Friday, December 25, 2020

శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికీ సంచరిస్తున్నారా ?

🌻శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికీ సంచరిస్తున్నారా ?🌹

అవును. ఇది యదార్ధము. ముమ్మాటికీ నిజం., ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లాలోని మాచర్ల దగ్గర వున్న "ఎత్తిపోతల" క్షేత్రంలో స్వయంభువై ఏకముఖి దత్తాత్రేయ స్వామిగా పూజలందుకుంటున్న ఈ క్షేత్రంలో ఈ సంఘటనలు ఆశ్చ్యర్యాన్నీ, మరింత విశ్వాసాన్ని కల్గిస్తోంది. ఈక్షేత్రానికి మాచర్ల గ్రామ చుట్టుప్రక్కల వున్న "తండా" ల నుండి వేలమంది భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు. వారికి ఆచారాలు ఏమి తెలియవు. చదువు లేదు. మంత్రాలు అసలే రావు. కేవలం మూఢ భక్తి. నెయ్యితో చేసిన అన్న పరమాన్నముతో స్వామిని దర్శిస్తారు. దత్తుని మీద అపారమైన విశ్వాసం, నమ్మకం. అవే వారిని ఆరోగ్యదాయకమైన, ఆనందమయమైన జీవితాన్ని నడిపిస్తున్నాయి. గర్భాలయాల్లో రుద్రాభిషేకాలు, పంచ సూక్తాలు, శాంతిమంత్రాలు చదువుతున్న మనం, వీళ్ళను చూస్తే ఆ స్వామే వీరి చెంత ఉండడానికి ఇష్టపడుతున్నాడా? అని భావించక తప్పదు. వీరికి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు సర్వం దత్తాత్రేయుడే. " మాకు నీవే దిక్కు. అనారోగ్యం వచ్చినా, ఆర్ధిక ఇబ్బంది వచ్చినా, ఏమి కావాలన్నా నువ్వే శరణు, నువ్వే దిక్కు"  అని దత్తాత్రేయుడిని ప్రార్థిస్తున్న వారి మధ్య ముసలివాని రూపంలో, చిన్న పిల్లవానిగా, పిచ్చివాడిలాగా అనేక రూపాలలో సంచరిస్తున్న శ్రీ గురుదత్త మహారాజ్ దర్శన భాగ్యాన్ని పొందుతున్న ఆ భక్తులు ఎంత ధన్య జీవులో? .....వారి మాటల్లోనే వినండి.....ఆనంద పారవశ్యం పొందండి...హృదయ స్పందనని గమనించండి.... 

అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.....🌹.🙏🌹

 

దత్తాత్రేయ స్వామి సంచార రూపాల్ని "శ్రీ దత్త అనుష్టుప్ మంత్రం" లో చెప్పబడింది.

దత్తాత్రేయ హరే కృష్ణా || ఉన్మత్తానంద దాయకా||

దిగంబర మునే బాల || పిశాచ జ్ఞాన సాగరా|| 🙏🙏

🌺🌿🌻🌺🌿🌻💐🌿🌻🌺🌿🌻🌺🌿🌻

🌹🌼 శ్రీ దత్త సాయి లీలా సంహిత గ్రూప్🌷🌺
   🌹🌻🌿జి.సురేష్ కుమార్🌺🌿🌻

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS