దేవతా పూజ లో ప్రత్యేకప్రదక్షిణలు , పంచాంగ ,అష్టాంగ నమస్కారములు వాటి ఫలం*
#చండీశప్రదక్షిణలు
#విష్ణుప్రదక్షిణలు
#प्रदक्षिणा
#परिक्रम
#शिवप्रदक्षिण
#विष्णुप्रदक्षिणा
#साष्टांगप्रदक्षिण
#Sahshtangapradakshina
#Panchangapradakshina
బృహన్నారదీయే
శివం ప్రదక్షిణీకృత్య సవ్యాసవ్య విధానతః | యత్ఫలం సమవాప్నోతి తన్మేనిగదతః శృణు ||
రాజత్ప్రదక్షిణైకేన ముచ్యతే బ్రహ్మహత్యయా। ద్వితీయేనాధికారిత్వం తృతీయేనేంద్ర సంపదమ్ ||
శివుడికి సవ్య-అపసవ్య విధానంలో ప్రదక్షిణ చేయడం వల్ల ఏ ఫలితం లభిస్తుందో, తెలుసుకుందాం ఒక ప్రదక్షిణ చేయగానే బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందుతాడు. రెండో ప్రదక్షిణతో అధికారిత్వం లభిస్తుంది. మూడో ప్రదక్షిణతో ఇంద్రునితో సమానమైన సంపదను పొందుతారు.
ఏకంగణాధిపేదద్యా ద్వ్యేసూర్యే త్రీణిశంకరే | చత్వారికేశవేదద్యా తృప్తాశ్వథ్థా ప్రదక్షిణాః ॥
గణపతికి ఒక ప్రదక్షిణ, సూర్యుడికి రెండు, శంకరుడికి మూడు, శ్రీ విష్ణువుకు నాలుగు ప్రదక్షిణలు చేయాలి. రావిచెట్టుకు ఏడు ప్రదక్షిణలు.
ఏకాచండ్యాం రవౌసప్త తిస్రోదద్యాద్వినాయకే | చతస్రః కేశవేదద్ద్యా చ్ఛివేత్వర్థం ప్రదక్షిణమ్ ॥
చండీదేవికి ఒకటి, సూర్యుడికి ఏడు, వినాయకుడికి మూడు, కేశవుడికి నాలుగు, మరియు శివుడికి అర్ధ ప్రదక్షిణ చేయాలి.
ఏకహస్తప్రణామంచ ఏకాచైవ ప్రదక్షిణా । అకాలేదర్శనంచైవ హంతి పుణ్యం పురాకృతమ్ ॥
ఒక చేతితో నమస్కరించడం, ఒకే ఒక ప్రదక్షిణ చేయడం, మరియు సమయం కాని వేళ దేవతా దర్శనం చేసుకోవడం వలన గతంలో చేసిన పుణ్యం నశిస్తుంది ,ప్రధాన మూర్తులకు నిత్యార్చన అభిషేకం ,కళ్యాణం సేవలు జరుగుతున్నప్పుడు దేవాలయo మహా నైవేద్య కాలం , హారతి కాలం మరియు దేవతా విశ్రాంతి కాలమైనా, ఇంకా దేవాలయం మూసి ఉన్నప్పుడు ప్రదక్షిణలు చేయకూడదు.
పదాంతరే పదంన్యస్య కరౌ చలనవర్ణితే । స్తుతిర్వాచి హృదిధ్యానం చతురఙ్గం ప్రదక్షిణమ్ ॥
ఒక అడుగు వెనుక మరొక అడుగు వేస్తూ, చేతులు కదలకుండా, నోటితో స్తుతిస్తూ, హృదయంలో ధ్యానం చేస్తూ చేసే ప్రదక్షిణ ఉత్తమ ఫలితాన్ని కలిగి ఉంటుంది.
స్థానే చండస్య సంకల్ప్య వృషభాదౌ ప్రదక్షిణమ్ | సవ్యే సవ్యం విజానీయా దపసవ్యేపసవ్యకమ్ ॥
నంది దగ్గర మొదలుపెట్టి శివలింగం చుట్టూ సవ్యంగా కుడివైపు తిరుగుతూ సోమసూత్రం వరకు వెళ్ళాలి. ఆ సోమసూత్రం దగ్గర లేక అక్కడే ఉన్న చండీశ్వరుని దగ్గర ఆగి , దానిని దాటకుండా, అక్కడి నుంచి వెనుకకు తిరిగి వెనక్కు అపసవ్యంగా ఎడమవైపు శివలింగం చుట్టూ నడిచి తిరిగి నంది దగ్గరకు చేరుకోవాలి. ఈ విధంగా ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఈ ప్రదక్షిణను ఎన్ని సార్లు చేయాలనుకుంటే అన్ని సార్లు పునరావృతం చేయాలి.
నవప్రదక్షిణోపేతం యః కుర్యాత్తు ప్రదక్షిణమ్ | త్రింశత్సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత్
ఎవరైతే తొమ్మిది ప్రదక్షిణాలను ఒకేసారి చేస్తారో, వారికి ముప్పై వేల ప్రదక్షిణాల పుణ్యఫలం లభిస్తుంది
శంభోః ప్రదక్షిణం కుర్వన్ సోమసూత్రం న లంఘయేత్ |
లoఘిత్వాత్వేకమేవస్యా దనులoఘ్యేయుత త్రయమ్ ||
ప్రసాదవిస్తార సమానసూత్రం సోమస్యసూత్రం దిశిసోమసూత్రమ్ ।
సూత్రాద్బహిర్లజ్ఝనతో నదోష స్స్యాద్దోష ఆభ్యంతర లంఘనేన
*శివునికి ప్రదక్షిణం* చేసేవారు, సోమసూత్రాన్ని దాటకూడదు సోమసూత్రాన్ని దాటితే ఒక ప్రదక్షిణ ఫలితం మాత్రమే వస్తుంది. అదే దాటకుండా చేస్తే పదివేల రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. దేవాలయం యొక్క పొడవు ఎంత ఉంటుందో అదే సోమసూత్రం యొక్క పొడవు. సోమసూత్రం ఉత్తర దిశగా ఉంటుంది.సోమసూత్రం వెలుపల దాటితే దోషం లేదు, కానీ దాని లోపల దాటితేనే దోషం.
॥ అపసవ్యంయతిః కుర్యా త్సవ్యం తు బ్రహ్మచారిణః । సవ్యాసవ్య విధిస్తు వానప్రస్థ గృహస్థయోః ॥
సన్యాసులు (యతులు) అపసవ్యంగా ప్రదక్షిణలు చేయాలి. కొన్ని సందర్భాలలో ఇది సాధారణ ప్రదక్షిణానికి వ్యతిరేక దిశలో ఉంటుంది.
బ్రహ్మచారులు సవ్యంగా ప్రదక్షిణలు చేయాలి. సవ్యం అంటే కుడివైపునకు ప్రదక్షిణ చేయడం. ఇది సాధారణంగా మనం చేసే ప్రదక్షిణ విధానం.
వానప్రస్థులు, గృహస్థులు అయితే సవ్యం మరియు అసవ్యం రెండూ చేయవచ్చు. అంటే, వారి ఇష్టం ప్రకారం వారు ప్రదక్షిణలు చేయవచ్చు.
సోమసూత్రద్వయం యత్ర యత్ర వావిష్ణుమందిరమ్ | అపసవ్యం నకుర్వీత కుర్యాదేవ ప్రదక్షిణమ్ ॥
సోమసూత్రద్వయం అంటే శివలింగం నుండి నీరు బయటకు వెళ్ళే మార్గం. శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు సోమసూత్రాన్ని దాటకూడదు.
*విష్ణుమందిరం* అయిన వ్యతిరేక దిశ లో చేయకూడదు.ఆ స్థానం లో ఎప్పుడూ సవ్య ప్రదక్షిణమే చేయాలి.
ప్రదక్షిణత్రయం కృత్వా నమస్కారైశ్చ పంచభిః ।
పునః ప్రదక్షిణం కృత్వా శివలోకే మహియతే |
ఒక భక్తుడు శివుని ఆలయంలో మొదట మూడు ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత ఐదుసార్లు సాష్టాంగ నమస్కారం లేదా శిరస్సు వంచి నమస్కారం చేయాలి.నమస్కారాలు పూర్తయిన తర్వాత, మరొక ఒక ప్రదక్షిణ చేయాలి.
ఇది ఇంకోక విధానం.
గర్భాలయే తథా ప్రాక్ ప్రదక్షిణ నిషేధః
పూజాభిషేకసమయే మహాదేవస్య శూలిన:| పూజాకర్తా వృష్ఠభాగం దర్శయేన్న కదాచన ॥
శివపూజాభిషేక సమయమందు మరియూ ఎల్లప్పుడునూ భక్తులు వారి శరీరముయొక్క వెనుకభాగము మహాదేవునకు చూపకూడదు.
అందువల్ల గర్భాలయములో మరియు విగ్రహం ముందు వైపు కూడా ప్రదక్షిణలు చేయరాదు.
తిరుమల లో అంగప్రదక్షిణ అనే పద్దతి కూడా ఉన్నది కోరికలు స్వామి వారికి చెప్పుకొని అవి తీరడానికి లేక కామ్యసిద్ధి తరువాత అక్కడ ప్రత్యేక సమయం లో (పొర్లు దండాలు) అంగప్రదక్షిణలు చేస్తారు
కేదార్ మానససరోవర్ లో కూడా కొందరు విదేశీయులు సైతం కఠినమైన ఈ పద్ధతి దైవానుగ్రహం కోసం చేస్తుంటారు.
ఇతి ప్రదక్షిణ నమస్కారవిధిః ॥
*పంచాంగ మరియు సాష్టాంగ నమస్కారము*
*బృహన్నారదీయే*
ప్రణమ్య దండవద్భూమౌ నమస్కారేణ యోర్చయేత్ |
సయాం గతిమవాప్నోతి నతాం క్రతుశతైరపి ||
దండం లేక కర్ర వలె నేలమీద పడుకుని, శరీరాన్ని పూర్తిగా నేలకు ఆనించి నమస్కరించడం. ఇది అత్యంత వినయంతో, భగవంతునికి సంపూర్ణంగా లొంగిపోయి చేసే నమస్కారo ఈ విధంగా నమస్కరించి, దైవాన్ని పూజించేవాడు.వ్యక్తి పొందే ఉన్నతమైన ఫలం జీవన్ముక్తి. వందలాది యజ్ఞాలు చేసినా కూడా పొందలేని ఫలాన్ని, కేవలం దండవత్ ప్రణామం ద్వారా భగవంతుని పూజించిన వ్యక్తి పొందుతాడు.
దోర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యా మురసా శిరసా తథా |
మనసావచసా దృష్ట్యా ప్రణామోష్టాఙ్గ ఈరితః || పద్భ్యాం కరాభ్యాం శిరసా పంచాంగప్రణతి స్మృతా | అష్టాఙ్గ ఉత్తమః ప్రోక్తః పంచాంగో మధ్యమః స్మృతః
శిరోహస్తౌచ జానూచ చిబుకం బాహుకద్వయమ్ । పంచాంగంతు నమస్కారో నమస్కారత్రయం స్మృతమ్
ఉత్థాయోత్థాయ కర్తవ్యః ప్రణామో దండవద్భువి ॥ ప్రదక్షిణం నకర్తవ్యం పురతః పృష్ఠ దర్శనాత్ |
రెండు చేతులు, రెండు పాదాలు, రెండు మోకాళ్ళు, వక్షస్థలం, తల, మనస్సు, వాక్కు, మరియు దృష్టి - ఈ ఎనిమిది (శారీరక , మానసిక ) అవయవాలతో చేసే ప్రణామాన్ని *అష్టాంగ ప్రణామం* అంటారు.
రెండు పాదాలు, రెండు చేతులు, మరియు తల - ఈ ఐదు భాగాలతో చేసే ప్రణామాన్ని *పంచాంగ ప్రణతి* అంటారు. ఈ రెండింటిలో, అష్టాంగ నమస్కారం ఉత్తమం అని, పంచాంగ నమస్కారం మధ్యమం అని చెప్పబడింది. పదే పదే లేచి, భూమి మీద దండవత్ ప్రణామం చేయాలి. దేవుని ముందు ప్రదక్షిణం చేయకూడదు.
*మహాదేవ మహాదేవ శ్రీ మాత్రే నమః*
*రాళ్ళబండి శర్మ* 🙏🙏🙏🙏

No comments:
Post a Comment