Monday, February 26, 2018

శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు



శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడు.
శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా ఏలినాటి శని ప్రసన్నుడవుతాడు. అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నవగ్రహాలలో ...ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవత..
వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.

'శనీశ్వర జపం నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ
సంభూతం తమ్ నమామి శనైశ్చరం | ఓం శం శనయేనమ:||

'ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్
'ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః |

'శని గాయత్రీ మంత్రం-
'ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. |
'ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ |

"బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
'సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మేశని' |ఓం శం శనైస్కర్యయే నమః ఓం శం శనైశ్వరాయ నమః||
|ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||
కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:

| ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం!

పూర్ణ మోహన్* ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించుకొంటే కలిబాధలు, శని బాధలు, గ్రహ బాధలు పోతాయి.
కలి సంబంధ బాధలు తొలగించే శక్తీ నల చరిత్రకు ఉంది. నలచక్రవర్తి కలిప్రభావం చేత నానా ఇక్కట్లు పడ్డాడు. కానీ, తన యోక్క ధర్మ ప్రవర్తనచే ఆ బాధలను అవలీలగా అతిక్రమించాడు.
దమయంతి, కర్కోటక సర్పం, రాజర్షి రుథుపర్ణుదు మొదలగు మహాత్ర్ముల సహకారంతో కలి పెట్టిన ఇక్కట్లను సమూలంగా తొలగించుకున్నాడు.
" కర్కొటకస్య నాగస్య దమయంత్యా: నలస్య చ,
రుథుపర్ణస్య రాజర్శే: కీర్తనం కలినాశనం...
కనుక కర్కోటక, దమయంతి, నల, రుతుపర్ణ -- నామాలతో ఉన్న ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించుకొంటే కలిబాధలు, శని బాధలు, గ్రహ బాధలు పోతాయని మహాభారతంలో చెప్పబడింది.
#దోషాలు_పోగొట్టే_శనీశ్వర_క్షేత్రం...





సాధారణంగా నవగ్రహాలతో పాటు శనీశ్వరుణ్ణీ దర్శనం చేసుకుంటాం. అయితే శనికి మాత్రమే ప్రత్యేకంగా గుడులుండటం అరుదు. అలాంటి ఓ దేవాలయం హైదరాబాద్‌ మహానగరానికి అతి సమీపంలో నెలకొంది. 22 అడుగుల ఎత్తున ఉండే ఇక్కడి శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే సకల శని దోషాలూ పరిహారమవుతాయట.

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం... తొమ్మిది గ్రహాలున్నా... శనీశ్వరుడి స్థానం ప్రత్యేకం. జనం ఆయన్ను తలచుకున్నంతగా మరే గ్రహదేవతనీ తలచుకోరనిగానీ, ఇంకా చెప్పాలంటే అంతలా భయపడరనిగానీ అంటే అది అతిశయోక్తి కాబోదు. అయితే, శనీశ్వరుడు యమధర్మరాజుకి సోదరుడు. సూర్యుడికి కొడుకు. న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం ఆయన వంశంలోనే ఉందన్న మాట. శనీశ్వరుడు ఈ జన్మకు సంబంధించే కాదు పూర్వజన్మల పాప కర్మలకూ దండనను విధించే క్రతువును నిర్వహించే బాధ్యత కలిగి ఉన్నవాడు. జన్మరీత్యా మనిషికి శనిమహర్దశా కాలాలు నడుస్తున్నప్పుడు వాళ్ల వాళ్ల పాపకర్మలను బట్టి వారిని ఆరోగ్యపరంగా, మానసికంగా దండిస్తూ ఉంటాడు. అయితే శనీశ్వరుణ్ణి శరణువేడటం ద్వారా ఆ బాధల నుంచి ఉపశమనం పొందొచ్చన్నది పురాణ వచనం. మనిషి జీవిత చక్రంతో ముడివడిన ఈ శనిదేవుడికి గుళ్లు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి. వాటిలో ఒకటి రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, మదనపల్లి గ్రామ సమీపంలో పచ్చని పంటపొలాల మధ్య వెలిసిన ఘంటల శనీశ్వర ఆలయం. ఇక్కడ స్వామి 22 అడుగుల ఎత్తుతో భక్తజనానికి దర్శనమిస్తాడు.

భక్తులకు వరం...
జాతక చక్రప్రకారం బుధ, గురు, శుక్ర మహర్దశలు ఎలా వస్తాయో అలాగే శనిమహర్దశా వస్తుంది. అయితే ఆ సమయంలో శనీశ్వరుడి వల్ల కలిగే బాధలు అధికంగా ఉండేవాళ్లు ఆయన్ను శాంతింపజేయడానికి పూజలు చేస్తుంటారు.

నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్‌ నమామి శనీశ్వరం
అంటూ ఆయన్ను స్తుతిస్తారు. శనీశ్వర మంత్రాన్ని చదవడం వల్ల ఆయన శాంతిస్తాడట. అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేయడమూ శుభఫలితాన్నిస్తుందట. శనీశ్వరుడికి ఆగమశాస్త్ర బద్ధంగా ఆలయాన్ని నిర్మించేందుకు ఎ

క్కువ మంది ముందుకు రారు. నిర్మాణంలో ఏవైనా లోపాలు చోటు చేసుకొంటే శనీశ్వరుడి ఆగ్రహానికి గురికావలసి వస్తుందేమోనన్నదే కారణమై ఉండొచ్చు. అందుకే శని ఆలయాలు అతి తక్కువ చోట్ల కనిపిస్తాయి. కోయ దొర స్వామి శంకర్‌రాజుముఖియా హైదరాబాద్‌ సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శనీశ్వర ఆలయంలో దాదాపు 22 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాక్షాత్తు శనీశ్వరుడే భూలోకానికి వచ్చినట్లు తీర్చిదిద్దిన ఈ విగ్రహం కాళ్ల కింద జ్యేష్ఠాదేవి ఉంటుంది. భారతి నర్సింహస్వామి, స్వరూపానందస్వామి చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠాపనగావించారు. ఆలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరులనూ కొలువుదీర్చారు. విగ్రహం ఎత్తైనది కావడంతో తైలాభిషేకం చేయాలంటే పై అంతస్తుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వృద్ధులూ, వికలాంగులను దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అష్టదిక్పాలకులూ ఈ గుళ్లొ కొలువయ్యారు. ఈ ఆలయంలోని స్వామిని స్త్రీలు కూడా ముట్టుకోవచ్చు.

Sunday, February 25, 2018

శ్రీ రామసేతువు గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.







రామసేతువు

శ్రీ రాముడు లంకను చేరి, రావణ సంహారం చేయడానికి, వానరసేన నిర్మించిన వంతెన అది. దాని పేరే రామ సేతువు.ఈనాటికి హిందూ మహసముద్రంలో ఉన్నది.ఈ శ్రీ రామసేతువు గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.

త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ రాముడిగా అవతరించారు కానీ ఎక్కడ మహిమలు చూపలేదు. ఒక మనిషి ఎలా ఆవేశపడతాడో, ఎలా భాధపడతాడో, కోపానికి, సంతోషానికి గురవుతాడో అచ్చం అలాగే రాముడు కూడా అనుభవించాడు. మనిషి ఎలా బ్రతకాలో, తాను తన దైవలీలలు చూపకుండా, మనిషిగా ధర్మాన్నీ ఆచరించి చుపించాడు. శ్రీ రామసేతువు నిర్మాణానికి సంబంధించి నలుడు, నీలుడికి రాముడికి మధ్య ఒక అద్భుతమైన సంవాదం రఘువంశంలో కనిపిస్తుంది. రావణాసురుడు చేత అపహరించబడిన సీతమ్మ లంకలో ఉందన్న విషయం హనుమంతుని ద్వారా తెలుసుకున్న శ్రీ రాముడు సముద్రం దాటి లంకకు ఎలా చేరాలా అని చింతిస్తున్నాడు. అప్పుడు వానరసేనలో ఉన్న నలుడు, నీలుడు రాముడి వద్దకు వచ్చారు.

వీళ్ళిద్దరు ఈ ప్రపంచ చరిత్రలో తొలి Hydraulic Engineerలు. వాళ్ళు రాముడిని సమీపించి "మీరేం భాధపడకండి. రాళ్ళ సహాయంతో సముద్రంలో మేము వంతెన నిర్మిస్తాము".సముద్రంలో రాళ్ళు ఎలా నిలబడతాయి? అని రాముడు ప్రశ్నిస్తే, మీకు ఆందోళన ఎందుకు? అది మాకు సంబంధించిన విషయం. Hydraulics మాకు అర్దమవుతాయి కానీ మీకు కాదు. ఎందుకంటే మాకు Hydraulic Engineeringలో మంచి నైపుణ్యం ఉంది. పడవల సహాయంతో సముద్రంలో రాళ్ళను పడేసి, ఒకదానిపై ఒకటి పేరుస్తాము. అవి పైవరకు వచ్చాక అప్పుడు సేతువు నిర్మాణం మొదలుపెడతామన్నారు నలుడు, నీలుడు. ఈ వంతెన నిర్మాణానికి ఎన్ని రోజుల పడుతుంది అని రాముడు అడుగగా, ఎన్ని రోజులైనా పట్టనివ్వండి, వంతెన పూర్తి చేస్తాం అన్నారు. వారధి పూర్తిచేస్తారు, మనం లంకకు వెళ్తాం, వెళ్ళిన వాళ్ళం తిరిగివస్తామా? వంతెన మధ్యలోనే కూలిపోతే? అని రాముడు తన సందేహాలను వ్యక్తం చేశాడు. మీకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, ఈ వంతెన మీద వెళ్ళిన మన సేన ఖచ్చితంగా తిరిగివస్తుంది. కాని రావణాసురిడి సైన్యం వస్తే మాత్రం ఈ వంతెన కూలిపోతుంది. ఇదెలా జరుగుతుందంటే, మేము ముందే ప్లాన్ వేసి, కొలతలు తీసుకున్నాం. మన సేనలో అన్ని వానరాలే(కోతులు) ఉన్నాయి. కోతులు నడిచే సమయంలో భూమి మీద అతితక్కువ ఒత్తిడి(pressure) మాత్రమే పెడతాయి. పరమాత్ముడు వాటి శరీరాన్ని ఏ విధంగా రూపొందించాడంటే, అవి తమ చేతులు, కాళ్ళను అతి తక్కువ సమయం నేలపై పెడతాయి, ఒక వేళ వాటి చేతులు, కాళ్ళను భూమి పై పెట్టిన వెంటనే అక్కడి నుండి దూకి వేరే ప్రదేశానికి వెళతాయి. అలా చాలాదూరం అవి దూకుతూ(jump) వెళ్ళగలవు. 1, 2 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం అవి అలాగే వెళ్ళగలవు.

ఈ వంతెన డిజైన్ ఏ విధంగా చేసామంటే, దాని మీద వానరాలుదూకుతూ దాటగలవు, కానీ రావణ సైన్యం వచ్చిదంటే ఈవంతెన కుప్పకూలిపోతుంది. ఎందుకంటే రావణసైన్యంలో అందరూ రాక్షసులే ఉన్నారు. వారి శరీరం చాలా పెద్దగా, బలంగా ఉంటుంది. వారూ నేలమీద తమ శరీరం ద్వారా అధిక భారం/ ఒత్తిడి(pressure) వేస్తారు. అందువల్ల ఈ సేతువు తెగిపోతుంది. వాళ్ళు మునిగిపోతారు. మనమే గెలుస్తాము. ఓడిపోయే అవకాశమే లేదు అన్నారు నలుడు, నీలుడు.

*వాల్మీకి రామాయణం : (6-22-51 TO 6-22-71) *
*సమర్ధచాపి సేతుం కర్తుంవై వరుణాలయే ||6-22-51*
*తస్మాతథైవ బంధంతు సేతుం వానర పుంగవః*

నేను సేతువును నిర్మించడంలో సమర్ధుడను. వానరులలో బలవంతులు ముందుకు వస్తే ఇప్పుడె నిర్మిస్తాను అన్నాడు నలుడు. రాముడూ ఆజ్ఞతో కొన్ని వందల వానరాలు అన్ని వైపులా వ్యాపించి ఉన్న అడవులపైకి ఆనందంతో గంతులు వేస్తూ పరిగెత్తాయి. పర్వతాల వంటి శరీరం సౌష్టవం కలిగిన వానరసేనాధిపతులు పెద్ద పెద్ద రాళ్ళను, కొండలను, చెట్లను విరగ్గొట్టి సుంద్రం వద్దకు తీసుకువచ్చారు. అశ్వకర్ణ, ధావ, అర్జున, మామిడి, అశోక, బిల్వ, శతపర్ణ మొదలైన చెట్లను సందురంలో పడేస్తున్నారు. మంచివానరాలు కొన్ని చెట్లను వ్రేళ్ళతో సహా , కొన్నిటికి వ్రేళ్ళు లేకుండానూ భూమిని నుంచి పెల్లగించి, ద్వజస్థంభాలను ఎత్తుకొస్తున్నారా అన్నట్టుగా తీసుకువచ్చారు. ప్రక్కన ఉన్న ప్రదేశాల నుండి వేప, కొబ్బరి, దానిమ్మ మొదలైన చెట్లను కొన్ని వానరాలు తీసుకువస్తున్నాయి.

*హస్తిమాత్రన్ మహాకాయః పాశానాంచ మహాబలః ||6-22-58*
*పర్వతాంశ్చ సముత్పట్యా యంత్రైః పరివహంతి చ *
*ప్రక్షిప్యామాణైర్ అచలైః సహసా జలం ఉద్దతం ||6-22-59*

కొండలవంటి శరీరంతో, ఏనుగులవలే ఉన్న కొండలను పెల్లగించి యంత్రాల(Machines/cranes) సహాయంతో తరలించి, ఒక్కసారిగా అన్ని వైపుల నుండి సముద్రంలో రాళ్ళను పడేయడంతో సముద్రంలో నీరు ఒక్కసారిగా పైకి లేచి క్రింద పడుతోందట.(యంత్రాలంటే క్రేన్లు మొదలైనవి. ఇవి ఆ కాలానికే ఉన్నాయి). ప్రగృణంతి హ్యాయతం శతయోజనం"* అంటే ఈ సమయంలో కొందరు రామసేతువును సరైన ఆకారంలో ఉందా, కొలత సరిగ్గా ఉందా అని కొలవడానికి వందయోజనాల stringను సిద్ధం చేస్తున్నారట. నలుడు, తన బాధ్యతగా సముద్రం మధ్యలో సేతువును నిర్మాణాన్ని ఇతర వానరాల సహాయంతో ప్రారంభించాడు. కొందరు వంతెన కొలవడానికి పొడవైన కర్రలనూ, ఇంకొందరు నిర్మాణానికి సంబంధించిన ఇతరవస్తువులను(సున్నం మొదలైనవి) దగ్గరపెట్టుకున్నారు. రెల్లుగడ్డి, పెద్ద పెద్ద దుంగలను కొన్ని వందల వానరాలు తీసుకువచ్చి, రాముడి ఆజ్ఞతో సేతువు నిర్మాణాన్ని వేగవంతం చేశాయి. మంచి సువాసన కలిగిన చెట్లను ఉపయోగించి, కొన్ని రకాల చేట్ల వ్రేళ్ళు, సున్నమూ, ఊడలతో బండలను ఒకదానికి ఒకటి దగ్గరగా,గట్టిగా కడుతూ అటూ, ఇటు వేగంగా పరుగులుపెడుతున్నాయి.

ఈ విధంగా మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, 3వ రోజు 21 యోజనాలు, 4వ రోజు 22 యోజనాలు, 5వ రోజు 23 యోజనాలతో మహాసేతువును, ప్రపంచంలో మానవనిర్మిత వంతెనను నలుడు ఆధ్వర్యంలో వానరసేన పూర్తిచేసింది. ఆధునిక ఇంజనీరింగ్ నిపుణులే ఆశ్చర్యపడేంతగా రామసేతువు నిర్మాణంలో ఉన్న నైపుణ్యం, ప్రత్యేకత ఏమిటి? అది ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిలిచి ఉంది? నలుడి ఆధ్వర్యంలో క్రేనులు, డ్రిల్లింగ్ మెషీన్లు, నైపుణ్యం కలిగిన వానరుల సహాయంతో 48 కిలోమీటర్ల పోదవు, 2.5-3 కిలోమీటర్ల వెడల్పుతో, సముద్రగర్భంలో 22 అడుగుల లోతు వరకు ఉండేలా సేతువును నిర్మించారు. అసలే సముద్రం మీద నిర్మిస్తున్న వంతెన. Straight గా నిర్మిస్తే పెద్దపెద్ద సముద్రపు అలల తాకిడి వలన ఒత్తిడికి గురై నిర్మాణానికి ప్రమాదం సంభవిస్తుందని, వంతెన మధ్యలోనే తెగిపోయే ప్రమాదం ఉందని, Arc Shape వచ్చేలా వారధిని డిజైన్ చేశారు. సునామీ(ఉప్పెన) వంటి ఉత్పాతాలు సంభవించినా సేతువుకు ఎటువంటి నష్టం వాటిల్లకపోవడానికి కారణం సెతువు ' Arc'shape ఉండడమే. సముద్రం మీద కడుతున్న వారధి, సముద్రం యొక్క ప్రవహానికి అడ్డురాకూడదని, అక్కడున్న జలచరాలకు ఇబ్బందికలగకూడదని, అలాగే సముద్ర ప్రవాహానికి అడ్డుగా ఒక గోడలాగా కడితే, వంతెన life ఎక్కువకాలం ఉండదని,ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నిర్మాణం చేయరాదని భావించినా నలుడు, సముద్రపు నీరు వెళ్ళేందుకు వీలుగా 7equal intervalsలో రామసేతువు క్రింది భాగంలో openings వచ్చేలా డిజైన్ చేశారు. ఇవి నీటిని బయటకు drain చేస్తాయి. సేతువు వెడల్పు(width) మొదట 2.5 కిలోమీటర్లు ఉండగా, మెల్లమెల్లగా పెరుగుతూ శ్రీ లంక చేరేసరికి 3 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఈరోజు ప్రపంచంలో ఆధునిక నిర్మాణరంగంలో(Modern Architecture) అమలుచేస్తున్న డిజైన్. త్రేతాయుగం అంటే 12,96,000 సంవత్సరాల కాలం.ఈ యుగంలోనే శ్రీ రామచంద్రుడు ఈ భూమిపై అవతరించాడు.తరువాత ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం.

ఇప్పటికి కలియుగంలో 5113 సంవత్సరములు గడిచాయి. రామసేతువు నిర్మాణం త్రేతాయుగం చివరలో జరిగినది. అంటే దాదాపు 9,00,000 ఏళ్ళ క్రితం. ఈ రోజు మనం చెప్పుకుంటున్న అత్యాధునిక పరిజ్ఞానం మన హిందువులకు కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఋజువేం కావాలి చెప్పండి. హిందువైనందుకు గర్వించండి. Say itwith pride : We are Hindus. కొన్ని లక్షల సంవత్సరాలు నీటిలో ఉన్నా, చెడిపోని లోహం(Metal)తో చేసిన bolts వాడి బండలను జతపరిచారని, మధమధ్యలో సున్నం, బంకమట్టి మొదలైనవి వాడారని సేతువును పరీశీలించిన రాజీవ్ దీక్షిత్ మొదలైనవారు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రదర్శించారు. పైన చెప్పిన వాటితో పాటు ఈ సేతువు సముద్రపు లోతు తక్కువగా(3-30 అడుగులు) ఉన్న ప్రదేశంలో ఉంది. అందువల్ల ఇది సహజంగా ఏర్పడినది కాదనడానికి అనేక ఆధారాలు దొరుకుతున్నాయి.రామసేతువును కాపాడుకుందాం. రామాయణం మనదేశ చరిత్రలో భాగం అని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పుకుందాం.

భారత్-శ్రీలంకల మధ్య ఒక వంతెన ఉన్నదని నాసా ఫోటోలు విడుదల చేసినప్పటికి, అది సహజంగా ఏర్పడిన వంతెన అనే చాలాకాలం వాదించింది. దాని వయసు సూమారు 17,50,000 ఏళ్ళు అని చెప్పింది. అక్కడ ఉన్న పగడాలు, యాంటి-బయాటిక్ లక్షణాలు కలిగి అంతరిక్షయానం చేసేవారికి ఉపయోగపడే algae, ఇవన్ని చూశాక అమెరికా భారత్ మీద అసూయతో అనేకవాదనలు చేసింది. అది 17,50,000 సంవత్సరాల నాటిదని చెప్పడం చేత అది శ్రీ రామసేతువు కాదని హిందువలను నమ్మించవచ్చని భావించింది.అసలు విషయం వేరే ఉన్నది. అదేంటంటే అమెరికా అన్ని మతాలను సమానంగా చూడదు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలలో గెలవాలంటే ముందు అక్కడున్న క్రైస్తవ మిషనరీల పెద్దల యొక్క అనుమతి ఉండాలి. వారు ఎవరికి మద్దతిస్తే వారే గేలుస్తారు. ఇదంతా చాలా రహస్యంగా జరిగే ప్రక్రియ. వారి మద్దతుతో అధ్యక్షుడయ్యకా ఎవరైనా 'ఆ మతం' యొక్క వ్యాప్తికి కృషి చేస్తారు. అందులో భాగంగానే భారత్ ను మరో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ మాదిరి తయారు చేయాలనుకుంటోంది అమెరికా. ఇక్కడ హిందువులు, భౌద్ధులు, సిక్కులు మీద జరిపే మతమార్పిడులను ఎప్పటికప్పుడు రహస్యంగా నివేదికల ద్వారా తెప్పించికుంటుంది అమెరికా. ఒకవేళ ఎక్కడైనా తమ మతపచారాన్ని అడ్డుకుంటే భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తుంది.( ఇదంతా చాలా రహస్యంగా జరిగే నిరంతర ప్రక్రియ. ఇది ఏ కొద్దిమందికి మాత్రమే తెలుసు.) తమ మతప్రచారాన్ని యధేచ్చగా జరిపించుకుంటుంది. తమ మతప్రచారానికి ఒక చిన్న అడ్డంకి ఏర్పడినా, పెద్ద ఉత్పాతం సంభవించినట్టు తెగ హడావుడి చేస్తుంది. భారతీయ సంస్కృతిని, హిందు, జైన, భౌద్ధ సిక్కు మతాలాను సమూలంగా భారత్ నుంచి తుడుచిపెట్టి ఈ దేశ పరిపాలనను తమ స్వహస్తాల్లోకి తీసుకోవాలన్నది అమెరికా ప్రభుత్వం వెనుక ఉండి ఈ నాటకం నడిపిస్తున్న వారి ఆలోచన. అందులో భాగంగానే హిందువుల రామాయణం నిజమని చెప్పే ఆధారమైన రామసేతువును కూల్చేయాలన్నది వారి ఆలోచన. ఇప్పటికే బ్రిటిషర్లు మహభారత కాలనికి సంబంధించిన ఆధారాలను అనేకం నాశనం చేశారు. రామాయణం ఎప్పుడో జరింగిందో తెలియక, అదంతా ఒక కధగా, ఒక నమ్మకంగా భావిస్తున్నాం. మనకు నిజాలు తెలిసేలోపు ఆధారాలను మాయం చేయాలన్నది అమెరికా ఆలోచన.

కానీ నిజం నిప్పులాంటిది. సత్యమేవ జయతే, 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా' అని మనకు మన గ్రంధాలు ప్రస్ఫుటంగా చెప్తున్నాయి. పరమాత్మ సత్యం. సత్యాన్ని ఎవరూ తొక్కిపెట్టలేరు. ఒక జెర్మన్ బృదం రామసేతువు మీద 'కార్బన్ డేటింగ్' చేసి, దాని వయసు 9,00,000 సంవత్సరాలని తేల్చింది. ఇది మన హిందువులు రామావతారం గురించి చెప్పే సమయంతో సరిపోతోంది.

2004లో భారత్ మీద సూనామీ విరుచుకుపడినప్పుడు, ఆ భయంకర అలలు దక్షిన తమిళనాడు, కేరళ మీద పడకుండా ఆపింది రామసేతువు. రామసేతువే కనుక లేకపోయి ఉంటే కొంకణతీర ప్రాంతానికి తీవ్ర నష్టం చేకూరేది. ఇప్పుడు రామసేతువును కూల్చేసి, సేతు సముద్రం ప్రాజెక్టును చేపడితే, భవిష్యత్తులో మరొక సూనామీ వస్తే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు చాలా తీవ్రంగా నష్టపోతాయి. రామసేతువు వలన, దాని దగ్గరి ప్రాంతంలో ఒక different వాతవరణం నెలకొని ఉంది. అక్కడున్నAlgae కు ఔషధ గుణాలున్నాయని 2012 జూలై ప్రాంతంలో కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధించి వెల్లడించారు. అక్కడున్న Algea మీద మరిన్ని పరిశోధనలు చేసి, ప్రజల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచగలిగే ఒక మందును తయారు చేయవచ్చని వెల్లడించారు. రామసేతువు వద్ద చాలా అరుదైన marine atmosphere కనిపిస్తుంది. అంతరించబోయే జాబితలో చేర్చబడిన 5 జాతులకు సంబంధించిన జీవరాశికి ఈ రామసేతువే ఆధారం. దీన్ని కూల్చేస్తే అక్కడున్న జీవరాశి పూర్తిగా అంతరించిపోతుంది . సేతు సందురం ప్రాజెక్టు వలన లక్షలమంది జాలర్లు జీవనం కోల్పోతారు.

ఈ రోజు ప్రపంచంలో అణువిద్యుత్ ప్లాంట్ల(nulcear plants)కు థోరియం(Thorium) ప్రత్యామ్నాయ ఇధనం(alternative fuel). భారత్ ప్రపంచంలో 25% థోరియం నిలువలు కలిగివుంది. అందులోనూ సగానికి పైగా థోరియం నిలువలు తమిళనాడు సముద్ర తీరంలో రామసేతువు దగ్గరగా ఉన్నాయి. మన దగ్గరున్న థోరియం నిలువలతో భారత్, మరే ఇతర దేశం మీద ఆధారపడే పరిస్థితి లేదు . రామసేతువు, సముద్రపు కెరటాలను అదుపు చేయడంతో పాటు, వాటిని క్రమబద్దీకరించడం వలన అక్కడ Thorium, Titanium అధికంగా ఇసుకలో ఉన్నాయి. సేతు సముద్రం ప్రాజెక్టు పేరుతో రామసేతువును కూల్చేయడం వలన అక్కడ ఉన్న mineral deposits కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. థోరియం ను అక్రమరవాణా చేయడం సులభవుతుంది. అంతేకాదూ, రామసేతువు కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కూడా ఇందుకే. గుట్టు చప్పుడు కాకుండా అక్కడున్న మన జాతి సంపదైన Thoriumను విదేశాలకు తరలించి, అక్రమంగా డబ్బు సంపాదించాలన్నది వారి ఆలోచన. అందుకే ఎంత నష్టం వాటిల్లుతుందని తెలిసినా, వారు రామసేతువును నాశనం చేయాలనే నిర్ణయాన్నిమార్చుకోవడం లేదు. రామసేతువును కూల్చి నౌకలు వెళ్ళెందుకు వీలుగా ఒక మార్గం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే చాలసార్లు ప్రయత్నాలు జరిగాయి కానీ ప్రతిసారి ఎద్దురుదెబ్బలే తగిలాయి.

జనతా పార్టీ అధ్యక్షుడు, సుబ్రమణ్యస్వామి రాసిన ఒక రెపోర్టును Asian Age ప్రచురించింది. 23-1-2007 న Asian Age లో ప్రచురింపబడిన దాని ప్రకారం Dredging Corporation of India(DCI) హోలాండ్ నుండి ఒక dredger ను import చేసుకుంది. అది రామసేతువు దగ్గర పని ప్రారంభించడానికి వెళ్ళి, సేతువుకు తగలగానే రెండు ముక్కలై, సముద్రంలో మునిగిపోయింది. Dredger ను సాగరగర్భం నుండి బయటకు తీయడానికి వెళ్ళిన DCI crane కూడా విరిగిపోయి సముద్రంలో మునిగిపోయింది. ఈసంఘటనను గురించి ఆరా తీయడానికి వచ్చి, ఆ ప్రదేశానికి వెళ్ళిన రష్యన్ ఇంజనీరుకు ఒక కాలు విరిగింది. గుట్టు చప్పుడు కాకుండా పని కానిద్దాం అనుకున్నారు. ప్రజలను మోసం చేయచ్చు, కాని పరమాత్ముడుని మోసం చేయగలరా? హిమాలయ పర్వతాల్లో, కైలాస మానససరోవరం చుట్టుప్రక్కల ఈ రోజుకి శ్రీ ఆంజనేయ స్వామి వారు తపస్సు చేస్తున్నారు. తన రాముడి సేతువు వద్దక వస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా?

రామసేతువు 1480 వరకు వాడుకలో ఉండేది. దాని మీది నుండి ప్రజలు ఇరుదేశాల మధ్య వ్యాపారం కొనసాగించారు. కాని ఆ తరువాతి కాలంలో వచ్చిన ఒక భారీ తుఫాను వలన రామసేతువు 3 నుండి 7 అడుగుల మేర సముద్రంలో మునిగిపోయింది. జై శ్రీరాం. పూర్ణ మోహన్

27 నక్షత్రాలు గుణగణాలు




అశ్విని నక్షత్రము గుణగణాలు

అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు. అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆశక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆశక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆశక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.

భరణినక్షత్రము గుణగణాలు

భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు.

ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించ లేరు. వృద్ధాపయములో సుఖజీవనము చేయడనికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. విరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు.ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధరణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది.

కృత్తికానక్షత్ర జాతకుల గుణగణాలు

కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సుర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు.
బాల్యములో మంచి పోషణ, పపెంపుదల ఉంటుంది. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గదుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నెర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నం మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించ లేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. వీరికి మధుమెహవ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో అస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగుణము ఎక్కువ. అపాత్రా దానము చేస్తారు. మద్యవర్తిత్వం బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసమస్యల నుండి బయటపడి సుఖజీవితము సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి.

రోహిణి నక్షత్ర గుణగణాలు

రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్సిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలయందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. మాతృవర్గం మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శ ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపణలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళా ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్దులు పొందగలరు.

సంతానముతో విభేదిస్తారు. గురుమహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనేతన వారిని సుఖపెదతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

మృగశిరా నక్షత్రము గుణగణాలు

మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంస్థలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు. అంతర్గతంగా స్త్రీలతో సంబంధాలు ఉంటాయి. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మముగా న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. సైనికపరమైన, ఆయుధ సంబందిత, విద్యాసంబంధిత ఉద్యోగావ్యపరాలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతంలో రాణిస్తారు. తల్లి తండ్రుల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానమందు క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చేస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ.

ఆరుద్ర నక్షత్రము గుణగణాలు

ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిగిఉంటారు. గొప్ప గమ్మత్తుగా మాట్లాడగలరు. మానవగణము కనుక లౌక్యంతో పనులు సాధించగలరు. రాశి అధిపతి బుధుడు నక్షత్ర అధిపతి రాహువు కనుక విద్యా వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. బాల్యం నుండి యవ్వనం వరకు సుఖసంతోషాలతో సాగుతున్న జీవితం వివాహానంతరం సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగం , వ్యాపారం వంటి వాటిలో త్వరగా స్థిరపడతారు. తగిన వయసులో వివాహం సులువుగా జరుగుతుంది. నటులుగా, కళాకారులుగా చక్కగా రాణిస్తారు. కళాత్మకమైన వ్రత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. డబ్బులకు చెందినట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందర పాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేటలు కనబరుస్తారు. తల్లిదండ్రులు, తోడబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగియుంటారు. రాత్రి పూట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందరిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చినా కూడ ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతుకుతారు. సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి జీవితంలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.

పునర్వసు నక్షత్రము గుణాగణాలు

ఇది గురు గ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు, అధిదేవత అధితి, పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలొ ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకితో కాల్చడము వంటి అలసట కలిగించె విద్యల అందు ఆసక్తి అధికము. అభిప్రాయాలు, మాటలు స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పదిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడడంలోనే ఆశక్తి అధికం కనబరుస్తారు. వివాహజీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చెసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదె పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది. ఇవి ఈ నక్షత్రజాతకులకు సాధారాణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపదతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది.సమస్యలను పరిష్కరించ గలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది. బాల్యము సుఖవంతముగా జరిగినా తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. నలభై నుండి ఏభై సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయట పడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది.

పుష్యమి నక్షత్రము గుణగణాలు

పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడిపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజాబాహుళ్యమును నియత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. యవ్వనం వచ్చిన తరువాత జీవితం అదృ ష్టానికి చేరువగా సాగుతుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహసంబంధాలు పటిష్టంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. సౌమ్యంగా ఉంటారు. తప్పు చెసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. తక్కువ సమయములో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. దానస్వభావము కలిగి ఉంటారు. వీరికి మంచి సలహాదారులు లభిస్తారు. ఒకరిద్దరు తప్పుడు సలహాదారుల వలన సమాజంలొ అప్రతిష్టకు లోనౌతారు. వారి సలహాల కారణంగా వ్యక్తిగత జీతంలోను, సామాజిక జీవితములోను అపసృతులు ఎదురౌతాయి. జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురౌతాయి. తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనౌతారు. నైతిక విలువలు లేని వైరివర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి ఔతారు. సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ నష్టాలకు గురి చేస్తాయి. దైవ భక్తి అధికము, అధ్యాత్మిక రంగంలో అభ్యున్నతి సాధిస్తారు. వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది.

ఆశ్లేష నక్షత్రము గుణగణాలు

ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదోఒక లాగ తమ తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, పగయును కలిగి ఉంటారు. రాజకీయాల వైపునకు మొగ్గు వీరిలో ఎక్కువగా నుండును. స్త్రీల వలన పెద్దల వలన జీవితములో ఇబ్బమ్దులకు గురి ఔతారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి, ఏది ఏమి అయిన సరే వీరు ఆయా అడ్డగింపులని దాటి పై చదువులను చదువుకొనగలుగుతారు.

వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసికొనిపోతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్ట పడి సుఖజీవితాన్ని అలవరచుకున్నా పొరపాటు అయిన ఊహల వలన సమస్యలు ఎదురౌతాయి. సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగంలో నిపుణత సాధిస్తారు. వర్గరాజకీయాలను సమర్ధతతో నడపగలరు. యీనియన్లలో ప్రజా జీవితములో మంచి పేరు వస్తుంది. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు.

లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గదిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువ ఔతారు. నమ్మకద్రోహులు స్నేహితులుగా ఉండడము దురదృష్టముగా పరిణమిస్తుంది. స్థిరాస్థులు దక్కించుకోగలుగుతారు. ఆయుర్వేద మందులు, బియ్యము, పాల వ్యాపారము, పెట్రోలు బంకులు, బట్టల(జవుళీ)వ్యాపారము లాభిస్తాయి. అర్హులైన వారికి దానము చెస్తారు. గొడవలు తగువులు తగాదాలకు దారి తీసే సంగతుల జోలికి వీరు పోనేపోరు దూరముగా ఉంటారు. ఒడు దుడుకులు ఉండకుండ వీరి బ్రతుకు నిలకడగా ఉంటుంది.
మఖనక్షత్రము గుణగణాలు

మఖ కేతుగ్రహ నక్షత్రం కనుక ఈ నక్షత్రజాతకులకు మంత్రోపాసన, వైరాగ్యం , భక్తి సహజంగా అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికం. కేతువు ఆధిపత్యం, రాక్షస గణముల చేరిక కారణంగా పట్టుదల, ప్రతీకారం వంటివి అధికం. ప్రతి విషయంలో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయం చేయలేరు. పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అబధ్రతా భావం అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడం వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణం అధికం. బ్యాంల్యంలోనే శుక్రదశ వస్తుంది కనుక విద్య కంటే సౌందర్య పోషణకు ప్రాదాన్యత ఇస్తారు. తన పరిసరాలను పరిశుభ్రంగా అందంగా ఉంచే ప్రయత్నాలు చేస్తారు. కార్యసాధన కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఎవరికీ తలవంచని మనస్తతత్వం వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొటారు. అధికారిగా రాణిస్తారుకాని కింది ఉద్యోగుల నిరసనకు గురి ఔతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పొస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి ఔతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతం భద్రం చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయం నుండి రాత్రి వరకు శ్రమిస్తారు కాని నిద్ర లేమిని సహించరు. సహన గుణం తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితం స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి బాధపదతారు. లోటు లేని జీవితం జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగం , గృహ యోగం, ఆర్ధిక యోగం, విదేశీయాన యోగం కలసి వస్తాయి. నక్షత్ర అధిపతి కేతువు కనుక భక్తి వైరాగ్యాలు, రాక్షస గణం కారణంగా పట్టుదల, రాశి అధిపతి సూర్యుడు కనుక ఆధిపత్య గుణం కలిగి ఉంటారు. దైవీక కార్య నిర్వహణ, రాజకీయ ఆధిపత్యం , వృ త్తి వ్యాపారాలలో ఆధిపత్యం వంటివి వీరికి రాణింపు తీసుకు వస్తాయి.

పూర్వఫలుగుణి నక్షత్రము గుణగణాలు

పూర్వఫల్గుణీ నక్షత్రం అధిపతి శుక్రుడు వీరికి బాల్యం కొంత వరకు సుఖమయ జీవితం గడుస్తుంది. ఆటంకం లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుంది. రాశ్యాధిపతి సూర్యుడు, నక్షత్రధిపతి శుక్రుడు, మానవగణం కారణంగా లౌక్యం , అధికారం కలగలసి ప్రవర్తిస్తారు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలంగా ప్రవర్తించే కారణంగా అధికారులుగా రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరులకు తల వంచలేరు కనుక పై అధికారులతో సహకరించి ముందుకు పోలేరు. సౌమ్యులే అయినా గంభీరంగా ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చేయరు. ఎవరు ఎమనుకున్నా లక్ష్య పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదాదానం చేస్తారు. సివిలు కేసులను ఎదుర్కొంటారు.స్వయంకృతాపరాధం వలన తాను శ్రమించి సాదించిన దానిని వైరి వర్గానికి ధారపోస్తారు. స్నేహితుల ఉచ్చు నుండి కొందరు జీవితకాలం వరకు బయట పడలేరు. బయట కనిపించే జీవితం కాక రహస్య జీవితం వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలాను ఎదురుగా చెప్ప లేరు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతం అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నంగా సంతానాన్ని వేరు రంగాలలొ ప్రోత్సహిస్తారు. సమాజంలో చురుకైన పాత్ర పోషిస్తారు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మంచి పరిచయాలు ఉంటాయి. వీరి జీవితం స్నేహానికి అంకితం. వీరవిద్యలలో రాణిస్తారు.

ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు

ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు, అధిదేవత ఆర్యముడు, మనుష్య గణం , రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు, జంతువు గోవు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు తండ్రి వలన ప్రయోజనం పొందుతారు. సహోదర వర్గం బలంగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికం. వివాహం సకాలంలో ఔతుంది, ఉద్యోగం లేక వ్యాపారం ఉంటాయి. అదృష్టానికి దగ్గరగా జీవితం సాగుతుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనం అధికంగా గుప్తంగా ఉంటాయి. తనకు అంతగా పరిచయం లేని రంగంలో ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారం చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి పాపభీతికి చోటు ఉండదు. ధనం విషయం లో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరంగా ఖర్చుపెట్టరు. ఖర్చు పెట్టిన దానికి వందరెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానం వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగ లాగా కూడబెడతారు. సంఘవ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. భార్య ఆధిపత్యం అధికం. మంచి ఆశయాలతో ముందుకు వచ్చినా వీరిని ప్రపంచం సరిగా అర్ధం చేసుకోదు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితం మీద ఉన్న భయం వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దశలు వీరికి యోగిస్తాయి.

హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు

హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహం, రాశి అధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు, మహిషి(గేదె). ఈ నక్షత్రజాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధం చేసుకుంటారు. అడగకనే సహాయం చెస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితములో ప్రధాన ప్రస్తావన ఔతుంది. వ్యుహాలు రహస్యం అయినా కొందరికి మాత్రం చెప్తారు. చేసిన తప్పులను అడగకుండా మీకు మీరుగా ఒప్పుకుంటారు. దూరప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జివితంలో మంచి మలుపులు ఔతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్ధ్యాలకు గుర్తింపు కొంత కాలం వేచి ఉండాలి. న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరిని బాధిస్తుంది. సర్దుకు పొవడం వలన వైవాహిక జివితం సజావుగా సాగుతుంది. స్వంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరీ వర్గం పట్ల అభిమానం కలిగి ఉంటారు. అనుకున్న ప్రదేశంలో ఇష్టమైన విద్య అభ్యసిస్తారు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రచారంలో ఉంటాయి. సంతానం పేరు ప్రతిష్టలు తెస్తారు.

చిత్తానక్షత్ర జాతకుల గుణగణాలు

చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు, రాక్షసగణం , జంతువు పులి, వృక్షం తాటి చెట్టు, రాశ్యధిపతులు బుధుడు శుక్రుడు, అధిదేవత త్వష్ట. బాల్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దత్తు పోవుట లేక స్వజనులకు దురంగా పెరుగుటకు అవకాశం ఉంది. ఇతరుల ఆర్ధిక సాయంతో జీవితంలో ముఖ్యఘట్టాలు పూర్తి చేసుకుంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితంలో మరెవ్వరు అనుభవించ కూడదని అహర్నిశలు కష్టపడతారు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదంగా భావించిన వారు జీవితంలో దూరం ఔతారు. వాదనా పఠిమ కారణంగా న్యాయస్థానాలలో, ప్రజాబాహుల్యంలో అనుకూల ఫలితాలు సాధించినా కుటుంబంలో అందుకు ప్రతికూల పరిస్తితులను ఎదుర్కొంటారు. సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులను దూరంగా ఉంచుతారు. పెద్దలు, ఉన్నత స్థానాలలో ఉన్న వారి నుండి ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కుంటారు. విపరీతమైన కోపం, పోరుబెట్టడం, జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం వలన కావలసిన వారికి అందరికి దూరం ఔతారు. ప్రయోజనం లేని చర్చలు, కోపతాపాలు జీవితంలో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. సంతానం ఉన్నత స్థితికి వస్తారు. విదేశీవ్యవహారాలు ఆలస్యంగా కలసి వస్తాయి. వస్తువలను బాగు చేయడం (రిపేరు వర్క్), సాహసకృత్యాలు, సాంకెతిక పరిజ్ఞానం, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. అందరిలో ప్రత్యేకత సాధించాలన్న కోరిక వలన వివాదాస్పదమై అనుకూల ఫలితాలను ఇస్తుంది. జీవితంలో అన్నిటికీ సర్దుకు పోయే భార్య లభిస్తుంది. జీవిత మద్య భాగంలో స్థిరాస్థులు కలిసి వస్తాయి. పాడి పంట వ్యవసాయం పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది.

స్వాతి నక్షత్రం గుణగణాలు

స్వాతి నక్షత్రాధిపతి రాహువు. స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి. కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహుప్రభావంతో కల్పనా శక్తి శుక్రప్రభావంతో సౌందర్యారాధనా శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. స్వాతి నక్షత్రజాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతినక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు. ఈ నక్షత్రజాతకులు చిన్న వయసులో దాదాపు 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా యుక్తవయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కష్ట కాలపరిమితి నక్షత్రపాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది. బాల్యంలో విధ్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించ వచ్చు. యుక్తవయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్ధికంగా సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు కనుక, గోచార రీత్యా శని నాలుగు, అయిదు స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బుధుడికి ఇది మిత్రరాశి కనుక, గోచార రీత్యా బుధుడు నవమ స్థానాధిపత్యం వహించి యోగకారకుడౌతాడు కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది. శుక్ర, రాహువుల ప్రభావం చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా, సాత్విక గుణం కారణంగా ఈ రాశి వారు కళారంగ ప్రవేశం చేస్తే సుస్థిరతను సాధించి రాణించే అవకాశాలు ఎక్కువ. బాహ్యంగానూ, గుప్తంగానూ శత్రువులు ఉంటారు. బాహ్యాకర్షణ, అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు. మార్గదర్శకమైన నడవడి కలిగిఉంటారు. కళాత్మకమైన వస్తు సేకరణ చేస్తారు. ఈతరుల అసూయకు లోను ఔతారు. అకారణమైన నిందకు గురి ఔతారు. ఒక వైపు వాదనలు విని ఏక పక్ష నిర్ణయాలు తీకునే కారణంగా అనేకులను దూరం చేసుకుంటారు.
దాని వలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు. సరి అయిన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా అభివృద్ధి మాత్రం కుంటు పడదు. దాతృత్వం ప్రోత్సహిస్తారు కాని దానగుణం తక్కువ. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. జల కారకుడైన శుక్రుడి ప్రభావితం వీరికి విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది.

విశాఖనక్షత్రము గుణగణాలు

విశాఖ గురుగ్రహ నక్షత్రం, రాక్షస గణం, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యథిపతి కుజుడు. గురుదశతో జీవితం ప్రారంభం ఔతుంది కనుక బాల్యం సుఖంగా జరుగుతుంది. తల్లి తండ్రులు కుంటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం మొదలౌతుంది. వీరికి మొండితనం ఎక్కువ. అనుకున్నది అమలు చేస్తారు. వీరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడం వ్యర్ధం. వీరికి సహాయం చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వారు చేసిన సహాయాన్ని భూతద్దంలో చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లేక స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించ లేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలొ పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశం చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్థులు సంక్రమిస్థాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగం వారి వలన మోసానికి గురిఔతారు. అన్యభాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగంలో విజయం సాధించి ప్రముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబధం ఉండదు. ఉద్యోగంలో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.వారి వలన నష్టం ప్రయోజనం సమంగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. విదేశీపౌరసత్వం లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు.
కుటుంబసభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయం పొదుపు, జాగ్రత్త, విజ్ఞానం జివితంలో సమపాళ్ళలో ఉంటాయి. ఏభై సంవత్సరాల అనంతరం జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యం సుఖవంతంగా జరుగుతుంది.

అనూరాధనక్షత్రము గుణగణాలు

అనూరాధా నక్షత్రం అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రం . అధిదేవత సూర్యుడు. జంతువు జింక, రాశ్యధిపతి కుజుడు. ఈ నక్షతరంలో జన్మించిన వారు జలక్రీడల అందు ఆసక్తులై ఉంటారు. నైతిక ధర్మం , పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవం కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితంలో స్థిరపడడానికి సమయం పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయం కావాలి. ఆరంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలంలో నిరాటంకంగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగజీవితంలో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతంగా సాగి పోతారు. ప్రేమవివాహాలు చేసుకుంటారు. గుర్తిపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రే యస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధువర్గం నుండి నమ్మకద్రోహం ఎదురౌతుంది. తండ్రి పద్దతులు నచ్చవు. తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది. సహోదర సహోదరీ వర్గం బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానం , దూరప్రాంత ఉద్యోగం , దూరప్రాంత విద్యా విధానం మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంత మంది ఉన్నా ఏకాంతంగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. సాహిత్య, కళారంగాలను వైరాగ్యం మిశ్రమం చేసి ప్రయోగాలు చేస్తారు. వైద్య విద్యలలో రాణిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరిపట్ల శాశ్వత అనుబంధం ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభం సంపాదించిన రంగంలో తిరిగి ప్రవేశించరు. నిలకడగా, నికరంగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యం అన్ని విధాలుగా బాగుంటుంది.

జ్యేష్టానక్షత్రము గుణగణాలు

జ్యేష్టా నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రం , అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యములు కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకోవడనికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడనికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు. మిత్రబెధం కలిగించి, తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నెహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు సౌందర్యంగానే కనిపిస్తాయి. భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం వీరికి సుఖంను కలిగిఉస్తుంది. సంతానం నష్టం కావచ్చు. అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపం ఉండదు. అన్నమాట, ఇచ్చిన వాగ్ధానము నిలబెట్తుకో లేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నెహం ఉండదు. సాంకేతిక రంగం లో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మిద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించ గలరు. తగిన వయసులో సంపాదన మొదలౌతుంది. సంపాదించిన ధనంను భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రం లో గ్రపరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటయీ మూలానక్షత్రము గుణగణాలు

మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి గురువు, జంతువు శునకం. ఈ నక్షత్రములో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభాపాతవాలు వీరి స్వంతం. చిన్న తనంలో బంధువుల నిరాదరణకు గురి ఔతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవితధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనసులో స్థానం లేదు. కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు. అణుకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఆర్ధిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పరు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చెయ్యడం కష్టతరమైన యజ్ఞం ఔతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. స్త్రీదేవతార్చన మంచిది. అరవై సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగి పోతుంది.

పూర్వాషాఢ నక్షత్రము గుణగణాలు

పూర్వాషాఢ నక్షత్రముకు అధిపతి శుక్రుడు, అది దేవత గంగ, మనుష్య గణం , జంతువు వానరం, రాశి అధిపతి గురువు. వీరు విలాసమంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవి చూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకు పోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం, కొంటె తనం వీరి స్వంతం. బాల్యజీవితం సుఖవంతము. వివాహ జీవితం సాధారణం. పుట్తిన ప్రామ్తానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నతస్థాయి సాధిస్తారు. స్నేహితులతో కలసి జీవితంలో విజయాలు సాధిస్తారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి రాణింపు లభిస్తుంది. కొంత కాలం తరువాత వీరున్న రంగంలో వీరి స్నెహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పుకు సహనానికి పరీక్షలు ఎదురౌతాయి. ఎక్కువ కాలం ఓర్పు వహించ లేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. నమ్మిన సేవకాజనం మోసం చెస్తారు. సహోదరీ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి స్వామీజీల పతల సదభిప్రాయం ఉంటుంది. దైవభీతి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానము మీద ఎవ్వరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మద్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారి తీస్తుంది.

ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు

ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువఁగా మాట్లాడెదరు, అణకువ కలిఁగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుఁగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుండఁదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నచ్చుకొనెదరు. కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకా నొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి , బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటందుకు సరి అయిన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మంచిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయంను చేస్తారు. తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వరు. ఆర్ధికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.

శ్రవణా నక్షత్ర జాతకుల గుణగణాలు

శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం. ఈ నక్షత్రజాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా నీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజములో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట, సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి స్వంతం. అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా విరికి విశాలహృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు. వీరికి దైవాను గ్రహం ఎక్కువ. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.

ధనిష్ఠానక్షత్రము గుణగణాలు

ధనిష్ఠా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, రాశ్యాధిపతి శని, జంతువు సింహము. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి తెలివి తేటలను సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శీఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. వీరి అధికార వైఖరి, మెండి తనం కారణంగా విమర్శలను ఎదుర్కొనవలసిన పరిస్థితి అడుగడుగునా ఎదురౌతుంది. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్థుల రుపములోనె నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు కాని ఆత్మియులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెప్తారు. అందు వలన నష్తపోతారు. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. పైసాకు చెల్లని వ్యక్తులను నెత్తికి ఎక్కించు కుని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. చదువు, సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే పురోగమనం సాధించ వచ్చు. సంతానంను అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురౌతాయి. పెంపకంలో లోపాలు ఉన్నా సంతానం బాగుపడి కుంటుంబానికి ఖ్యాతి తెస్తారు. గురు, శని, బుధ, మహర్ధశలు, శుక్రదశ యోగిస్తాయి.

శతభిషానక్షత్రము గుణగణాలు

ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గలలొ స్నెహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గంతో, న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురౌతుంది. విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు ఎదురౌతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్ధిక సహాయం చెయవలసి ఉంటుంది. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి. సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చెస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఆత్మియులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చెసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం కొంత జరిగిన తరువాత సౌఖ్యంగా జరుగుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవం. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ సాధారణ ఫలితాలు మాత్రమే.

పూర్వాభద్రనక్షత్రము గుణగణాలు

పూర్వాభాద్ర నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాశ్యాధిపతులు శని, గురువులు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఊంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతురత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాబం చెస్తారు లేక పోతే విచక్షణా రహితంగా కొడతారు. ఆర్ధిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. ఆధిపత్యపోరు ఇబ్బందికి గురి చేస్తుంది. వైవాహైక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.

ఉత్తరాభద్రానక్షత్ర,ము గుణగణాలు

ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు. ఈ నక్షత్ర జాతకులు వినయవిధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. జివితం సాఫీగా జరిగి పోతుంది. ముప్పై నుండి నలభై సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు. జాతక చక్రములో గ్రహస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు చేర్పులు ఉంటాయి.

రేవతీనక్షత్రము గుణగణాలు

రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. స్నానం పట్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్ధిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపరంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించు కుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండ దండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉందదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూతన వ్యాపారాలలొ రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. వీరికి జ్ఞాపక శక్తి , సాహిత్య రంగంలో అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు

పూర్ణ మోహన్

బీజాక్షర సంకేతములు

         


బీజాక్షర సంకేతములు

ఓం - ప్రణవము సృష్టికి మూలం
హ్రీం - శక్తి లేక మాయా బీజం
ఈం - మహామాయ
ఐం - వాగ్బీజం
క్లీం - మన్మధ బీజం
సౌః - సౌభాగ్య బీజం
ఆం - పాశబీజం
క్రోం - అంకుశము
హ్రాం - సూర్య బీజం
సోం, సః - చంద్ర బీజం
లం - ఇంద్ర బీజం, పృథివీ బీజం
వం - వరుణ బీజం,జల బీజం
రం - అగ్ని బీజం
హం - ఆకాశ బీజం, యమ బీజం
యం - వాయు బీజం
శం -ఈశాన్య బీజం, శాంతి బీజం
షం , క్షం - నిరృతి బీజము
సం - సోమ (కుబేర) బీజము
జూం - మృత్యుంజయ, కాలభైరవ బీజం
భం - భైరవబీజం
శ్రీం - లక్ష్మీబీజం
హ్సౌ - ప్రాసాద , హయగ్రీవబీజం
Kshourwm - నృసింహ బీజం
ఖేం - మారణబీజం
ఖట్ - సంహారబీజం
ఫట్ - అస్త్రబీజం
హుం - కవచబీజం
వషట్ వశీకరణముబీజం
వౌషట్ - ఆవేశబీజం
ష్ట్రీo - యమబీజం
ధూం - ధూమావతిబీజం
క్రీం - కాళీబీజం
గం - గణపతిబీజం
గ్లౌం - వారాహి,గణపతిబీజం
ఘే - గణపతిబీజం
త్రీం -తారా బీజం
స్త్రీo - తారాబీజం
హూం - కూర్చము,క్రోధము,ధేనువు
బ్లూం - సమ్మోహనము
ద్రాం -ద్రావణ, దత్తాత్రేయబీజం
ద్రీo - ఉద్దీపనం
దం - దత్తాత్రేయబీజం
అం - బ్రహ్మ బీజం
కం -బ్రహ్మబీజం
ఇం - నేత్రబీజం
ఉం - శ్రోత్రబీజం
హ్లీం - బగళాబీజం
గ్రీం - గణపతిబీజం
ఠ - స్థంభనము
హిలి - వశీకరణ,దేవతాభాషణం
కిలి కిలి - దేవతాభాషణం
చులు - బాధా నివారణ
హులు - బాధా నివారణ

మానవుడు ఈ లోకంలోని కర్మ వలన శరీరాన్ని పొందుతున్నాడు. ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ మరల పాపపుణ్యాలు చేసి తిరిగి జన్మ పరంపరను పొందుతున్నాడు. ఇట్టి జన్మ పరంపరను విచ్చేదమొనర్చడానికి ఉపయోగపడు సాధనే ‘జపం’ అని శాస్తమ్రులు చెబుతున్నాయి.
‘జప’మనగా ‘జ’-జన్మ విచ్ఛేదనం చేయునది. ‘ప’ -పాపమును నశింపచేయునది అని అర్ధం. ఈ విధంగా జన్మను పాపమును రెండింటిని నశింపచేయడం చేతనే దీనికి జపమని పేరు వచ్చింది. జపంలో చందోబద్ధమైన ఒకే భగవన్నామం కానీ, ప్రత్యేకమైన కొన్ని మంత్రాలను కానీ ఉచ్చరించడం జరుగుతుంది. మనసు చంచలమై అల్లకల్లోలంగా వున్నప్పుడు ఆ మనసును ఏకాగ్రపరచడానికి జపం ఉపయోగపడుతుంది. నిశ్చల మనస్సుతో నిర్మలంగా దైవంపై మనసును కేంద్రీకరించి తత్ మంత్ర దేవతామూర్తి గుణరూపాలను మనసులో ముద్రించుకుని జపించాలి.
జపాన్ని మూడు విధాలుగా చేయవచ్చు. ఒకటి వాచకము: మంత్ర బీజ వర్ణములను తన దగ్గర ఉన్నవారికి వినబడునట్టు ఉచ్చరించుతూ జపించడం. రెండవది ఉపాంశువు: తన దగ్గరున్న వారికి మంత్రోచ్ఛారణ శబ్దాలు వినపడకుండా ఉచ్చరిస్తూ కేవలం పెదవులను మాత్రమే కదలిస్తూ జపం చేయడం. మూడు మానసికము: పెదవులను నాలుకను కదల్చకుండా మనస్సులోనే మంత్రం జపించుట.
వాచిక జపయజ్ఞముకన్నా ఉపాంశు జప యజ్ఞము వందరెట్లు అధిక ఫలాన్ని కలిగిస్తుంది. ఉపాంశు జప యజ్ఞం కంటె మానసిక జపయజ్ఞం వెయ్యిరెట్లు అధిక ఫలాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మంత్ర మహిమార్ధములను క్షుణ్ణంగా తెలుసుకుని జపించడం, సగర్భ జపం అనీ, మిక్కిలి శ్రేష్ఠమైనదనీ చెబుతున్నారు.
జపాన్ని చేసి సిద్ధి పొంది ఉచ్ఛస్థితికి వచ్చిన మహాపురుషుల యొక్క ప్రతిరోమము మంత్రాన్ని ఉచ్చరించడాన్ని మనం గమనించవచ్చును. జపం వలన కలుగు స్పందనచే సాధకుని శరీరం అంతా ఒక విధమైన దివ్య తేజస్సుతో దీప్తి నొందుతుంది. ఇట్టి స్థితిలో సాధకుని శరీరం దైవభావంతో అంతర్లీనమై ఒకవిధమైన గగుర్పాటు కలిగి అనిర్వచనీయమైన అద్భుతానందాన్ని పొందును. అతనిలో దైవ ప్రేమ పూర్తిగా నిండి ఆధ్యాత్మిక శక్తిని పొందుతుంది. మరియు అనేక ఇతర సిద్ధులను కూడా పొందుతుంది.
అలాగే జపవిధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మరీ మెల్లగా అక్షరం విడిచి అక్షరంగా జపం చేయరాదు. అలాగని వర్ణోచ్ఛారణ మిక్కిలి వేగంగాను చేయరాదు. సమాన వేగంతో ఆటంకాలు లేకుండా స్పష్టంగా ఉచ్చరించాలి. జపం చేసేటప్పుడు మనసును ఇతర భావాలనుండి మరిల్చి దైవం మీద మంత్రార్ధం మీదే ధ్యాసవుంచి ప్రశాంతంగా, ఏకాంతంగా జపించాలి.
సాధ్యమైనంతవరకు వౌనంగా ఉండాలి. శాంత స్వభావంతో ఉంటు పెద్దలను, విజ్ఞులను గౌరవించాలి. పాప కర్మలను, పాప చింతనలను పూర్తిగా విడిచి ధర్మచింతనతో, ఆధ్యాత్మిక చింతనతో గడపవలెను. సాత్విక మితాహారాన్ని భుజించాలి. సదా ఇష్ట దేవతా స్తోత్రాల పఠనం, వినడం కీర్తనం చేయాలి. దైవంనందు జపం పట్ల పరిపూర్ణ విశ్వాసం వుండడం అత్యంత ఆవశ్యకం. మానసిక జపానికి కాలనియమం లేదు. సాధకుని యొక్క అనుకూలత బట్టి ఎపుడైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు. మంత్రార్ధాన్ని, మంత్ర చైతన్యమును, యోని ముద్రను తెలసుకోకుండా ఎన్నిసార్లు జపించినా నిష్ఫలం అవుతుంది. జపోచ్ఛారణలో మంత్రం బీజాక్షరాలు లోపించకూడదు. అలాలోపిస్తే జప ఫలం ఉండదు.
బీజ లోపం లేకుండా చైతన్యం కలిగి ఉండు మంత్రాలను జపించడం వల్లనే ఫలితం. సంధ్యా సమయాల్లో అష్టోత్తరాలు, సహస్రనామాలు జపించడం ఉత్తమం. ఒక దైవనామాన్నికానీ ఒకే మంత్రాన్ని గానీ జపిచడం వల్ల ఏకాగ్రత కుదిరి జపసాధన నిర్విఘ్నంగా సాగుతుంది. Chinta gopi sharma

సలేశ్వరం- శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా. సలేశ్వరం (Saleshwaram) ఇది శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము.











సలేశ్వరం-

శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ
ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా.

సలేశ్వరం (Saleshwaram) ఇది శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము.ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రస్థలమ. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతరజరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలిపౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరం లో వుంటుంది. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు.. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలోవున్నా గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవచ్చరం లో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్షకు లు అందరు ముగ్డులు అవుతారు.

ఉనికి: –

ఇది మన రాష్ట్రంలోని మాహబూబ్ నగర్ జిల్లా లోనల్లమల అడవులలో వుంది. హైదరాబాద్– శ్రీశైలం — హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది. ఆటవీ శాఖ వారి అనుమతితో ఆ దారెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ల గానె రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది.

చరిత్ర: –

అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిధిలావస్తలో వుంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం. అంతకు ముందు దాని పేరు’ పుల్ల చెలమల’. 1973 లో ‘ప్రాజెక్ట్ టైగర్’ పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పలుల సరక్షణా కేంద్రం. నిజాంవిడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలదార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున వున్న గుట్టపైన కిలో మీటరు దూరమ్ నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టాల మధ్య లోయ లోనికి దిగాల ఆ దారిలొ ఎన్నే గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం. గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్చంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి వున్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవ మైనలింగమయ్య స్వామి లింగం వున్నది. స్థానిక చెంచులేఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడ లింగమే వున్నది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, -గంగమ్మవిగ్రహాలున్నాయి.

జాతర: –

సలేశ్వరం జాతర సంవత్సరాని కొక సారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు “వత్తన్నం వత్తన్నం లింగమయ్యో” అంటు వస్తారు. వెళ్లేటప్పుడు “పోతున్నం పోతున్నం లింగమయ్యొ” అని అరుస్తూ నడుస్తుంటారు.

చారిత్రల ఆదారాలు: –

నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలోమూస:చుళధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉన్నది. ఆ గిరిపై అనాడు [[ శ్రీ లంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులుకొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరి ఈ సలేశ్వరమే నని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టడాలు వున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16″/10″/3″ గా వున్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . “సుళ” తెలుగులో “సుల” అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరం గా ……చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విష్ణు కుండినుల క్రీ.శ.. 360 —370 కాలపు నిర్మాణాలు కూడ వున్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10′”/ 10″/3″ . దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం వున్నది. ద్వార బందంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం వున్నది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తున నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతులలలో నాలుగు ఆయుదాలు వున్నాయి. కుడి చేతిలో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో ఢమరుకం ఎడమ చేయి కిందికి వాలి ఒక ఆయుదాన్ని పట్టుకుని వున్నది. బీరభద్రుని కింద కుడి వైపున పబ్బతి పట్టు కున్న కిరీటం లేని వినాయాకుని ప్రతిమ ఉండగా ఎడమ వైపున స్త్రీమూర్తి వున్నది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలున్నాయి. ఇవే పాతవిగా కనబడుతున్నాయి. ఈ విగ్రహాల ముందు ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించె విసురు రాయి వున్నది. గుడికి ఎడమ వై పున గల అరాతి గోడకి బ్రంహీ లిపిలో ఒక శాసనం చెక్కబడి వుంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడ వున్నది. ఈ రెండూ విష్ణు కుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్ర కారులు చదివి వివరిస్తే విక్ష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించ వచ్చు. స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగా, పశ్చిమాన గల లొద్దిఅనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. పిష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బ్.ఎన్ శాస్త్రి నిరూపించారు. క్రీ.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి మల్లికార్హ్జున పండితారాద్య చరిత్ర లో శ్రీపర్వత క్షేత్ర మహాత్యంలోకూడ ఈ సలేశ్వర విశేషాలను పాల్కురి సోమనాధుడు విశేషంగా వర్ణించాడు. 17 వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన చత్రపతి శివాజి కూడ ఇక్కడ అశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర వలన తెలుస్తున్నది.

ప్రకృతి: –

సలేశ్వరం లోయ సుమారు రెండు కిలో మీటర్ల పొడవుండి మనకు అమెరికా లోని గ్రాండ్ క్యానన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కానన్ అందాలను చాలమందిమెకన్నాస్ గోల్డ్ సినిమాలో చూసి వుంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడువునా స్పష్టమైన దారులు వున్నాయి. అవి జంతువులు నీటి కోశం వెళ్లే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆది మానవులకు, ఆ తరువాత అబౌద్ద బిక్షవులకు, ఆపైన మునులకు, ఋషులకు స్థావరాలుగా వుండేవని అక్కడి ఆదారాలను బట్టి తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశొధకులకు చాల బాగ నచ్చే ప్రదేశం ఇది.

Saturday, February 24, 2018

సర్పదోషం,నాగదోషం ఎలా దోషము తొలగును? రెమెడీలు ఏమిటి?



సర్పదోషం,నాగదోషం ఎలా దోషము తొలగును? రెమెడీలు ఏమిటి?

జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.., పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు.., లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బందించినవారు.., పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు.., జన్మ జాతకమందు రాహు కేతువుల మద్య గ్రహాలు ఉన్న ,పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు. "కాల సర్పదోషం"(నాగదోషం) కలవారై ఉంటారు.

ఈ దోషం కలవారు వివాహం .., సంతానం.., కుటుంభం.., అభివృద్ధి ..,ఆరోగ్య.., విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి భాదించును.

జాతకచక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు.

జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని లగ్నంలో గాని ద్వితీయంలో గాని ఉన్న ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్ధం చేసుకోవటం, భార్య భర్తల మధ్య తగాదాలు, విడిపోవటం కూడా జరుగుతాయి.

జాతకచక్రంలో పంచమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుంది. పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం ఉంటుంది. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోతారు. ప్రేమలో మోసపోతారు.

జాతకచక్రంలో సప్తమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న బార్యా భర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి.

జాతకచక్రంలో అష్టమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడ్తం, పాము కలలు రావటం జరుగుతుంది.

"అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః
భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్"

నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి.సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.

నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు.
అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు.

దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం చేస్కోవలసి ఉంటుంది..
*నాగ దోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజా ధానదికములు చేసిన నివారణ జరుగును.

*ఆరు ముఖాలు గాని,గణేశ్ రుద్రాక్ష గాని,ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుటతో పాటు ఏనుగు వెంట్రుకల తో చేసిన రింగ్ గాని చేతికి కడియం గాని ధరించుట శుభమగును.

*ప్రతీ శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిధులల్లో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టుట,పక్షులకు ఆహారం పెట్టుట వలన కూడా నివారన కలుగును.

*నాగ ప్రతిమ(సుబ్రహ్మణ్య) 27రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము చేయట చేత నివారణ మగును.

*ప్రతీ సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన కూడా నివారణమగును.

*నవగ్రహములకు ఇరవైఒక దినములు ప్రదక్షిణలు చేయుటచేత శుభమగును.రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా నివారణ జరుగును.

*ప్రతీ ఆదివారం ఉపవాసముంటు నాగదేవతాలయం చుట్టు ప్రదక్షినలు చేస్తు లలితా సహస్రనామావలి గాని,దుర్గా సప్త శ్లోకి పఠించిన శుభమగును.

*అధిక ప్రభావం కలవారు దేవాలయమునందు సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయుట వలన పూర్తి దోష నివృత్తి అగును.

*అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపించటం వలన కూడా దోషం నివారణ అగును.

*నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయట కూడా శాంతి కలిగించును.మంగళవారం రోజు గాని,ఆదివారం రోజు గాని ఉపవాసం ఉన్న దోషం నివారణ అగును.

*రాహు కేతువులకు మూలమంత్ర జపములు తర్పనములు హోమము దానము చేయుటచేత కూడా దోష నివారణయగును.

*ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించుట అభిషేకించుట కూడా సత్ఫలితాలనిచ్చును.

*వెండి నాగ ప్రతిమ చేయించి పదకొండు దినములు మూలమంత్ర సహితముగా పూజించి బ్రాహ్మణునకు దానము చేయుట వలన కూడా దోష నివారణయగును.

*మినుములు.నువ్వులు.ఉలువలు.. ప్రతీ మంగళవారం దానము చేయుచు ఉన్న దోష నివృత్తియగును.
పైన చెప్పిన అన్ని చేయలేకపోయిన కొన్ని అయిన శ్రద్దగా చేసిన దోష నివృతి అగును. పూర్ణ మోహన్

శ్రీ దత్తాత్రేయ స్వామి ఎవరు ? తత్వం ఏమిటి?



శ్రీ దత్తాత్రేయ స్వామి ఎవరు ? తత్వం ఏమిటి?

శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది. ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.
అతని సతీమణి అనఘాదేవి. అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ.

దత్తుని రూపంలో అంతరార్థం:
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే • మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
• నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.
• ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.
• మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.
• త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.
• చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.
• డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
• కమండలము:సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.

దత్త తత్వం:
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది." దత్తా నీదయ "

దత్తా దత్తా దత్తా దీనదయాళ , దత్తా దత్తా దత్తా పరమక్రుపాళ,

పిలిచినంతనే పరుగునవచ్చి లాలించే స్మత్రుగామి మీరే మా దిక్కుమెుక్కు. పిచ్చివాడివలె కనపడుతూ నోటికోచ్చినట్లు బూతులు తిడుతూ నాకర్మలను తోలగిస్తూ, వెంటనే నవ్వుతూ కరుణకురిపిస్తూ ఆశీర్వదించే ఉన్మత్తవేషా నీవే మాదైవం.

బక్కచిక్కిన నాలుగుకుక్కలు లాగలేక లాగె చిన్నబండి.. దానిలో పిచ్చివాడివలె కనపడతావు వేగంగా బండిని లాగండని కుక్కలను కోడతుంటావు. అవునులే స్వామి, మీరు ఏదానవసంహారం చేశారని మీకు ఇంద్రాదిదేవతలు స్వర్ణరధాలు ఇస్తారు? పూలవాన కురిపిస్తారు? అయిననూ మీరు బంగారమే.

మాంసం కోట్లదగ్గర, కూర్చుని బ్రమ్హానందంలో లయమౌతూ ఉంటావు.. ఎగిరిపడ్డ మాంసపు ముక్కలను మీ దగ్గరుండే కుక్కలు తింటూ వాటిలో అవే కోట్టుకుంటుంటే ఎముకతో వాటిని తలమీద కోడుతూ వాటికి భయం చెబుతావు. ఈపిచ్చివాడు దైవమా? అవును ఆపిచ్చివాడే మా ప్రాణం, మాదైవం.

నీలో నీవుగోణుక్కుంటావు నీలో నీవే నవ్వుకుంటావు, ఎప్పుడు నవ్వుతావో ఎప్పుడు కోపంతో ఊగిపోతావో, ఎప్పుడు లాలిస్తావో, ఎప్పుడు ఏమిచేస్తావో నీకే ఎరుక. అయినా మీరే మా తోడూనీడ.

చింపిరిజుట్టు , చిరిగిన బట్టలు, చంకకిజోలె, చేత భిక్షపాత్ర, వడివడిగా పడే అడుగులు, నీవేగాన్ని అందుకోవాలని పరుగుపెట్టె కుక్కపిల్లలు, సూన్యంలోకి చూసే కన్నులు, పిశాచమావహించిన వాడిలాటి ప్రవర్తన నీ లీలలు ఎవరికి అర్థమౌతాయి? అయిననూ దత్తా నీవే మాదైవం.

చాలామంది అనుకుంటున్నారు ఎందుకా పిచ్చివాడి వెంటపడుతున్నాడు ఈపిచ్చోడు? ఆపిచ్చాడా వీడిని ఉధ్ధరించేది? ఆయనె పిచ్చోడు ఆపిచ్చోడికి వీడు కింకరుడు సేవకుడా అని. అయ్యెూ వీడు జీవితం అంతా ఖర్చు చేసుకుంటున్నాడు ఆపిచ్చోడివెంటపడుతూ.. తీరా ఆపిచ్చోడు వీడిని ఉధ్ధరించలేకపోతేనో అని. అయినా దత్తా నీవే ముక్తిదాత.

కార్తవీర్యుని కనికరించినవాడు, విష్ణుదత్తుని లాలించినవాడు, పరశురాముని దీవించినవాడు, ప్రహ్లాద, వశిష్ఠ, సమర్థరామదాస, మత్స్యేంద్రనాథులవంటి వారిని అనుగ్రహించినవాడు ఆపిచ్చివాడె.
నమ్ముకుని ఉంటే, వెంటనడుస్తుంటే, ఈపిచ్చోడిని ఆపిచ్చోడు ఏదో ఓకనాటికైనా ఓరెయ్ నీవూ నాలాగె పిచ్చోడివైపో అనకపోతాడా.. నాకు తనపిచ్చి ఎక్కించకపోతాడా?

సద్గురు చరణదాస

ప్రశ్న జ్యోతిష్యం అంటే ఏమిటి ?- ప్రశ్న ఫలించు యోగాలు ఏమిటి?



ప్రశ్న జ్యోతిష్యం అంటే ఏమిటి ?- ప్రశ్న ఫలించు యోగాలు ఏమిటి?

మానవుడి మనసే ప్రశ్నల పుట్ట. నిత్యం ఎన్నో ప్రశ్నలు వేదిస్తాయి. ఉద్యోగం వస్తుందా? పెళ్లవుతుందా? సమస్యలు తొలగిపోతాయా? ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుంది? వంటి ప్రశ్నలెన్నో మనసుల్ని తొలుస్తుంటాయి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? 'ప్రశ్న' లేనిదే జవాబు లేదు. కానీ, జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వీటికి సమాధానం చెప్పేందుకు ఉద్ధేశించిందే 'ప్రశ్న జ్యోతిష్యం'. జ్యోతిష్య శాస్త్రానికి అనుబంధంగా ఈ 'ప్రశ్న' విధానాన్ని మన మహర్షులు ఎప్పుడొ రూపొందించారు.

జ్యోతిష్యశాస్త్రం సిద్ధాంత, హోరా, సంహిత, ప్రశ్న, శకునం అను పంచస్కందాత్మకంగా వివరించబడింది. ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహముల స్ధితి ఆ ప్రశ్న గురించిన వివరాలు, ఆ ప్రశ్న భవిష్యత్తును తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది. జాతకంలోని ఒక అంశానికి సంబంధించిన సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది. ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు. ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు.

జాతకుడు ఈ జన్మలో చేసిన పుణ్య పాపముల ప్రభావాలు పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. జాతకం గత జన్మ కర్మ ఫలాలను నిర్దేశించేదైతే ప్రశ్న జ్యోతిష్యం ఈ క్షణం వరకు మనం చేసిన పుణ్య పాపాలను కూడా పరిగణలోకి తీసుకొని ఫలిత నిర్దేశం చేస్తుంది. జాతకం అనుకూలంగా ఉండి ,ప్రశ్న వ్యతిరేకంగా వస్తే ఈ జన్మలో ఎక్కువ పాపాలు చేశాడని, జాతకం వ్యతిరేకంగా ఉండి ప్రశ్న అనుకూలంగా వస్తే ఈ జన్మలో పుణ్యాలు ఎక్కువగా చేసినట్లు గుర్తించమన్నాడు.రెండు సమానంగా వస్తే పుణ్య పాపాలు సమానంగానే చేసినట్లు గుర్తించమన్నాడు. దీనిని బట్టి జాతకం పరీక్షించే ప్రతి సందర్భంలోనూ ప్రతి అంశానికి ప్రత్యేకంగా ప్రశ్నను కూడా పరీక్షించి చూడాల్సిందే.

జాతకుడు జాతక సహకారంతో పాటు, ప్రశ్నా శాస్త్రాన్ని కూడా పరిశీలించి, పరిశీలన చేయటానికి అవకాశం లేని తక్కిన అంశాలను తపశ్శక్తితో గమనించే శక్తిని సంపాదించి ప్రశ్న శాస్త్రం ద్వారా దాన్ని నిర్ధారించుకొని ఆ తరువాత ఫలితాన్ని చెప్పినట్లయితే ఎక్కువశాతం వాస్తవానికి దగ్గరగా, జాతకుడికి ఉపయుక్తమయ్యే సలహాలను జాతకుడు ఇవ్వగలడు.

చంద్రుడు లగ్నంలో శని కేంద్రంలో ఇంకా బుదుడు అస్తంగత్వం చెందిన లేక లగ్నములోని చంద్రునిపై బుధ,కుజుల దృష్టి ఉన్న జాతకుడు ప్రశ్నించు విధానం మంచిది కాదు అని అర్ధం. అనగా జాతకుని నిజాయితీలో లోపమును సూచించును. జ్యోతిష్యున్ని పరీక్షించటానికి ప్రశ్న అడిగే సూచనలు ఉన్నాయి.

ప్రశ్నించకూడని సమయాలు
నక్షత్రాలు: భరణి, కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, మఖ, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, పూర్వాభాద్ర, ఇంకా గండాంత నక్షత్రాలు (ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి చివరి పాదాలు, అశ్వని, మఖ, మూల మొదటి పాదాలు)
తిధులు: అష్టమి, విదియ, సప్తమి, ద్వాదశి, చవితి, నవమి, చతుర్దశి ఇంకా అమావాస్య.
యోగములు: వ్యతీపాత, వైదృతి యోగాలు.
కరణము: శకుని, చతుష్పాద, నాగ, కింస్తుఘ్న కరణాలు.
వారములు: మంగళ, శనివారములు.
సూర్య, చంద్ర గ్రహణముల 3 రోజులు. గుళిక లగ్నంలో ఉన్నప్పుడు, లగ్నంపై పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు, సంక్రమణ జరిగిన రోజులలో జాతకుడు జ్యోతిష్యుడిని ప్రశ్నించరాదు. పై సమయాలు జాతకుడి కంటే జ్యోతిష్యునికే గుర్తించే అవకాశాలు ఎక్కువ కాబట్టి జ్యోతిష్కుడు ఆ సమయాలలో ప్రశ్న ఫలితం చెప్పరాదు.

ప్రశ్న ఫలించు యోగాలు
పృష్టోదయ రాశులు: మేషం, వృషభం, కర్కాటకం, ధనస్సు, మకరం.
శీర్షోదయ రాశులు: మిధునం, సింహం,కన్య, తుల, వృశ్చికం, కుంభ.
ఉభయోదయ రాశులు: మీనం.
శీర్షోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే శుభం, పృష్టోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే ప్రశ్న ఫలించదు. ఉభయోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే మధ్యమ ఫలితాన్ని ఇస్తాయి.

చరరాశులు ప్రశ్న లగ్నమైతే ప్రస్తుత పరిస్ధితులలో మార్పు కనబడుతుంది. స్దిర రాశులు ప్రశ్న లగ్నమైతే మార్పు కనబడదు. ద్విస్వభావ రాశులు ప్రశ్న లగ్నమైతే ఆలస్యం, కష్టంతో ఫలితం కనిపిస్తుంది.

లగ్నాధిపతికి,కారక భావాదిపతికి సంబంధం ఉంటే ప్రశ్న ఫలిస్తుంది. లగ్నాధిపతి చంద్రుడు శుభ భావాలలో ఉండాలి. కేంద్రాలలో శుభగ్రహాలు, త్రిషడాయులలో పాప గ్రహాలు ఉండాలి. చంద్రుడు ఉపచయాలలో ఉంటే మంచిది. ప్రశ్నాచక్ర లగ్నం, జన్మ లగ్నం ఒకదానికొకటి ద్విద్వాదశాలు, షష్టాకాలలో ఉండరాదు.

ప్రశ్న చక్రంలో వక్రగ్రహం ఏ భావంలో కలదో ఆభావానికి సంబందించిన అంశములలో అడ్డంకులు కలుగుతాయి. వక్రించిన శుభగ్రహాలు 6, 8, 12 భావాలకు ఆదిపతులైతే శుభపలితం రావటం కష్టం. పాపగ్రహాలు వక్రించి 6,8,12 భావాలకు అధిపతులైతే శుభ ఫలితం రాకపోగా అడ్డంకులు ఎదురవుతాయి....

రాహు గ్రహ ఆరాధనా రహస్యాలు ఏమిటి?నివారణోపాయలు ఎలా చెయ్యాలి?



రాహు గ్రహ ఆరాధనా రహస్యాలు ఏమిటి?నివారణోపాయలు ఎలా చెయ్యాలి?
విదేశీయుల పద్దతి ప్రకారం రాహువు గ్రహం కాదు. పరాశురుడు కూడా గ్రహంగా అంగికరించలేదు.ప్రాచీనులు రాహువును ఛాయా గ్రహం అని అన్నారు. ఛాయా అనగానే ఇంకొక దానికి నీడ లేదా ప్రతిబింబము అని అర్ధం.అందుకే మన ఆర్యులు "శనివత్త్ రాహు" అని శని గ్రహానికి బదులుగా రాహువని బావించారు.రాహువును గ్రహం అనుట కంటే విధ్యుదయ స్కంతావరణ మనుట సమంజసం.అన్ని గ్రహాలు రవి వలన అస్తంగతులైతే,రవి చంద్రులను సహితం నిస్తేజులుగా చేయగల చండ ప్రచండుడు రాహువు.అందుకే ఈయన స్త్రోతంలో "చంద్రాదిత్య విమర్ధనం" అని మర్దించే శక్తీ రాహువుకు కలదని చెప్పబడింది.ప్రాణ శక్తీ కారకుడైన సూర్యుని,మనః శక్తీకి కారకుడైన చంద్రుని మర్ద్దించే శక్తీ కలదు.కావునే రాహు మహా దశః భాగులేనివారు పడే పాట్లు అన్ని ఇన్ని కావు.

పురాణాల ప్రకారం దక్షుని కూతురు సింహికకు కస్యపునికి రాహువు జన్మించాడు. పైటినసగోత్రజుడు పార్ధవా నామ సంవత్సర భద్రా పద పౌర్ణమి పూర్వభద్రా నక్షత్రామందు జన్మించాడు.మ్లేచ్చ స్వభావం కలిగినవాడు.సూర్యునికి నైరుతి దిశలో శూర్పకార మండలంలో సింహవాహునుడై,కరాళ వక్త్రంతో ఉప విష్ణుడై వుంటాడు

రాహు గ్రహ సామర్ద్యాలు

క్రోత్తదాన్ని దేన్నీయినా తెచ్చి పెట్టీ స్వభావం రాహువునిది.శరీరంలోకి ఫారిన్ మీటర్కానీ,మనుషులకు ఫారిన్ ప్రయాణం కానీ, వ్యక్తులతో పరిచయాలు కానీ,అలవాట్లతో అనుభూతులు కానీ కల్గించేవాడు రాహువు. ఈ గ్రహం గారడీ చేయిoచే శక్తి కలవాడు.అబద్ధాలు,అల్లకల్లోలాలు,క్రొత్త అలవాట్లు.క్రొత్త వేష భాషలు కల్గించడంలో సిద్దహస్త్తుడు.గ్రీకు పురాణ గాధల్లో డ్రాగన్ అనే రాకాసి బల్లి వంటి జంతువూ తలగా రాహువును,తోకగా కేతువును ప్రతికలుగ చిత్రీకరించారు.శని వాలే రాహువు కర్మ గ్రహం.పూర్వ జన్మ కర్మల్ని అతివిడ్డురంగా అనుబవింపచేయగలడు.దుర్మార్గ స్వభావం కలవారు అందలం ఎక్కడానికి సహస కార్యక్రమాలు చేపట్టి వారికీ చేయూత నివ్వడానికి,రాహువు బాగా సహకరిస్తాడు.రాహు మహా దశలో ఖచ్చితంగా పితృ కర్మలు చేయిస్తాడు.కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రాహు దశఃకానీ,అంతర్ దశః కానీ జరుగుతున్నపుడు తండ్రి, తాత,తల్లి,అమ్మమ్మలో ఒకరికి ఆయువు తీరుతుంది. రాహువుకు యోగాలు కల్గించడం ఉన్నా,అనుబవంలో అవయోగాలు ఎక్కువుగా కల్గిస్తాడు."రాహు మహా దశః పట్టిందిరా అనెడి లోకోక్తి అల్పుల అందలం ఎక్కుట వల్ల ఏర్పడిందే.ఫారిన్ భాషలు,ఫారిన్ వస్తువులు ఫారిన్ జబ్బులు తెప్పించడంలో రాహువుదే ఆగ్రాతాంబూలం

రాహువు కారకత్యాలు

రాజ్యాధికారం కల్పించుటలో ,పదవిచ్యుతుని చేయుటలో రాహువు కారకుడు
వర్ణాంతర వివాహాలు చేసుకోనటలో ప్రభావం కలవాడు.
కుట్రలు,పన్నాగాలు,ఎత్తు గడలు,కులద్రోయుట వంటి నీచ గుణాలు కల్గిస్తాడు
సాంప్రదాయాల సంస్కరణకు,మతబ్రస్థత్వాం పట్టిస్తాడు.
తక్కువ స్టితికల స్త్రీ సాంగత్యానికి పూరి కోల్పుతాడు.
సంకుచిత ఆలోచనలు కల్గిస్తాడు.
వ్యసనపరులుగా,తిరుగుభోతులుగా మర్చి దుష్ట్ట స్నేహాలను కల్గిస్తాడు.
నైరుతి దిశలో కలిగే లాభ నష్టాలకు కారకుడు
పీడ కలలు,భయదోళనలు కల్పిస్తాడు.
రహస్య స్టావరాల పనులు,రహస్య మంతనాలకు ప్రేరేపిస్తాడు
వన దుర్గ దేవి ఆరాధనతో రాహువు ప్రీతీ చెందుతాడు
ఉర్దూ,పర్షియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవడానికి కారకుడు

రాహువు కల్గించే భాదలు

స్వంత బుద్ధి లోపించి ఇతరుల చెడు సలహాలను పాటించుట
ముర్ఖునిగా ప్రవర్తించుట,అధికార దుర్వినియోగం చేసి అల్లరి పలగుట
ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల నష్టాలు,పొలిసు గూడచారి సంస్తల వల్ల భాద కలుగును
కుటుంబంలో పెద్దవారికీ ఆకస్మిక మరణాలు, పిల్లలు తప్పిపోవుట లేదా ఎత్తుకు పోవుట
కోర్టు వ్యవ`హరల్లో ఇరుక్కు పోవుట
మిలటరీ సంబంధ, బిల్డింగ్ కాంట్రాక్టు సంబంధ నష్టాలు
పాములు, తేళ్ళు,గేదెలు,విష జంతువుల వల్ల భాధలు
విష గ్యాసులు,ఆమ్లాలు,వాతావరణ కాలుష్యం వల్ల ప్రమాదాలు
నూన్యత భావం
ఎక్కడికో పారి పోదామనే మానస్చాంచల్యం
జైలు వరకు తెసుకొని వెళ్ళుట చేయిస్తాడు
చంద్రునితో కలిస్తే గొప్ప బుద్ధి చాంచల్యం కానీ పిచ్చి కానీ కల్గించవచ్చును.
కుజుని తో కలిసి చెడిపోతే ఆకస్మిక ప్రమాదాలు,దెబ్బ లాటలు,గాయాలు కల్గిస్తాడు
రవితో కలిస్తే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బ తీస్తాడు
శని రాహువుల కలయిక త్రీవ్రమైన పరిస్తితిలకు దారి తీయవచ్చును
గురునితో కలిస్తే సద్భావన ఉన్నా, తప్పని పరిస్టితిలలో తప్పులు చేయిస్తాడు
ఎంత రహస్యంగా పనులు చేసినా బహిర్ఘతం చేసి పరువు తీయిస్తాడు
రాహువు ఎంత యోగం కల్గించినా,ఎంతో కొంత అప్రతిస్ట్ట చేయకుండా ఉండలేడు

రాహువు కల్గించే రోగాలు

రాహువు వాయుతత్వ కారకుడు అవడం వల్ల మనవ శరీరంలోని సమస్త వాయు సంబంద రోగాలను కల్గిస్తాడు.నొప్పి ఎక్కడుందో అక్కడ రాహువు ఉంటాడు.,కడుపు,నాభి, మర్మాంగాల నొప్పులకు ప్రతీక.ఉచ్చ్వాస నిశ్వాసల్లోని గమన సిలత్వాన్ని కంట్రోలు చేసే శక్తీ రాహువుది.ఉరఃపంజర సంబంద రోగాలను కల్గిస్తాడు. శుక్రరాహువుల కలయికతో చర్మ సౌoధర్యన్ని దెబ్బ తీస్తాడు. సమస్త మైన అంటు వ్యాధులకు రాహువు అధిపతి. టైఫాయిడ,మలేరియా, మసూచి, ఇన్ ఫ్లూ,అనేక రకాల వైరస్ జ్వరాలకు రాహువు పెట్టింది పేరు.కన్య రాశిలో వుంటే అన్ని రకాల పురుగులను కడుపులో పెంచుతాడు. శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించి,బ్యాక్తిరియను ఆహ్వానించడంలో రాహువు మొదటి వాడు. రాహువు స్టితి బట్టి పక్షవాతం,కిళ్ళ వాతం, నడుము నొప్పి మడాల పగ్గులు కల్గుతాయి

రాహు గ్రహ నివారనోపాయలు

రాహువుకు అధిదేవత పృద్వీ అని కొందరు,గౌ గోవులని కొందరు చెప్తారు.ప్రత్యదిదేవత సర్పములు,అధిప్రత్యది దేవతా సహితంగా పునశ్చరణ చేసి దార పోయుట వలన నివారణ కల్గును
రాహువుకు అధిష్టాన దేవత దుర్గా దేవి సప్తాసతి పారాయణం కానీ మంత్రం జపం కానీ ,కవచం కానీ పునఃశ్చరణ చేయుట వలన నివారణ పొందవచ్చును
చిన్నమాస్తాదేవిని విధి విధానంగా పూజించడం వల్ల రాహు గ్రహం దుష్పరిమనాలను నివారించవచ్చును
రాహు గ్రహ దోష నివారణకు శనివారం నాడు ప్రారంబించి వరుసగా 18 దినాలు పారుతున్న నీటిలోకి రోజుకోక కొబ్బరికాయ దార పోయుట వల్ల నివారణ కల్గును
పడుకొనే ముందు గదిలో నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, తెల్ల వారు జామున లేవగానే చూచుట వల్ల రాహు గ్రహ పీడ నివారణ కల్గును

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS