Saturday, February 10, 2018

ధర్మ సూక్ష్మములు



1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.

2)ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి.
ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.
సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,
రెండవది పడమటగా ఉండాలి.

3)శివునికి అభిషేకం,
సూర్యునికి నమస్కారం,
విష్ణువుకి అలంకారం,
వినాయకునికి తర్పణం,
అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం .
ఇవి చేస్తే మంచి జరుగుతుంది.

4)ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.

5)దీపమును నోటితో ఆర్పరాదు.
ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు.
దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.

6)దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.

7)దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు.
ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.

8)పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.

9)యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు.
మరియు
ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు.
లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని, విగ్రహంగాని ఉండాలి.
నిలబడి ఉన్నది వాడరాదు.

10)శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.

11)ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.

12)తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

13)తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి)
తీర్దయాత్రలందు,
పున్యక్షేత్రములందు,
దేవాలయములందు,
మార్గమునందు,
వివాహమునండు,
సభలందు,
పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.

14)ఆదివారం సూర్యుని ఆలయం,
సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం,
మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,
బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు,
గురువారం దక్షణామూర్తి స్వామి , దత్తాత్రేయ స్వామి మొదలగు గురువుల ఆలయాలు,
శుక్రవారం అమ్మవారి ఆలయాలు,
శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు
మరియు
గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.

15)ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి.
శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి.
అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి.
మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.

16)నవ విధ భక్తి మార్గములు:
శ్రవణం (వినటం),
కీర్తనం(పాడటం),
స్మరణము(మనసులో జపించుట),
పాద సేవనము,
అర్చన(పూజ),
నమస్కారము,
దాస్యము(సేవ),
సఖ్యము,
ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట)
వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.

17)జపములు మూడు రకములు.అవి:
వాచకజపము:
అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది.
ఉపామ్సుజపం:
ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది.
మానసజపం:
ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది.
అన్ని జపాలలో కెల్లా
మానసజపం ఉత్తమం,
వాచకజపం సామాన్యం,
ఉపంసుజపం మధ్యమం.

18)స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.

19)ప్రదక్షిణాలు:
వినాయకుని ఒకటి,
ఈశ్వరునికి మూడు,
అమ్మవార్లకు నాలుగు,
విష్ణు మూర్తికి నాలుగు,
మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS