Friday, January 12, 2018

అష్ట వినాయకులు – అష్ట శక్తులు

                                     ...


అష్ట వినాయకులు – అష్ట శక్తులు

శ్రీ గణేశుడు సాధన చేసి శివపిత అయిన పరమాత్ముని ద్వారా అష్ట శక్తులను ప్రాప్తి చేసుకున్నాడు. కనుకనే అతనికి అష్టవినాయకుడు అన్న పేరుతో గాయనము ఉంది, పూజ జరుగుతుంది. వారి ప్రతి ఒక్క పేరులో ఆ శక్తి మరియు దాని మహత్వము స్పష్టమవుతుంది. అదేవిధంగా మనము కూడా శివపితను స్మరించి, సాధనతో ఈ అన్ని శక్తులను ప్రాప్తి చేసుకోగలము.

శ్రీ గణేశునికి అనేక పేర్లు ఉన్నాయి, ప్రతి ఒక్క పేరు గుణవాచకము మరియు కర్తవ్య వాచకమైనది. శివ పుత్రుడైన గణేశునికి శివారాధనద్వారా అనేక దివ్య శక్తులు ప్రాప్తించాయి, వాటి స్వరూపము కర్తవ్యాల రూపములో ప్రసిద్ధము.

*శ్రీ మోరేశ్వరుడు..! మన బుద్ధిని శుద్ధంగా, పవిత్రంగా తయారుచేసే కర్తవ్యము చేసేవారిని మోరేశ్వర్ అని అంటారు.

*శ్రీ వరద వినాయకుడు..!! మహాదాని మరియు వరదానీ దృష్టిద్వారా సర్వుల మనోకామనలను పూర్తి చేసే శక్తిని ప్రాప్తి చేసుకున్న కారణంగా శ్రీ గణేశుని శ్రీ వరద వినాయకుడు అని అంటారు.

*శ్రీ విఘ్నేశ్వరుడు..!! పరమాత్మ స్మృతిద్వారా భక్తులందరి విఘ్నాలను దూరము చేస్తారు మరియు ఏ కార్యమునైనా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు కనుక శ్రీ గణేశుని విఘ్న వినాశక రూపములో పూజిస్తారు.

*శ్రీ మహా గణపతి...!! ఆత్మలందరి అపరాధాలను స్వయములో ఇముడ్చుకునే శక్తి అనగా క్షమించే మహా శక్తి ఉన్న కారణంగా శ్రీ గణేశుని శ్రీ మహా గణపతి అని అంటారు.

*శ్రీ చింతామణి..!! ప్రభు చింతనద్వారా అందరి వ్యర్ధ చింతలను సమాప్తము చేసే శక్తి ఉన్న కారణంగా శ్రీ గణేశుని పేరు శ్రీ చింతామణి అయింది.

*శ్రీ బల్లాలేశ్వరుడు..!! నిరంతర ఈశ్వరీయ స్మృతిద్వారా అనేక పరిస్థితులను ఎదుర్కొనే శక్తి (బలము) శ్రీ గణేశునికి ప్రాప్తించిన కారణంగా వారిని శ్రీ బల్లాలేశ్వరుడు అని అంటారు.

*శ్రీ గిరిజాత్మజుడు..!! ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా తన మానసిక స్థితిని అచలంగా, దృఢంగా ఉంచుకునే శ్రీ గణేశుని శ్రీ గిరిజాత్మజుడు అని అంటారు.

*శ్రీ సిద్ధి వినాయకుడు..!! యోగ తపస్య ద్వారా ప్రతి సంకల్పాన్ని సిద్ధింపచేసుకునే శక్తి అనగా సర్వుల మనోకామనలను పూర్తి చేసే శక్తిని ప్రాప్తి చేసుకున్న శ్రీ గణేశున్ని శ్రీ సిద్ధి వినాయకుడు అని అంటారు.

ఇదేవిధంగా రాజయోగముద్వారా అనగా శివ పరమాత్మ స్మృతిద్వారా, యోగ-తపస్యలద్వారా దివ్య శక్తులను ప్రాప్తి చేసుకునే శివపుత్రులకు శ్రీ గణేశుడు ప్రతీక.

అష్ట వినాయకుడు..
అష్టవినాయక లేదా ఎనిమిది గణేష్లు భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది, అష్టవినాయక యాత్ర లేదా తీర్థయాత్ర వినాయకుడి ఎనిమిది పవిత్ర ఆలయాలు ఉన్నాయి .అన్ని ఎనిమిది అష్టవినాయక్ ఆలయాలు స్వయంభూ (స్వీయ-ఆవిర్భావం) మరియు జాగ్రూత్.

వివిధ ప్రదేశాలలో గణేష్ . గణేశ్వర్, మహంగపాటి, చింతామణి, గిరిజత్మాక్, విగ్నేశ్వర్, సిద్వివినాయక్, బల్లలేశ్వర్, వరద వినాయక్లు వివిధ గణేష్ పేర్లు. ఈ టెంపుల్స్ మోర్గావ్, రంజంగాన్, థిర్, లెనియద్రి, ఓఝర్, సిద్దాత్క్, పాలి మరియు మహద్ వద్ద ఉన్నాయి. ఈ ప్రదేశాలు పూణే, అహ్మద్ నగర్ మరియు రాయ్గడ్ జిల్లాలో ఉన్నాయి. 8 వినాయకాల్లో 6, పూణె జిల్లాలో 2, రాయ్గడ్ జిల్లాలో ఉన్నాయి, కానీ పూణే ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS