Wednesday, December 30, 2020
Saturday, December 26, 2020
Friday, December 25, 2020
సగం పక్షి, సగం సింహంఉండే రూపమే శరభ... ఇది మహాశివుని అవతారం.
సగం పక్షి, సగం సింహం.ఉండే రూపమే శరభ.. ఇది మహాశివుని అవతారం.
విష్ణుమూర్తి దశావతారాల గురించి చాలామంది టకటకా చెప్పేస్తారు. కానీ మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మన అవగాహన తక్కువే. అలాంటి శివుని అవతారాలలో ఒక్కటే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే రూపమే శరభ! దక్షిణాది ఆలయాలలో ఎక్కువగా కనిపించే ఈ రూపం వెనుక ఓ ఘనమైన కథ ఉంది.
విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే! అయితే హిరణ్యకశిపుని సంహారం తరువాత కూడా ఆయన కోపం చల్లారనే లేదట. ఆ ఉగ్రనారసింహుని క్రోధానికి లోకమంతా అల్లకల్లోలమైపోయింది. నరసింహుని నిలువరించకపోతే ఆయన కోపానికి ప్రకృతి సర్వనాశనం కాక తప్పదని భయపడ్డారు దేవతలు. అందుకోసం నరసింహుని నిలువరించమంటూ వారంతా కలిసి శివుని ప్రార్థించారట. అప్పుడు శివుడు తన అవతారాలైన వీరభద్ర, భైరవులని పంపాడట. కానీ నారసింహుని ముందు ఆ రెండు అవతారాలూ నిలువలేకపోవడంతో శరభ అవతారాన్ని ధరించాడు శివుడు.
కొన్ని పురాణాల ప్రకారం శరభ, నరసింహ అవతారాల మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో నరసింహుడు ఓడిపోయాడు కూడా. మరి కొన్ని పురాణాల ప్రకారం శరభ అవతారాన్ని ఎదుర్కొనేందుకు విష్ణుమూర్తి గండభేరుండ పక్షిగా అవతరించాడు. రెండు తలలతో ఉండే ఈ పక్షి శరభని దీటుగా ఎదుర్కొంటుంది. ఎంతసేపు యుద్ధం జరిగినా గెలుపు ఓటములు తేలకపోవడంతో, రెండు అవతారాలూ యుద్ధాన్ని విరమించుకుంటాయి. ఎవరి మధ్య యుద్ధం జరిగినా, ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా శివకేశవులు ఇరువురూ ఒక్కటే కాబట్టి శరభను విష్ణుమాయగా వర్ణించేవారు కూడా లేకపోలేదు. కేవలం శివకేశవుల పురాణాలలోనే కాదు, బుద్ధుని జాతక కథలలో కూడా ఈ శరభ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ జాతక కథల ప్రకారం శరభ బుద్ధుని పూర్వ అవతారాలలో ఒకటి!
శరభ రూపం దక్షిణాదిన, అందునా తమిళనాట ఉన్న శివాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా శైవ మతాన్ని ప్రోత్సహించిన చోళులు నిర్మించిన ఆలయాలలో ఈ ప్రతిమ తప్పక ఉంటుంది. ఒకో చోట ఈ శరభ రూపం కేవలం నామమాత్రంగానే ఉంటే, మరికొన్ని చోట్ల సకల ఆయుధాలతోనూ, దుర్గాదేవి సమేతంగా దర్శనమిస్తుంది. శివుని శరభేశ్వరునిగానో, శరభేశ్వరమూర్తిగానో కొలుచుకునే సంప్రదాయం తమిళనాట ఇంకా ప్రచారంలోనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలలో కూడా ఈ రూపం కనిపిస్తున్నప్పటికీ, దానిని శరభ అవతారంగా పోల్చుకునే భక్తులు అరుదు. అలాగని శరభ అవతారాన్ని తెలుగువారు గుర్తిచలేదని కాదు. ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాంతాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి. వీరశైవులు చేసే నృత్యాలలో శరభ, అశ్శరభ, దశ్శరభ అంటూ ఒళ్లు గగుర్పొడిచే అరుపులు వినిపిస్తాయి. తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ప్రచారంలో ఉండేదని చెబుతారు.
ఉత్తరావృత శంఖం, ఉత్తరావృత శంఖం విశేషాలు పాంచజన్యం ఉత్తరావృత శంఖం
ఉత్తరావృత శంఖం, ఉత్తరావృత శంఖం విశేషాలు
పాంచజన్యం ఉత్తరావృత శంఖం
భగవాన్ శ్రీకృష్ణపరమాత్ముడి శంఖం పాంచజన్యం. ఆయన ఈ శంఖాన్ని కురుక్షేత్ర యుద్ధంలో పూరించేవాడు. వసుదేవుడు బలరామ , కృష్ణులకు గర్గాచార్యుడనే పురోహితుడి ద్వారా ఉపనయనం చేయించాడు. అనంతరం ఆచార్యులు వారికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బలరామ కృష్ణులను సాందీప మహాముని ఆశ్రమానికి తీసుకువెళతారు. ఆ ఆశ్రమంలో అన్ని విద్యలను ఆచార్యుల వారు వారికి బోధించారు. ఈ ఆశ్రమంలోనే కుచేలుడు కృష్ణునికి స్నేహితుడిగా పరిచయమవుతాడు.
కొంతకాలం అనంతరం శిక్షణ ముగియడంతో బలరాముడు , కృష్ణుడు ఆచార్యులకు ప్రణమిల్లి గురుదక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించమని కోరతారు. వీరు సామాన్యులు కాదని వైకంఠం నుంచి భువిపై అవతరించిన వారని తన దివ్యజ్ఞానంతో సాందీపుడు తెలుసుకొంటాడు. తన మరణించిన కుమారుడిని తిరిగి బతికించమని కోరతాడు. గురుపత్ని శోకాన్ని నివారించినట్టు అవుతుందని వారికి సూచిస్తాడు.
గురుకుమారుడు కొంతకాలం క్రితం సముద్రస్నానం చేస్తూ భారీ అల రావడంతో కడలిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ సముద్రతీరానికి వెళ్లిన బలరామ కృష్ణులు గురుకుమారుడిని తిరిగివ్వమని సాగరుణ్ని కోరారు. సాక్షాత్తు నారాయణుడే తన దగ్గరకు రావడంతో సముద్రుడు వారికి వినమ్రంగా నమస్కరించి ‘గురుపుత్రుడిని మింగింది పంచజనుడనే రాక్షసుడనీ , కడలి గర్భంలో దాగి వున్నాడనీ’ వెల్లడిస్తాడు. దీంతో వారు సముద్రంలోపలికి వెళ్లి పంచజనుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. అనంతరం అతని కడుపును చీల్చిచూడగా గురు కుమారుడు కనిపించడు. ఒక శంఖువు మాత్రమే కనిపిస్తుంది. శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. గురుకుమారుడు నరకంలో వున్నాడని గ్రహించిన వారు అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఆ శంఖువును పూరిస్తాడు కృష్ణుడు. ఆ శబ్దానికిభీతిల్లిన యమధర్మరాజు అక్కడకు చేరుకొని ఇద్దరినీ తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేసి ఎందుకొచ్చారో తెలుసుకుంటాడు. భగవంతుని ఆజ్ఞ కావడంతో వెంటనే సాందీపుని కుమారుడిని వారితో పంపిస్తాడు. మునికుమారుడిని వెంటబెట్టుకొని ఆశ్రమానికి చేరుకుంటారు. మృతుడైన తమ కుమారుడు తిరిగి రావడంతో సాందీప దంపతులు ఎంతో సంతోషిస్తారు. పంచజనుడి నుంచి తీసుకున్న శంఖం కనుకనే దానికి పాంచజన్యం అని పేరొచ్చింది.
#శంఖం ప్రాముఖ్యత
దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. ఉత్తరావృత శంఖానికి ఎడమప్రక్క ఆవృతం(కడుపు) ఉంటుంది. శంఖాన్ని తూర్పుదిక్కుకి పట్టుకున్నప్పుడు ఉత్తరం వైపు ఆవృతం ఉంటుంది.
కాబట్టి ఈ శంఖాన్ని ఉత్తరావృత శంఖం అంటారు. విజయానికి సంకేతంగా శంఖాన్ని పూరిస్తారు. శంఖ ధ్వని విజయానికి , సమృద్ధికి, సుఖానికి , కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక.
ఉత్తరావృత శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు.
ఉత్తరావృత శంఖాన్ని ఊదటం కేవలం ఆద్యాత్మికపరమైన ప్రయోజనాలే కాకుండా శాస్త్రీయ మరియు ఆయుర్వేద ప్రయోజనాలు కూడా ఉంది. శంఖాన్ని ఊదినప్పుడు స్వచ్చమైన గాలి ఊపిరితిత్తులకు చేరుతుంది. మలినాలతో కూడిన గాలి బయటకు వస్తుంది. ఉత్తరావృత శంఖాన్ని ఊదటం వలన ఊపిరితిత్తుల వ్యాదులు నశించటమే కాకుండా ప్రేగులకు సంబందించిన వ్యాదులు నివారణవుతాయి. ఎవరికైనా మాటలు తడబడటం , నత్తి , గొంతు సంబంద సమస్యలు ఉన్నవారు ఉత్తరావృత శంఖాన్ని పూరించిన , ఉత్తరావృత శంఖ ద్వని విన్న గొంతు సంబంద వ్యాదులు నివారణవుతాయి. ఆస్తమా ఉన్నవారు క్రమం తప్పకుండా ఉత్తరావృత శంఖాన్ని పూరించినట్లైతే వ్యాది నుండి నివారింపబడతారు.
శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం ఉత్తరావృత శంఖ ధ్వని వల్ల వాతావరణంలో హాని చేసే కీటకముల నాశనం జరుగుతుందని - అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. జర్మన్ శాస్త్రవేత్తల ప్రయోగాల పలితంగా ధైరాయిడ్ , హార్మోన్ లోపాల వంటి వ్యాదులు నివారింపబడతాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు.
ఆశ్చర్యకరంగా కొన్ని ప్రాంతాలలో శంఖాన్ని పూరించినప్పుడు వెలువడే శబ్ధ కెరటాలు పరిసరాల్లో నివసించే ప్రజలకు ప్లేగు , కలరా వంటి వ్యాదులు ప్రబలవని నమ్ముతారు. ఉత్తరావృత శంఖాన్ని పూరించిన ఇంటిలో గాని , వ్యాపారసంస్ధలలో గాని నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉత్తరావృత శంఖాన్ని పూజ మందిరంలో గాని , ఇంటికి ఉత్తర దిక్కున గాని ఉంచిన సమస్త వాస్తు దోషాలు నశిస్తాయి.
వివాహాలు కుదిర్చేటప్పుడు పొంతన చూస్తారు వరుడిది , వధువుది , జాతకపరిశీలనలో కుజదోషం అమ్మాయిలో ఉందనో , లేక అబ్బాయిలో ఉందో చెప్పడం వలన ఆ సంబంధాన్ని కుదుర్చుకోరు ,
వివాహాలు కుదిర్చేటప్పుడు పొంతన చూస్తారు వరుడిది , వధువుది , జాతకపరిశీలనలో కుజదోషం అమ్మాయిలో ఉందనో , లేక అబ్బాయిలో ఉందో చెప్పడం వలన ఆ సంబంధాన్ని కుదుర్చుకోరు , కొన్ని అనంతకాల సర్పదోషం ఉంది అనో , సప్తమస్థానానికి రాహుదోషం పట్టింది లేదా లగ్నములోనె రాహువు ఉన్నాడనో లేదా మాంగల్యస్థానంలో రాహువు ఉన్నాడనో, ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు చెడిపోతుంటాయి . నిశ్చితార్థం అయిన తరువాత కూడా కొన్ని చిన్న చిన్న కారణాలతో అపశకునముల వలన పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. వివాహాలు అయిన తరువాత కొంత కాలానికే విడిపోయే సంఘటనలు ఏర్పడుతాయి. ప్రేమ వివాహాలు కూడా జరగక వేరే వేరే వ్యక్తులను వివాహం చేసుకోవాల్సి వస్తుంది.... ఇలాంటి వాటికి తగిన పరిష్కారాం ...
యక్షిణి కుందెళ్ళు:-
ఏ ఇంట్లో అయితే వివాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆ ఇంట్లో ఒక మగ , ఆడ కుందేలును స్వచ్చమైన తెల్లగా ఉన్న కుందేలును తీసుకుని వచ్చి ఆ రెండింటికీ వివాహం చేస్తారు ఇది కేరళ తంత్రం . పెళ్లి చేసిన తర్వాత ఆ కుందేలును ఆ ఇంటివారికి ఇస్తారు . కుజదోషం ఉంటే ఎర్రని పదార్థాలు ఆ కుందేలుకు ఆహారంగా పెట్టాలి. రాహు కేతువుల దోషం ఉంటే భూమిలో నుంచి వచ్చే దుంపలను ఆహారం పెట్టండి. శుక్రదోషం ఉంటే తెల్లని పదార్థాలు, తీపి పదార్థాలు ఎక్కువగా వేయాలి. బుధగ్రహదోషం ఉంటే ఆకుపచ్చని గడ్డి లేదా పెసలను నానబెట్టి ఆహారంగా వెసి పెంచమని చెబుతారు. ఇలా చేయడం వల్ల మూడు నెలల కాలంలోనే వివాహం కుదిరి సంతోషంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు . అనతి కాలంలోనే చక్కని సంతానం కలుగుతుంది.యక్షిణీ కుందేలు దొరకని వారు అటువంటి కుందేలు బొమ్మలను రెండింటినీ తీసుకుని వచ్చి బొమ్మల పెళ్ళి చేయవచ్చు. నల్ల ఇరుగుడు చెక్కతో గానీ , ఎర్రచందనం చెక్క తో గాని చేసినటువంటి బొమ్మలకు వివాహం చేసి ఆ ఇంట్లో పెడితే శుభకార్యాలు జరుగుతాయి. ఇది కేరళలో ఉన్న చాలా పురాతనమైన తంత్ర ప్రక్రియ.
మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి...
మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి...
1. అర్ధ దోషం
2. నిమిత్త దోషం
3. స్ధాన దోషం
4. గుణ దోషం
5. సంస్కార దోషం.
ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు
🔸 అర్ధ దోషం
ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు
భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది.
హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.
తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు
తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు
వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు.
శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు.
ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం
🔸 నిమిత్త దోషం
మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి
వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు.
అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి
భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు
అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది
ఆమె ఆలోచనలు *గ్రహించిన భీష్ముడు
'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను.
నా స్వీయ బుధ్ధిని ఆ *ఆహారం తుడిచి పెట్టింది. *శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను
నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు
చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది
🔸 స్ధాన దోషం
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటకూడా పాడైపోతుంది
యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు.
దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి, అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు
మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి
🔸 గుణ దోషం
మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది
🔸 సంస్కారదోషం
ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది
మహాభారతం తరువాత ఇక ఏ కథలోనూ దివ్యాస్త్రాల ప్రస్తావన రాలేదేమిటి..?
మహాభారతం తరువాత ఇక ఏ కథలోనూ దివ్యాస్త్రాల ప్రస్తావన రాలేదేమిటి..? ఆ పరిజ్ఞానం తరువాత కాలానికి సంబంధించిన కథానాయకులకు ఎందుకు లేకుండాపోయింది..? కురుక్షేత్రం తరువాత ఈ దివ్యాస్త్రాలు ఏమయ్యాయి..? ఇంట్రస్టింగు ప్రశ్న కదా… అప్పుడప్పుడూ ఈ అంశంపై కూడా నెట్‌లో కొన్ని చర్చలు, వ్యాఖ్యలు కనిపిస్తుంటాయి… ఓసారి పరిశీలిద్దాం… దివ్యాస్త్రాలు అంటే నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, గరుడాస్త్రం, సమ్మోహనాస్త్రం, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం… ఇలాంటివి…
కురుక్షేత్ర కాలానికే ధర్మం క్షీణదశకు చేరుకుంది… ఆ ద్వాపర యుగం దాటి ఇక కలియుగం ప్రారంభమైతే ఇంకా ధర్మం ఒంటికాలితో కుంటక తప్పదని కృష్ణుడి భావన… ధర్మ పరిరక్షణ పేరుతోనే కురుక్షేత్ర సమరం జరిపించినా సరే, ఒక్కసారి కలియుగం ఆరంభమైతే ఇక ధర్మక్షీణత అనివార్యమని తనకూ తెలుసు… మనుషుల్లో కక్షలు, కార్పణ్యాలు పెరుగుతాయి… విచక్షణ, సంయమనం మరింత అదుపు తప్పుతాయి… అందుకని దివ్యాస్త్రాలు కలియుగంలోకి ప్రవేశించొద్దు అనేది కృష్ణుడి నిర్ణయం… ఓసారి ఆ దివ్యాస్త్రాల పరిజ్ఞానం ఎవరెవరికి ఉన్నదో, ఎవరి ద్వారా అవి కలియుగంలోకి కూడా వచ్చే అవకాశాలున్నాయో పరిశీలిస్తాడు…
1) కృష్ణుడు… అంటే తనే… తను ఎలాగూ కలియుగంలోకి రాడు… అప్పటికే అవతారం చాలిస్తాడు…
2) అర్జునుడు… తన జీవనం చివరి అంకంలో స్వర్గం వైపు సాగే మహాప్రస్థానంలో ఏ హిమాలయ పర్వతంపైనో రాలిపోతాడు… ఆ భవిష్యత్తు కృష్ణుడికీ తెలుసు…
3) అభిమన్యుడు…అర్జునుడి ద్వారాా కొన్ని దివ్యాస్త్రాల పరిజ్ఞానం నేర్చుకున్నాడు సరే, కానీ కురుక్షేత్రంలోనే కుట్రవ్యూహాలకు హతుడైపోయాడు…
4) భీష్ముడు… ప్రతి దివ్యాస్త్రం మీద పట్టు ఉన్న యోధుడు… కురుక్షేత్రంలోనే, అంపశయ్యపై వేచీ వేచీ, చివరకు ప్రాణాలొదిలాడు…
5) ద్రోణుడు… దృష్టద్యుమ్నుడి చేతలో శిరోఖండనానికి గురై, కురుక్షేత్ర సమరంలోనే ప్రాణాలు వదిలేశాడు…
6) అశ్వత్థామ… తండ్రి ద్వారా అన్నిరకాల దివ్యాస్త్రాల జ్ఙానాన్ని సంపాదిస్తాడు… కానీ పాండవులు అనుకుని, కురుక్షేత్రం చివరిరోజు ఉపపాండవులను సంహరించి, ఆ దివ్యస్త్ర పరిజ్ఞానాన్ని మరిచిపోయే శాపం కృష్ణుడి నుంచి పొందుతాడు… పిచ్చివాడై ఏ అడవుల్లో పడి ఎలా బతికాడో ఎవరికీ తెలియదు…
7) పరుశురాముడు… తను యోగనిద్రలోకి వెళ్లిపోతాడు… ఈ ప్రాపంచిక ధ్యాస నుంచే దూరమవుతాడు… ద్వాపర యుగం అనంతరం ఈయన ప్రస్తావన మరే పురాణంలోనూ కనిపించదు…
8) సాత్యకి… యాదవులు పరస్పరం సంఘర్షించుకుని, అందరూ మరణిస్తారు… అందులో సాత్యకి కూడా… ఏ ఇతర యాదవ వీరుడికీ ఈ విద్య తెలియదు…
9) కర్ణుడు… పరుశురాముడి నుంచి దివ్యాస్త్రాల పరిజ్ఞానం పొందినవాడే… కానీ కురుక్షేత్రంలో మరణించాడు… తను ఎవరికీ తన విద్యను బోధించలేదు…
10) దృష్టద్యుమ్నుడు… తనకు కొన్ని దివ్యాస్త్రాలు తెలుసు… కానీ కురుక్షేత్రం చివరిరోజున అశ్వత్థామ చేతుల్లో హతుడైపోయాడు…
11) ధృతరాష్ట్రుడు… తను ఏ యుద్ధంలోనూ పోరాడకపోయినా తను దివ్యాస్త్రాల పరిజ్ఞానం కలిగిన వాడే,.. కురుక్షేత్రం తరువాత సన్యాసాశ్రమం తీసుకుని, అడవుల్లో నివసిస్తాడు… ఓరోజు దావానలం చుట్టుముట్టి ఆ మంటల్లోనే పడి మరణిస్తాడు…
12) బర్బరీకుడు… ఘటోత్కచుడి కొడుకు… దివ్యాస్త్ర సంపన్నుడు… అంతులేని గందరగోళంలోకి నెట్టేసి, కృష్ణుడు ఈ పాత్రను కురుక్షేత్రానికి ముందే ముగించేస్తాడు…
13) బభ్రువాహనుడు… అర్జునుడి చిత్రాంగద వల్ల పుట్టిన కొడుకు… అర్జునుడిని మించిన యోధుడు…
14) పరీక్షిత్తు… అభిమన్యుడి కొడుకు… అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం దెబ్బకు తల్లి గర్భంలోనే మరణిస్తే, కృష్ణుడు బతికిస్తాడు,,, తనే ధర్మరాజు అనంతరం అఖండ ఆర్యావర్తానికి చక్రవర్తి అవుతాడు…
15) వృషకేతు… కర్ణుడి చిన్నకొడుకు… కురుక్షేత్రం అనంతరం అర్జునుడు అమితంగా ప్రేమిస్తాడు ఇతన్ని… అన్నిరకాల విద్యలూ నేర్పిస్తాడు…
అంటే… ఈ చివరి ముగ్గురూ మిగిలారు… ఈ ముగ్గురూ ద్వాపర యుగం అనంతరం కలియుగంలోకి ప్రవేశించే పాత్రలు… అందుకని కృష్ణుడు వేర్వేరు సందర్భాలలో ఆ ముగ్గురి నుంచీ మాట తీసుకుంటాడు… ఎవరికీ ఈ విద్యల్ని నేర్పించవద్దు అని… దానికి కట్టుబడి ఉంటారు… ఇక వారి తరువాత ఎవరికీ ఆ విద్య దక్కలేదు… ఆ పరంపర వారితోనే ఆగిపోయింది… తమ వారసులకు కూడా ఆ విద్యను బోధించలేదు… వారితోనే దివ్యాస్త్రాల కథ ముగిసిపోయింది…
రాహు,కేతు పూజకై, శ్రీ కాళహస్తి...
రాహు,కేతు పూజకై, శ్రీ కాళహస్తి...
శ్రీకాళహస్తి లోని గుడికి రాహు కేతువుల గ్రహణ సమయం కాలంలో పూజలు జరుగుటకు గల ఆంతర్యము
ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తూర్పు దిశ యందు కూర్చుండి పశ్చిమము చూస్తూ ఉంటారు
మనము గమనించ దగ్గ విశేషం.
అలాగే పడమర లో అమ్మవారు కూర్చొని తూర్పు లో ఉన్న ఈశ్వరుని చూడడం గమనించగలము. (ఆది అంతము)( ప్రకృతి పురుషుడు) ఒకరి కొకరు ఎదురెదురుగా ఉండటము .
ఈ విషయమును మరొక విధముగా చెప్పదలచుకుంటే రాశి చక్రమూలో రాహువు కేతువు లు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు.
ఈ దేవాలయములో పరమేశ్వరుని శిరముపై పంచ తలలు కేతు గాను . అమ్మవారు ఏక సిర రాహు గాను పరిగణించ వలెను.
ఈ దేవాలయంలో రాహుకాలంలో రాహు కేతువుల పూజ ప్రశస్తము అయితే ప్రతి రోజు రాహుకాలము వచ్చును. కానీ ఆ సమయంలో స్వామివారిని దర్శించుకున్న స్వామి వారి తల పై పంచ నాగులు కేతువు దర్శనము కనపడును. అయితే రాహు గా అమ్మవారిని పరిగణించినపుడు సోమవారము నాడు శుక్రవారం మాత్రమే అమ్మవారికి నడుమునకు అలంకరించ్చే వడ్రాణం రూపంలో రాహు కనబడును . అమ్మవారికి శుక్రవారం రోజున వజ్రాల కిరీటం నడుమునకు ఒక తల నాగుపాము వడ్రాణం గాను బంగారము తో తయారు చేసిన చీర తో అలంకరింపబడును.
కనుక శ్రీకాళహస్తి లో సోమవారం శుక్రవారం రాహుకాల సమయంలో మాత్రమే .
ఈ విషయమును గమనించి రాహు కేతువుల దోషనిమిత్తము సోమవారం శుక్రవారం రాహుకాలంలో ప్రశస్తమని గమనించగలరు.
మహిళలు ధరించే ఆభరణాల గురించి వేరే చెప్పక్కర్లేదు.
మహిళలు ధరించే ఆభరణాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒక్కో ఆభరణం వెనుక ఒక్కో ప్రయోజనం దాగి వుంటుంది. అలాగే ముక్కుపుడక వెనుక కూడా సైంటిఫిక్ ప్రయోజనాలున్నాయి.
ముఖ్యంగా మహిళల పునరుత్పత్తి అవయవాలతో సంబంధం కలిగి ఉన్న ఎడమ ముక్కు భాగంలోని నరాలను శాంతపరచే క్రమంలో భాగంగా మహిళలు ముక్కు పుడకలను ధరిస్తారని చెప్పబడింది. అలాంటి ఈ ధారణ మహిళ ప్రసవ సమయంలో ఎంతో మేలు చేకూర్చుతుందట. అంతేకాదు, మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే బహిష్టు నొప్పిని కూడా ఇది నిరోధిస్తుందట.
పూర్వ విశ్వాసాల ప్రకారం భార్య తన ముక్కు ద్వారా వదిలే శ్వాస భర్త ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట. అందువల్ల మహిళ ముక్కుపుడకను ధరిస్తే ఆ గాలి స్వచ్చంగా మారి ఎటువంటి చెడు అనారోగ్య ప్రభావాలను కలిగించదట
ముక్కుపుడక బంగారంతో చేస్తారు కనుక ఆ లోహానికి అలాంటి గుణం ఉన్నది.
👆 ఇది నాడీ దోషానికి సంబంధించిన విశేషాలను కొంతవరకూ నిరోధిస్తుంది.
నాడీ దోషము అంటే మనం చూసే అష్ట కూటముల లో ఒకటిగా ఉండి 8 పాయింట్లు ఇచ్చే విషయం
నాడీ దోషము నుండి వివాహం జరిగి పోయిన వారు దయచేసి ఈ ముక్కును కుట్టించుకున్న చో ఆ దోషం కి కొంత తెరిపి రావచ్చు.
శివుని అష్టమూర్తులు
ఏఫ్రియల్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు
ప్రకాశం జిల్లా* *త్రిపురాంతకం* *బాల త్రిపుర సుందరి దేవి
హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత
శ్రీ అచలేశ్వర్ మహాదేవ్-ధోల్పూర్-రాజస్థాన్
_నిజామాబాద్ , కామా రెడ్డి జిల్లా , రామారెడ్డి పల్లి , ఇసన్నపల్లిలో కాలభైరవుడు_
*_నిజామాబాద్ , కామా రెడ్డి జిల్లా , రామారెడ్డి పల్లి , ఇసన్నపల్లిలో కాలభైరవుడు_*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఇక్కడ కాలభైరవున్ని పూజిస్తే సకల గ్రహదోషాలు , అపమృత్యుదోషాలు తొలగిపోతాయి.
సాక్షాత్ పరమశివుడే కొలువైన క్షేత్రం కాశీ క్షేత్రం. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుడి మానస పుత్రుడే ఈ కాలభైరవుడు. బ్రహ్మణే సంహరించిన శక్తి శాలీ. దుష్టశక్తులకు సింహ స్వప్నం. మనసారా నమ్మినవారికి కొంగుబారాన్ని అందించే కాలభైరవుడు.
శరణు భైరవయ్యా అని పిలిస్తే నేనున్నానంటూ అభయమిచ్చే నిలువెత్తు కాలభైరవ స్వామి నిజామాబాద్ కామా రెడ్డి జిల్లా , రామారెడ్డి పల్లి , ఇసన్నపల్లిలో 8 అడుగుల కాలభైరవ స్వామి మూల విగ్రహం కనిపిస్తుంది.
ఆదిశంకరాచార్యులచే స్తుతించబడిన కాలభైరవుడు ఉత్తర ప్రదేశ్ లోని కాశీ క్షేతం తర్వాత దక్షిణ భారత దేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ గుర్తించబడిన *ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ క్షేత్రంలో నెలకొని ఉన్నాడు*. ఈ కాలభైరస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం..
శ్రీ కాలభైరవ స్వామి ఆలయం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి గుడి. రామారెడ్డి పేటలోని శివాలయం , రామాలయాల నిర్వహణకోసం.. దోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఇసనపల్లి. ఈగుడికి వెళ్ళే మార్గంలో చుట్టూ పచ్చటి పొలాలు , ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది. ఇక్కడున్న గ్రామానికి ఎనిమిది దిక్కులా అష్టభైరవులున్నారు. ఈ ఆయం దగ్గరకు వెళ్ళగానే కాస్తంత దూరం నుండే ఈ గుడి సిందూరం రంగులో ఉన్న గుడి అభయమిస్తున్నట్లు కనబడుతుంది.
ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని విగ్రహం క్రీ.శ.13వ శతాబ్ధ కాలం నాటిదని చెబుతారు. సహజంగా ఈ గుడిలోని విగ్రహాన్ని కనుక చూసినట్లైతే కొంత మంది దిగంబర జైన విగ్రహమని కొందరి వాదన. అయితే కాలభైరవుడిని దిగంబరుడిగా చెప్పిన పురాణాలు , తంత్ర గ్రంథాలున్న కాలభైరవ విగ్రహం సనాతన వైదిక దేవతా విగ్రమనే వాదన. కరువు సమయంలో ఇక్కడి ఆలయంలోని కాలభైరవుని విగ్రహానికి స్థానికులు పేడ పూస్తారు. తర్వాత ఆపేడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా పడేవని అక్కడ ప్రజలు ప్రఘాడమైన నమ్మకం.
ఎవరైతే చేతబడి కలిగి ఉంటారో అలాంటి వారు ఈ దేవాలయంలో 21 రోజులు లేదా 41 నిద్ర చేస్తే మంచిదని , ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకం. ఈ కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని , సంకల్ప సిద్ధిని పొందడం కాలభైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.
కాలస్వరూపం తెలిసినవాడు , ఇంకా సంతానభాగ్యం పొందడానికి , వివాహ మరియు ఉద్యోగ సమస్యలున్నవారు ఈ ఆలయాన్ని సందర్శించి నియమం చేస్తే వారి కోరికలు తప్పక తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని , అతీంద్రమైన శక్తులను ప్రసాధించే కాలభైరవునికి గారెలతో మాల వేస్తారు. బెల్లం , కొబ్బరి నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.
శ్రీ శివపురాణం ప్రకారం ప్రధానంగా అష్టభైరవులు వరుసగా చండభైరవ , అసితాంగ భేరవ , సంహార భైరవ , రురు భైరవ , క్రోథ బైరవ , కపాల భైరవ , భీషణ భైరవ , ఉన్మత్త భైరవ. ఈ ఇసన్నపల్లి గ్రామంలో అష్టభైరవులు వెలసినట్లు అక్కడివారు చెబుతారు.
అష్టబైరవులలో కాశీభైరవుడు పైభాగంలో ఉంటాడు , క్రింది ఈశాన్య భాగంలో కాలభైరవుడు ఉంటారు , *ఈశ్యాన్య దిక్కును ఈవానుడు పాలించడం వల్ల ఈ గ్రామానికి ఇసన్నపల్లి అని పేరు వచ్చింది.* భైరవుడంటే పోషకుడని , భయంకురడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం)కూడా అణిగి ఉంటాడు , కనుకనే కాలబైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.
బ్రహ్మ గర్వం అణచడానికి అవతరించిన కాలభైరవుడు , శివుడి మానసపుత్రుడు కాలభైరవుడు. బ్రహ్మ యొక్క అహాన్ని తగ్గించడంలో బ్రహ్మా యొక్క ఐదవ తలను ఖండిచడం వల్ల అతనికి బ్రహ్మ హత్యా మహాపాతకం తగలడం వల్ల దాన్ని పోగొట్టుకొనడం కోసం బిక్షాటన చేసి , కాశీకి వెళ్ళి అక్కడ విముక్తుడయ్యాడని , అప్పటి నుండి అక్కడే కాశీ క్షేత్రపాలకుడుగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది.
అదేమిటంటే త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ దేవుడికి మొదట ఐదు తలలుండేవట , తను సృష్టికర్త కావడంతో బ్రహ్మలో గర్వం పెరిగిందట. త్రిమూర్తుల్లో తానే అధికుడని చెప్పుకోవడం మొదలు పెట్టాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు వచ్చి *‘నా నాభికమంల నుండి పుట్టినవాడివి , అందువల్ల నేనే గొప్పవాణి అన్నారట. వాళ్లిద్దరూ వాదించుకుంటుండగా అక్కడ ఒక జ్యోతి స్థంభం ప్రత్యక్షమైనది. అప్పుడు అది చూసి శ్రీ మహా విష్ణువు ఈ వాదన నుండి విరపించుకున్నాడు , కానీ బ్రహ్మకు మాత్రం అహంకారం పోలేదు.
అప్పుడు శివుడినుండి ఓ ఘోరరూపం ఆవిర్భవించిందట. నాలాగే తనకూ ఐదు తలలున్నాయి కాబట్టి నాతో సమానుడని గర్వంతో విర్రవీగుతున్నాడు. ఈ ఐదో తలను నీ కొనగోటితో తుంచెయ్. అని ఆ రూపాన్ని ఆదేశించాడట. కొనగోటి బ్రహ్మఐదోతలను తొలగిస్తే కానీ ఆ బ్రహ్మకు తత్వంేదు. అప్పుడు శివుడు ఆ రూపంతో నువ్వు బ్రహ్మ తలను తెంచావు కాబట్టి కాలం వలె కనిపిస్తున్నావు. అందుకే నిన్ను కాలభైరవుడు అని పిలుస్తారు.
అయితే బ్రహ్మతలను ఖండిచినందుకు బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకోవడం వల్ల ఈ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండేళ్ళు భిక్షాటన చేసి ఇందులో తింటే పాపం పరిహారమవుతుంది. ఇక పైన నా దేవాలయాల్లో నువ్వే క్షేత్రపాలకుడివి . కాశీ పట్టణానికి అధిపతిగా , నా ఆలయాలకు వచ్చే భక్తుల పాపాలను భక్షిస్తావు అని చెప్పాడట.
కాలభైరవుని దేవాలయాలు మనదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. నేపాల్ , ఇండోనేషియా , థాయ్‌లాండ్‌లలో కాలభైరవుణ్ణి విశేషంగా పూజిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రమే ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోనూ ఉంది.
*ఇక్కడ కార్తీక మాసంలో ఘనంగా స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇసన్నపల్లిలో వెలసిన ఈ కాలభైరవున్ని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్టాల నుండీ కూడా భక్తులు సందర్శిస్తుంటారు.*
RECENT POST
నవ విధ శాంతులు
నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం: కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...
POPULAR POSTS
-
కార్తెలు-వాటి వివరణ మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెల...
-
అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్విన...
-
విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే... i భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో ...
-
కదంబ వృక్ష మహిమ : కదంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్సిస్. ఇది ఆకురాల్చదు. ఎప్ప...
-
సకల దేవతల మంత్రాలు మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్...
-
లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత. లక్ష్మి గవ్వల పూజ - ఉపయోగాలు . Laxmi Pasupu Gavvalu.The Importance of Laxmi Gavvalu Sri Maha Lakshmi Pasupu ...
-
నక్షత్ర ఆధారిత ఉపశమనాలు వివరణ జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను. జ్యోతిష శాస్త్రము మ...
-
సలేశ్వరం- శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా. సలేశ్వరం (Saleshwaram) ఇ...
-
శ్రీ దత్తాత్రేయ దేవాలయం...ఎత్తిపోతల. అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల బాహ్య ప్రపంచానికి అంతగా త...
-
బీజాక్షర సంకేతములు ఓం - ప్రణవము సృష్టికి మూలం హ్రీం - శక్తి లేక మాయా బీజం ఈం - మహామాయ ఐం - వాగ్బీజం క్లీం - మన్మధ బీజం సౌ...