అష్టలక్ష్మి దేవాలయం గుంటూరు | Ashta Lakshmi Temple Arundalpet GuntuR అష్టలక్ష్మి దేవాలయం..అరండల్ పేట..4వ లైన్..గుంటూరు
Sunday, May 30, 2021
అష్టలక్ష్మి దేవాలయం గుంటూరు | Ashta Lakshmi Temple Arundalpet GuntuR అష్టలక్ష్మి దేవాలయం..అరండల్ పేట..4వ లైన్..గుంటూరు
ఓం శ్రీ మాత్రేనమః🙏🙏
ఈ లక్ష్మీదేవి (అష్టలక్ష్మీ ఆలయం..) దేవాలయం గుంటూరు నగరం, అరండల్ పేట 4వలైన్, 4వ అడ్డరోడ్ లో ఉన్న శివాలయం శ్రీగంగా,మీనాక్షి సమేత సోమసుందరేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్నది. ఈ అష్టలక్ష్మీ మందిరం హంపి విరూపాక్ష శ్రీ విద్యారణ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో 1996లో నిర్మించబడింది. చాలా అద్భుతమైన దేవాలయం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నిత్యం విశేష పూజలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. లక్ష్మీ అమ్మవార్ల మూల విగ్రహాలు ఎంతో అందంగా అమర్చబడి ఉన్నాయి. ఒకవైపు నలుగురు, మరోవైపు నలుగురు లక్ష్మీదేవీలు మధ్యలో లక్ష్మీ నారాయణులు, వారి ఎదురుగా మరో లక్ష్మీవిగ్రహం దానిముందు శ్రీచక్రం ఎప్పుడూ కుంకుమార్చనలతో విరాజిల్లుతూ వుంటుంది. శ్రీసూక్తంతో కుంకుమ పూజ చేస్తూంటారు. ఎంతో అందంగా లక్ష్మీ నారాయణులు అలంకరణ చేస్తారు. కలువపూల అలంకరణలో అమ్మవార్లు ఎంతో అందంగా ఉంటారు. ఇక్కడ అఖండ దీపారాధన చేస్తారు.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే!
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే!!
మరో ప్రక్క సాయిబాబా వారి విగ్రహం-ద్వారకా సాయినాధుడు కొలువై ఉన్నారు. బాబా వెనుక కొన్ని ఉత్సవ విగ్రహాలను ఉంటాయి. గణపతి, సుబ్రంహ్మణ్యస్వామి, లక్ష్మీ నారాయణుల ఉత్సవ విగ్రహాలను ఉంటాయి. మరోవైపు దసరా ఉత్సవాల సందర్భంగా వివిధ అమ్మవార్ల అలంకరణల ఉత్సవ విగ్రహాలను ఉంటాయి. ఎంతో అద్భుతంగా మహిషాసుర మర్ధిన, శివుడు, అన్నపూర్ణాదేవి, నెమలి వీణతో సరస్వతీదేవి, ఏనుగులతో లక్ష్మీదేవి, దుర్గాదేవి విగ్రహాలు ఎంతో అదంగా అలంకరిచి ఉంటాయి. ఈ అష్టలక్ష్మీ దేవాలయానికి గోశాల కూడా ఉంది. నిడుముక్కల, తాడికొండలో గోశాల ఏర్పాటు చేశారు. గుంటూరులోని ఈ దేవాలయాన్ని తప్పక దర్శించాలని, ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం అందరికీ కలగాలని, వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందుతారని ఆశిస్తూ....
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏
శ్రీ విజయ సాయిబాబా మందిరం గోరంట్ల మెయిన్ రోడ్ అమరావతి రోడ్ గుంటూరు SRI VIJAYA SAIBABA MANDIR GORANTLA GUNTUR విజయ సాయిబాబా మందిరం...గోరంట్ల...గుంటూరు
శ్రీ విజయ సాయిబాబా మందిరం గోరంట్ల మెయిన్ రోడ్ అమరావతి రోడ్ గుంటూరు SRI VIJAYA SAIBABA MANDIR GORANTLA GUNTUR విజయ సాయిబాబా మందిరం...గోరంట్ల...గుంటూరు
ఓం శ్రీ సాయిరాం🙏🙏
గుంటూరుకి అతిసమీపంలో ఉన్న గోరంట్ల గ్రామంలో ఉన్న విజయ సాయిబాబా మందిరం చిన్నదైనా, ఎంతో భక్తి-శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రక్కనే ప్రసన్నాంజనేయ స్వామి మందిరం కూడా ఉన్నది.
ఆలయం పైన గణపతి విగ్రహం, మధ్యలో బాబా, కుమారస్వామి విగ్రహలు చూడవచ్చు. సాయిబాబా మందిరం లోపలికి ప్రవేశించగానే ఎంతో కళాత్మకంగా నెమలి బొమ్మలతో, మండపం రంగులతో వేసిన అలంకరణ కనిపిస్తుంది. బాబా విగ్రహం ఎదురుగా కూర్మం (తాబేలు) ప్రతిష్టించారు. ప్రక్కన మండపానికి ఒకవైపు విఘ్నేశ్వరుడు, మరొకవైపు దత్తాత్రేయుడు దర్శనం చేసుకోవచ్చు. బాబా విగ్రహం చూడచక్కగా మనిషి రూపం చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఎంతో అద్భుతంగా అలంకరించారు. షిరిడిలో మాదిరిగా విగ్రహం ముందు సమాధి ఏర్పాటుచేసి అలంకారం చేసారు. పాదుకలు దర్శించుకోవటానికి, ప్రదక్షిణలు చేయుటకు వీలుగా ఏర్పాటుచేసారు.
హే పరమేశ్వర దీనదయాళో,సాయినాధ గురుదేవ కృపాళో!
రక్ష రక్ష జగదీశ్వర సాయి,ఆర్తత్రాణ పరాయణ సాయి!!
ప్రతి గురువారం అభిషేక, అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. పల్లకిసేవ కోసం పల్లకి, ఉయ్యాలసేవ కోసం ఊయల ఏర్పాట్లు ఉన్నాయి. షిరిడిలో మాదిరిగా శ్రీ కృష్ణుని విగ్రహం, ద్వారకామాయి చిత్రపటం ఒకవైపున ఉన్నాయి.
ఈ విజయసాయి మందిరంలో ఏఏ పదార్ధాలతో అభిషేకం చేస్తే, ఏఏ ఫలితాలు కలుగుతాయో రాసిన బోర్డు కూడా ఏర్పాటుచేసారు. ఏకాదశసూత్రాలు, ఊదీమంత్రం బోర్డులు కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ధ బాబాచిత్రం ఒక గ్లాస్ మీద వేసినది చాలాఅందంగా ఉన్నది. ఇక్కడ ప్రతిరోజూ నాలుగు హారతులు తప్పక జరుగుతాయని ఇక్కడి అర్చకులు వేణుమాధవ్ గారు తెలియచేసారు. మీరు గోరంట్ల గ్రామం వైపు వచ్చినప్పుడు తప్పక ఈ విజయసాయి మందిరాన్ని దర్శించి, స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని, వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందాలని కోరకుంటూ....
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలగిరి నల్లపాడు గుంటూరు SRI VENKATESWARA SWAMY TEMPLE NALLAPADU GUNTUR
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలగిరి నల్లపాడు గుంటూరు SRI VENKATESWARA SWAMY TEMPLE NALLAPADU GUNTUR శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము..తిరుమలగిరి...నల్లపాడు..గుంటూరు.
ఓం శ్రీ వేంకటేశాయనమః🙏🙏
గుంటూరుకి అతి సమీపంలో ఉన్న నల్లపాడు హైవే మీద ఉన్న విఘ్నేశ్వర స్వామి గుడి మీదగా వెళ్ళగా, శబరిగిరి నగర్ లో ఉన్న తిరుమలగిరి గుట్ట మీద వెలసిన శ్రీ వెంటేశ్వరస్వామి ఆలయ విశేషాలు.
దేవాలయనికి ఈశాన్యంలో కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా కాలువ ఉండటం ఎంతో శుభప్రదం. ఆలయ ప్రవేశానికి ముందు వేప,రావిచెట్టు క్రింద శ్రీలక్ష్మీ అమ్మవారి విగ్రహం ప్రతిష్టించబడింది. అక్కడే పెద్ద గరుత్మంతుడు మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రాంగణంలో ద్వారపాలకుల మధ్య 42 మెట్ల మార్గం ద్వారా గుట్ట మీదకు చేరుకోవచ్చు. మార్గం ప్రక్కన అందంగా కొన్ని విగ్రహాలు ఉంచారు. దశావతారాలు,రంగనాథ స్వామి, ఆంజనేయస్వామి, శ్రీ కృష్ణుడు, వామనమూర్తి, హయగ్రీవుడు, పరశురాముడు, గరుత్మంతుడు, నారదుడు మొదలైన దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. పైకి చేరుకోగానే పెద్ద ధ్వజస్థంభం ఎదురుగా కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి, క్షేత్రపాలకులు, వనదుర్గాదేవి విగ్రహం, ఒకవైపు వల్మీకం (పుట్ట)పై నాగేంద్రుడు, తులసికోట దర్శనమిస్తాయి. లలిత పీఠపాలిత శ్రీ అలివేలు మంగ, ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అను బోర్డు కనపడుతుంది. ప్రక్కనే పెద్ద ద్వారపాలకులు చుట్టూ చిన్న ఉపాలయాలు గరుత్మంతుని మందిరం, మరోవైపు పవన సుతుడు సింధూరవర్ణ దక్షిణ ముఖ అభయాంజనేయ స్వామి, మరోవైపు వరాహస్వామి దర్శనమిస్తాయి.
మూలవిరాట్టు దర్శనం 9 అడుగుల 7 అంగుళాల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని చూచుటకు రెండు కన్నులు సరిపోవు. నిలువెత్తు విగ్రహం, తిరునామంతో, శంఖు, చక్రాలతో దివ్యంగా కనిపిస్తోంది స్వామివిగ్రహం. ఎంతో అందమైన అద్భుతమైన కలియుగ ప్రత్యక్ష దైవం.
ప్రక్కనే కళ్యాణ ఉత్సవ మూర్తులు ఉన్నాయి. ఏకాదశిలలో విశేష పూజలు కళ్యాణం నిర్వహిస్తారు. "ఓం నమో నారాయణాయ" మంత్రాన్ని చెప్పిన రామానుజుల వారి విగ్రహం, మరోప్రక్క విశ్వక్సేనుడి విగ్రహం, ఇంకొకవైపు పెద్ద అలివేలు మంగ వరద అభయ హస్తముద్రలతో అమ్మవారు దివ్యంగా ఉంటుంది. చల్లని తల్లి లక్ష్మీదేవి మరోవైపు దివ్య తేజస్సుతో దర్శనమిస్తుంది. ఆండాళ్ అమ్మవారు ధనుర్మాసంలో పూజలందుకుంటూ విరాజిల్లుతున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ గోదాకళ్యాణం నిర్వహింస్తారు.
గర్భదోషాలు, సంతానంలేని వారు ఇక్కడ 27 ప్రదక్షిణలు చేసి, పసుపు-కుంకుమ సమర్పిస్తే, దోషపరిహారం కలిగి సంతానం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఆలయ వ్యవస్తాపకులు చౌడవరపు శర్మగారి మాతృమూర్తి శ్రీమతి సుశీలమ్మ గారి విగ్రహం కూడా చూడవచ్చు.
తప్పక నల్లపాడు తిరుమలగిరిపై వేంచేసిన శ్రీ లలితాపీఠపాలిత శ్రీ అలివేలు మంగ, ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి, స్వామివారి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆశిస్తూ...
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏
శ్రీ రామ సాయి మందిరం (1957)సాయిబాబా రోడ్ చంద్రమౌళి నగర్ గుంటూరు SRI RAMASAI MANDIRAM SAIBABA ROAD CHANDRAMOULINAGAR GUNTUR 63 క్రితం నిర్మాణం జరిగిన శ్రీ సాయి బాబా మందిరం
శ్రీ రామ సాయి మందిరం (1957)సాయిబాబా రోడ్ చంద్రమౌళి నగర్ గుంటూరు SRI RAMASAI MANDIRAM SAIBABA ROAD CHANDRAMOULINAGAR GUNTUR
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏.
త్రిపుర సుందరి దేవి ఆలయం TRIPURA SUNDARI UDAIPUR Tripura Sundari Temple in Tripura
త్రిపుర సుందరి దేవి ఆలయం TRIPURA SUNDARI UDAIPUR Tripura Sundari Temple in Tripura
శ్రీ మాత్రే నమః🙏🙏:
త్రిపుర సుందరి దేవి ఆలయం-- ఉదయపూర్-- త్రిపుర..
త్రిపుర రాష్ట్రంలోని అగర్తల రాజధానికి 55 కి:మీ దూరంలో గల త్రిపుర సుందరీదేవి ఆలయం ఎంతో ప్రశస్తమైంది. ఈ ఆలయం 500 సం:ల క్రితంనాటిది. ఎప్పటినుంచో పూజలందుకుంటున్న ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు తెలుగువారు దర్శించుకుంటూ వుంటారు. ఈ ఆలయం కూర్మ (తాబేలు) రూపంలో ఉంటుంది. దీనిని "కూర్మపీఠం" అని కూడా అంటారు. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో, చాలా ఆహ్లాదంగా, సహజసిద్ధమైన ప్రకృతి వాతావరణంలో ఉంటుంది. ఈ ఆలయం ఎదురుగా కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో తాబేళ్లు (కూర్మం) చేపలు (మత్స్యం) ఉంటాయి. వీటిని ఎవరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు కోనేరులో స్నానంచేసి, కోనేరులో ఉన్న తాబేళ్ళకి, చేపలకి ఆహారం వేసి, (పేలాలు… మొద:) దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయం మొత్తం సింధూర వర్ణంతో ఉంటుంది. ఆలయానికి ఒకపక్క, ఆలయానికి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. మరొక ప్రక్క శివుడు, పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ స్వయంగా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. చిన్న ఊరు అయినా దేవాలయ ప్రాంగణంలో మహిళలు ఉపాధి కోసం సహాయ సంఘాలుగా ఏర్పడి, పూజా ద్రవ్యాలకి సంబంధించిన దుకాణాలను నడుపుతున్నారు. ఇక్కడ అమ్మవారికి ఎర్ర మందారాలు తోటి, బిల్వపత్రాలతోటి మాలకట్టి అమ్మవారి అలంకరణ చేస్తారు. నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైన పేడా (పాలకోవా) సమర్పిస్తారు. అమ్మవారి దేవాలయాల్లో 51 శక్తి పీఠాలు ఉన్నాయి. శక్తి పీఠాలు అనగానే అష్టాదశ (18) శక్తిపీఠాలు గుర్తుకొస్తాయి. పురాణాల ప్రకారం 51 శక్తి పీఠాలుగా చెప్తారు. ఈ ఆలయం చిట్టచివరి (51వ) శక్తిపీఠంగా చెప్పవచ్చు. అమ్మవారి "కుడికాలు" పడిన ప్రదేశంగా చెప్తూ ఉంటారు. దేవాలయ గర్భాలయంలో చిన్నద్వారం నుంచి అమ్మవారు మందార, బిల్వపత్రాల మాల అలంకరణతో, ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది. పక్కనే చిన్న అమ్మవారిని ("చోటా మా") చూడవచ్చు. అమ్మని చూడగానే మనసంతా ఆనందంతో నిండిపోయి, మన కోసమే వేచి చూస్తుందా! అన్న భావన కలుగుతుంది. ఈ అమ్మవారి సమక్షంలో జప, తప, హోమాదులు, రుద్ర పునఃశ్చరణ, దేవీ సప్తశతి పారాయణం, దేవీ ఖడ్గమాలా స్తోత్రం, మహిషాసుర మర్దిని స్తోత్రం పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు, బాలా మంత్రం చేసేవాళ్ళు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. పూర్వం ఈ ప్రాంతం బంగ్లాదేశ్ కి దగ్గరగా ఉంటుంది. ఈ అమ్మవారి పేరుతోనే, త్రిపుర రాష్ట్రం ఏర్పడింది అనడంలో సందేహంలేదు. ఈ అమ్మవారిని "త్రిపుర సుందరి, త్రిపుర భైరవి" అని పిలుస్తారు. "మాతా బరీ టెంపుల్" అని ఆ రాష్ట్ర ప్రజలు పిలుచుకుంటారు. ఈ ఆలయాన్ని దర్శించు కోవాలంటే అదృష్టమే కాదు!! పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి.. అన్నిటినీ మించి అమ్మ దయ ఉండాలి...
శివానంద క్షేత్రం.. శివాలయం.. నార్కెట్ పల్లి.. నల్గొండ జిల్లా.. హైదరాబాద్ హైవే..నలగొండ జిల్లాలో నార్కెట్ పల్లిలో ఉన్న పురాతన శివాలయం శివానంద క్షేత్రం Sivananda Kshetram nalgonda
శివానంద క్షేత్రం.. శివాలయం.. నార్కెట్ పల్లి.. నల్గొండ జిల్లా.. హైదరాబాద్ హైవే..
హైదరాబాద్ నల్గొండ హైవే రహదారి మీద, నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో హోటల్ వివేర ప్రక్కనే వున్న పురాతనమైన, ప్రాచీనమైన శివానందక్షేత్రం - చిన్న శివాలయం. లోపలికి వెళ్ళగానే హాటల్ వివేరా ముందు కొలనులో(పౌంటేన్) శివలింగం మీద ధ్యానంలో ఉన్న శివుడు (ధ్యాన బుద్ధుడిని పోలి ఉంటుంది..) కనిపిస్తాడు. దేవాలయం ముఖద్వారం మీద "ఓం నమః శివాయ" అను బోర్డు కనిపిస్తుంది. బోర్డు మీద 14-11 2005కు ముందు ఆలయ పురాతన ఫొటోలు కనిపిస్తొయు. ఈఆలయాన్ని పునరుద్ధరించిన వారు సద్గురు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు. వారి చిత్ర పటాలు దర్శనమిస్తాయి, వారి సద్గురువు శ్రీ కందుకూరి భీమునిపట్నం గారి (విశాఖపట్నం ) చిత్ర పటం కూడా చూడవచ్చు. ఆలయంలో రావి,వేపచెట్టు సముదాయం, యజ్ఞశాల, ఇక్కడ మరొక ప్రక్క బోర్డు మీద ఏయే ద్రవ్యాలతో శివాభిషేకం చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందో వ్రాయబడి వుంటుంది. ఆలయంలోకి వెళ్ళగానే గర్భగుడిలో గణపతి, ప్రక్కనే నాగాభరణ భూషితుడై, పూలతో అలంకరించిన శివలింగాన్ని(పరమేశ్వరుని) దర్శనం చేసుకోవచ్చు. ఎంతో పురాతనమైన ఈ క్షేత్రాన్ని అధునాతనంగా తీర్చిదిద్దారు. ఆహ్లాదకరమైన ప్రాంగణంలో చక్కటి వాతావరణంలో ప్రయాణికులు మరియూ భక్తులు సేద తీరుటకు వీలుగా ఆధునికంగా పూల చెట్లతో చక్కగా చిన్న శివాలయం అద్భుతంగా నిర్మించబడిందీ క్షేత్రం. బయటికి వెళ్ళే ద్వారం మీద "పునఃదర్శన ప్రాప్తిరస్తు" అని వ్రాయబడి వుంటుంది. కనుక అటువైపు స్వంత వాహనాలలో వెళ్ళేటప్పుడు ఈ శివాలయాన్ని దర్శించి ఆ శివానందుని కృపాకటాక్షాలు పొంది, మీరూ సుఖసంతోషాలతో ఆనందంగా వుండాలని ఆశిస్తూ...
ఓం శ్రీ గరుభ్యోనమః🙏
Thursday, May 27, 2021
వైశాఖ శుద్ధ పౌర్ణమి ఉగ్ర నరసింహుని అవతార సమాప్తి అరవీర భయంకర శరభేశ్వర జయంతి.
🌸
వైశాఖ శుద్ధ పౌర్ణమి
ఉగ్ర నరసింహుని అవతార సమాప్తి
అరవీర భయంకర శరభేశ్వర జయంతి.
హిరణ్యకశిపుడి
కడుపును చీల్చి
ప్రేగులను N వేసుకొని , రక్తాన్ని త్రాగి సంహరించిన ?
ఉగ్ర నరసింహుడు అ.సుర లక్షణాలతో
మరింత ఆగ్రహావేశాలు జ్వాలల్లా పెరిగి , అదేపనిగా ఆకాశమే దద్ధరిల్లే విధంగా ,
విశ్వMmmM?.మే భయంతో వణికిపొయ్యేలా ,
అరణ్యములో వేగంగా తిరుగాడుతుంటే
భూమి యావత్తు కంపించిపోతుంటే...
అహోబిలానికి విచ్చేసిన
ముక్కోటి దేవతలు భయభ్రాంతులకు లోనై భీతిల్లిపోతూ , అనేక విధాలుగా నారసింహుని శాంతించమని వేడుకోసాగినా , మరింత ఉగ్రావేశంతో అడుగులు వేస్తుంటే.. అడవిలో జ్వాలలు పెరగసాగాయి.
సర్వ దేవతలు భయబ్రాంతులకు లోనై పరమశివుణ్ణి వేడుకొనగా ... వీరభద్రున్ని పంపి , విష్ణువు యొక్క ఆగ్రహాన్ని లొంగదీయమని తెలిపి పంపించగా... తన తీక్షణమైన చూపులతోనే అతిలోక భయంకరుడైన వీరభద్రున్నే అదృశ్యం చేయడంతో.. ఇక పరమశివుడే అత్యంత భీకర శక్తివంతమైన రూపంతో సగం మానవుడిగా , సగం మృగంగా , మరో సగంగా పక్షి రూపంలో అతిపెద్ద పరిమాణంలో , ఒళ్ళంతా పొక్కులతో , అనేక చేతులతో , పటిష్టమైన పంజాలతో , నిప్పు కణితల్లే మండుతూ వున్న మూడు కన్నులతో , అతి పెద్ద శిరోజాలతో , పెద్దదైన తోకతో , అతిపెద్ద రెక్కలతో , పొడవైన సూదిగా వుండేలా దంతాలతో ,
భరించలేని బుసలు కొడుతూ ,
వినలేని ఉరుముల్లాంటి గొంతుతో ప్రతిధ్వనులు చేస్తూ... నరసింహునికి శక్తికి మించిన ఆకారంతోనూ పరమశివుడే
వైశాఖ శుద్ధ పౌర్ణమి నాటి సాయంత్రం వేళల్లో
శ్రీ శరభేశ్వర అవతారాన్ని ధరించి
నారసింహుని ఎదుట ప్రత్యక్షమై ,
నరసింహునితో హోరాహోరీగా తలపడగా.. పరమేశ్వరుడు ఇక నరసింహుని అవతార సమాప్తి చేయాలని తన పొడవాటి తోకతో నారసింహుని చుట్టి పైకెత్తి గిరగిరా తిప్పి పడబోయే సమయంలో... వచ్చినది పరమేశ్వరుడే అని నారసింహుడు తలచి ..
ఓ శరభేశ్వరా ! శరభ ! శరభ !! అని పిలుస్తూ..
నా ఉగ్రరూపాన్ని విరమిస్తున్నాను అని తెలిపి ,
శరభేశ్వరునికి తన సింహపు చర్మ శరీరాన్ని వలచి కానుకగా సమర్పించగా , నారసింహుని తలను పరమేశ్వరుని మెడలోని పుర్రెల హరంలో ఒక్కటై స్థిరపడుతుంది.
ఈవిధంగా నరసింహుని అవతారం
వైశాఖ శుద్ధ చతుర్దశితో జన్మించి
( సరిగ్గా ఇరవై నాలుగు గంటలు మాత్రమే )
వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజుతో
అవతార సమాప్తి కాగా ,
పరమేశ్వరుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శరభేశ్వరునిగా అవతరించి లోక కళ్యాణం గావిస్తాడు.
అనంతరం , శ్రీ నరసింహుడు నిజరూపమైన
శ్రీ మహావిష్ణువు రూపాన్ని స్వీకరించి , శ్రీలక్ష్మీ సమేతుడై వైకుంఠానికి ప్రయాణం కాగా ,
ప్రదోష సమయంలోనే శరభేశ్వరుడు అవతరించిన పౌర్ణమి అత్యంత పవిత్రమైన పుణ్యపర్వదినంగా ఆరాధించుకోవాలని శివ పురాణం నందు వివరింపబడింది.
Wednesday, May 26, 2021
శ్రీ కూర్మ జయంతి శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం
_*🚩26-05-2021శ్రీ కూర్మ జయంతి🚩*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*కూర్మ జయంతిపై ముఖ్యమైన సమయాలు*
సూర్యోదయం మే 26, 2021 5:45 ఉదయం
సూర్యాస్తమయం మే 26, 2021 7:01 అపరాహ్నం
పూర్ణిమ తిథి ప్రారంభమైంది మే 25, 2021 8:30 అపరాహ్నం
పూర్ణిమ తితి ముగుస్తుంది మే 26, 2021 4:43 అపరాహ్నం
*శ్రీ కూర్మ జయంతి నాడు "శ్రీకూర్మం" క్షేత్రాన్ని దర్శించుకోండి!*
దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో రెండో అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవ , దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా , వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు.
అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది.
శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంగభీముడు కూర్మనాధస్వామి ఆలయాన్ని పునర్‌నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కర్పూరేశ్వరుడు , హఠకేశ్వరుడు , సుందేశ్వరుడు , కోటేశ్వరుడు , పాతాళ సిద్దేశ్వరుడు అనే అయిదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా వున్న ఈ క్షేత్రం కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిందనీ , కళింగ రాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చరిత్ర చెబుతోంది.
కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు , అతని భార్య వంశధారల తపస్సుకు , భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ , బ్రహ్మాండ , పద్మ పురాణాలలో వుంది.
శ్రీరాముడు , బలరాముడు , జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు.
ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట.
దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం.
శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ , అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు.
ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఇక్కడ చేసిన పితృకర్మలకు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
ఇక శ్రీ కూర్మ జయంతి రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపవేయబడుతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం , కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
*🌹కూర్మావతార వర్ణిన🌹*
అగ్ని దేవుడు వశిష్ఠునితో *"వశిష్ఠా ! ఇప్పుడు కూర్మావతారమును వర్ణించుచుంటిని వినుము. దీనిని వినిన సమస్త పాపములు నశించును. పూర్వము దేవాసుర సంగ్రామమున దైత్యులు దేవతలను ఓడించిరి. వీరికి దుర్వాసుని శాపము వలన లక్ష్మికూడ తొలగిపోయెను. సమస్త దేవతలు క్షీరసాగరమందు శయనించి యున్న విష్ణు భగవానుని చెంతకేగి "భగవాన్ ! తమరు దేవతలను రక్షించవలెను"* అని ప్రార్థించిరి.
శ్రీహరి , బ్రహ్మాది దేవతలతో *"దేవగణములారా ! మీరు క్షీర సముద్రమును మధించుడు. అమృతమును పొందుటకును , లక్ష్మీప్రాప్తి గలుగుటకును మీరు అసురులతో సంధి చేసికొనవలెను. ఏదైననూ ఒక మహత్కార్యము నిర్వహించవలెనన్న ఒక మహత్ప్రయోజనము పొందగోరినను , శత్రువులైనను సంధి చేసికొనవలెను. నేను మిమ్ములను అమృతమునకు హక్కుదారులను చేసి దైత్యులను వంచితులను గావించెదను. మీరు దైత్యరాజు బలి చక్రవర్తిని నాయకునిగా నియమించుకొని మందరాచలమును కవ్వముగచేసి , వాసుకి సర్పమును కవ్వపు త్రాడుగచేసి , నా సహాయమును కూడ పొంది , క్షీరసాగరమును మధించుడు"* అని చెప్పగా దేవతలు , దైత్యులతో సంధి చేసికొని , క్షీర సముద్రమును చిలుకుట ప్రారంభించిరి. వాసుకి సర్పము తోకవైపు దేవతలు నిలచిరి. వాసుకి సర్ప నిఃశ్వాసములకు దానవులు బలహీనులగుచుండిరి. దేవతలు భగవానుని కృపాదృష్టితో బలవంతులగుచుండిరి.
సముద్ర మథనము ప్రారంభమయ్యెను. ఏమియు ఆధారము లేకపోవుటచే మందరాచలము సముద్రమున మునిగిపోయెను. అప్పుడు విష్ణు భగవానుడు కచ్ఛపరూపము (కూర్మరూపము) ధరించి మందరాచలమును తన వీపుపై ఉంచెను. అప్పుడు తిరిగి సముద్రమును మధించసాగిరి. దానినుండి హాలహల ప్రకటమయ్యెను. దానిని శంకర భగవానుడు తన కంఠమందు ధరించెను. దీనిచేత కంఠమున నల్లని మచ్చ ఏర్పడుటచే శంకర భగవానుడు నీలకంఠ నామముతో ప్రసిధ్ధుడయ్యెను.
ఆ తరువాత సముద్రము నుండి వారుణీదేవి , పారిజాత వృక్షము , కౌస్తుభమణి , గోవులు , అప్సరసలు , లక్ష్మీదేవి విష్ణుభవానుని చేరగా, సమస్త దేవతలు దర్శించి స్తుతించిరి , దీనివలన అందరూ లక్ష్మీ సంపన్నులయిరి.
అనంతరము అయుర్వేద ప్రవర్తకుడైన ధన్వన్తరి భగవానుడు అమృత కలశముతో ప్రకటమయ్యెను. దైత్యులా కలశమును లాగుకొని దాని నుండి సగము దేవతల కిచ్చి మిగిలినది తీసికొని జంభాది దైత్యులు వెళ్ళుచుండిరి. వీరు వెళ్ళుట గాంచిన విష్ణు భగవానుడు మోహినీ రూపము ధరించెను. రూపవతి అయిన ఈ స్త్రీని గాంచిన దైత్యులు మోహితులై *"సుముఖీ ! నీవు మాకు భార్యవై ఈ అమృతమును మాచే త్రాగించుము"* అని కోరగా అట్లే అని మోహినీ రూపమున నున్న భగవానుడు ఆ అమృత కలశము గ్రహించి దేవతలచే త్రాగించుచుండెను. ఆ సమయమున రాహువు చంద్రుని రూపము ధరించి అమృతమును త్రాగుచుండెను. అప్పుడు సూర్య , చంద్రులు వాని కపట వేషమును ప్రకటించిరి. ఇది గాంచిన శ్రీహరి చక్రముతో వాని శిరస్సును ఖండించెను. కాని దయగలిగి మరల జీవింపజేసెను.
అప్పుడు రాహువు, శ్రీహరితో *"ఈ సూర్యచంద్రులను నేను అనేక మారులు గ్రహణముగా పట్టెదను , ఆ గ్రహణ సమయమున జనులు ఏ కొద్ది దానము చేసినను , అది అక్షయమగును"* అని చెప్పగా శ్రీహరి *"తథాస్తు"* అనెను.
ఆ తరువాత స్త్రీ రూపమును విష్ణు భగవానుడు త్యజించెను. కాని శంకర భగవానుడు *"ఆ మోహినీ రూపమును మరల దర్శింపజేయు"* మని కోరుకొనెను. అప్పుడు శ్రీహరి మరల మోహినీ రూపమును ధరించగా , శంకర భగవానుడు మాయతో మోహితుడై పార్వతిని విడిచి మోహిని వెంటపడెను. శంకరుడు ఉన్మత్తుడై మోహిని కేశములను పట్టుకొనెను. మోహిని కేశములని విడిపించుకొని వెళ్ళిపోయెను. శంకర భగవానుని వీర్యము పడినచోట శివలింగక్షేత్రములు మరియు బంగారు గనులు ఏర్పడెను. అనంతరము శంకర భగవానుడు ఇది మాయ అని గ్రహించి తన స్వరూపమున స్థితుడయ్యెను.
అప్పుడు శ్రీహరి శంకరునితో *"రుద్రా ! నీవు నా మాయను జయించితివి. నామాయను జయించిన వాడవు నీవు ఒక్కడివే. దైత్యులకు అమృతము లభించనందువలన దేవతలు యుద్ధమందు వారిని జయించి తిరిగి స్వర్గమును పొంది"* రనెను. దైత్యులు పాతాళమున ప్రవేశించి అచ్చట నుండి సాగిరి. దేవతల విజయ గాధను చదివెడివారు స్వర్గలోకమునకు వెళ్ళుదురు.
*🌹శ్రీ కూర్మ స్తోత్రం🌹*
నమామి తే దేవ పదారవిందం
ప్రపన్న తాపోప శమాతపత్రం |
యన్మూలకేతా యతయోఽంజసోరు
సంసారదుఃఖం బహిరుత్క్షిపంతి||1||
ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా-
స్తాపత్రయేణోపహతా న శర్మ |ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి-
చ్ఛాయాం స విద్యామత
ఆశ్రయేమ || 2 ||
మార్గంతి యత్తే ముఖపద్మనీడై-
శ్ఛన్దస్సుపర్ణైరృషయో వివిక్తే |
యస్యాఘమర్షోదసరిద్వరాయాః
పదం పదం తీర్థపదః ప్రపన్నాః || 3 ||
యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా
సంమృజ్యమానే హృదయేఽవధాయ |
జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా
వ్రజేమ తత్తేఽంఘ్రి సరోజపీఠమ్ || 4 ||
విశ్వస్య జన్మస్థితిసంయమార్థే
కృతావతారస్య పదాంబుజం తే |
వ్రజేమ సర్వే శరణం యదీశ
స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ || 5 ||
యత్సానుబంధేఽసతి దేహగేహే
మమాహమిత్యూఢ దురాగ్రహాణాం |
పుంసాం సుదూరం వసతోపి పుర్యాం
భజేమ తత్తే భగవన్పదాబ్జమ్|| 6 ||
తాన్వా అసద్వృత్తిభిరక్షిభిర్యే
పరాహృతాంతర్మనసః పరేశ |
అథో న పశ్యన్త్యురుగాయ నూనం
యేతే పదన్యాస విలాసలక్ష్మ్యాః || 7 ||
పానేన తే దేవ కథాసుధాయాః
ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే |
వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం
యథాఞ్జసాన్వీయురకుంఠధిష్ణ్యమ్ || 8 ||
తథాపరే చాత్మసమాధియోగ-
బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠాం |
త్వామేవ ధీరాః పురుషం విశన్తి
తేషాం శ్రమః స్యాన్న తు సేవయా తే || 9 ||
తత్తే వయం లోకసిసృక్షయాద్య
త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిః స్మ |
సర్వే వియుక్తాః స్వవిహారతంత్రం
న శక్నుమస్తత్ప్రతిహర్తవే తే || 10 ||
యావద్బలిం తేఽజ హరామ కాలే
యథా వయం చాన్నమదామ యత్ర |
యథో భయేషాం త ఇమే హి లోకా
బలిం హరన్తోఽన్న మదన్త్యనూహాః |11||
త్వం నః సురాణామసి సాన్వయానాం
కూటస్థ ఆద్యః పురుషః పురాణః |
త్వం దేవశక్త్యాం గుణకర్మయోనౌ
రేతస్త్వజాయాం కవిమాదధేఽజః |12 ||
తతో వయం సత్ప్రముఖా యదర్థే
బభూవిమాత్మన్కరవామ కిం తే |
త్వం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా
దేవ క్రియార్థే యదను గ్రహాణామ్|13 ||
*ఇతి శ్రీమద్భాగవతే కూర్మస్తోత్తం*
🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏💥 *నేడు శ్రీ కూర్మ జయంతి* సందర్భంగా...
💥:
*🐢అత్యంత అరుదైన శ్రీ కూర్మనాథ స్వామివారి నిజరూప దర్శనం🐢*
*🙏🏻స్థలపురాణం🙏*
*🐢శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం🐢*
శ్రీకాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో ఉంది.
శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.
*🐢స్థలపురాణము*
శ్రీకూర్మం లోని ఆలయ ముఖద్వారము శ్రీకాకుళం, గార మండలంలో ఉన్న ఆలయం 2 వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది నమ్ముతారు. నిజానికి ఆలయము నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే, ఈ ఆలయం చోళ, కళింగ రాజా రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు.7 వ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసునని ఉంది.తరువాత ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజ వంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో చేశారు. దేవాలయ మొత్తం నిర్మాణం లో గాంధర్వ శిల్ప సంపాద అని పిలవబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు, కీర్తిని చాటి చెప్తాయి. గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగభీముడు ఆలయం చుట్టూ నేల, పైభాగాన్ని నిర్మించారు.
దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించే వాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను.
అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను. రాజు వంశధారలో స్నానమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని, సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావిష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండము నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమిచ్చెను. స్వామి నాలుగు చేతులతో, శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధింపగా శ్రీమహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు, నారదునితో కలసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్రయోగము చేసెను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించెను. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగములో వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్య నివాసమేర్పరుచుకొనెను.
ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్త్రీ కూర్మగుండములో దాహముతీర్చుకొని, శ్రీకూర్మనాథుని దర్శించుకొని, తన భర్త అయిన భిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, ఆతను వచ్చి చూడగా ఆ గుండముపైన చక్రాకారములో తేజము కనుపించెను. ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాల్చెను. భిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ, మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తుండగా, అక్కడకు వచ్చిన శ్వేతమహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు, కూర్మరూపములో నీకు సులభముగానే దర్శనమిచ్చాడు అని చెప్పెను. అంత భిల్లురాజు సంతోషముతో స్వామిని పూజించెను. స్వామి సంతోషించి, భిల్లురాజును కూర్మగుండమునకు కట్టడము, సోపానములు కట్టించవలసిందిగానూ, శ్వేతమహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసింది గానూ ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. భిల్లురాజును, స్వామి, పశ్చిమదిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపములో నివాసమేర్పరుచుకోమని ఆజ్ఞాపించెను. అంతట భిల్లురాజు, తనవైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. శ్రీకూర్మనాథుడు అట్లే ఆభిల్లురాజుకు వరమిచ్చెను. అప్పటినుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగెను.
ఒకనాడు నారదుడు కూర్మనాథుని సేవించుటకు రాగా, శ్వేతమహారాజు, స్వామిని అర్చారూపమున ఆరధించుటకు ఏ మంత్రము తో ప్రతిష్ఠించవలెనని అడిగెను. అంతట నారదుడు, బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడే శ్రీకూర్మనాథుని, సుదర్శన మంత్రముతో ప్రతిష్ఠించెను. అప్పుడు స్వామి అగ్నిజ్వాలలచే భయంకరముగా ప్రకాశిస్తున్న శ్రీకూర్మనాథుని చూసి దేవతలందరూ భయకంపితులైరి. అప్పుడు శ్వేతమహారాజు, స్వామిని, గోపాలమంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అట్లే శ్రీకూర్మనాథుని గోపాలమంత్రంతో పునహ ప్రతిష్ఠచేసెను. అప్పుడు స్వామి శాంతరూపములో దర్శనమిచ్చి, తనకు నారాయణ మంత్రముతో అభిషేకము, సంకర్షణ మంత్రముతో వస్త్ర సమర్పణ, వాసుదేవ మంత్రముతో ఏక హారతి, అనంత మంత్రముతో ధూపము, పద్మనాభ మంత్రముతో పంచహారతి సమర్పించవలెనని బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ స్వామిని అట్లే ఆరాధించెను. శ్రీకూర్మనాథుడే ప్రాకారాది దేవతా స్థాపనకు ఆజ్ఞనిస్తూ, తూర్పున పార్వతీ సమేతంగా శివుని, ఆగ్నేయమున నరశింహుని, దక్షణమున గోపాలమూర్తిని, నైరుతి దిక్కున వైకుంఠనాథుని, వాయువ్యమున వైష్ణవీ దుర్గను, ఆమెకు ముందు భాగమున విశ్వక్షేసులను, తరువాత అనంతుని స్థాపించమనగా, బ్రహ్మ అట్లే చేసెను.
తిలోత్తమ స్వర్గము నుండి శ్రీకూర్మనాథుని పూజించుటకు వచ్చి అక్కడనే ఉండిపోయింది. బ్రహ్మ, స్వామికి నివేదించిన ప్రసాదము ఆమెకు లభించకపోవుటచే దుఖితురాలై, వక్రాంగ మహామునిని ఆశ్రయించగా, ఆయన, తిలోత్తమకు నారశింహమంత్రమును ఉపదేశించెను. ఆమె ఆమంత్రముతో తపమాచరించగా, ఆమె కాలిబొటనవ్రేలు దగ్గర ఒక గుండమేర్పడింది. అందుండి, శ్రీకూర్మనాథుడు, నరశింహరూపమున ఉద్భవించి, ఆమెకు దర్శనమిచ్చెను. తిలోత్తమ ఆనందంతో స్వామిని అక్కడ అట్లే వెలయవలసిందిగా కోరగా స్వామి అక్కడ అలాగే వెలసెను. ఆకుండము, నరసింహతీర్థమని, అక్కడ వెలసిన స్వామి, పాతాళ నరసింహుడని అందురని స్వామి చెప్పెను. అంత తిలోత్తమ తనకు ప్రసాదము లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తికు మెచ్చి, తన ప్రసాదముపై శాశ్వత ఆధిపత్యమును ఆమెకు ప్రసాదించెను. అప్పటినుండి స్వామివారి ప్రసాదమును తిలోత్తమే అందరికీ పంచేదట.
పద్మపురాణము లోని శ్వేతగిరి మహత్యమను 30 అధ్యాయములో చెప్పబడిన విశేషముల ప్రకారము
శ్రీకూర్మక్షేత్రమునకు వంశధారానదీ తీరములో శ్రీకూర్మశైలమను పర్వతము ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభంచును.ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానముచేసి, శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది. ఇక్క డ ఉన్న చక్రతీర్థము, నారదతీర్థము, కౌటిల్యతీర్థము, మాధవతీర్థము, నరసింహతీర్థము, కూర్మతీర్థము, వంశధార నది, లాంగలీనది, సముద్రములో మూడురోజులుగానీ, ఎనిమిదిరోజులు గానీ ఈ క్షేత్రములో ఉండి, స్నానములాచరిస్తూ, స్వామిని కొలుచుట ఒక ఆచారము.
ఈ శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము (ఐదుగురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము) తూర్పున వంశధారాసాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున (సింగుపురపుకొండ) హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళీ తీరమున శ్రీకాకుళ పట్టణములో కోటీశ్వరుడు, ఉత్తరమున (పిప్పల) ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్రమున సుధాకుండతీరమున సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.
*🐢ఆలయ విశిష్టత*
ఈ ఆలయం యొక్క పెద్ద ప్రాకారా నికి వెలుపల ‘శ్వేత పుష్కరిణి’ ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రిక ఆధారాలు స్పష్టం చేస్తు న్నాయి. ఈ ఆలయం లోని ప్రతీ శిల్పం ఒక అపూరూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమై పోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్యా ధారాలుగా నిలుస్తాయి. అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరా రుతూ ఉంటుంది. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపు దిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమ ణీయంగా మలిచారు.
ప్రతీ ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భ గుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాధుని ఆవతారంలో శ్రీమహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరి స్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, ఐదడు గుల పొడవు, నాలుగడుగులు వెడల్పు కొలతలు గల రాతిపీఠం పై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు. రెండున్నర అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరం చివరిగా పశ్చిమా భిముఖంగా తోకతో మూడు భాగాలుగా శ్రీకూర్మం కన్పిస్తుంది. మధ్య తక్కు వ ఎత్తులో శిరస్సుకలిపి ఒకటిగా కన్పిస్తా యి. చివర తాటి పండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది.
విగ్రహ మంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరిస్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు.
*🐢బలరాముని శాపం*
ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగిం చాడు. దాంతో అతడు భైరవుని పై ఆగ్రహంతో ఆతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాధ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఆయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు ‘కూర్మావతారం’లో ఆలయం భూమి పై మరెక్కడా ఉండకూడదని శపించాడు. అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాధస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈఆలయా నికి రెండు ధ్వజ స్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగుభాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణీలో జలక్రీడలాడుతూ కన్పించాడట. అందు వల్లే ఆ పుష్క రిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని ‘గోపీ చందనం’ అని కూడా అంటారు.
పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు సవరించు
కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాలలో మూలాలు.
మహావిష్ణువు కూర్మావతారము రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం (తాబేలు) అవతారం.
విష్ణు ప్రముఖ దశావతారాలలో 2 వ అవతారం. విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంది, రెండు ద్వజస్థంబాలతో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలులో ఒకటి.
రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలులో ఒకటి.
అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడ్య చిత్రాలతో ఉన్న దేవాలయాలులో ఒకటి.
దుర్గా మాత వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచ రెండవ ఆలయం., ఇతర వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది.
దీని శిఖరం రాతి శిల్పం - గాంధార శిల్పకళా అని అంటారు., ఇతర స్తంభాలతో పోలిక లేకుండా కొన్ని స్తంభాలు క్రింద వృథాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్తంభాలు ఉన్నాయి.
వారణాసి (కాశి) వెల్లడానికి సొరంగ మార్గం ఉంది, ప్రస్తుతం దీన్ని మూసివేసారు.
వారణాసి / పూరీ (ఒడిషా) ల వలె, మరణించినవారి అంతిమ కర్మలు, మోక్ష స్థానం ఇక్కడ నిర్వహిస్తారు .
ఆది శంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ, చైతన్య మహా ప్రభు అనేక గొప్ప రాజులు, సెయింట్స్ ఋషులు దేవాలయాన్ని సందర్శించారు
*🐢ప్రయాణ సదుపాయం*
శ్రీకాకుళం పట్టణం పాత బస్ స్టాండు నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఆర్టిసి వారి బస్సులు ఉన్నాయి.ఉదయం 6.00గంటలనుండి, రాత్రి 8.00గంటల వరకు నడుస్తాయి.అంతేకాక ఆటోలు, టాక్సిలు ఉన్నాయి.వసతి మాత్రం శ్రీకాకుళం పట్టణం లోనే.
*ఓం శ్రీ కూర్మనాథాయ నమః*🙏🏻
నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు
🌿నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు🌿
తమినళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది.ఇక్కడ అనేక చారిత్రక అవశేషాలు కలవు.
నామక్కల్ ఆంజనేయస్వామి ఆలయానికి ప్రసిద్ది. ఇక్కడ నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20అడుగుల ఆంజనేయ విగ్రహంతో ఉండటం వల్ల బాగా ప్రసిద్ది చెందాడు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు . అందుకు ఆశ్చర్యకరమైన కారణాలు చెప్పారు
మరి ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం
స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని..
ఈ ఆలయంలో స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అంటారు. ఎందురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల. గతంలో పైకప్పు వేయాలని ప్రయాత్నాలు జరిగాయని కానీ వేసిన కప్పు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు ప్రదాన అర్చకులు.
ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని
ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని..అందువల్లే పైన కప్పు వేయడానికి వీలుకాలేదని ఆలయ కథనం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈయన్ను దర్శించుకుంటారు. ఆయన కరుణ ఉంటే శత్రుశేషం, గ్రహ దోషం నుండి ఎలాంటి సమస్యలు ఉండవంటారు. ఆయన చల్లని దీవెనలు మనపై పడితే చాలు జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది. అనేది వాస్తవం.
ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో నామక్కల్ లోని ఆంజనేయుడు కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజల సుఖశాంతులను పర్యవేక్షిస్తున్నాడు.
ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది. నామక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంది. నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్లు ఎదురుగా ఉంటుంది ఈ గుడి. ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఈ విగ్రహం చాలా ప్రసిద్ధి చెంది నమక్కల్ హనుమాన్‌గా పిలువబడుతుంది.ఆంజనేయుడు దిగంబర దేవాలయంలో (ఆకాశం పైకప్పుగా)
లక్ష్మీ నృసింహ స్వామి మరియు సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటాడు.
స్వామి వారి విగ్రహం సుమారు 18అడుగుల పై మాటే ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం నరసింహస్వామి మూర్తికి అభిముఖంగా ఉండటం విశేషం.ఆంజనేయుడి కన్ను లక్ష్మీ నరసింహ స్వామి పాదాలతో (పాద పద్మాలు) సరళ రేఖలో ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం ఇక్కడి కోటకు రక్షకునిగా ఉంటుందని, అక్కడి ప్రజలను శత్రువుల నుండి రక్షిస్తుందని చెబుతుంటారు స్థానికులు.
ఆంజనేయుడు స్వామి యొక్క పాదపద్మాలను దర్శించుకోవడాన్ని నేటికీ గరుడాళ్వార్ సన్నిథి నుండి గమనించవచ్చు. కమలాలం చెరువు మెట్ల మీద ఆంజనేయ స్వామి పాదముద్రలను గమనించవచ్చు.
నామగిరి కొండలపై ఉన్న నామక్కల్ కోటను 16వ శతాబ్ధంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఈ కోటలో ప్రస్తుతం పురాతనమైన విష్ణు ఆలయ శిథిలాలు కూడా ఉన్నాయి. నామక్కల్ దుర్గం కోట సుమారు ఒకటిన్నర ఎకరం వరకూ ఉంటుంది.
ఈ కోటకు నైరుతి భాగంలో మొట్లు ఉన్నాయి. నామ గిరి హిల్స్ కు ఇరువైపులా ఉన్న గుహలో నరసింహస్వామి , రంగనాథ స్వామి ఆలయాలున్నాయి. కొండరాయితో చెక్కబడిన విగ్రహాలు కావటంతో నేటికి అవి చెక్క చెదరకుండా ఉన్నాయి.
ఈ కొండలలో ఎనిమిది కొలనులు ఉన్నాయి.
వీటిలో తామర పువ్వులు పెరుగుతాయి. ఈ దుర్గంలో కొంత కాలం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి కనపడకుండా తలదాచుకున్నాడట.
తర్వాత కాలంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశం చేసుకున్నారట. ఇక్కడి అద్భుతమైన శిల్పకళ ఈ ప్రదేశానికి మళ్లీ మళ్ళీ సందర్శించేలా చేస్తాయి.స్వామికి ప్రతి ఏడాది మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను నిర్వహి స్తారు. నామక్కల్లో చూడవల్సిన ఇతర ప్రధాన ఆకర్షణలు
నైనా మలై నమక్కల్ సిటీ కి 10 కి.మీ.ల దూరంలో కల ఒక చిన్న కొండ. తిరుమలై పట్టి గ్రామానికి సమీపంగా వుంటుంది. నైనా మలై కొండపై వెంకట చలపతి టెంపుల్ కలదు. దీనిని చేరాలంటే , 2500 మెట్లు ఎక్కాలి. అయినప్పటికీ భక్తులు శనివారాలు ఇతర పండుగ దినాలలో అధిక సంఖ్యలో ఈ టెంపుల్ దర్శిస్తారు.. 🙏🙏🙏🙏
శ్రీ క్రిష్ణ పారిజాత వృక్షం, కింటూర్, బారాబంకి, ఉత్తర ప్రదేశ్
తీర్ధయాత్ర - మధ్యప్రదేశ్
శ్రీ క్రిష్ణ పారిజాత వృక్షం, కింటూర్, బారాబంకి, ఉత్తర ప్రదేశ్
దర్శనం సమయం: ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు
బారాబంకి - పారిజాత చెట్టుకు పుట్టినిల్లు ఈ పారిజాత పుష్పం సత్యభామకు ఎంతో ఇష్టం. స్వర్గంలోకం నుండి కృష్ణ పరమాత్మ తెచ్చిన వృక్షం. పారిజాత వృక్షం, పుష్పం అనే పేర్లు చెబితే చటుక్కున మనకు గుర్తుకు వచ్చేది సత్యభామ-శ్రీకృష్ణుడు. పురాణాల్లో చెప్పిన ప్రకారం తన ఇష్టసఖి సత్యభామకు కృష్ణుడు పారిజాతాన్ని తెచ్చి ఇస్తాడు.
శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉన్నదట. అక్కడ కనిపించే ఈ మహావృక్షం ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ వృక్షం తన శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు మరి.
ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షానికి ఉండటం గమనార్హం. ఇంకా ఈ చెట్టు విశిష్టతను చూస్తే దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పైభాగాన ఉండే ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. పుష్పాలు చాలా అందంగా బంగారు రంగు - తెలుపు రంగులో కలిసి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
బారాబంకి లో కల పారిజాత వృక్షం ప్రపంచంలోని మొదటిది. ఇది ఏక లింగ పురుష చెట్టు. ఇది పండ్లు లేదా విత్తనాలు ఉత్పత్తి చేయలేదు. ఈ చెట్టు 5000 సంవత్సరాల నాటిదని చెపుతారు. జూన్-జూలై నెలల్లో వికసిస్తుండే ఈ వృక్షం మరో విశేషం ఏమిటో తెలుసా దీని ఆకులు కానీ, శాఖలు కానీ ఎండిపోయి రాలవు. ఒకవేళ ఎండిపోతే అలాగే కుంచించుకుపోయి కాండంలో కలిసిపోతాయి. ఇదే పారిజాతం వృక్షం యొక్క గొప్పతనం.
ఇక్కడ కృష్ణాస్టమి పండుగ మరియు శ్రీకృష్ణునికి సంబంధించిన అన్ని పండుగలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇక్కడివారు
ఎలా చేరుకోవాలి:
విమాన ప్రయాణం ద్వారా: లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బారాబంకీ 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రైలు ప్రయాణం ద్వారా: బారాబంకి జిల్లాలోని భుద్వాల్ జెఎన్ రైల్వే స్టేషన్ నుండి బారాబంకీ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, మరియు కింటూర్ గ్రామం అక్కడి నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రోడ్డు మార్గం ద్వారా: కింటూర్ గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబంకి జిల్లాలోని రామ్‌నగర్ పట్టణం. రామ్‌నగర్ పట్టణానికి చేరుకోవడానికి ఉత్తర ప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ యొక్క బస్సులు అందుబాటులో ఉన్నాయి. రామ్‌నగర్ టౌన్ నుండి స్థానిక రవాణా త్రీ వీలర్, జీప్ మొదలైనవి ఉదయం 6.00 నుండి సాయంత్రం 7.00 వరకు అందుబాటులో ఉన్నాయి.
సర్వేజనా సుఖినోభవంతు
అష్ట వినాయక
*వినాయక స్వరూపంలోని ఆంతర్యం: అష్ట వినాయక ప్రత్యేకతలు.*
స్వస్తిశ్రీ గణనాయకం గజముఖం మొరేస్వరం సిద్ధిదం, బల్లాళం మురుడం వినాయకమడమ్ చింతామణీ థేవరం లేన్యాద్రిం గిరిజాత్మకం సువరదం విఘ్నేశ్వరం ఓఝరం ! గ్రామే రంజన సంస్థితో గణపతిః కుర్యాత్ సదా మంగళమ్ | ఈ శ్లోకమునందు అష్టవినాయక క్షేత్రములు, అచ్చటి వినాయకుల పేరు చెప్పబడినవి. ఈ శ్లోకము ద్వాదశ జ్యోతిర్లింగముల శ్లోకములను పోలియున్నది.
ఇదే విధముగా, అష్ట వినాయక మంగళ శ్లోకమునందు
వాటిక్రమము క్షేత్రము వినాయకుని పేరు క్షేత్రము వినాయకుని పేరు
1. మోర్గాం శ్రీ మోరేశ్వర్ (లేక) శ్రీ మయూరేశ్వర్ 2. సిద్దటేక్ శ్రీ సిద్ది వినాయక 3. పాలీ శ్రీబల్లాళేశ్వర్ 4. మహాడ్ శ్రీ వరద వినాయక్ 5. ధేవూర్ శ్రీ చింతామణి 6. లేన్యాద్రి శ్రీ గిరిజాత్మజ 7. ఓఝర్ విఘ్నేశ్వరుడు 8. రంజన్గాం శ్రీ మహాగణపతి ఈ ఎనిమిది వినాయక పుణ్యక్షేత్రములు పూణే పట్టణమును చుట్టుకొని వృత్తాకార మండలములో ఉన్నవి. "పూణే" అనగా పుణ్యక్షేత్రమని అర్థము. వినాయక భగవానుడు ఈ పుణ్యప్రదేశ పరిసరములలో తన క్షేత్రములను ఏర్పరుచుకొనినాడు.
అష్ట వినాయకుల పురాణ గాథలు ముద్దల పురాణమునను, గణేశ పురాణములోను, చెప్పబడినవి. వినాయక అనగా సర్వదేవతలకు నాయకుడు, తనకు ఇంకొక నాయకుడు లేడు. (వి-నాయక) అతడే గణపతి, గణనాయకుడు, గణేశుడు, గణ అనగా దేవగణములు, ప్రజలు. వీరికి పతి, నాయకుడు, ఈశుడు - కనుక ఆయనకు ఆ పేర్లు వచ్చినవి. ఆతడే విఘ్నేశ్వరుడు, ఏ ఆటంకములు, విఘ్నములురాకుండా కాపాడే దేవుడు, కనుక సమస్తసత్కార్యములలో ప్రప్రథమముగా పూజింపబడుచుండును.
వినాయకుడు గజముఖుడు, ఏనుగుతలను శిరస్సుగా కలవాడు, లంబోదరుడు, అనగా చాల పెద్దఉదరముకలవాడు, మూషికవాహనుడు, ఎలుకను వాహనముగా గలవాడు, ఏనుగు శిరస్సు - వివేకమునకు చిహ్నము, తుండము - ఓం కారమును సూచించును. ఉదరము - సమృద్ధికి ప్రతీక. మూషికము - కుశాగ్రబుద్ధిని తెలియ చేయును.
వేదవ్యాసులవారు అష్టాదశపురాణములను, అష్టాదశ ఉపపురాణాలను రచించిరి. ఈ ఉపపురాణములలో శ్రీ గణేశ పురాణము ఒకటి, గణేశుని స్మరణమాత్రముచేతనే విఘ్నములు పూర్తిగా తొలిగిపోయి, మనోభీష్టసిద్ది సకల కార్యసిద్ధి కలుగును. గజాననుడు భక్తవత్సలుడు, ప్రణవ స్వరూపుడు, నిత్యసత్య స్వరూపుడు.
గణేశ పురాణమును బ్రహ్మ వ్యాసులవారికి ఉపదేశించారు. ఆయన భృగువునకూ, భృగుమహర్షి సోమకాంత మహారాజునకు ఉపదేశించారు. గణేశ పురాణము, భృగు సోమకాంత సంవాదముతో ప్రారంభమగును. పూర్వము నైమిశారణ్యములో శౌనకాది మునులు లోకకళ్యాణార్థము పన్నెండు సంవత్సరముల సత్రయాగాన్ని తలపెట్టారు. అచ్చటకు సూత మహాముని కూడ వచ్చారు.
సూతులవారిని శౌనకాది మహామునులు కోరగా, ఆతడు ఈ గణేశపురాణమును వారికి వినిపించెను. మన ప్రాచీన సంప్రదాయములో పగటిపూట యజ్ఞయాగాదులు చేయుచూ, సాయంకాలము భగవత్కథా శ్రవణం చేసేవారు. ఈ విధంగా నిద్రలేచినప్పటినుండియు రాత్రిపరుండు వరకు, రోజంతా భగవద్భక్తితో గడిపేవారు.
వినాయకునికి గణాధిపత్యము వచ్చిన చోటు గిరిజాత్మజ క్షేత్రం- లేన్యాద్రి
పరమేశ్వరుని ఉపదేశానుసారము పార్వతీదేవి పుత్రాపేక్షతో 12 సంవత్సరములు గణేశమంత్రమును జపించెనని శ్రీమోరేశ్వర్కు సంబంధించిన పురాణకథలో ఉన్నది. పార్వతీదేవి ఈ విధముగా తపస్సు చేసిన స్థానమే ఈ లేన్యాద్రి పర్వత శిఖరము. ఒక భాద్రపద శుద్ధ చతుర్థినాడు, తలస్నానము చేయుటకు ముందుగా పార్వతీదేవి తనయొంటినుండి తీసిన నలుగుపిండితో విఘ్నేశ్వరునివిగ్రహము చేసి, పూజించెను.
ఆ పూజకు, తపస్సునకు సంతసించి, విఘ్నేశ్వరుడు బాలుని రూపమును ధరించి అవతరించెను. తరువాత 15 సంవత్సరములు పార్వతీమాతతో అక్కడే యుండి తనబాలలీలను ప్రదర్శించెను. బాలగణపతిని చంపుటకై సింధురాసురుడు పంపిన చాలామంది రాక్షసులను హతమార్చెను.
క్రూరాసుర, బాలాసుర, వ్యోమాసుర, కుశలాసుర, ఇంకను మొదలైన పెక్కు మంది రాక్షసులు బాలగణపతిచే చంపబడినారు. విశ్వకర్మ లేన్యాద్రిని సందర్శించి, 6 సంవత్సరములవయస్సులోనున్న గణపతిని పూజించి అతనికి పాశము, పరశువు, అంకుశము, కమలములను అర్పణచేసాడు. బాలగణపతి యొక్క 7వ సంవత్సరమున గౌతమమహాముని అతనికి ఉపనయమును చేసెను.
తరువాత, పరమేశ్వరుడు గణపతికి విఘ్నాధిపత్యమును ప్రసాదించెను. అప్పటినుండి అతడు విఘ్నేశ్వరుడాయెను. పార్వతి, గిరి రాజకుమార్తె, ఆత్మజుడు అనగా తనయుడు. గిరిజాత్మజుడు అనగా పార్వతీ తనయుడు. కనుక, ఇచ్చట వినాయకుని పేరు "గిరిజాత్మజుడు" అయినది. గమనిక: లేన్యాద్రి పర్వతము పూణే జిల్లాలో జన్స్టర్ తాలూకాలో, గోలేగామ్ అనే గ్రామమునందున్నది. ఇది పూణేకు 94 కిలోమీటర్ల దూరమున ఉన్నది.
వినాయక చవితి ప్రతి రోజు చదవ వలసినస్తుతి. శుక్లామ్బరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాన్తయే. అగజానన పద్మార్కం, గజానన మహర్నిశమ్ అనేకదం తం భక్తానాం, ఏకదంత ముపాస్మహే. గజాననం భూతగణాధిసేవితం, కపిత్థజమ్బూఫలచారుభక్షణమ్ ఉమాసుతం శోకవినాశకారకం, నమామి విఘ్నేశ్వరపాదపఙ్కజమ్. స జయతి సిన్ధురవదనో దేవో యత్పాదపఙ్కజస్మరణమ్ వాసరమణిరివ తమసాం రాశీన్నాశయతి విఘ్నానామ్. సుముఖశ్చైకదన్తశ్చ, కపిలో గజకర్ణకః, లమ్బోదరశ్చ వికటో, విఘ్ననాశో వినాయకః. ధూమకేతుర్గణాధ్యక్షో, ఫాలచన్ద్రో గజాననః, వక్రతుణ్డ శ్శూర్పకర్ణో, హేరమ్బః స్కన్ధపూర్వజః. షోడశైతాని నామాని, యః పఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ, ప్రవేశే నిర్గమే తథా, సఙ్గ్రామే సఙ్కటే చైవ, విఘ్నస్తస్య న జాయతే. విఘ్నధ్వాన్త నివారణైక తరణి ర్విఘ్నాటవీ హవ్యవాట్ విఘ్నవ్యాళ కులస్య మత్త గరుడో విఘ్నేభ పఞ్చాననః, విఘ్నోత్తుఙ్గ గిరిప్రభేదన పవిర్విఘ్నాబ్ధి కుంభోద్భవో విఘ్నాఘౌఘ ఘనప్రచణ్డ పవనో విఘ్నేశ్వరః పాతుమామ్. ఇతి శ్రీ గణపతి వన్దనమ్
బుద్ధ జయంతి సందర్భంగా
యోగ సంస్కృతిలో ఏ ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలోనైనా బుద్ధ పౌర్ణమి చాలా ప్రధానమైన రోజు.
గౌతమ బుద్ధుడు ఈ భూమిపై అవతరించిన రోజు, జ్ఞానోదయమైన రోజుగా బుద్ధ పౌర్ణమి గుర్తింపు పొందింది. ఉత్తరాయణంలో వచ్చే ఈ మూడో పౌర్ణమికి గౌతమ బుద్ధుడి జ్ఞాపకార్ధం ఆయన పేరు పెట్టుకున్నాం. సుమారు ఎనిమిదేళ్లు కఠోర సాధన చేసిన గౌతముడు శారీరకంగా చాలా నీరసించి పోయారు. నాలుగేళ్ల పాాటు ఆయన ‘సమాన’ అనే సాధనలో ఉన్నారు. ‘సమాన’ సాధన అంటే ఆహారాన్ని అపేక్షించకుండా కేవలం ఉపవాసం, ఉండటం.
ఈ సాధన ఆయన శరీరాన్ని దాదాపు మరణానికి దగ్గరయేంతగా శుష్కింపజేసింది. ఆయన అలానడుస్తూ, 'నిరంజన’ అనే నది వద్దకు వెళ్లారు. ప్రస్తుతం భారతదేశంలోని చాలా నదుల్లా, అది కూడా అంతరించి పోయింది. అప్పట్లో ఈ నది మోకాలి లోతు నీరుతో, ఒక పెద్దపాయలా, వేగంగా ప్రవాహిస్తోంది. ఆ నదిని దాటడానికి ఆయన ప్రయత్నించారు. కానీ ఆయన శరీరం ఎంత నీరసించి పోయిందంటే నది మధ్యలోకి వెళ్ళాక ఆయన మరొక్క అడుగు కూడా వేయ లేకపోయారు. అంత తేలికగా వదలే మనిషి కాదు కాబట్టి, ఆయన అక్కడున్న ఒక పెద్ద ఎండుకొమ్మని పట్టుకుని అలా నిలబడ్డారు.
‘నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుంచి కదలను! ఆత్మ సాక్షత్కారమైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే దేహం వీడాలి’ అనుకుంటూ గంటల తరబడి నిలబడ్డారని చెబుతారు. అసలు ఆయన గంటల కొద్దీ నిలబడ్డారో లేదా నీరసించిన స్థితిలో కొన్ని క్షణాలే ఆయనకు గంటలుగా అనిపించాయో మనకి తెలియదు. కానీ ఆ క్షణంలో ‘తాను దేని కోసమైతే పరితపిస్తున్నారో అది తనలోనే ఉంది!’ అనే విషయం మహాత్ముడు గ్రహించారు.
‘ఈ శ్రమంతా ఎందుకు? కావాల్సింది సంపూర్ణమైన అంగీకారం, అంతే. నేను శోధిస్తున్నది నా లోపలే ఉంది. నేను ప్రపంచమంతా ఎందుకు వెతుకుతున్నాను?’ అనుకున్నారు. ఇలా అనిపించాక ఆయనకు మరో అడుగు వేయటానికి ఇంకాస్త శక్తి వచ్చింది. ఆ నదిని దాటి, ప్రఖ్యాతి గాంచిన బోధివృక్షం కింద కూర్చున్నారు. ఎంతో ‘దృడ నిశ్చయంతో నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుంచి కదలను! నేను ఆత్మ సాక్షత్కారమైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే చనిపోవాలి!’ అని నిశ్చయించుకున్నారు. ఆ మరుక్షణమే ఆయన ఆ స్థితికి చేరగలిగారు.
జ్ఞానోదయం పొందాలంటే మనం జీవితంలో కోరుకునేది అదొక్కటే కావాలి. అప్పుడు అది క్షణంలో జరిగిపోతుంది. మన సాధన, ప్రయత్నం అంతా మనకి అటువంటి ప్రాధాన్యత ఏర్పడటం కోసమే. మనుషులందరికీ ఎన్నో ప్రాధాన్యతలుంటాయి. అందువల్ల వారి మనస్సు, భావోద్వేగాలు, శక్తి అంతటా విస్తరించి ఉంటాయి. వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి సాధన చేయడానికి ఎంతో సమయం పడుతుంది. కాబట్టి, మొదట చేయాల్సింది మనల్ని మనం ఒక్క చోటుకి సమీకరించుకోవడం. అంటే మనల్ని మనం ఒకే దిశ వైపు మాత్రమే మళ్లించుకోవడం. ఒక మనిషి తనను తాను సంపూర్ణంగా ఒక్క చోటుకి సమీకరించుకున్నప్పుడు మాత్రమే, అతనికి మేము ఏదైనా చేయడం సాధ్యమవుతుంది.
సమాన’ గా గౌతమ బుద్ధుడి సాధనలోని తీవ్రతను చూసి ఎన్నో ఏళ్లు ఉన్న ఐదుగురు తోటి సాధకులు ఆయనను మార్గదర్శకునిగా తీసుకున్నారు. కానీ ఆయన ధ్యాన స్థితిలో నుంచి లేచిన తర్వాత మొదట ‘మనందరం భోజనం చేద్దాం’ అన్నారు. దీంతో వాళ్లు నిర్ఘాంతపోయి.. బుద్ధుడి సాధన దిగజారి పొయిందనుకుని, పూర్తిగా నిరుత్సాహపడ్డారు. వారి భావాలను గ్రహించిన గౌతముడు.. ‘మీకు అసలు విషయం తెలియడం లేదు. ఇది ఉపవాసం గురించి కాదు, ఇది ఙ్ఞానోదయం గురించి.. నాకు పూర్ణ ఙ్ఞానోదయం కలిగింది.. నన్ను గమనించండి. నా లోని ఈ మార్పును చూడండి. నాతో కేవలం అలా ఉండిపోండి, అంతే’ అన్నారు.
మన ఊరిలో గ్రామదేవతలు ఎలా వెలిశారు ఆ పేర్లు ఎలా వచ్చాయి?
గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత - గ్రామదేవత
రాట్నాలకుంట గ్రామంలో గ్రామదేవత రాట్నాలమ్మ గుడి వెలుపల ఉన్న బోర్డుపై జంతు బలులు నిషేధింపబడినవి అని వ్రాసిఉన్నది
గుడిలోవలో ముత్యాలమ్మ గ్రామ దేవత
గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి.
*గ్రామదేవతా వ్యవస్థ*
శ్రీ పెద్దింటి అమ్మ వారి ఆలయం గురించిన ఒక బోర్డు
గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపలను గ్రామదేవతలని అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.
ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు కచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.
*దేవతల ఆవిర్భావము*
పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.
పృధ్వీ దేవత
పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్ఠించిన పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు. జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూవుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉంది.
జల దేవత
జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ—గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.
అగ్ని దేవత
మూడవది తేజస్సు (అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ పౌర్ణమినాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).
వాయు దేవత
నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.
ఆకాశ దేవత
ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన. ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.
*పోషణ, రక్షణ నిచ్చే దేవతలు*
విశాఖ జిల్లాలో ఒక గ్రామ దేవత ప్రతిరూపాలు పూజింపబడుతున్నవి
ఇక ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది. పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామంలోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ఇక పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.
గ్రామదేవతా నామ విశేషాలు
సాధారణంగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది 'మావుళ్ళమ్మ' అయింది. శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ అంకాళమ్మ మారిపోయింది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది. గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది. బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= బోనాలమ్మ. అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= గుర్రాలమ్మ అయినది. ఇక ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ' అన్నారు. సోమప్రోలు అనే గ్రామం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.
*అమ్మోర్లు*
తడికలపూడి గ్రామంలో గ్రామదేవత గుడి - ద్వారంపై ఇలా వ్రాసిఉన్నది "శ్రీ అంకాలమ్మ, గంగానమ్మ, 101 దేవతలు ఉండు ఆలయం"
పార్వతే అమ్మోరు (అమ్మవారు)గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అనీ వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజనీ అంటారు. వారిలో కొందరు....
గంగమ్మ గుడిలో ఒక బోర్డు
పాగేలమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, గంగానమ్మ, బంగారమ్మ, గొంతెమ్మ, సత్తెమ్మ, తాళ్ళమ్మ, చింతాలమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, బంగారు బాపనమ్మ, పుట్టాలమ్మ, దక్షాయణమ్మ, పేరంటాళ్ళమ్మ, రావులమ్మ, గండి పోచమ్మ, మొగదారమ్మ, ఈరినమ్మ, దుర్గమ్మ, మొదుగులమ్మ, నూకాలమ్మ (అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా, కాకినాడ, సామర్లకోట, కాండ్రకోట (పెద్దాపురం), చింతలూరు తూర్పుగోదావరి జిల్లా), మరిడమ్మ, నేరెళ్ళమ్మ, పుంతలో ముసలమ్మ (మొయ్యేరు,అత్తిలిదగ్గర,ప.గోజిల్లా), మాచరమ్మోరు, మద్ది అనపమ్మోరు, సోమాలమ్మ, పెద్దింట్లమ్మ, గుర్రాలక్క (అంతర్వేది, తూ.గో.జిల్లా) (గుర్రాలమ్మ), అంబికాలమ్మ, దనమ్మ, మాలక్ష్మమ్మ, ఇటకలమ్మ, దానాలమ్మ, రాట్నాలమ్మ, తలుపులమ్మ (తుని, తూ.గో.జిల్లా), పెన్నేరమ్మ, వెంకాయమ్మ, గున్నాలమ్మ, ఎల్లమ్మ (విశాఖపట్నం), పెద్దమ్మ, మంటాలమ్మ, గంటాలమ్మ, సుంకులమ్మ, జంబులమ్మ, పేరంటాలమ్మ, కంటికలమ్మ, వనువులమ్మ, సుబ్బాలమ్మ, అక్కమ్మ, గనికమ్మ, ధారాలమ్మ, మహాలక్ష్మమ్మ, లంకాలమ్మ, దోసాలమ్మ, పళ్ళాలమ్మ (వానపల్లి, తూ.గో.జిల్లా), ధనమ్మ, జోగులమ్మ, పైడితల్లి, చెంగాళామ్మ, రావులమ్మ, బూరుగులమ్మ, కనకమహాలక్ష్మి (విశాఖపట్టణం), పోలమ్మ, కొండాలమ్మ, వెర్నిమ్మ, దేశిమ్మ, గరవాలమ్మ, గరగలమ్మ, దానెమ్మ, మహంకాలమ్మ, వీరుళ్ళమ్మ, మరిడమ్మ, ముళ్ళమాంబిక, యల్లారమ్మ, వల్లూరమ్మ, నాగులమ్మ, వేగులమ్మ, ముడియలమ్మ, పెద్దింట్లమ్మ, నంగాలమ్మ, చాగళ్ళామ్మ, నాంచారమ్మ, సమ్మక్క, సారలమ్మ, మజ్జిగౌరమ్మ, కన్నమ్మ- పేరంటళ్ళమ్మ, రంగమ్మ-పేరంటాలమ్మ, వెంగమ్మ-పేరంటాలమ్మ,తిరుపతమ్మ, రెడ్డమ్మ, పగడాలమ్మ, మురుగులమ్మ (బండారులంక, తూ.గో.జిల్లా), విశాఖపట్నంలో కుంచమ్మ, ఎరకమ్మ, పెద్దింట్లమ్మ,మరిడమ్మ ఉన్నారు.మసకపల్లి పామర్రు మండలం తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామదేవతలు గొల్లాలమ్మ, (పినపళ్ళ) మసకపల్లమ్మ, వెలగలమ్మ, ఉర్లమ్మ తల్లి (గణపవరం, కర్లపాలెం మండలం, గూంటూరుజిల్లా)పైళ్లమ్మ తల్లి, బళ్లమ్మ తల్లి, లోల్లాలమ్మ తల్లి, వూదలమ్మ తల్లి, కట్వలాంబిక,నాగాలమ్మ-నాంచారమ్మ తల్లి, సింగమ్మ తల్లి,ఘట్టమ్మ తల్లి, అంజారమ్మ తల్లి, కొట్లమ్మ తల్లి (పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా), బర్రెమ్మ తల్లి (పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా), బలుసులమ్మ తల్లి (తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా), వెంకమ్మ తల్లి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది.
Subscribe to:
Posts (Atom)
RECENT POST
నవ విధ శాంతులు
నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం: కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...
POPULAR POSTS
-
కార్తెలు-వాటి వివరణ మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెల...
-
అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్విన...
-
విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే... i భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో ...
-
కదంబ వృక్ష మహిమ : కదంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్సిస్. ఇది ఆకురాల్చదు. ఎప్ప...
-
సకల దేవతల మంత్రాలు మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్...
-
లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత. లక్ష్మి గవ్వల పూజ - ఉపయోగాలు . Laxmi Pasupu Gavvalu.The Importance of Laxmi Gavvalu Sri Maha Lakshmi Pasupu ...
-
నక్షత్ర ఆధారిత ఉపశమనాలు వివరణ జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను. జ్యోతిష శాస్త్రము మ...
-
సలేశ్వరం- శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా. సలేశ్వరం (Saleshwaram) ఇ...
-
శ్రీ దత్తాత్రేయ దేవాలయం...ఎత్తిపోతల. అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల బాహ్య ప్రపంచానికి అంతగా త...
-
బీజాక్షర సంకేతములు ఓం - ప్రణవము సృష్టికి మూలం హ్రీం - శక్తి లేక మాయా బీజం ఈం - మహామాయ ఐం - వాగ్బీజం క్లీం - మన్మధ బీజం సౌ...