Tuesday, January 9, 2018

విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక




విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక
గెలాక్టిక్ సెంటర్
విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలుఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మనసౌరకుటుంబం ఉన్నది పాలపుంత అనబడే ఒకగెలాక్సీలో అని మనకు తెలుసు. ఈ పాలపుంతలోమనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కేలేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈపాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేదిఊహించనలవి గాని శక్తికి కేంద్రం. అది ప్రస్తుతంధనూరాశిలో ఉంది. ఈ ధనూ రాశిలోనే గేలాక్టిక్సెంటర్ దగ్గరగా మూలా నక్షత్రం ఉంది. ఈప్రాంతంలో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉన్నదని సైన్సుఅంచనా వేసింది. ఆ బ్లాక్ హోల్ ఒక పెద్ద నక్షత్రంసైజులో ఉండి, కొన్ని మిలియన్ల సూర్యులసాంద్రతను కలిగి ఉంది. ఇది ఊహించ నలవి గానంత రేడియో తరంగాలనువేదజల్లగల శక్తిని కలిగి ఉంది. మన సూర్యునినుంచి ఇది దాదాపు 30,000 కాంతి సంవత్సరాలదూరంలో ఉంది. మన సూర్యుడు తన సౌరమండలగ్రహాలతో సహా ఈ గెలాక్టిక్ సెంటర్ చుట్టూతా 200మిలియన్ సంవత్సరాలలో ఒకసారి ప్రదక్షిణంచేస్తాడు. దీనికోసం ఆయన శూన్యంలో సెకనుకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు.ఇంకొక విచిత్రం ఏమిటంటే- ఈ విష్ణు నాభి అనేప్రాంతం ఒక ఎక్కుపెట్టబడిన విల్లువంటి ఆకారంలో,ధనుస్సులాగా ఉండి ధనూ రాశి అనే పేరుకు సరిగ్గాసరిపోతూ ఉంటుంది.

విష్ణు నాభి

మన పురాణాలు విశ్వం మొత్తాన్నీ విష్ణుస్వరూపంగా వర్ణించాయి. విశ్వం విష్ణు: అంటూ విష్ణు సహస్ర నామం కూడా చెప్పింది. విష్ణునాబినుంచి ఉద్భవించిన కమలంలో సృష్టిమూలమైన బ్రహ్మ జననం జరిగిందని పురాణాలుచెప్పాయి. మన గెలాక్సీకి కేంద్ర స్థానం అయిన ఈసెంటర్ ను మన భాషలో నాభి అనవచ్చు. నాభిఅనగా కుదురు, కేంద్రం అని అర్ధాలున్నాయి. అంటేవిష్ణునాభి అయిన గెలాక్టిక్ సెంటర్ సృష్టికి మూలంఅవడానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.
ఇక్కడే ఉన్నటువంటి "మూలా" నక్షత్రమండలం ఈఊహకు ఆధారాన్ని కలిగిస్తున్నది. ఇందులో చాలారహస్యాలు దాగి ఉన్నవి. సృష్టిమూలమైన మహాశక్తిఇక్కడే ఉన్నదని మనకు సూచన ప్రాయంగాతెలుస్తున్నది.ఇదే ప్రాంతంలో ఉన్నదని సైన్స్ఊహిస్తున్న బ్లాక్ హోల్ ఆ శక్తి స్వరూపంకావచ్చునా? ఈ విషయం పురాణాలు వ్రాశినమహర్షులకు ఎలా తెలిసి ఉండవచ్చొ, ఈనాడురేడియో టెలిస్కోపులకు కూడా లీలగా మాత్రమేఅందుతున్న ఈ రాశికి వాళ్ళు ఆనాడే కళ్లతోచూచినట్లు "ధనూరాశి" అని ఎలా నామకరణంచేశారో, అందులో బ్లాక్ హోల్ సమీపంలోనినక్షత్రానికి "మూలా నక్షత్ర మండలం" అని ఎలాపేరు పెట్టారో మన ఊహకు అందదు.

రాహుకేతువులు- సృష్టి క్రమం- ఒక అంతుబట్టనిరహస్యం

ధనూ రాశి బాణం ఎక్కుపెట్టిన ఒక విలుకానిరూపంలో ఉంటుంది. ఆ బాణం సరాసరి ఎదురుగాఉన్న మిధున రాశి వైపు గురి పెట్టి ఉంటుంది. ఈవిధంగా ధనూ రాశి నుంచి మిధున రాశి వరకు ఒకగీత గీస్తే, అది జ్యోతిశ్చక్రాన్ని రెండుగా విభజిస్తుంది.మిధున రాశిలో రాహువుదైన ఆర్ద్రా నక్షత్రం ఉన్నది.ధనూ రాశిలో కేతువుదైన మూలా నక్షత్రం ఉన్నది.మిధున రాశి జంట మిధునానికి సూచిక. అనగా స్త్రీపురుషులు జంటగా ఉన్న బొమ్మ ఈ రాశినిసూచిస్తుంది.
దీన్ని బట్టి ఏం అర్ధం అవుతున్నది? మూలానక్షత్రం ఉన్న ధనూ రాశి నుంచి స్త్రీ పురుషుల సృష్టిజరిగడానికి అవసరమైన శక్తి ప్రసారం మిధున రాశివైపు జరుగుతున్నది అని తెలుస్తున్నది. అంటేప్రధమంగా విశ్వంలో జీవావిర్భావానికి మూలంఅయిన శక్తి ప్రసారం ధనూ రాశిలో ఉన్న మూలానక్షత్ర ప్రాంతం నుంచి మిధున రాశి వైపుగా జరిగిఉండవచ్చు.
ఇక్కడే ఇంకొక విచిత్రం ఉన్నది. ఈ నాటికీ శిశుజననం జరిగినప్పుడు బొడ్డు కోయడం జరుగుతుంది.గర్భస్ఘ శిశువుకు బొడ్డు ( నాభి) ద్వారానే తల్లినుంచిపోషణ అందుతుంది. అలాగే విశ్వం మొత్తానికీ శక్తిప్రసారం విశ్వ నాభి అయిన గెలాక్టిక్ సెంటర్లో ఉన్నమూలా నక్షత్రం నుంచి జరుగుతూ ఉండవచ్చు. ఆశక్తి కేంద్రంతో బంధం తెగిన మరుక్షణం జీవిమాయామోహాలకు లోబడి మానవ జన్మలోకిఆడుగు పెట్టటం జరుగుతుండవచ్చు.

శిశు జననానికి పట్టే తొమ్మిది నెలలు-ఇంకో రహస్యం

శిశు జననానికి తొమ్మిది నెలలు పడుతుంది.అలాగే రాశి చక్రంలో ధనూ రాశి తొమ్మిదవది. అంటేమేష రాశిలో తలతో మొదలైన శిశువు రూపంతొమ్మిది నెలలు నిండిన తరువాత ధనూరాశిచివరలో ఈ భూమ్మీదకు వస్తున్నది. తొమ్మిదిరాశులను అధిగమించి, పదవ రాశి మరియు కర్మస్థానం అయిన మకర రాశిలోకి అడుగు పెడుతూమకరం వలె పాకుతూ ఈ కర్మల లోకంలోకి ఆడుగుపెడుతున్నది.

మూడో నెలలో పిండంలోనికి ఆత్మ ప్రవేశంజరుగుతుందని యోగవిదులు చెబుతారు. మూడోనెలలో పిండం ఆడో మగో స్ఫుటంగా తెలుస్తుంది.అందుకనేనేమో, మూడవ రాశి అయిన మిధునంయొక్క గుర్తు- స్త్రీ, పురుషులుగా ఉంటుంది. అంటేలింగ నిర్ధారణ ఆ సమయంలో జరుగుతుంది అనిరహస్య సంకేతంగా సూచితం అవుతున్నది
మూడో రాశి అయిన మిధునం లో ఉన్నపుడు,మూడవ నెలలో, దానికి సూటిగా ఎదురుగా ఉన్నధనూ రాశినుంచి, బాణం లాగా ఆత్మ వచ్చి ఈపిండంలో కుదురుకుంటుందని భావం. ఈ క్రమాన్నిరహస్యంగా సూచిస్తూ ధనూ రాశి నుంచిఎక్కుపెట్టిన బాణం దానికి ఎదురుగా ఉన్న స్త్రీపురుషుల సంకేత రాశి అయిన మిథునం వైపుగాచూస్తూ ఉంటుంది.
అంటే ఆత్మల పుట్టుక మూలా నక్షత్ర మండలప్రాంతంలో జరుగుతుందా? లేక మరణం తర్వాతఆత్మగా విశ్రాంతి తీసుకునే స్థానం ధనూరాశిలోఉన్న మూలా నక్షత్ర ప్రాంతంలోని విపరీతమైనమహా శక్తి కేంద్రం అయిన బ్లాక్ హోల్కావచ్చునా? మనమందరమూ మరణం తర్వాత చేరవలసిన స్థానం ఇదేనా? ఇదొక పరమ శాంతిమయ, తేజోమయ లోకం కావచ్చునా?

శ్రీ రామ కృష్ణ- వివేకానందుల బ్రహ్మ యోనిదర్శనం

వివేకానంద స్వామికి ఒకరోజున బ్రహ్మాండమైనత్రికోణాకారం ఒకటి బంగారు రంగులో వెలుగుతూధ్యానంలో దర్శనం ఇచ్చింది. ఆ ఆకారం జీవంతోనిండి ఉన్నట్లు ఆయనకు కనిపించింది. ఆవిషయాన్ని ఆయన శ్రీరామకృష్ణులతో చెబితే,ఆయన చాలా సంతోషించి " నీవీ రోజున బ్రహ్మయోనిని దర్శించావు. నేను కూడా ఆ దర్శనాన్ని నాసాధనా కాలంలో పొందాను. కాని ఆ మహాత్రికోణంనుంచి అనుక్షణం అనేక బ్రహ్మాండాలు, లోకాలువెలువడుతున్నట్లు కూడా నెను చూచాను" అనిచెబుతారు. అనగా వారిరువురూ, అసంఖ్యాకలోకాలకు అనుక్షణం జన్మ నిస్తున్న ఒక మహా శక్తికేంద్రాన్ని చూచారు. వారు చూచినది మూలా నక్షత్రమండల ప్రాంతంలో ఉన్నటువంటి మహా శక్తికేంద్రమైన బ్లాక్ హోల్ నేనా? ధ్యానంలో వారిమనస్సులు అన్ని కాంతి సంవత్సరాల దూరాన్నిఅధిగమించి ధనూ రాశి ప్రాంతంలో ఉన్న ఆ మహాశక్తిని దర్శించి ఉండవచ్చునా?
ధ్యానాభ్యాసులు, మనకు తెలిసిన ఇరవై ఏడు నక్షత్ర మండలాలను దాటి సుదూర విశ్వాంతరాళంలోకి తమ చేతనను తీసుకుపోవలసి ఉంటుంది. బిలియన్ల కాంతి సంవత్సరాల దూరాన్ని అధిగమించి చిమ్మ చీకటితో నిండిని విశాలాంతరాళంలో ఒక నక్షత్రంలానిరాధారంగా నిలబడవలసి ఉంటుంది. కనుక ధ్యానాభ్యాస పరులకు వారి ప్రయాణ మార్గంలో ఈ నక్షత్ర మండలాలు, కాంతి విస్ఫులింగాలు, జ్యోతిశ్చక్రాలు, దేవతా లోకాలు అన్నీ దర్శనం ఇస్తాయి


*ॐ{జై శ్రీమన్నారాయణ}ॐ*

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS