పిల్లలు లేని వారు ఈ పవిత్ర క్షేత్రంలో ఒక రాత్రి నిద్రిస్తే సంతానం లభిస్తుందని అచంచలమైన నమ్మకం ఉంది. ఎన్నో కుటుంబాలు ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ మహిమను అనుభవించాయి.
ఈ ఆలయ మహిమను ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తన ప్రవచనాలలో ప్రస్తావించారు.
📍 స్థానం:
గొల్లప్రోలు మండలం, పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లా (పూర్వ తూర్పుగోదావరి జిల్లా)
🚩 ప్రయాణ సౌకర్యం
1️⃣ పిఠాపురం వైపు నుండి
పిఠాపురం నుండి 14 కి.మీ. దూరంలో ఉంది.
విజయవాడ, హైదరాబాద్, చెన్నై, కాకినాడ వైపు నుండి వచ్చే వారు పిఠాపురం లేదా సామర్లకోట రైల్వేస్టేషన్ లో దిగాలి.
అక్కడ నుండి చేబ్రోలు చేరుకొని, 6 కి.మీ. ప్రయాణం చేస్తే అలవెల్లి మల్లవరం/పాముల మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం దర్శనం లభిస్తుంది.
2️⃣ విశాఖపట్నం వైపు నుండి
విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా నుండి వచ్చే వారు అన్నవరం ద్వారా రావచ్చు.
అన్నవరం రైల్వే స్టేషన్‌లో కొన్ని మాత్రమే ట్రైన్లు ఆగుతాయి.
అన్నవరం నుండి కత్తిపూడి → చేబ్రోలు → మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యం దేవస్థానం చేరుకోవచ్చు.
⚠️ గమనిక: అన్ని ట్రైన్లు సామర్లకోట జంక్షన్ వద్ద ఆగుతాయి. సామర్లకోట నుండి పిఠాపురం నుండి చేబ్రోలు నుండి మల్లవరం ఆలయానికి చేరుకోవడం సులభం.
🌐 మరిన్ని వివరాలు అధికారిక దేవస్థానం వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
🙏 అలవెల్లి మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి క్షేత్రం మహిమ అనుభవించి, మీ కోరికలు తీర్చుకోండి.
.jpg)
No comments:
Post a Comment