Saturday, February 24, 2018

శ్రీ దత్తాత్రేయ స్వామి ఎవరు ? తత్వం ఏమిటి?



శ్రీ దత్తాత్రేయ స్వామి ఎవరు ? తత్వం ఏమిటి?

శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది. ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.
అతని సతీమణి అనఘాదేవి. అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ.

దత్తుని రూపంలో అంతరార్థం:
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే • మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
• నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.
• ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.
• మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.
• త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.
• చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.
• డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
• కమండలము:సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.

దత్త తత్వం:
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది." దత్తా నీదయ "

దత్తా దత్తా దత్తా దీనదయాళ , దత్తా దత్తా దత్తా పరమక్రుపాళ,

పిలిచినంతనే పరుగునవచ్చి లాలించే స్మత్రుగామి మీరే మా దిక్కుమెుక్కు. పిచ్చివాడివలె కనపడుతూ నోటికోచ్చినట్లు బూతులు తిడుతూ నాకర్మలను తోలగిస్తూ, వెంటనే నవ్వుతూ కరుణకురిపిస్తూ ఆశీర్వదించే ఉన్మత్తవేషా నీవే మాదైవం.

బక్కచిక్కిన నాలుగుకుక్కలు లాగలేక లాగె చిన్నబండి.. దానిలో పిచ్చివాడివలె కనపడతావు వేగంగా బండిని లాగండని కుక్కలను కోడతుంటావు. అవునులే స్వామి, మీరు ఏదానవసంహారం చేశారని మీకు ఇంద్రాదిదేవతలు స్వర్ణరధాలు ఇస్తారు? పూలవాన కురిపిస్తారు? అయిననూ మీరు బంగారమే.

మాంసం కోట్లదగ్గర, కూర్చుని బ్రమ్హానందంలో లయమౌతూ ఉంటావు.. ఎగిరిపడ్డ మాంసపు ముక్కలను మీ దగ్గరుండే కుక్కలు తింటూ వాటిలో అవే కోట్టుకుంటుంటే ఎముకతో వాటిని తలమీద కోడుతూ వాటికి భయం చెబుతావు. ఈపిచ్చివాడు దైవమా? అవును ఆపిచ్చివాడే మా ప్రాణం, మాదైవం.

నీలో నీవుగోణుక్కుంటావు నీలో నీవే నవ్వుకుంటావు, ఎప్పుడు నవ్వుతావో ఎప్పుడు కోపంతో ఊగిపోతావో, ఎప్పుడు లాలిస్తావో, ఎప్పుడు ఏమిచేస్తావో నీకే ఎరుక. అయినా మీరే మా తోడూనీడ.

చింపిరిజుట్టు , చిరిగిన బట్టలు, చంకకిజోలె, చేత భిక్షపాత్ర, వడివడిగా పడే అడుగులు, నీవేగాన్ని అందుకోవాలని పరుగుపెట్టె కుక్కపిల్లలు, సూన్యంలోకి చూసే కన్నులు, పిశాచమావహించిన వాడిలాటి ప్రవర్తన నీ లీలలు ఎవరికి అర్థమౌతాయి? అయిననూ దత్తా నీవే మాదైవం.

చాలామంది అనుకుంటున్నారు ఎందుకా పిచ్చివాడి వెంటపడుతున్నాడు ఈపిచ్చోడు? ఆపిచ్చాడా వీడిని ఉధ్ధరించేది? ఆయనె పిచ్చోడు ఆపిచ్చోడికి వీడు కింకరుడు సేవకుడా అని. అయ్యెూ వీడు జీవితం అంతా ఖర్చు చేసుకుంటున్నాడు ఆపిచ్చోడివెంటపడుతూ.. తీరా ఆపిచ్చోడు వీడిని ఉధ్ధరించలేకపోతేనో అని. అయినా దత్తా నీవే ముక్తిదాత.

కార్తవీర్యుని కనికరించినవాడు, విష్ణుదత్తుని లాలించినవాడు, పరశురాముని దీవించినవాడు, ప్రహ్లాద, వశిష్ఠ, సమర్థరామదాస, మత్స్యేంద్రనాథులవంటి వారిని అనుగ్రహించినవాడు ఆపిచ్చివాడె.
నమ్ముకుని ఉంటే, వెంటనడుస్తుంటే, ఈపిచ్చోడిని ఆపిచ్చోడు ఏదో ఓకనాటికైనా ఓరెయ్ నీవూ నాలాగె పిచ్చోడివైపో అనకపోతాడా.. నాకు తనపిచ్చి ఎక్కించకపోతాడా?

సద్గురు చరణదాస

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS