Monday, December 14, 2020

మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలని తెలపడానికి మహా పురుషులు ఎన్నో న్యాయాలను తెలియజేసారు. వాటిల్లో కొన్ని న్యాయాలను చూద్దాం.

మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలని తెలపడానికి మహా పురుషులు ఎన్నో  న్యాయాలను తెలియజేసారు. వాటిల్లో కొన్ని న్యాయాలను చూద్దాం.




1.భ్రమర కీటక న్య్యాయం.
2. హంసక్షీర న్యాయం.
3. మర్కట కిశోరన్యాయం.
4. మార్జాల కిశోర న్యాయం.
5. తిల తండుల న్యాయం. 
6. దర్వీ పాక న్యాయం.

1. భ్రమర కీటక న్యాయం : తుమ్మెద ఒక కీటకం పై శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటుంది .అలాచేసినందువల్ల ఆ కీటకం భ్రమరంగా మారిపోతుంది.దీనినే భ్రమర కీటక న్యాయం అంటారు. వాల్మీకి ఒక బోయవాడు .దారి దోపిడీ చేస్తూ కిరాత కుడిగా ఉండేవాడు.సప్త ఋషుల ఉపదేశంతో రామ నామాన్ని జపిస్తూ ఋషిగా మారిపోయాడు.అలాగే మంచి వారితో స్నేహం చేస్తే చెడ్డవాడు కూడా మంచి వాడుగా మారిపోతాడు.అనే న్యాయమే “భ్రమర కీటక న్యాయం”.
2.  హంసక్షీర న్యాయం: హంసకి పాలని,నీరుని వేరుచేసే నైపుణ్యం ఉంది . ఒక విషయం చెప్పినపుడు కాని మాట్లాడేటప్పుడుకాని అందులోని మంచి చెడు విషయాలలో ,మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలని తెలపడానికి పై న్యాయాన్ని ఉదాహరిస్తారు .
3. మర్కట కిశోర న్యాయం: కోతి పిల్ల తల్లి పొట్టని పట్టుకొనే ఉంటుంది .తల్లి కోతి చెట్ల మించి ఎగిరి దూకేటప్పుడు పిల్ల కోతి తన రక్షణ తనే చూసుకొంటూ ఉంటుంది.అని తెల్పేదే “మర్కట కిశోర న్యాయం” ప్రహ్లాదుడిలా మనం నిరంతరం ఆ దేవ దేవుణ్ణి ఆశ్రయించి ఉండాలి .అంతటా అన్నింటా ఆయనే ఉన్నాడు అని నమ్మాలి.”ఇందు గలడు,  అందు లేడు,అనే సందేహాన్ని విడచి సదా ఆ స్వామినే పిల్లకోతి తల్లిని పట్టుకొని ఉన్నట్లు మనం ఆశ్రయించి ఉండాలి అనితెల్పేదే “మర్కట కిశోరన్యాయం,”రామాయణంలో లక్ష్మణుడు ,భాగవతం లో గోపికలు,భారతంలో పాండవులు నిరంతరం ఆస్వామినే ఆశ్రయించి ఉన్నారు,.ఇలాంటివి ఎన్నో ఈ న్యాయానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.

4. మార్జాల కిశోర న్యాయం: మార్జాలం అంటే పిల్లి.కిశోరం అంటే పిల్ల.పిల్లి తన పిల్లల్ని తనే రక్షించు కొంటుంది. పిల్లి కనిన తరువాత ఆపిల్లల్ని నోటితో పట్టుకొని వేరు వేరు ప్రదేశాలలో ఉంచుతూ అవి పెద్ద అయేదాకా కాపాడుతూ ఉంటుంది.అలాగే మనం ముందుగ భగవంతుని “మర్కట కిశోర న్యాయం లా “ఆశ్రయించి ఉంటె ఆస్వామి ప్రహ్లాదుని,ధ్రువుని,గజేంద్రుని ,అహల్యని,పాండవులని,ఇలా ఎందరినో కాపాడినట్లు “మార్జాల కిశోర న్యాయంలా”భక్తులను కాపాడుతాడు అని ఈన్యాయం తెల్పుతుంది .(వచ్చేమాసం మరికొన్ని.)


5. తిలతండుల న్యాయం: తిలలు అంటే నువ్వులు .తండులాలు అంటే బియ్యం .నవ్వులు,బియ్యం కలిపి చూస్తే రెండు వేరు వేరు గానే కనపడతాయి .కాని వాటిని వేరుచేయలేము. అలాగే జీవాత్మ,పరమాత్మ వేరుగా ఉన్నా వారి మధ్య ఉండే భక్తి తత్వాన్ని వేరు చేయలేముకదా. దీనినే అద్వైత స్తితి అంటారు.అట్లే రెండు వేరువేరు విషయాలుకలిపి చెప్పినపుడు వాటిని “ తిల తండుల న్యాయంలా “ వేరు,వేరుగా పరిశీలించాలని తెలపదానికి,ఈ న్యాయాన్ని ఉపయోగిస్తారు.దీనిని “ఉపనిషత్”వాక్యం ద్వారా మరికొంచం తెలుసుకొందాము.

పూర్ణ మద,పూర్ణమిదం,పూర్నాద్,పూర్ణ మదుచ్యతే.పూర్ణస్య,పూర్ణమాదాయ,పూర్నమేవావసిష్యతి.”

అంటే---పూర్నుడైన భగవంతుని నుండి సంపూర్ణ జగత్తు పుట్టి మరల పూర్నుడైన భగవంతుని లోనే సంపూర్ణముగా కలిసి పోతుంది “అని తేలికగా అర్ధం చెప్పవచ్చు. కాని సర్వాంతర్యామి అయిన ఆ భాగవత్తత్త్వాని దర్శించవచ్చు. ఇక్కడ ఒక్కసారి పోతన గారి భాగవత పద్యాన్ని,పరిశీలిద్దాము.”ఎవ్వనిచే జనించు జగము,ఎవ్వని లోపలనుండు లీనమై.అన్నపద్యంలో పై మంత్రానికి సంపూర్ణ అర్ధం లభిస్తుంది.ప్రకృతి ,పరమాత్మలు వేరుగా కనిపించినా అవి ఒక్కటే “తిల తండులాల “వలె వేరుచేయ లేము.

6. దర్వీపాక న్యాయం: దర్వీ అంటే గరిట.పాకం అంటే వండే పదార్ధాలు.(అనగా కూరలు ,పులుసులు వంటివి.)గరిట కూరలను ,పులుసులను వండేటప్పుడు కలపడానికి ఉపయోగ పడుతున్దేతప్ప ఆ గరిట వాటిని రుచి చూడలేదు కదా ! అలాగే ఎంత చదువు చదివినా తెలివి తేటలు లేకుంటే ఆ చదువు వ్యర్ధమగును.కనక పులుసులో గరిట్లాగా మనం ఉండకుండా జ్ఞానం కలిగి ఉండాలి అని ఈ న్యాయం తెల్పుతుంది.ఆత్మ,పరమాత్మ తత్త్వాలని తెలుసుకోలేని ,జీవాత్మ ఉనికి వ్యర్ధముకద . వేదాలు ,ఉపనిషత్తులు,అనేక పురాణాలు చదివి బ్రహ్మ జ్ఞానం పొందని వాని జన్మ “దర్వీపాక న్యాయంలా” ఉంటుంది అని ఈ న్యాయం వివరిస్తుంది.---ఇక్కడ “నేతి,నేతి,నేతి సిద్దాంతాన్ని" పరిశీలించి భగవంతుడు ఎలా ఉంటాడు? అన్నది ప్రశ్న? దానికి ఉపనిషత్ ఇలా చెపుతుంది.”ఆత్మ దేవుడు కాదు. ఆత్మా న దేవ:,ననర: న తిర్యక్ ,న దేహ:,నైవ మన:,న ప్రాణం, అని న ఇతి,న ఇతి అంటూ ఇది కాదు, ఇదికాదు అని చెప్తూ ఎక్కడ ప్రశ్న ఆగిపోతుందో అక్కడ స్వామి కనబడతాడు.

జానపద రామాయణంలో ఉన్న చిన్ని కధతో దీనిని వివరిస్తాను”.సీతారాముల వనవాసంలో ఋషుల ఆశ్రమానికి వెళ్తారు.రాముడు, లక్ష్మణుడు ఋషుల మధ్య కూర్చొని భరద్వాజ మహర్షి చెప్పేది వింటూ ఉంటారు.సీత రుషి పత్నుల మధ్య కూర్చుని ఉంటుంది.రాముడు కాషాయ వస్త్రాలు ధరించడం వల్ల,ఋషులలో కలిసి పోతాడు.సీత మామూలు బట్టలే కట్టుకొని ఉంటుంది.రుషి పత్నులు,ఆమెని గుర్తించి ఆరుషులలో నీ భర్త ఎవరు ?అని ప్రస్నిస్తూ, ఈయన,ఈయనా ,అని ఒక్కక్కర్ని చూపించి అడుగుతారు.అప్పుడు సీత ఆయన కాదు,ఆయన కాదు (నేతి ,నేతి) అనిచేపుతూ ఉంటుంది . రాముణ్ణి చూపించి అడిగినప్పుడు మాత్రం సిగ్గుతో ఏమి చెప్పకుండా ‌‌ ఊ రుకొంటుంది” .అంటే భగవంతుని తెలుసుకోవడానికి ఎట్టివాక్యలు పనికి రావు. అని ఉపనిషత్తు వివరిస్తుంది.”ఎతోవచో నివర్తన్తే తద్ధామ పరమం మమ” ఎక్కడ వరకు వాక్యాలు వెళ్లి, మరి ముందుకి వెళ్ళలేక వెనక్కి మరలుతాయో అదే నానివాసము. అని భగవానుడే చెప్పాడు. ఇట్టి బ్రహ్మ జ్ఞానాన్ని పండితుడు పొంద లేక పొతే వాని చదువు,వ్యర్ధము అని "ఈ దర్వీపాక న్యాయం" తెల్పుతుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS