"కృష్ణ" అనగా నలుపు అని అర్ధవు. కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం. ఇంకా ఈ పేరుకు అనేక వివరణలున్నాయి. మహాభారతం ఉద్యోగపర్వం ప్రకారం 'కృష్' అనగా దున్నుట (నాగలి మొన నల్లగా ఉంటుంది గనుక ఈ పేరు వచ్చింది). భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు (వ్యవసాయానికి ప్రాముఖ్యతను తెలిపే పేరు). వల్లభ సాంప్రదాయం బ్రహ్మసంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం "కృష్ణ". చైతన్య చరితామృతంలో చెప్పిన అర్థం
ప్రకారం మహాభారత వాక్యం . ఆకర్షించేవాడు కృష్ణుడు. భాగవతం ఆత్మారామ శ్లోకంలో కూడా ఈ భావం చెప్పబడింది. విష్ణుసహస్రనామం 57వ పేరుగా వచ్చిన "కృష్ణ" అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించునది అని ఆదిశంకరాచార్యుడు వివరించాడు. ఇంకా కృష్ణునికి గోవిందుడు, గోపాలుడు, వాసుదేవుడు వంటి అనేకనామాలున్నాయి. జగన్నాథుడు, విఠోబా వంటి పేర్లు కొన్ని ప్రాంతాలలో లేదా సంప్రదాయాలలో ప్రాచుర్యం కలిగి ఉన్నాయి.
బృందావనం అంటే ఏమి ?
శ్రీ కృష్ణుడు నెమలి పించం తన ఆభరణముగా తలపై ఎందుకు ధరించాడు?
"బృంద" అంటే ... పల్లేరుకాయలు వనము, అంటే అడవి .... పల్లేరు కాయలతో నిండిన వనం అనీ అర్ధం
శ్రీ కృష్ణపరమాత్మ వచ్చినంతనే.... పారిజాతవనమయ్యింది, పచ్చని పచ్చికబయళ్ళుతో,అందమైన పుష్పజాతులతో కనువిందు గొలిపే నందనవనంగా మారింది.
ఇక కొందరు మహానుభావులు ఈ మధ్య అనవసర పుకార్లతో పురాణాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కృష్ణుడు నవనీతచోరుడు (దొంగ ).... 16,000మంది గోపికలతో సరససల్లాపాలు జరిపాడు. గోపికాజారుడు కాదా అనీ ....
నెమలి పించం ధరించడం ప్రాశస్త్యం
********************************
త్రేతాయుగమున రామావతారంలో ఆయన ధర్మనిబద్ధత,ఆయన నడిచిన మార్గమునకు ముగ్ధులై ఋషులు,మునులు,అప్సరసలు,దేవతలు,ముఖ్యమైన భక్తులు స్వామివారి సఖ్యతను కోరి వేడుకున్నందున.. ద్వాపరమందున కృష్ణావతారం దాల్చినప్పుడు,మీరు గోపికలుగా జన్మించిన... మీ కోరికలు నెరవేరగలవని మాటఇచ్చినందుననే .....వారితో సఖ్యంగా మెలిగాడు.
కృష్ణుడు పుట్టినంతనే ... (అంతకుపూర్వం అక్కడి బక్కచిక్కిన ) గోవులు పుష్కలంగా ఇచ్చిన పాలతో తయారుచేసిన వెన్న ముందుగా ఎవరి ఇంట ప్రవేశించి తింటాడో ననీ తలుపులు తెరిచి దొంగచాటుగా ఆయనకోసం గోపికలవేషం లోఉన్న దేవతలు నిరీక్షించేవారు.... వెన్న జ్ఞానస్వరూపమట.
శ్రీకృష్ణ పరమాత్మ తన అతి చిన్న వయసు కేవలం ఆరున్నర (6-1/2) ప్రాయంలో గోపికలతో శారీరక సంబంధం లేకుండా ,ఎవరు ఎలా కోరుకుంటే ఆ విధంగా వారితో సరస సల్లాపాలు జరిపాడు.ఈయన పవిత్రుడు గోపికలు కృష్ణుడి మధ్యన ఉన్నది పవిత్రమైన చెలిమి మాత్రమే,కృష్ణుడు మనందరికీ గూడా ఒక భోగిగా కనిపించే ఒక యోగి.
కృష్ణుడు అస్కలిత(స్కలనం లేనివాడు ) బ్రహ్మచారి . కనుకనే తన తలపై నెమలి పించo ధరించాడు.
ఇక నెమలి విషయానికొస్తే ప్రపంచంలో సంభోగం చేయని చేయలేని అతిపవిత్రమైన జీవి / పక్షి అందుకే మన భారత జాతీయపక్షి గా నెమలిని ఎంచుకున్నారు.
ఎందుకనగా ... ప్రతీ ప్రాణి జననానికి ఆడ,మగ ప్రాణుల సంయోగం అవసరం,,,కానీ నెమలి పక్షి విషయంలో ఈ ప్రక్రియ ప్రత్యేకం
ఎక్కువగా వర్షాకాలం లో మెరుపులు ఉరుములతోకూడిన వర్షం పడే /వర్షం పడి ఆగిన సమయంలో.... ఆకాశంలో జరిగే మార్పులను ఇంద్రధనుస్సు లను చూచిన ఆనందపరవశం లో మగ నెమలి తన పురి విప్పి ఆనంద తాండవం/నాట్యం చేస్తుంది.... ఆ సమయంలో ఆ మగ నెమలి కంటి నుండి ఆనంద భాష్పములు రాలుతాయి,ఈ సమయంలోనే ఆడ నెమలి....మగ నెమలి కంటి నుండి రాలిన చుక్కలను తన నోటిద్వారా తను గ్రహించి గర్భం దాల్చి మరో పక్షికి గుడ్ల రూపంలో జన్మనిస్తుంది,కానీ ఈ నెమళ్ళు సంభోగించవు.
అందువలననే శ్రీ కృష్ణపరమాత్మ కూడా నాకు ఎవరితో శారీరక సుఖములేదు,కేవలం ఆత్మ,భక్తి,ప్రేమ సుఖము తప్ప.... నాకు ఏ దోషమూ లేదు ,నాకు ఏ స్త్రీతో సంబంధం లేదు అనీ తలియజెప్పడమే తాను తలపైన నెమలి పింఛాన్ని ధరించే శ్రీ కృష్ణ తత్వం!!!....
మీ అందరికీ ఓ అనుమానం కలుగ వచ్చు మరి కృషుడికి సంతానం లేదా?...అవును,ఆకాలంలోఆయన ధర్మానుసారం చేసుకున్నవే అష్ట వివాహాలు.
కృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు. కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి 16వేలమంది (కొన్ని గ్రంథాలలో 16100 అని ఉన్నది) భార్యలతో శారీరక బంధము కలిగియుండలేదు. 16 వేల గోపికా స్త్రీలను నరకాసురుని బారినుండి కాపాడి సంఘములో సముచిత స్థానము కల్పించాడు. "భర్త అనగా భరించువాడు" అను నానుడి ప్రకారము, మరియు ఒక పురుషుని పంచన చేరి, అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమానస్థితి-గతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు. కానీ పైన చెప్పబడిన అష్ఠ అష్టమహిషులతోనే శ్రీకృష్ణునికి సంతానము కలిగినది అని గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి. .
జై శ్రీ కృష్ణ !!!
No comments:
Post a Comment