Friday, February 18, 2022

నవరత్నాలు ధరించే విధములు

 నవరత్నాలు ధరించే విధములు



నవగ్రహాలకు సంబంధించి అంతర్ధశలు ఉన్నట్టే గ్రహ మహర్ధశ ఉంటుంది. అంతర్ధశకు సంబంధించి ఆ కాలంలో వివిధ రత్నాలను ధరించినట్లే జాతకాన్ని అనుసరించి మహర్ధశలోనూ రత్నాలను ధరిస్తే శుభం చేకూరుతుంది. రవి మహర్ధ్థశ ఆరేళ్లకాలంపాటు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో రవి జపం చేయించిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. చంద్ర మహర్థశ పదేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో చంద్ర జపం చేయించి ముత్యాన్ని వెండిలో ధరించాలి.దీనిని ఉంగరపు వేలికి ధరించాలి. కుజ మహర్థశ ఏడేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో కుజ జపం చేయించిన తర్వాత పగడాన్ని వెండిలో ఉంగరపు వేలికి ధరించాలి. బుధ మహర్ధశ పదిహేడేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో బుధ జపం చేయించిన తర్వాత జాతిపచ్చను బంగారముతో చేయించి చిటికెన వేలు పెట్టుకోవాలి. గురు మహర్ధశ పదహారేళ్ల పాటు ఉంటుంది.ఈ మహర్ధశ కాలంలో గురు జపం చేయించిన త ర్వాత కనక పుష్యరాగం అనే రత్నాన్ని బంగారంతో చేయించి చూపుడు వేలికి పెట్టుకోవాలి. శుక్ర మహర్ధశ ఇరవై ఏళ్ల పాటు ఉంటుంది. శుక్ర జపం చేయించిన వజ్రాన్ని బంగారంలో చేసి ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. శని మహర్ధశ పందొమ్మిదేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో శని జపం చేయించిన నీలాన్ని వెండిలో మధ్య వేలికి ధరించాలి.రాహు మహర్ధశ పద్దెనిమిదేళ్ల పాటు ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో రాహు జపం చేయించిన గోమేధికాన్ని వెండిలో ధరించాలి. ఈ ఆభరణాన్ని మధ్య వేలికి ధరించాలి. కేతువు మహర్ధశ ఏడేళ్ల కాలం ఉంటుంది. కేతు జపం చేయించిన వైఢూర్యాన్ని వెండిలో మధ్య వేలికి పెట్టుకోవాలి. రత్నాలు ధరించాలి అనుకున్నవారందరూ సరియైన జ్యోతిషునిచే జాతక పరిశీలన చేయించి జ్యోతిష్యుని సలహా మేరకు మాత్రమే ధరించాలి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS