కావచ్చునా?

శ్రీ రామ కృష్ణ- వివేకానందుల బ్రహ్మ యోనిదర్శనం

వివేకానంద స్వామికి ఒకరోజున బ్రహ్మాండమైనత్రికోణాకారం ఒకటి బంగారు రంగులో వెలుగుతూధ్యానంలో దర్శనం ఇచ్చింది. ఆ ఆకారం జీవంతోనిండి ఉన్నట్లు ఆయనకు కనిపించింది. ఆవిషయాన్ని ఆయన శ్రీరామకృష్ణులతో చెబితే,ఆయన చాలా సంతోషించి " నీవీ రోజున బ్రహ్మయోనిని దర్శించావు. నేను కూడా ఆ దర్శనాన్ని నాసాధనా కాలంలో పొందాను. కాని ఆ మహాత్రికోణంనుంచి అనుక్షణం అనేక బ్రహ్మాండాలు, లోకాలువెలువడుతున్నట్లు కూడా నెను చూచాను" అనిచెబుతారు. అనగా వారిరువురూ, అసంఖ్యాకలోకాలకు అనుక్షణం జన్మ నిస్తున్న ఒక మహా శక్తికేంద్రాన్ని చూచారు. వారు చూచినది మూలా నక్షత్రమండల ప్రాంతంలో ఉన్నటువంటి మహా శక్తికేంద్రమైన బ్లాక్ హోల్ నేనా? ధ్యానంలో వారిమనస్సులు అన్ని కాంతి సంవత్సరాల దూరాన్నిఅధిగమించి ధనూ రాశి ప్రాంతంలో ఉన్న ఆ మహాశక్తిని దర్శించి ఉండవచ్చునా?
ధ్యానాభ్యాసులు, మనకు తెలిసిన ఇరవై ఏడు నక్షత్ర మండలాలను దాటి సుదూర విశ్వాంతరాళంలోకి తమ చేతనను తీసుకుపోవలసి ఉంటుంది. బిలియన్ల కాంతి సంవత్సరాల దూరాన్ని అధిగమించి చిమ్మ చీకటితో నిండిని విశాలాంతరాళంలో ఒక నక్షత్రంలానిరాధారంగా నిలబడవలసి ఉంటుంది. కనుక ధ్యానాభ్యాస పరులకు వారి ప్రయాణ మార్గంలో ఈ నక్షత్ర మండలాలు, కాంతి విస్ఫులింగాలు, జ్యోతిశ్చక్రాలు, దేవతా లోకాలు అన్నీ దర్శనం ఇస్తాయి


*ॐ{జై శ్రీమన్నారాయణ}ॐ*

పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు



పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు

పరీక్షల సమయంలో గణపతి, సరస్వతి, హయగ్రీవ మంత్రాలను పఠించడం ద్వారా అనవసర భయం, ఆందోళన లేకుండా మంచి జ్ఞాపక శక్తి కలిగి, పరీక్షలలో ఉత్తమమైన ప్రతిభను కనబరచి అఖండమైన వి జయాన్ని సాధించవచ్చు.
గణపతి స్తుతి:-

ఓం గణానాం త్వా గణపతిహిం హవామహే
కవిం కవీనా ముపమశ్ర వస్తమం
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత
ఆ న: శృణ్వనూతభి: స్సీదసాదనం
ఓం శ్రీ మహా గణాధిపతయే నమ: ||


సరస్వతీ స్తుతి:-
సర స్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా |
ఓం ప్రణో దేవీ సర్వస్వతీ వాజేభిర్వాజనీ వతీ
దీనా మవిత్రియవతు ఓం శ్రీ సరస్వత్యై నమ: ||


హయగ్రీవ స్తుతి:-
జ్ఞానానంద మయం నిర్మల స్ఫటికాకృతిమ్‌
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే |
ఉద్గ్ర ప్రణవోప్రణ వోద్గీత సర్వ వాగీశ్వరేశ్వరా
సర్వ వేద వయాచింత్య సర్వం బోధయ బోధయా ||

బల్లి శాస్త్రం. బల్లి మన పై పడితే ఫలితము, ఏ విధముగా ఉండే అవకాసం ఉన్నది




బల్లి శాస్త్రం.
బల్లి మన పై పడితే ఫలితము, ఏ విధముగా ఉండే అవకాసం ఉన్నది

శిరస్సు = కలహం
ముఖము నందు =బంధు దర్శనం
కనుబొమ్మల నడుమ = రాజానుగ్రహం
పై పెదవి =ధన వ్యయం
క్రింది పెదవి = ధన లాభం
ముక్కు చివర =రోగము
కుడి చెవు = దీర్ఘాయువు
ఎడమ చెవి =వ్యాపార లాభం
నేత్రాల యందు = శుభం
గడ్డం నందు =రాజ దండనము
నోటి మీద = ఇస్టాన్న భోజనం
మెడ యందు = పుత్రా జననం
దవడల మెడ =వస్త్ర లాభం
కంఠము నందు = శత్రువు
కుడి భుజం =ఆరోగ్యం
ఎడమ భుజం =స్త్రీ సంభోగం, ఆరోగ్యం
కుడి ముంజేయి = కీర్తి
ఎడమ ముంజేయి =రోగం
హస్తం = ధన లాభం
కనుల మీద =శుభం
చేతి గొళ్ళ యందు = ధన నాశనం
మోకాళ్ళు =స్త్రీ, ధన లాభము
పిక్కల యందు =శుభము
మదములు =శుభము
స్తన భాగం =దోషం
ఉదరం = ధన్య లాభం
రొమ్ము, నాభి = ధన లాభం
పాదం = ప్రయాణం
కాలి గోళ్ళు= నిర్లజ్జ
లింగం = దారిద్యం
జుట్టు కోన =మృత్యువు
దేహము పై పరిగెడితే = దీర్ఘాయువు
మీద పడి, వెను వెంటనే వెళిపోతే, దానంతట అది =మంచిది

పురుషులకు..

తలమీద కలహం
పాదముల వెనక ప్రయాణము
కాలివ్రేళ్లు రోగపీడ
పాదములపై కష్టము
మీసముపై కష్టము
తొడలపై వస్త్రనాశనము
ఎడమ భుజము అగౌరవము
కుడి భుజము కష్టము
వ్రేళ్ళపై స్నేహితులరాక
మోచేయి ధనహాని
మణికట్టునందు అలంకారప్రాప్తి
చేతియందు ధననష్టం
ఎడమ మూపు రాజభయం
నోటియందు రోగప్రాప్తి
రెండు పెదవులపై మృత్యువు
క్రింది పెదవి ధనలాభం
పైపెదవి కలహము
ఎడమచెవి లాభము
కుడిచెవి దుఃఖం
నుదురు బంధుసన్యాసం
కుడికన్ను అపజయం
ఎడమకన్ను శుభం
ముఖము ధనలాభం
బ్రహ్మరంద్రమున మృత్యువు

స్త్రీలకు..

తలమీద మరణసంకటం
కొప్పుపై రోగభయం
పిక్కలు బంధుదర్శనం
ఎడమకన్ను భర్తప్రేమ
కుడికన్ను మనోవ్యధ
వక్షమున అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి ధనలాభం
పై పెదవి విరోధములు
క్రిందిపెదవి నూతన వస్తులాభము
రెండుపెదవులు కష్టము
స్తనమునందు అధిక దుఃఖము
వీపుయందు మరణవార్త
గోళ్ళయందు కలహము
చేయుయందు ధననష్టము
కుడిచేయి ధనలాభం
ఎడమచేయి మనోచలనము
వ్రేళ్ళపై భూషణప్రాప్తి
కుడిభుజము కామరతి, సుఖము
బాహువులు రత్నభూషణప్రాప్తి
తొడలు వ్యభిచారము,కామము
మోకాళ్ళు బంధనము
చీలమండలు కష్టము
కుడికాలు శత్రునాశనము
కాలివ్రేళ్ళు పుత్రలాభం.

వీటికి పరిహారం గా...కంచిలోని వెండి..బంగారు బల్లి ముట్టుకుని వస్తే దోషాలు పోతాయి... భయపడాలిసిందేమి లేదు..! జీవితంలో ఒక్కసారి వెళ్లి తాకి వస్తే చాలు..పడ్డ ప్రతీ సారీ.. పరుగు పెట్టక్కరలేదు..కంచికి.
.!!

లలితాసహస్రనామ స్త్రోత్ర అర్ధాలు - ఫలితం



లలితాసహస్రనామ స్త్రోత్ర అర్ధాలు - ఫలితం

లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.

నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం.....కానీ బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్న్ని. సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్‌ అంటే ఖచ్చితంగా లెక్కపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి?? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం.

మనసుతో పలకాలి:

లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి.

భవానీమాతే లలితాదేవి:

ఎరుపు రంగు దుస్తులు కట్టు కొన్న, ప్రేమ మయ చూపులు కలిగిన పాశము, అంకు శం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామం త్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటు వంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలను కుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంఝాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు అను మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే, ఆ తల్లి పలుకు తుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి. ఈనామ సహస్రమే లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి. శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తమ్రు. గొప్ప ప్రమాణం.
183 శ్లోకములలో చెప్పబడినది:

ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామమము వివరణ ఇవ్వబడుతున్నది. శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపములోవున్నది. శ్రీఅంటే లక్ష్మి. మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. ముక్తిని పొందుదాం.

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS