Saturday, December 19, 2020

తిరుచెందురు సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య క్షేత్రముల వివరములు

🌹🌹🌹 *మార్గశీర్ష మాస షష్టి సందర్భముగా సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య క్షేత్రముల వివరములు* 🌹🌹🌹

               *మొదటి క్షేత్రము*


🌹🌹🌹  *తిరుచెందూర్*  🌹🌹🌹

              *తిరుచెందూర్ ను గతంలో 'కాపాడపురం' అనే వారు. తర్వాతి కాలంలో తిరుచేన్ చెందిలూర్ అని మరియు తర్వాత తిరుచెన్ - చెందిలూర్ అని ఆ తర్వాత తిరుచెందూర్ అని పిలిచారు*. *తిరుచెందూర్ ను అనేక రాజ వంశాలు పాలించాయి. వారిలో చెరలు , పంద్యాలు మొదలైన వారు కలరు*.

            *తిరుచెందూర్ దక్షిణ భారత దేశంలోని ఆనందమైన కోస్తా తీర పట్టణం. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో కలదు. తమిళనాడులోని తిరునల్వేలికి 60 కి.మీ. దూరం లో సముద్రపు అంచున తిరుచెందూర్ వుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య  స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది*.
*తిరుచెందూర్ చుట్టూ తీర ప్రాంత అడవులు , తాటిచెట్లు , జీడిపప్పు మొక్కలు మొదలైనవి ఉన్నాయి. పురాణాల మేరకు మురుగన్ తిరుచెందూర్ లో శూరపద్మన్ అనే రాక్షసుడిని వధించాడు. అప్పటి నుండి ఈ ప్రదేశం మురుగన్ పవిత్ర స్థలంగా భావిస్తూ వస్తుంది*.

        *తిరుచెందూర్ లో సుబ్రహ్మణ్య  స్వామి అత్యంత సంపన్నుడు . తారకాసుర సంహారం తర్వాత అతని తమ్ముడు శూరపద్ముడు పారిపోతే, కుమార స్వామి వెంబడించగా, అతను మామిడి చెట్టు గా మారిపోయాడు. స్వామి, తన బల్లెం తో చెట్టును చీల్చి వాణ్ని చంపేశాడు. అప్పుడు ఆ చెట్టు లో ఒక భాగం నెమలి గా , రెండో భాగం కోడిగా మారాయి*.

          *ఆ రెండిటిని కుమార స్వామి వాహనాలుగా చేసుకొన్నాడు. ఆయన ఆయుధమైన బల్లెం , ఆయనకు చిహ్నం గా పూజలందుకొంటుంది ఇక్కడ. ఇక్కడి శరవణభవుడైన కుమార స్వామికి ఉదయం పది గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు విభూతితో అభిషేకం రెండు సార్లు జరగటం విశేషం. సముద్రపు ఒడ్డున ఒక బావిలో తియ్యని నీరు లభించటం మరో గొప్ప విచిత్రం*.

                *తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో మురుగన్ భార్యలైన వల్లి మరియు దేవసేన విగ్రహాలు ఉంటాయి. వేదకాలం నుండి ఉన్న ఈ ఆలయంలో శివుడు , విష్ణువు విగ్రహాలతో పాటు ప్రాచీన గ్రంథాలు కలవు*.

       *పున్నైనగర్ లోని వనతిరుపతి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. ఇది తిరుచెందూర్ నుండి 20 KM ల దూరంలో కాచనవలి స్టేషన్ వద్ద కలదు*.

          *మేలపుతుకూది గ్రామంలోని అయ్యనార్ ఆలయం తిరుచెందూర్ కు 10 KM ల దూరంలో కలదు. ఈ గ్రామం చుట్టూ అందమైన నీటి కొలనులు , వాటి మధ్యలో అయ్యనార్ ఆలయం చుట్టూ తోటలు ఉన్నాయి. ఇది తమిళనాడులోని అందమైన ప్రదేశాలలో ఒకటి*.

              *వల్లీ గుహలు*

                 *తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి సమీపంలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో కలదు. ఇక్కడి నుండి సముద్ర అందాలను వీక్షించవచ్చు . ఈ వల్లీ గుహలను దత్తాత్రేయ గుహలు అని కూడా పిలుస్తారు. గుహలలో మురుగన్, వల్లి, దత్తాత్రేయ విగ్రహాలు ఉంటాయి. అలాగే వివిధ దేవుళ్ళ చిత్రాలు, పెయింటింగ్ లు చూడవచ్చు*.


           *కుదిరి మొజి తేరి అనేది ఒక అందమైన పిక్నిక్ స్పాట్. ఇది తిరుచెందూర్ కు 12 KM ల దూరంలో కలదు. ఇక్కడి సహజ ఆకర్షణ నీటి బుగ్గ*.

      *దీనిని మొదట పంచాలంకురిచి కోట అనేవారు. దీనిని పంచాలంకురిచి వంశానికి చెందిన రాజు వీర పాండ్య కట్టబొమ్మన్ నిర్మించాడు. ఇందులో వారి కులదేవత అయిన జక్కమ్మ గుడి కలదు. ప్రస్తుతం ఆర్కియలాజికల్ వారు ఈ కట్టడాన్ని నిర్వహిస్తున్నారు*.


          *తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది. ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు , శూరపద్మన్ అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి , పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం*.

       *'తిరుచెందూర్' లో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు శూరపద్మన్ అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు*.

     *సముద్ర తీరంలో శక్తివంతమైన, సుందరమైన దివ్య క్షేత్రం*
*చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము*.

          *ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే , ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో శక్తివంతమైన, సుందరమైన దివ్య క్షేత్రం యిది. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో అది చూసి తీరాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది*.

*ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖములుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆరు దివ్యవమైన క్షేత్రములను తమిళనాడులోని ఆరుపడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రతీ చోటా రాక్షస సంహారం చేసే ముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు. ఈ ఆరు క్షేత్రములు వరుసగా తిరుచెందూర్,  తిరుప్పరంకుండ్రం , పళముదిర్చొళై , పళని , స్వామిమలై , తిరుత్తణి. నాగదోషం ఉన్నవారు, ఈ ఆరు క్షేత్రముల దర్శనం చేస్తే ఆ దోషం పోయి ఇష్ట కార్యములు నెరవేరుతాయి. అంతే కాక , కుజగ్రహమునకు అధిపతి సుబ్రహ్మణ్యుడు* .


                 *రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ*

             *సాధారణంగా సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కూడా కొండపైన కొలువై ఉంటే , తిరుచెందూర్ క్షేత్రం మాత్రం సుముద్రపు ఒడ్డున అలరారుతోంది. రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉన్నది. మూడు వందల సంవత్సరాలకు పూర్వం , తిరువాయదురై మఠపు మహా సన్నిధానపు దేశికామూర్తికి,స్వామి కలలో కనిపించి , ఆలయ గోపురం కట్టమని ఆదేశించాడట. అయితే అతడు పేదవాడు కావడం వల్ల గోపుర నిర్మాణానికి వచ్చిన కూలీలకు కూలీ డబ్బులకు బదులుగా స్వామి వారి విభూతిని ఇచ్చాడట. కూలీలు ఆ విభూతినే మహాద్భాగ్యంగా భావించి వెళుతుండగా మార్గం మధ్యలో ఆ విభూతి బంగారు నాణేలుగా మారిందట*.

          *ఇలా ప్రతి రోజూ జరుగుతూ రాజగోపునిర్మాణం ఆరు అంతస్తుల వరకూ పూర్తయిందట. సరిగ్గా ఆరవ అంతస్థు పూర్తికాగనే ఈ అద్భుతం జరగడం ఆగిపోయిందట. అనంతరం స్వామి దేశికాచార్యుని కలలో కనిపించి మిగిలిన నిర్మాణానికి సీతాపతి మరైక్కార్ అనే భక్తుని దగ్గరకు వెళ్లి , ఒక బుట్ట ఉప్పును తీసుకురమ్మనమని ఆదేశించాడట. దేశికామూర్తి స్వామి ఆదేశం మేరకు , సీతాపతి మరైక్కార్ దగ్గర ఓ బుట్ట ఉప్పు తీసుకుని వస్తుండగా, మార్గం మధ్యలో ఆ ఉప్పు కాస్తా బంగారంగా మారిపోయిందట. ఆ బంగారు నాణేలతో దేశికామూర్తి మిగిలిన రాజగోపురాన్ని నిర్మించాడు. అనంతర కాలంలో ఈ ఆలయం అనేక మార్పులకు , చేర్పులకూ గురవుతూ వచ్చింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం వంద సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది*.


   *ప్రధానాలయానికి 200 అడుగుల దూరంలో ఒక చిన్న బావి ఉంది. ఇది సాక్షాత్తు ఆ స్వామి వారే తవ్వారని ప్రతీతి. దీనిని నాయక్కనర్ (కుక్క బావి) అని పిలుస్తారు. ఈ బావి సముద్రానికి సమీపంలో ఉన్ననూ , ఇందులోని నీరు ఉప్పగా ఉండక , తియ్యగా ఉండటాన్ని ఇక్కడి వారు విశేషంగా చెప్పుకుంటారు*.

  *అలాగే ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఓ గుహ ఉంది. దీనిని ‘వల్లీ గుహ ' అని పిలుస్తారు. ఈ గుహాలయంలో వల్లీ, దేవయాని అమ్మవార్లు కొలువై ఉన్నారు*.

   *తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరో లీల ఏమిటంటే 2006 లో వచ్చిన సునామి వల్ల ఇక్కడ ఎవ్వరికీ హాని జరగలేదు కదా కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు . అది స్వామి వారి శక్తి*

*తిరుచెందూర్ విభూతి మహిమ:*

      *ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే , ఎటువంటి గ్రహ , శత్రు , భూత , ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయం అవుతాయి. ఎంతో మందికి అనుభవంలోకి వచ్చాయి స్వామి వారి లీలలు. నమ్మిన వాడికి నమ్మినంత.. అన్నారు పెద్దలు*.


*తిరుచెందూర్ ఎలా చేరుకోవాలి ?*

    *బస్సు / రోడ్డు ద్వారా :*

       *చెన్నై , మదురై , తిరునల్వేలి, త్రివేండ్రం మరియు కన్యాకుమారి తదితర ప్రాంతాల నుండి తిరుచెందూర్ కు ప్రభుత్వ / ప్రైవేట్ బస్సులు కలవు*.

              *రైలు ద్వారా :*

*తిరుచందూర్ కు సమీపాన 60 km ల దూరంలో తిరునల్వేలి జంక్షన్ ఉన్నది*

         *విమానం ద్వారా :*

       *సమీపాన 27 km ల దూరంలో ట్యుటికోరన్ ఎయిర్ పోర్ట్ కలదు. అలాగే 150 km ల దూరంలో త్రివేండ్రం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కూడా కలదు*.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS