Friday, December 25, 2020

శివుని అష్టమూర్తులు

శివుని అష్టమూర్తులు :

1) భవుడు, 2) శర్వుడు, 3) ఈశానుడు, 4) పశుపతి, 5) ఉగ్రుడు, 6) రుద్రుడు, 7) భీముడు, 8) మహాదేవుడు అన్నవే శివుని ఎనిమిది మూర్తులు, శివుని అష్టమూర్తులు నాలుగు చేతులు కలిగివుండి మూడవ కంటితో జటాజూటముతో ఎఱ్ఱని వస్త్రముతో భూషణములతో వర్ణించబడి వున్న అష్టమూర్తులందరూ అభయ ముద్రను టంకమును కుడివైపున ధరించి, ఎడమచేతులలో వరదముద్రను, లేడిని ధరించివుంటారు ఈ అష్టమూర్తులలో భవుడు తెలుపువర్ణము, శర్వుడు నలుపు, ఈశానుడు ఎఱుపు, పశుపతి నల్లనివర్ణము, ఉగ్రుడు పసుపు కలిసిన తెలుపు, రుద్రుడు కుంకుమ వర్ణం ఎరుపు, భీముడు ప్రవాళ (పగడమువంటి) ఎరుపు, మహాదేవుడు నలుపు వర్ణముతోనూ, వర్ణింపబడి ఉన్నారు
1. ఏకాదశ రుద్రులు :
రుద్రునికి శైవాగమం ప్రకారం 1) శంభుడు, 2) పినాకి, 3) గిరీశుడు, 4) స్థాణుడు, 5) భర్గుడు, 6) సదాశివుడు, 7) శివుడు. 8) హరుడు, 9) శర్వుడు, 10) కపాలి, 11) భవుడు అన్న మూర్తులు చెప్పబడివున్నాయి ఈ
ఏకాదశరుద్రులుకాక శివునికి అష్టమూర్తులు, అనగా ఎనిమిది రూపాలూ చెప్పబడి వున్నాయి
1. చంద్రశేఖరుడు :
పగడము వంటి ఎఱ్ఱని శరీరకాంతి కలిగినవాడు మృదుమధురమైన ప్రేమభావమును వ్యక్తముచేయు ఆకృతికలిగి, విశాలమైన నుదురు, త్రినేత్రము లతో, శిరస్సున అర్ధచంద్రునితో పాద పీరముపై నిలిచి నాలుగు బాహువులు కలిగి కుడిచేతిలో ఒకటి అభయముద్ర రెండవదానిలో పరశువు ధరించి ఉంటాడు ఎడమచేతిలో ఒకచేత వరదముద్ర, మరోచేత లేడిని ధరించిన చతుర్భుజమూర్తిగా ధ్యానించాలి!
2. ఉమామహేశ్వరుడు : -
ఉమ అనగా పార్వతీదేవి ఉమతో కూడిన ఈ ఉమామహేశ్వరుడు తెల్ల తామరపుష్పము వంటి ఉమాదేవి సహితుడై కూర్చుండి నల్లకలువల వంటి కన్నులతో ప్రసన్న ముఖము కలిగి చతుర్భుజములతో కుడిచేతులలో అభయముద్ర, టంకము ధరించి, ఎడమచేతులతో వరదముద్ర, లేడిని ధరించిన ప్రశాంతముఖుడైన, మూర్తిగ పరమాత్ముడైన ఉమామహేశుని ధ్యానించవలెను వృషభారూఢ శివుడు :
ఈ మూర్తిని శివుడు వృషభవాహనముపై కూర్చుండి ఎడమవైపున పార్వతీదేవిని పట్టుకొనివుండి కుడిచేత కటకముద్రతో, కుడితొడపై కూర్చుని వున్న వినాయకుని కౌగిలించుకొని ఒకచేత జపమాలను, వరదహస్తమునూ, లేడినీ ధరించిన తెల్లని కాంతిగల వృషభవాహనుడిగా శివుని ధ్యానించవలెను
3 నటరాజమూర్తి :
గుండ్రని అగ్నిజ్వాలామండలములో తాండవము చేయు నటరాజ మూర్తి తన ఒకచేత పాముయొక్క శిరస్సును పట్టుకొని, ఎడమపాదము పైకెత్తి కుడిపాదముతో అపస్మార పురుషుని అణగతొక్కుచూ ఎఱ్ఱని పాదములూ, హస్తములూ కలిగి 4 చేతులు కలిగి కుడిచేతులలో ఢమరుకము, అభయ ముద్రలనూ, ఎడమవైపున ధోలాహస్తము, అగ్నిని ధరించిన విధంగా నటరాజ మూర్తిని ధ్యానించవలెను
4.అర్ధనారీశ్వరమూర్తి :
కుడివైపున శంకరుని మూర్తి ఎడమవైపున పార్వతి ఈశ్వరుడు ఎఱ్ఱని శరీరఛాయ కలిగి, గంగాదేవి చంద్రరేఖ గల జటాజూటముతో అర్ధపాల నేత్రముతో కపాలకుండలముతో పులితోలు వస్త్రములుగాగల సగముభాగము నడుముతో ప్రకాశించుచుండును ఎడమభాగములో పార్వతీదేవి నల్లటి శరీరఛాయ పాపట, తిలకములతో చెవినత్తులు ధరించి ఏకగ్ధనముతో నాల్గు చేతులు కలిగివుండును వీరహస్తమునందు టంకమునూ, పార్వతి హస్తము నడుముననుంచుకొని వరదహస్తము, కలువపువ్వూ ధరించివుండునుకుడిపాదము ఈశ్వరభాగము వంచబడి ఎడమపాదము అందెలతో అలంకరించబడిన అర్ధనారీశ్వరమూర్తిని - ఈ రెండువర్ణములలో ధ్యానించ వలెను
5.దక్షిణామూర్తి :
వటవృక్షము క్రింద సుఖాసీనుడైన మహేశ్వరుడు, తెల్లని సర్వావయ వములతో, శిరస్సున అర్ధచంద్రునితో, నాగభూషణములతో పులితోలును వస్త్రముగా ధరించి సమస్త ముని గణములచేత సేవించబడుచూ ఆరాధ్య మూర్తియై ఉపదేశముద్ర ధరించి, సురాసురులు, కిన్నెర, కింపురుష ప్రమధులచే సేవింపబడుచున్న జ్ఞాన ఉపదేశమూర్తిగా ధ్యానించవలెనుకుడిచేత ధ్యానముద్ర, జపమాలలను ధరించి ఎడమచేతులలో పుస్తకమును, వీణను ధరించివుండును కుడివైపు జమదగ్ని, వశిష్టుడూ, భృగువు, నారదుడు నిలువబడియుండగా ఎడమభాగములో అపస్మార పురుషుని పాదములతో తొక్కును సకల లోకములను బ్రహ్మ జ్ఞానోపదేశము చేయువానిగా దక్షిణామూర్తిని ధ్యానించవలెను
6. వీరభద్రమూర్తి :
నల్లని శరీరకాంతితో ఎఱ్ఱని వస్త్రములతో కనుబొమ్మలు ముడిపడి కోపించిన క్రోధములో అగ్నివలే మండుచున్న కేశములు కలిగి, మూడు కన్నులతో సింహచర్మము ధరించి ఎనిమిది చేతులతో ప్రకాశించును కుడివైపు బాహువులలో దండము, శూలము, గొడ్డలిని ధరించి, ఎడమ భాగమున 1) ఖేటము, 2) కపాలము, 3) టంకము, 4) రోకలిని ధరించి, చిరుగంటతో, దండతో అలంకరించబడిన వీరభద్రమూర్తిని ధ్యానమూర్తిగా ధ్యానించవలెను
7. మహాకైలాసమూర్తి :
ఈ మహాకైలాసమూర్తిని స్కాందపురాణంలోని శంకరసంహిత ఇలా వర్ణిస్తున్నది మేరుపర్వతానికి ఉత్తరభాగమున ఉన్న కైలాసగిరిపై ఎడమ భాగమున సర్వమంగళాదేవితో కూడిన చంద్రశేఖరుడైన పరమశివుడు భక్తు లతో ప్రమధ గణములతో పరివేష్టితుడై ఉండును గొప్పదైన సింహాసనముపై శ్రీమన్మహా పరమశివుడు చక్కగా వికసించిన కమలములవంటి ఇరువది అయిదు (25) ముఖములతో. వివిధాయుధము లను ధరించిన ఏబది (50) చేతులతో, ఎఱ్ఱతామరపూవుల వంటి హస్తము లతో, పాదములతో వివిధములైన మణులు పొదిగిన బంగారు నగలతోభూషితుడై, కోటిసూర్యుల కాంతులను వెక్కిరించు ఆనందదాయకమైన రూపములో గంగా జటాజూటముతో, నెలవంక శిరోభూషణముతో, విభూతిని పూనుకొన్న సర్వాంగములతో, నాగయజ్ఞోపవీతుడై కపాలమాలను ధరించి, పులితోలును వస్త్రముగా ధరించి, ప్రతిముఖమునందు మూడుకన్నులతో కుడికాలును చాపి ఎడమకాలిని కుంచించి, భక్తుల కోరికలను అనుగ్ర హించుచూ అధివసించును!
1) అభయ ముద్ర, 2) చక్రము, 3) శూలము, 4) టంకము, 5) బాణము, 6) గద, 7) పద్మము, 8) ఖడ్గము, 9) తామరము, 10) శక్తి, 11) గొడ్డలి, 12) ప్రాసము, 13) నాగము, 14) నాగలి, 15) అంకుశము, 16) జపమాల, 17) చిన్నకత్తి, 18) ధ్వజము, 19) దండము, 20) వజ్రము, 21) కుంతము, 22) ఎముక, 23) దంష్ట్రము, 24) అంపము, 25) ఖిండినాలము కుడిచేతు లలో ధరించియుండి, 1) వరముద్ర, 2) విల్లు, 3) లేడి, 4) శంఖము, 5) ఖేటము, 6) పాశము, 7) గొడ్డలి. 8) ముధరము, 9) ఢమరుకము, 10) గంట, 11) రుద్రవీణ, 12) పునకము, 13) కపాలము. 14) పుట్టె, 15) ఖట్వాంగము, 16) భుశుండీ ఎడమ చేతులలో ధరించును
8. మృత్యుంజయ మూర్తి :
అమృత మృత్యుంజయమూర్తిగా శివుడు తెల్లని శరీరఛాయ కలిగి శిరస్సున అమృతము స్రవించే అర్ధచంద్రునితో యోగసమాధిలో బంధింపబడిన పెదవులు, రెండుచేతులలో అమృతము నింపిన బంగారు కలశములు పట్టుకొని, మరిరెండు చేతులతో అమృతమును శిరస్సుపై అభిషేకించు కొనుచూ, పసుపురంగుగల జటలతో శిరస్సున చంద్రుడు, సూర్య, చంద్ర, అగ్నులూ, త్రినేత్రములతో నాగభూషణుడై సర్పయజ్ఞోపవీతమును ధరించి పులితోలు వస్త్రముగా ధరించి, భస్మము ధరించిన సర్వాంగములు కలిగి, కూర్చున్నవానిగా ధ్యానించవలెను

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS