Monday, February 26, 2018

శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు



శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడు.
శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా ఏలినాటి శని ప్రసన్నుడవుతాడు. అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నవగ్రహాలలో ...ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవత..
వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.

'శనీశ్వర జపం నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ
సంభూతం తమ్ నమామి శనైశ్చరం | ఓం శం శనయేనమ:||

'ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్
'ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః |

'శని గాయత్రీ మంత్రం-
'ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. |
'ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ |

"బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
'సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మేశని' |ఓం శం శనైస్కర్యయే నమః ఓం శం శనైశ్వరాయ నమః||
|ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||
కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:

| ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం!

పూర్ణ మోహన్* ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించుకొంటే కలిబాధలు, శని బాధలు, గ్రహ బాధలు పోతాయి.
కలి సంబంధ బాధలు తొలగించే శక్తీ నల చరిత్రకు ఉంది. నలచక్రవర్తి కలిప్రభావం చేత నానా ఇక్కట్లు పడ్డాడు. కానీ, తన యోక్క ధర్మ ప్రవర్తనచే ఆ బాధలను అవలీలగా అతిక్రమించాడు.
దమయంతి, కర్కోటక సర్పం, రాజర్షి రుథుపర్ణుదు మొదలగు మహాత్ర్ముల సహకారంతో కలి పెట్టిన ఇక్కట్లను సమూలంగా తొలగించుకున్నాడు.
" కర్కొటకస్య నాగస్య దమయంత్యా: నలస్య చ,
రుథుపర్ణస్య రాజర్శే: కీర్తనం కలినాశనం...
కనుక కర్కోటక, దమయంతి, నల, రుతుపర్ణ -- నామాలతో ఉన్న ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించుకొంటే కలిబాధలు, శని బాధలు, గ్రహ బాధలు పోతాయని మహాభారతంలో చెప్పబడింది.
#దోషాలు_పోగొట్టే_శనీశ్వర_క్షేత్రం...





సాధారణంగా నవగ్రహాలతో పాటు శనీశ్వరుణ్ణీ దర్శనం చేసుకుంటాం. అయితే శనికి మాత్రమే ప్రత్యేకంగా గుడులుండటం అరుదు. అలాంటి ఓ దేవాలయం హైదరాబాద్‌ మహానగరానికి అతి సమీపంలో నెలకొంది. 22 అడుగుల ఎత్తున ఉండే ఇక్కడి శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే సకల శని దోషాలూ పరిహారమవుతాయట.

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం... తొమ్మిది గ్రహాలున్నా... శనీశ్వరుడి స్థానం ప్రత్యేకం. జనం ఆయన్ను తలచుకున్నంతగా మరే గ్రహదేవతనీ తలచుకోరనిగానీ, ఇంకా చెప్పాలంటే అంతలా భయపడరనిగానీ అంటే అది అతిశయోక్తి కాబోదు. అయితే, శనీశ్వరుడు యమధర్మరాజుకి సోదరుడు. సూర్యుడికి కొడుకు. న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం ఆయన వంశంలోనే ఉందన్న మాట. శనీశ్వరుడు ఈ జన్మకు సంబంధించే కాదు పూర్వజన్మల పాప కర్మలకూ దండనను విధించే క్రతువును నిర్వహించే బాధ్యత కలిగి ఉన్నవాడు. జన్మరీత్యా మనిషికి శనిమహర్దశా కాలాలు నడుస్తున్నప్పుడు వాళ్ల వాళ్ల పాపకర్మలను బట్టి వారిని ఆరోగ్యపరంగా, మానసికంగా దండిస్తూ ఉంటాడు. అయితే శనీశ్వరుణ్ణి శరణువేడటం ద్వారా ఆ బాధల నుంచి ఉపశమనం పొందొచ్చన్నది పురాణ వచనం. మనిషి జీవిత చక్రంతో ముడివడిన ఈ శనిదేవుడికి గుళ్లు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి. వాటిలో ఒకటి రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, మదనపల్లి గ్రామ సమీపంలో పచ్చని పంటపొలాల మధ్య వెలిసిన ఘంటల శనీశ్వర ఆలయం. ఇక్కడ స్వామి 22 అడుగుల ఎత్తుతో భక్తజనానికి దర్శనమిస్తాడు.

భక్తులకు వరం...
జాతక చక్రప్రకారం బుధ, గురు, శుక్ర మహర్దశలు ఎలా వస్తాయో అలాగే శనిమహర్దశా వస్తుంది. అయితే ఆ సమయంలో శనీశ్వరుడి వల్ల కలిగే బాధలు అధికంగా ఉండేవాళ్లు ఆయన్ను శాంతింపజేయడానికి పూజలు చేస్తుంటారు.

నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్‌ నమామి శనీశ్వరం
అంటూ ఆయన్ను స్తుతిస్తారు. శనీశ్వర మంత్రాన్ని చదవడం వల్ల ఆయన శాంతిస్తాడట. అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేయడమూ శుభఫలితాన్నిస్తుందట. శనీశ్వరుడికి ఆగమశాస్త్ర బద్ధంగా ఆలయాన్ని నిర్మించేందుకు ఎ

క్కువ మంది ముందుకు రారు. నిర్మాణంలో ఏవైనా లోపాలు చోటు చేసుకొంటే శనీశ్వరుడి ఆగ్రహానికి గురికావలసి వస్తుందేమోనన్నదే కారణమై ఉండొచ్చు. అందుకే శని ఆలయాలు అతి తక్కువ చోట్ల కనిపిస్తాయి. కోయ దొర స్వామి శంకర్‌రాజుముఖియా హైదరాబాద్‌ సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శనీశ్వర ఆలయంలో దాదాపు 22 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాక్షాత్తు శనీశ్వరుడే భూలోకానికి వచ్చినట్లు తీర్చిదిద్దిన ఈ విగ్రహం కాళ్ల కింద జ్యేష్ఠాదేవి ఉంటుంది. భారతి నర్సింహస్వామి, స్వరూపానందస్వామి చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠాపనగావించారు. ఆలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరులనూ కొలువుదీర్చారు. విగ్రహం ఎత్తైనది కావడంతో తైలాభిషేకం చేయాలంటే పై అంతస్తుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వృద్ధులూ, వికలాంగులను దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అష్టదిక్పాలకులూ ఈ గుళ్లొ కొలువయ్యారు. ఈ ఆలయంలోని స్వామిని స్త్రీలు కూడా ముట్టుకోవచ్చు.

1 comment:

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS