Monday, July 31, 2023

దక్షిణాయణ_పుణ్యకాలం

 దక్షిణాయణ_పుణ్యకాలం



 దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి సమయంగా భావిస్తారు. దక్షిణాయణం దేవతలకు రాత్రి అవడం వల్ల ఆ సమయంలో వారు నిద్రిస్తారని అంటారు. అందుకే విష్ణుమూర్త్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెబుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల్ల ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు.


దక్షిణాయణంలో సూర్యుడు దక్షిణార్థ గోళం దిశగా పయనిస్తాడు. ఇందుకు భిన్నంగా ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరార్థ గోళం దిశగా పయనిస్తాడు. దక్షిణాయనం ఇప్పుడు (జులై మధ్య కాలంలో) ప్రారంభవమై జనవరి 14 వరకూ కొనసాగుతుంది. 


ముఖ్యంగా దక్షిణాయణం లోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేం దుకు భూమి పైకి వస్తారని చెబుతారు. ఈ దక్షిణాయణంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి వంటివి జరుగుతాయి. శ్రాద్ధాదులు మానివేయడం కూడా సంతానం కలగక పోవడానికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. శ్రాద్ధాదులు చేయక పోవడమే పిల్లలు లేక పోవడానికి కారణమని భావించి, వాటిని యధావిధిగా చేయడం మొదలు పెట్టి సంతానం పొం దామని చెప్పినవారు కూడా ఉన్నారు.


బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి, ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు మనను కన్న తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య. ప్రతి దక్షి ణాయణంలో చలి వంటివి పెరగడం వ్ల్లల ఎక్కువగా మర ణాలు కూడా సంభవిస్తాయి. అయితే ఉత్తరాయణాన్ని పుణ్య కాలంగా భావిస్తారు. ఆ సమయంలో మరణించడం మంచిదనే అభిప్రాయం ఉంది. భీష్ముడు స్వచ్ఛంద మరణం వరంగా ఉన్న వాడు కనుక ఉత్తరాయణం వచ్చే వరకూ వేచి ఉండి అప్పుడు ప్రాణం వదిలాడు.  చాతుర్మాస్యం దక్షిణాయణం లోనే వస్తుంది.   పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు వంటివి చేయడం, సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, అవసరంలో ఉన్న వారకి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామం చేయడం, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణ ఇటువంటివి చేస్తే అవి శరీరానికి, మనస్సుకు మంచి చేస్తాయి. పాపాలు తొలగిపోతాయి.

No comments:

Post a Comment

RECENT POST

మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి

మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవారంభం‌ ... ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం భవాబ్ధి తరణోపాయం శంఖచక్రధరంపదమ్ శ్రీ...

POPULAR POSTS