Friday, December 25, 2020

రాహు,కేతు పూజకై, శ్రీ కాళహస్తి...

 రాహు,కేతు పూజకై, శ్రీ కాళహస్తి...



శ్రీకాళహస్తి లోని గుడికి రాహు కేతువుల గ్రహణ సమయం కాలంలో పూజలు జరుగుటకు గల ఆంతర్యము

 ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తూర్పు దిశ యందు కూర్చుండి  పశ్చిమము చూస్తూ ఉంటారు 

మనము గమనించ దగ్గ విశేషం. 

 అలాగే పడమర లో అమ్మవారు కూర్చొని   తూర్పు లో ఉన్న ఈశ్వరుని చూడడం  గమనించగలము.  (ఆది అంతము)( ప్రకృతి పురుషుడు) ఒకరి కొకరు ఎదురెదురుగా ఉండటము .


ఈ విషయమును మరొక విధముగా చెప్పదలచుకుంటే రాశి చక్రమూలో  రాహువు కేతువు లు  ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. 

ఈ దేవాలయములో  పరమేశ్వరుని శిరముపై పంచ తలలు కేతు గాను . అమ్మవారు ఏక సిర రాహు గాను  పరిగణించ వలెను. 

 ఈ దేవాలయంలో రాహుకాలంలో రాహు కేతువుల పూజ ప్రశస్తము అయితే ప్రతి రోజు రాహుకాలము వచ్చును. కానీ  ఆ సమయంలో స్వామివారిని దర్శించుకున్న స్వామి వారి తల పై పంచ నాగులు కేతువు దర్శనము  కనపడును.  అయితే రాహు గా అమ్మవారిని పరిగణించినపుడు  సోమవారము నాడు శుక్రవారం మాత్రమే   అమ్మవారికి నడుమునకు అలంకరించ్చే   వడ్రాణం రూపంలో రాహు కనబడును . అమ్మవారికి శుక్రవారం రోజున వజ్రాల కిరీటం నడుమునకు   ఒక తల  నాగుపాము వడ్రాణం గాను  బంగారము తో తయారు చేసిన చీర తో  అలంకరింపబడును. 

కనుక శ్రీకాళహస్తి లో సోమవారం శుక్రవారం రాహుకాల సమయంలో మాత్రమే . 

ఈ విషయమును  గమనించి రాహు కేతువుల దోషనిమిత్తము సోమవారం శుక్రవారం రాహుకాలంలో ప్రశస్తమని గమనించగలరు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS