Sunday, February 13, 2022

అమ్మవారికి నైవేద్యం:

*అమ్మవారికి నైవేద్యం:*

           ➖➖➖

అమ్మవారికి ఏ తిథి రోజున..ఏ అబిషేకం..ఏ నైవేద్యం.. పెట్టాలి?

**పాడ్యమి రోజు..*
ఆవు నేయితో అభిషేకం చేస్తే సకల రోగాలు నివారణ అవుతాయి.

**విదియ రోజు..*
చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.

**తదియ రోజు..*
ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి.

**చవితి రోజున..*
పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.

**పంచమి రోజు..*
అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు, బుద్ది శక్తి పెరుగుతుంది.

**షష్టి రోజున..*
తేనే తో అమ్మవారిని అభిషేకించి, బ్రహ్మణునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది.

**అష్టమి రోజున..*
బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అన్నీ తీరిపొతాయి అంటారు.

**నవమి రోజున..*
నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి.

**దశమి రోజున..*
నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది.

**వారాలలో ఏ నైవేద్యం..!*

ఆదివారం రోజు - పాలు
సోమవారం - పాయసం
మంగళవారం - అరటిపళ్ళు
బుధవారం - వెన్న
గురువారం - పటికబెల్లం
శుక్రవారం - తీపి పదార్ధాలు
శనివారం - ఆవు నేయి

**అమ్మవారికి ఇష్టమయిన అన్నం:*
పులగం - అన్నం + పెసరపప్పు
పాయసాన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం

*నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తిన్నట్టు, అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూడదు.

**అమ్మవారిని పూజ ఎలా చేయాలి.!*

ఆచమనం ముందు చేయాలి..
కాల స్మరణ చేయాలి (సంకల్పం )..
అబిషేకం చేయాలి..
మామిడి రసం(చూత పళ్ళు ) తో అబిషేకం చేయటం వలన సరస్వతి ఆఇంటి ని విడిచి వెళ్ళదు, అ ఇంట్లో వుండే వారికీ సరస్వతి కటాక్షం ఉంటుంది. 

ఆవు నేయి తో అబిషేకం చేయటం వలన సకల రోగాలు పోతాయి, 
పెరుగుతో అబిషేకం వలన సంపదలు కలుగుతాయి అమ్మవారికి చాలా ప్రీతిగా ఉంటారు, సకల రోగాలు పోతాయి, 
తేనే తో అబిషేకం చేయటం వలన యశస్సు పెరుగుతుంది, మేదస్సు పెరుగుతుంది, 
ఆవు పాల తో అబిషేకం చేయటం వలన సకల దోషాలు పోయి, సకల శుభాలు కలుగుతాయి.
గంధం తో అభిషేకం చేయటం వలన మనలో తామస గుణం పోతుంది, 
పసుపు తో అభిషేకం చేయటం వలన సౌభగ్యమ్ పెరుగుతుంది.

అమ్మవారిని 108 పువ్వులు తో పూజ చేయడం విశేషం. కమలాలు, జాజిపువులు, లేత బిల్వాలు - సకల సంపదలు కలుగుతాయి, 
దాడిమి పువ్వులు (దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు అంటే కాయకి ముందు వచ్చే పువ్వులు కాకుండా దానిమ్మ పువ్వు చెట్లు చిన్న చిన్న గులాబిలా వేరుగా ఉంటాయి) వాటితో, 
మల్లెలు కూడా అమ్మవారికి ఇష్టం..

ఇవన్నీ భక్తి భావంతో మనము ఏర్పరచుకున్నవే ఆ తల్లికి భక్తిగా ఎలా పూజించిన లోటు ఎంచదు చదన్నం నాకు ప్రీతి అని పేదవారు ఇంట్లో చద్దిబువ్వ తిని వారిని కరుణించే తల్లి ఆడంబరాలు తిధి ప్రకారం లెక్కపెట్టుకుని చేసే పూజలకు కాదు ప్రసన్నం కాదు మనసుతో చేసే నిత్య ఆరాధన అర్చనకు ప్రసన్నం అవుతుంది ,

మరి ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మన తృప్తి కోసం మనకు ఆ తల్లి పట్ల ఉన్న శ్రద్ధ ఆప్యాయత ఆశ ఆ తల్లి సన్నిధిలో సేవ చేస్తూ సమయం గడపటం కోసం మానసికంగా బాహ్యంగా కూడా ఆమె సన్నిధిలో కాసేపైనా ప్రాపంచిక విషయాలు మరచి నివశించడం కోసం ఇవన్నీ ఆచరిస్తూ ఆ తల్లిని పూజిస్తున్నాము కానీ ఆమె మననుండి మనస్ఫూర్తిగా పెట్టే నమస్కారానికి ప్రసన్నం అయిపోతుంది. 

ఉదాహరణకు మీ ఇంట్లో చంటి బిడ్డ ఇది కావాలి అని అడగలేడు కానీ మీరు ఎన్నో రకాలుగా అలంకారం చేసి మురిసిపోతారు మీరు చేయకపోయినా వాడు నోరు తెరచి అడగలేడు, అలంకరించి దిష్టి చుక్క పెట్టుకుని పదే పదే చూసుకుని మురిసిపోతారు ఆ బిడ్డ నుండి ఏదీ ఆశించరు.    అది మీ స్వచ్ఛమైన ప్రేమ ,భక్తుడికి భగవంతుడు పైన కూడా అటువంటి ప్రేమే ఉంటుంది ఉండాలి అదే నిజమైన భక్తి. 
                    శ్రీ మాత్రే నమః

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                 

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS