Tuesday, August 19, 2025

శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?


శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?


సాదారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసు. కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? నిజానికి శివునికి 19 అవతారాలు ఉన్నాయి. దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి. సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశ్యం చెడును నాశనం చేయటం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది.

శివుని గురించి మాట్లాడితే, మాకు 19 అవతారాలలో చాలా కొన్ని మాత్రమే తెలుసు. శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. శివుని యొక్క19 అవతారాలలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతిమ ఉద్దేశ్యంగా కలిగి ఉన్నాయి. కాబట్టి, మీరు శివుని యొక్క19 అవతారాలు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద ఉన్న వ్యాసంను చదవండి.
 
పిప్లాద్ అవతారం
శివుడు మహర్షి దధీచి ఇంటిలో పిప్లాద్ గా జన్మించెను. అయితే పిప్లాద్ జన్మించటానికి ముందే మహర్షి దధీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయెను. పిప్లాద్ పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకొనెను. అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శనిని క్షీణించమని శపించెను. తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించేను. అయితే 16 సంవత్సరాల లోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకుడదని చెప్పెను. అందువల్ల శివడుని పిప్లాద్ రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు.
 
నంది అవతారం
నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడుగా ఉంటారని పరిగణిస్తారు. ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది. రెండు చేతులు కలిపి ఉంటాయి మరో రెండు చేతుల్లో గొడ్డలి మరియు జింక పట్టుకొని ఉంటారు.
 
వీరభద్ర అవతారం
సతీ దేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత,శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను త్రెంపి మైదానంలోకి విసిరెను. ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను. ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం. అతను పుర్రెల దండ ధరించి, భయానకమైన ఆయుధాలు పట్టుకొని మరియు మూడు మండుతున్న కళ్ళతో ఒక డార్క్ దేవుడుగా కనపడతారు. శివుడు యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షుని యొక్క తలను త్రెంచబడింది.
 
భైరవ అవతారం
శివుడు,బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం పట్టింది. బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్దం చెప్పిన సమయంలో,శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికేను. బ్రహ్మ తల నరకటం వలన బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంది. అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకొని పన్నెండు సంవత్సరాల పాటు బిక్షాటన చేసెను. ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తిపీఠాలకు కాపలా ఉంటారని చెప్పుతారు.
 
అశ్వత్థామ అవతారం
క్షీరసాగర మథన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషంను తీసుకొనెను. అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది.లార్డ్ విష్ణువు శివుని నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చెను. అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణ కుమారుడుగా పుట్టుతావని వరం ఇచ్చెను. మొత్తం క్షత్రియులను చంపుతావని చెప్పెను. అందువలన విష్ణువు అశ్వత్థామగా జన్మించెను.
 
శరభ అవతారం
శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి,మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది. శివ పురాణం ప్రకారం, విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవటానికి శివుడు శరభ అవతారం ఎత్తేను.
 
గ్రిహపతి అవతారం
శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మించెను. విశ్వనర్ అతని కొడుకుకు గ్రిహపతి అనే పేరు పెట్టెను. గ్రిహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లితండ్రులకు చెప్పెను. అందువలన,గ్రిహపతి మరణంను జయించేందుకు కాశీకి వెళ్ళెను. గ్రిహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువును జయించెను.
 
దుర్వాస అవతారం
శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించెను. దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారని ప్రసిద్ది గాంచారు.
 
హనుమాన్ అవతారం
హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకటి. రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారు.
 
వృషభ అవతారం
సముద్ర మంథనం తర్వాత, ఒకసారి విష్ణువు పాతాళలోకం వెళ్ళెను. అక్కడ అతను అందమైన మహిళలు పట్ల తీవ్రమైన మొహాన్ని కలిగి ఉండెను. విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు. కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరముగా మరియు వికృతముగా ఉండేవారు. వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేదించటం ప్రారంభించారు. అప్పుడు లార్డ్ శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణు మూర్తి యొక్క కుమారులను చంపివేసెను. అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాటానికి వచ్చెను. కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత,అతను అతని నివాసం తిరిగి వెళ్ళిపోయెను.
 
యతినాథ్ అవతారం
ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు. అతను,అతని బార్య శివుని యొక్క భక్తులు. ఒక రోజు శివుడు యతినాథ్ రూపంలో వారికీ దర్శనం ఇచ్చెను. అయితే వారి గుడిసె ఇద్దరు పడుకోవటానికి మాత్రమే సరిపోతుంది. అందువల్ల ఆహుక్ బయట పడుకొని యతినాథ్ ను లోపల పడుకోమని చెప్పెను. దురదృష్టవశాత్తు ఆహుక్ రాత్రి సమయంలో ఒక క్రూర మృగంచే చంపబడ్డాడు.ఉదయం, ఆహుక్ చనిపోయినట్లు కనుకొని, తను కూడా చనిపోవాలని నిర్ణయించుకొనెను. అప్పుడు శివుడు అతని నిజ రూపంలో కనిపించి పునర్జన్మ లో ఆమె మరియు ఆమె భర్త నల మహారాజు మరియు దమయంతిలుగా జన్మిస్తారని చెప్పెను. ఇప్పుడు వారు శివునిలో ఇక్యం అయిపొయెను.
 
కృష్ణ దర్శన్ అవతారం
శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయటానికి ఈ అవతారం జరిగింది.
 
భిక్షువర్య అవతారం
శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడటానికి జరిగెను.
 
.సురేశ్వర్ అవతారం
శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చెను. అందువల్ల ఈ అవతారంను సురేశ్వర్ అవతారం అని చెప్పుతారు.
 
కిరీట్ లేదా వేటగాడు అవతారం
అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చెను. దుర్యోధనుడు అర్జునుడుని చంపటానికి మూక అనే రాక్షసుణ్ణి పంపెను. మూక ఒక పంది రూపంలో వచ్చెను. అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా,తన ఏకాగ్రతను భంగపరస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చెను. అప్పుడు కళ్ళు తెరచి మూకను చూసేను.
అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేసెను. ఇద్దరు కలిపి పందిని ఓడించెను. అర్జునుడుతో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరెను. అప్పుడు శివుడు అర్జునుడు యొక్క శౌర్యంను మెచ్చి పాశుపత అస్త్రంను బహుమతిగా ఇచ్చెను.
 
సుంతన్ తారక అవతారం
శివుడు పార్వతిని వివాహం చేసుకోవటానికి ఆమె తండ్రి హిమాలయా నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తేను.
 
బ్రహ్మచారి అవతారం
పార్వతి ఆమె భర్త పరమశివుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో,శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారం జరిగెను.
 
యక్షేశ్వర్ అవతారం
శివుడు దేవతల యొక్క మనస్సులలోకి వచ్చిన తప్పుడు అహంను తొలగించటానికి ఈ అవతారం జరిగేను.
 
అవధూత్ అవతారం
ఇంద్రుని యొక్క అహంకారంను తగ్గించటానికి శివుడు ఈ అవతారంను తీసుకున్నారు.
                  ఓం నమఃశివాయ.
🌹🌹🌹🙏🙏🙏

Wednesday, August 13, 2025

కాశీలోని_ద్వాదశ_12సూర్య_దేవాలయీలు

కాశీలోని_ద్వాదశ_12సూర్య_దేవాలయీలు


దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే 
శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి. 

1) కేశవాదిత్యుడు: ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని (కేశవుడు) గురువుగా స్వీకరించి, తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. శ్రీ ఆది కేశవ స్వామి ఆలయంలో (రాజ్ ఘాట్ ఫోర్ట్ దగ్గర ---> రాజ్ ఘాట్ వేరు... రాజా ఘాట్ వేరు. గమనించ గలరు..) కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది. విష్ణుమూర్తి కాశీకి వచ్చి, మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శనం చేయాలి.

2) మయుఖాదిత్యుడు: సూర్య భగవానుడు ధూత్ పాప, ధర్మ నదుల సంగమ స్థానం వద్ద  వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు, విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజురోజుకీ సూర్య కిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోయారు. గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుడిని చల్లబరిచారు. లోకాలకు ఉపశమనం కలిగించారు. నేటికీ ఈ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. ఇదే కిరణా నదీ ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్ లో కలుస్తుందట. 

సూర్యుడు ప్రతిష్టించిన పరమేశ్వర లింగం గాభస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళ గౌరి గా పంచ గంగా ఘాట్ లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యునిగా మంగళ గౌరీ ఆలయంలో వెలిసాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ తొలగి పోతాయని విశ్వసిస్తారు.

3) గంగాదిత్యుడు: లలితా ఘాట్ వద్ద గల నేపాలీ మందిరం క్రింద భాగాన ఉన్న గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధననష్టం ఉండదని అపమృత్యు భయం ఉండదని చెప్తారు.

4) అరుణాదిత్యుడు: గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు ఊరువులు లేకుండా జన్మించిన వినత పుత్రుడైన అనూరుడు. సంతుష్టుడైన రవి తన రధానికి సారధిగా నియమించుకున్నాడు. త్రిలోచన ఘాట్ లో, శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని  విగ్రహం క్రింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్య్రం దాపురించదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు. 

5) ఖగోళాదిత్యుడు: కద్రువ వద్ద దాస్యం తొలగిన తరువాత, వినత గరుత్మంతునితో కలిసి కాశీ చేరుకొని, తన తప్పులకు పరిష్కారం చేసుకోడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదించాడు. మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొంటారని  చెప్తారు. 

6) లోలార్కాదిత్యుడు: తులసీ ఘాట్ వద్ద, అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువుతీరి ఉంటారు లోలార్కాదిత్యుడు. నదీ సంగమ జలం అంతర్వాహినిగా కుండం లోనికి చేరుకుంటుంది. కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయని చెప్తారు.

7) సాంబాదిత్యుడు: నారదుని కారణంగా తండ్రి శాపానికి గురి అయ్యి కుష్ఠురోగం బారిన పడతాడు శ్రీకృష్ణ జాంబవతుల తనయుడైన సాంబుడు. తర్వాత కృష్ణుడి సలహా మేరకు కాశీ చేరి, విశ్వేశ్వరునితో పాటు, సూర్యనారాయణ స్వామిని కూడా నియమంగా ఆరాధిస్తాడు. ప్రభాకరుని కృపతో కుష్టు రోగం తొలగిపోతుంది. సూర్య కుండం (సూరజ్ కుండ్) వద్ద ఉన్న ఈ ఆదిత్యుని ప్రార్ధించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారట. 

8) ద్రౌపది ఆదిత్యుడు: శ్రీ కృష్ణుని సలహా మేరకు ద్రౌపది గంగా తీరాన సూర్య భగవానుని ధ్యానించింది. అభిమానంతో సూర్యుడు ఆమెకు అక్షయ పాత్ర అనుగ్రహించాడు. ఈ ద్రౌపది ఆదిత్యుని కొలిచిన వారి ఇంట ఐశ్వర్యానికి అంతు ఉండదని గ్రంధాలు తెలియజేస్తున్నాయి. అన్నపూర్ణాదేవి ఆలయం మరియు విశ్వేశ్వర స్వామి ఆలయాల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ ఒక పక్కగా ఈ స్వామి కనపడతారు.

9) ఉత్తరార్క ఆదిత్యుడు: జాతక రీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకొన్నది సులక్షణ. నియమంగా గంగా తీరాన సుర్యారాధన చేస్తుండేది. ఆమెతో పాటు ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే ఉండేది. కొంత కాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సులక్షణ, శివ పార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకొన్నది. బాలిక నిస్వార్ధ బుద్దికి సంతసించిన సర్వేశ్వరుడు శాశ్వత కైలాసం ప్రసాదించాడు. మేక మరు జన్మలో కాశీ రాజుకు పుత్రికగా జన్మించినది. స్థానికంగా 'బకరీ కుండ్' అని పిలిచే కోనేరులో స్నానమాచరించి, ఉత్తరార్క ఆదిత్యుని ఆరాధించిన వారికి ఇహ పర సుఖాలు లభిస్తాయట. వారణాశి సిటీ రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్ లో ఉంటుందీ మందిరం.

10) విమలాదిత్యుడు: అంతు తెలియని చర్మ వ్యాధితో బాధ పడుతున్న విమలుడు అనే బ్రాహ్మణుడు కాశీ వచ్చి అచంచల భక్తి శ్రద్దలతో దినకరుని ప్రార్ధించసాగాడు. స్వామి అనుగ్రహంతో అతని వ్యాధి సంపూర్ణంగా నిర్మూలించబడినది. విమలుడుకి ఆరోగ్యం ప్రసాదించిన స్వామిని విమలాదిత్యుడు అని పిలుస్తారు. ఖారీకువా గల్లీ (జంగంబారి)లో ఉండే విమలాదిత్యుని సేవించిన వారిని అనారోగ్య బాధలు దరి చేరవని చెప్తారు. 

11) వృద్దాదిత్యుడు: హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు. జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్ధించాడు. స్వామి కృపతో పునః యవ్వనాన్ని పొందాడు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తిరిగితే (కనుక్కుంటూ వెళ్ళాలి) అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ చిన్న గదిలాంటి మందిరంలో ఉన్న వృద్ద ఆదిత్యుని పూజించిన వారికి వృద్దాప్య బాధలు ఉండవని చెప్తారు. 

12) యమాదిత్యుడు: సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు, తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేసాడు. దర్శన భాగ్యం పొందాడు. యముడు ప్రతిష్టించిన శ్రీ యమేశ్వర స్వామిని, యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకొంటే, శాశ్వత స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని కాశీ ఖండం తెలుపుతోంది. సింధియా ఘాట్ లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు.

Tuesday, August 12, 2025

అష్ట సోమేశ్వర ఆలయాలు:

అష్ట సోమేశ్వర ఆలయాలు: 

 1) తూర్పు-- కోలంక: మండలం:- కాజులూరు:  స్వామివారు:- సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- ఉమాదేవి:   ప్రతిష్టించినది:- సూర్యుడు:   విష్ణాలయం:- కేశవ స్వామి, వెంకటేశ్వర స్వామి:   గ్రామ దేవతలు:- ఓరిళ్ళమ్మ, కొల పిల్లమ్మ... 2)  ఆగ్నేయం-- దంగేరు:   మండలం:- కె.గంగవరం:   స్వామి వారు:- ఉమా సోమేశ్వరస్వామి:   అమ్మవారు:- పార్వతీదేవి:   ప్రతిష్టించినది:- కశ్యపుడు:   విష్ణాలయం:- వేణుగోపాల స్వామి:   గ్రామ దేవతలు:- కట్లమ్మ, దారలమ్మ:    3) దక్షిణం-- కోటిపల్లి:   మండలం:- కె. గంగవరం:  స్వామివారు:- ఛాయా సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- రాజరాజేశ్వరి:   ప్రతిష్టించినది:-  అత్రిమహాముని:   విష్ణాలయం:- సిద్ది జనార్ధన స్వామి:   గ్రామ దేవత:-  ముత్యాలమ్మ:  4) నైరుతి-- కోరుమిల్లి:  మండలం:-  కపిలేశ్వరపురం:  స్వామివారు:- సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- రాజరాజేశ్వరి దేవి:   ప్రతిష్టించినది:- భరద్వాజుడు: విష్ణాలయం:-  జనార్ధన స్వామి:  గ్రామ దేవతలు:- దోర్లమ్మ:   5)  పడమర-- వెంటూరు:   మండలం:- రాయవరం:   స్వామివారు:- ఉమా సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- పార్వతీదేవి:   ప్రతిష్టించినది:- విశ్వామిత్రుడు:   విష్ణాలయం:- కేశవ స్వామి:   గ్రామ దేవతలు:-  మారెమ్మ:   6) వాయువ్యం-- సోమేశ్వరం:   మండలం:- రాయవరం:   స్వామివారు:-  సోమేశ్వర స్వామి:   అమ్మవారు:-  బాలా త్రిపుర సుందరి:   ప్రతిష్టించినది:-  గౌతముడు:   విష్ణాలయం:-  వేణుగోపాలస్వామి:   గ్రామ దేవతలు:-  బూరులమ్మ , బంతి బాపనమ్మ:   7)  ఉత్తరం-- వెల్ల:   మండలం:- రామచంద్రపురం:   స్వామివారు:- సోమేశ్వర స్వామి: అమ్మవారు:- బాలా త్రిపుర సుందరి:   ప్రతిష్టించినది:- వశిష్ఠుడు:   విష్ణాలయం:- వేణుగోపాలస్వామి:  గ్రామ దేవతలు:- పోలేరమ్మ:   8)  ఈశాన్యం-- పెనుమళ్ళ:  మండలం:- కాజులూరు:   స్వామివారు:- రాజ సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- పార్వతి దేవి:   ప్రతిష్టించినది:- జమదగ్ని:   విష్ణాలయం:- రామ మందిరం:  గ్రామ దేవతలు:-  పణుగుదాలమ్మ:      
 స్వామివారు:   1). సోమేశ్వర స్వామి-- 1.కోలంక- తూర్పు:  2.కోరుమిల్లి- నైరుతి:   3. సోమేశ్వరం- వాయువ్యం:  4. వెల్ల-ఉత్తరం:   2).  ఉమా సోమేశ్వర స్వామి--  1. దంగేరు- ఆగ్నేయం:  2. వెంటూరు- పడమర:  3). చాయ సోమేశ్వర స్వామి-- 1.కోటిపల్లి- దక్షిణం:  4). రాజ సోమేశ్వర స్వామి-- 1. పెనుమళ్ళ- ఈశాన్యం:   
అమ్మవారు:    1).రాజరాజేశ్వరీ దేవి-- 1. దక్షిణం-కోటిపల్లి:  2. నైరుతి- కోరుమిల్లి:   2). బాలాత్రిపురసుందరి-- 1.వాయువ్యం- సోమేశ్వరం: 2. ఉత్తరం- వెల్ల:  3). పార్వతి దేవి-- 1. ఆగ్నేయం- దంగేరు:     2. పడమర-వెంటూరు:  3. ఈశాన్యం- పెనుమళ్ళ:  4) ఉమాదేవి--  తూర్పు- కోలంక:
 విష్ణాలయం:   1). వేణుగోపాలస్వామి--1. వాయువ్యం- సోమేశ్వరం:  2. ఉత్తరం-వెల్ల:  3. ఆగ్నేయం- దంగేరు: 2). జనార్ధనస్వామి-- 1. దక్షిణం- కోటిపల్లి:  2. నైరుతి- కోరుమిల్లి:  3). కేశవ స్వామి-- 1. తూర్పు- కోలంక:  2. పడమర- వెంటూరు:  4). రామ మందిరం-- 1. ఈశాన్యం- పెనుమళ్ళ:
 మండలం: 1) కె. గంగవరం-- 1. ఆగ్నేయం- దంగేరు:   2. దక్షిణం- కోటిపల్లి:   2) రాయవరం-- 1. పడమర- వెంటూరు:  2. వాయువ్యం -సోమేశ్వరం:   3) కాజులూరు-- 1. తూర్పు -కోలంక:   2 ఈశాన్యం- పెనుమళ్ళ:  4)  కపిలేశ్వరపురం-- 1. నైరుతి- కోరుమిల్లి:   5) రామచంద్రాపురం--1. ఉత్తరం -వెల్ల:  
 1). కోలంక-- ఆత్రేయ నది దగ్గరలో... 2). దంగేరు-- కణ్వ నది దగ్గరలో... 3) కోటిపల్లి --గౌతమి నది దగ్గరలో... 5) సోమేశ్వరం-- తుల్యభాగా నది దగ్గరలో... 6) వెల్ల----------7)పెనుమళ్ళ-- ఆత్రేయ సాగరసంగమం... 8 వెంటూరు-- తుల్య సాగర సంగమం...

RECENT POST

ఆంజనేయస్వామి_అవతారాలు

ఆంజనేయస్వామి_అవతారాలు 🚩ఆంజనేయస్వామి కూడా విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు.శ్రీమహావిష్ణువు దశావతారంధరిస్తే..ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ...

POPULAR POSTS