హనుమాన్ చాలిసా .
సుప్రసిద్ద హిందీ ప్రాచీన కవి ,శ్రీరామ భక్తులలో
అగ్రగణ్యుడు 'రామచరిత మానస్ 'అనే పేరుతో రామాయణం రచించిన గోస్వామి
తులసీదాసు తీర్థములు దర్శిస్తూ పండరీపురం చేరి ,అక్కడ కొంతకాలం నివసించాడు .నిత్యకృత్యాల్లో భాగముగా ఓ
రోజున 'చంద్రభాగా ' నదిలో స్నానం చేసి
పండరినాథుని ధ్యానిస్తూ నదీతీరాన కూర్చుని ఉన్నాడు .అదే సమయములొ ఒక అంధుడు ఇంట్లొ తగాదాపడి అత్మహత్య చేసుకొందామని అక్కడికొచ్చాడు .ధ్యానం లో
ఉన్న తులసిదాసును ఆ అంధుడు పాదాలు
తగిలాయి .అతడు పడిపొయాడు .తులసి
వెంటనే ఆ అంధుణ్ణి పైకి లేపి ,అలింగనం చేసుకుని 'క్షమించు నాయనా ! నీ కృపాదృష్టిని నాపై ప్రసరింపచెయ్యి .ఇటు చూడు 'అన్నాడు .అంతే ...ఆ అంధుడికి చూపువచ్చింది .పరమానందంతో తులసిదాసు పాదాలపైబడి 'స్వామీ ! మీరు
నా పాలిట సాక్షాత్తూ పాండురంగస్వామి వే
నాకు దృష్టిని ప్రసాదించారు .మరోజన్మకు
నన్ను అర్హుణ్ణి చేశారు .ఈ పునర్జన్మను అధ్యాత్మిక సేవతో సద్వినియోగము చేసుకొంటాను 'అని అన్నాడు .అందుకు తులసిదాసు 'నాయనా !ఇది నా మహిమకాదు .నేను సామాన్యుణ్ణి .విఠల ప్రభువు అనుగ్రహ పాప్తి కలిగింది .నీకు అది దివ్యదృష్టి .నీ శేష జీవితాన్ని దైవచింతనలో
ధన్యం చేసుకో 'అని పలికాడు .
తులసిదాసు జీవితంలో ఇలాంటి సంఘటనలెన్నో సంభవించాయి .ఇవన్నీ
భగవంతుడు ఆయనద్వారా వ్యక్తం చేయించినవే .ఈ విషయం ఆ కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తెలిసింది .తనకొలువుకు రావాల్సిందిగా
అహ్వానించాడు .'నీకు చాలా మహిమలున్నట్లు తెలిసింది ...నాకు కొన్ని చూపించు .మెప్పించి పారితోషికాలు స్వీకరించు 'అని కబురు పంపాడు .
అందుకు తులసిదాసు ' పాదుషా చక్రవర్తీ !
నేను రామదాసును .నాలో ఏ మహిమలూ
లేవు .నిమిత్రమాత్రుణ్ణి. ఏమైనా ,ఎక్కడైనా వ్యక్తమైతే అవి శ్రీరామచంద్రమూర్తి లీలలు !'
అని బదులిచ్చాడు .అక్బరుకు ఆగ్రహం
కలిగింది .' ఎమిటీ !పాదుషానే ధిక్కరిస్తున్నావా ! నా మాట విననివాళ్లకు
మరణదండన తప్పదని సంగతి నీకు తెలియదా 'అని గద్దించాడు .తులసిదాసు
వినమ్రుడై బదులు పలికాడు .'మరణమే శరణ్యమని రాముని సంకల్పమైతే ఆ మరణం ఆపినా ఆగదు .'అన్నాడు .అక్బరు క్రోధం తారాస్థాయికి చేరుకొంది .తన ఆజ్ఞను
కాదనీ ధిక్కరించినందుకు భటులని పిలచి
తులసిదాసును కొరడాదెబ్బలతో కొట్టవలిసినదిగా ఆదేశించాడు .తులసి రెండు
చేతులు జోడించి 'రామనామ 'స్మరణం చేశాడు .భటుల చేతిలో కొరడాలు లేచినవి
లేచినట్లే ఉండిపోయాయి .అక్బరుతో సహా
భటులను భయంకర చూపులతో ,అరుపులతో అసంఖ్యాకమైన
కోతులు బెదిరించసాగాయి .అందరూ కంపించసాగారు .చుట్టూ చేరిన కోతులు వాళ్లను అడుగైనా కదలినివ్వడం లేదు .అక్బరు దిగ్బ్రాంతి చెంది దిక్కుతోచని
స్థితిలో ఉండిపోయాడు .తనపొరపాటును తెలుసుకున్నాడు .తులసిదాసు పాదాలమీద
పడి కన్నీరుమున్నీరుగా విలపించసాగాడు .
తులసికి ఏమీ అర్థం కాలేదు .కారణమడిగితే
తనదయనీయ స్థితిని వివరించాడు అక్బరు .
తనకే కోతులు కనిపించడంలేదే .భక్తి ప్రపత్తులతొ హనుమను ప్రార్ధించాడు .
'స్వామీ !నాపై ఎందుకింత నిర్దయ .వీరందరికీ
దర్శనమిచ్చి కరుణించావు కదా !నాకెందుకు
ఆ సౌభాగ్యం ప్రసాదించవు ?నేను చేసిన
అపరాధం ఏదైనావుంటే క్షమించు 'అంటూ
దుఃఖబాష్పధారలు స్రవిస్తుంటే ,ఎలుగెత్తి
వాయునందనుణ్ణి అనేక విధాలా స్తుతి చేశాడు .పవన సుతుని దర్శనం పొంది
పరమానందభరితుడై పోయాడు .
అదే 'హనుమాన్ చాలిసా 'గా జగత్ప్రసిద్ది
పొందింది .మారుతి కటాక్ష వరమహిమ చేత
తులసిదాసు విరచిత 'హనుమాన్ చాలిసా '
మోక్ష తులసిదళమై రామనామ జపసాధకులను పునీతం చేస్తుంది

No comments:
Post a Comment